ఇసుక అక్రమ రవాణా పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు*
ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రజ్ఞాపూర్ గ్రామ శివారు రాజీవ్ రహదారి, గౌరారం గ్రామ శివారు రాజీవ్ రహదారి పక్కన అక్రమంగా డంపు చేసిన ఇసుకను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు
[Streetbuzz News Crime journalist]
సిద్దిపేట జిల్లా:
గజ్వేల్ నియోజకవర్గం:
(వర్గల్ ఫిబ్రవరి 09) :- శుక్రవారం మధ్యాహ్నం సమయమున ప్రజ్ఞాపూర్ గ్రామ శివారు రాజీవ్ రహదారి, గౌరారం గ్రామం గ్రామ శివారులో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక డంపు చేసినారని నమ్మదగిన సమాచారం పైసిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది వెళ్లి ఇసుక డంపులను గుర్తించి గజ్వేల్ పోలీసులకు, గౌరారం పోలీసులకు అప్పగించిన సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు సంబంధిత పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
ఇసుక డంపు చేసిన నిందితుల వివరాలు
1. గుడికందుల నరేందర్, ప్రజ్ఞాపూర్ గ్రామం
2. గుడికందుల గణేష్, దాతర్ పల్లి, గజ్వేల్ మండలం.
3. బక్కల యాదగిరి, గ్రామం రాయరం, మండలం కుకునూరుపల్లి.
4. శ్రీరామ్ కృష్ణ, గ్రామం ప్రజ్ఞాపూర్.
5. గోపాల్ కృష్ణ, గ్రామం దాతర్ పల్లి, మండలం గజ్వేల్.
6. మామిండ్ల స్వామి, గ్రామం వర్గల్.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Feb 10 2024, 06:22