madagoni surendar

Feb 09 2024, 20:43

టి.ఎమ్.ఎస్.ఎస్ దళిత జాతి ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి

టి.ఎమ్.ఎస్.ఎస్ దళిత జాతి ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి.

.

నల్గొండ జిల్లా:-

టి.ఎమ్.ఎస్.ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి శ్రీనివాస్ ని టి.ఎమ్.ఎస్.ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ గడ్డ యాదయ్య మాదిగ నియమించారు.ఈ సందర్బంగా నాగుల జ్యోతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా మహిళా ఇంచార్జీ గా నియమించినందుకు ఫౌండర్ ప్రెసిడెంట్ యాదయ్య కు కృతజ్ఞతలు తెలిపారు. దళిత సంఘాల, దళిత్ జాతి కోసం తన వంతు సేవ చేస్తానని అన్నారు.

.

madagoni surendar

Feb 09 2024, 10:11

తెలంగాణ మూడవ అసెంబ్లీ రెండో సెషన్ మొదటి రోజు సమావేశాలు

తెలంగాణ మూడవ అసెంబ్లీ

రెండో సెషన్ మొదటి రోజు సమావేశాలు

నేడు శాసనసభ శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ

ప్రభుత్వ సమాధానం ఉండనుంది.

శాసనసభలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు.

మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి బలపరుస్తారు.

మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా, బి మహేష్ కుమార్ గౌడ్ బలపరుస్తారు.

అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న అనంతరం cm రేవంత్​రెడ్డి చర్చకు సమాధానం ఇస్తారు.

గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం ఉభయసభల ముందు ఉంచుతారు.

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి కాలరీస్ వార్షిక నివేదికను....

తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ వార్షిక నివేదికన ఉభయసభల ముందు టేబుల్ చేస్తారు.

రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను ఉపసభల ముందు టేబుల్ చేస్తారు.

రేపు శనివారం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రివర్గం నేడు సమావేశం.

అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం కానుంది.

బడ్జెట్​కు ఆమోదం తెలపడంతో పాటు ఇతర అంశాలపై కేబినెట్​లో చర్చించనున్నారు.

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ నివేదిక ఇచ్చింది.

విజిలెన్స్ నివేదికపై క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్ ఆలోచన.

న్యాయమూర్తుల కొరత ఉన్నందున సిట్టింగ్ జడ్జిలను ఇవ్వలేమని, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది

రిటైర్డ్ జస్టిస్ చే విచారణ చేయించాలని సర్కార్ ఆలోచన.

ఇలాంటి విషయాలపై కేబినేట్​లో చర్చించే అవకాశం.

వీటితో పాటు బడ్జెట్ సమావేశాలు, ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

madagoni surendar

Feb 08 2024, 17:43

బెల్ట్ షాపుల తో మహిళలపై పెరుగుతున్న నేరాలు.మునుగోడు తరహాలో బెల్టు షాపులను ఎత్తివేయాలి.

బెల్ట్ షాపుల తో మహిళలపై పెరుగుతున్న నేరాలు

మునుగోడు తరహాలో బెల్టు షాపులను ఎత్తివేయాలి.

రౌండ్ టేబుల్ సమావేశంలో. జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి పిలుపు.

.

నల్గొండ జిల్లా:-

మిర్యాలగూడ.

విచ్చలవిడి మద్యంతో జిల్లాలో నేరాలు పెరిగిపోతున్నాయని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం బెల్టు షాపులను ఎత్తివేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి యు టి యఫ్.రాష్ట్ర కార్యదర్శి నాగమణి డిమాండ్ చేశారు.

గురువారం నాడు మిర్యాలగూడ కార్యాలయంలో "విచ్చలవిడి బెల్టు షాపులు-పెరుగుతున్న నేరాలు" అనే అంశంపై ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి యు టి యఫ్.రాష్ట్ర కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ.నూతన ఆదాయ మార్గాలను సృష్టించాల్సిన పాలకులు మద్యాన్ని ఆధారంగా చేసుకొని మద్యం పైన వచ్చే ఆదాయం ఆధారంగా ప్రభుత్వాలు నడపడం అనేది దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన విచ్చలవిడి బెల్ట్ షాపుల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో పసిపిల్లల నుండి మొదలుకొని పండు ముసలి వరకు 'మధ్యమనే' వ్యసనానికి లోనై మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారని వారన్నారు. విచ్చలవిడి మద్యం అమ్మకాల ద్వారానే మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని వారన్నారు. మునుగోడు నియోజకవర్గం లో బెల్టు షాపు లేని వ్యవస్థను అక్కడ ఎమ్మెల్యే తీసుకురావడం శుభ పరిణామం అన్నారు. మునుగోడు తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం బెల్ట్ షాప్ నిషేధిత పాలసీని తీసుకొచ్చిఎత్తివేయాలని కోరారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారికి వాస్తవంగా ఎలాంటి ఉపాధి అవకాశాలు లేనట్లయితే అలాంటి వారికి ప్రభుత్వం మరో మార్గం ద్వారా ఆదాయ వనరులను సమకూర్చుకునే విధంగా వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.బెల్ట్ షాపులో ఎత్తివేత కోసం జిల్లావ్యాప్తంగా కార్యాచరణ చేపట్టి బెల్ట్ షాపుల నిషేధిత ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని వారన్నారు.

ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలే బోయిన వరలక్ష్మి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో.

హెచ్ఎం అరుణకుమార నాగమణి, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి బంటు కవిత,టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ సభ్యురాలు మట్టమ్మ,సీనియర్ నాయకురాలు గాద పద్మ,

ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి గోవర్ధన,

జిల్లా కమిటీ సభ్యురాలు నాగమణి,

జిల్లా కమిటీ సభ్యురాలు

పూలమ్మ,జిల్లా కమిటీ సభ్యురాలు శాంతమ్మ,టౌన్ అధ్యక్షురాలు ఊర్మిళ,హుస్సేన్,కృష్ణవేణి,

సరిత,మంగ,తదితరులు పాల్గొన్నారు.

పోలెబోయిన వరలక్ష్మి

జిల్లా అధ్యక్షులు.

మిర్యాలగూడ.

madagoni surendar

Feb 08 2024, 14:49

ఎక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందేలా కృషి: ప్రొఫెసర్ కోదండరాం

ఎక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందేలా కృషి: ప్రొఫెసర్ కోదండరాం

హైదరాబాద్:ఫిబ్రవరి 08

విద్య,వైద్యం వంటి కనీస అవసరాలు కూడా లేక జర్నలిస్టులు అనేక అవస్థలు పడుతున్నారని జనసమితి వ్యవస్థాపకులు తెలంగాణా సాధకుడు, శాసనమండలి సభ్యులుగా ఇటీవలే నామినేట్ అయిన కోదండరాం అన్నారు.

డిజెఎఫ్ జాతీయ మహాసభ కు ముఖ్య అతిథి గా విచ్చే సిన ఆయన జర్నలిస్టుల సమస్యలపై స్పందించా రు.జర్నలిస్టుల పై ప్రభుత్వా లు సానుకూలంగా ఉండాల న్నారు.

వారికి విద్య వైద్యం తో పాటు వారికి నివాస యోగ్య మైన స్థలాల కేటాయింపులు జరగాల్సి ఉందన్నా రు.కార్పోరేట్ విద్యాల యాలలో జర్నలిస్టులకు 50 శాతం రాయితీ ఇప్పటికే అమలు లో ఉన్నదని కానీ అది కూడా సరిగా అమలు కావటం లేదన్న విషయాలు నా దృష్టికి వచ్చాయని వాటి ప్రామాణికతలలో కూడా మరింత వెసులుబాటు కలిగేలా ప్రయత్నం చేయాల న్నారు.

అలాగే ఎక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సేవలు అందేలా కృషి చేద్దామన్నారు.ఈ మేరకు తగిన ప్రతిపాదనను తన వద్దకు తీసుకు వస్తే సంబం ధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా నని హామీఇచ్చారు.

ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో సానుకూలం గా ఉందని త్వరిత గతిన జర్నలిస్టులకు మంచి జరుగుతున్నదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు...

madagoni surendar

Feb 08 2024, 11:08

నల్గొండకు ఏ మొఖం పెట్టుకొని వస్తున్నావ్ కేసీఆర్.- టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్.

నల్గొండకు ఏ మొఖం పెట్టుకొని వస్తున్నావ్ కేసీఆర్ - టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్

హైదరాబాద్ (ఫిబ్రవరి 08):-

నాగార్జున సాగర్ నుండి జగన్ కు నీళ్లు ఇచ్చినందుకా? పది ఏండ్లు అధికారంలో ఉండి కూడా ఎస్ ఎల్ బి సి.నీటి కాలువను పూర్తి చేసి, నీళ్లు ఇవ్వనందుకా?మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా సమస్యల సుడిగుండంలో ఉంచినందుకా?అక్షరాన్ని మాత్రమే నమ్ముకుని హైదరాబాద్ లైబ్రరీలల్లో కుర్చీలకు అతుకున్న నల్లగొండ నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టినందుకా?నల్లగొండ మూసీ నది ఏటి ఇసుక నంత దోచుకున్నందుకా? తక్షణమే నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పి, నల్గొండకు రావాలి.కాంగ్రెస్ ప్రజా పాలన హితం కోరుతూ, స్పష్టమైన తీర్పించి కాంగ్రెస్ కు పట్టం కట్టిన నల్లగొండజిల్లా ప్రజల ముందు నీ ఆటలు సాగవు కేసీఆర్.

• చనగాని దయాకర్ గౌడ్ .టీపీసీసీ అధికార ప్రతినిధి, ఓ.యూ. ఉద్యమ నేత •

madagoni surendar

Feb 08 2024, 10:12

నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.

హైదరాబాద్:- నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఉదయం 11:30 గంటలకు ఉభయసభల సమావేశం

ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ తమిలి సై

గవర్నర్ ప్రసంగంపై పొలిటికల్ వర్గాల్లో చర్చ

గత పది ఏళ్ల పాలన తీరు, రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగించనున్న గవర్నర్

గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ స్పీచ్ లో గత బీఆర్ఎస్ పాలనపై ఘాటైన విమర్శలు

ఇవాళ అసెంబ్లీలో అదే స్థాయిలో గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం

madagoni surendar

Feb 07 2024, 17:30

శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల పోస్టర్ ను ఆవిష్కరచిన.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,నకిరేకల్ ఎమ్మెల్యే

శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల పోస్టర్ ను ఆవిష్కరచిన.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం.

నల్గొండ జిల్లా:-నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని ఈ నెల 14 నుండి 21 వరకు అత్యంత వైభవంగా జరిగే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల పోస్టర్ ను హైదరాబాద్ సెక్రటేరియట్ లో అవిష్కరించిన.తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల నిర్మాణ, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.ఈ కార్యక్రమంలో. నకిరేకల్ నియోజకవర్గ నాయకులు, ఆలయ ఈవో,ప్రధాన అర్చకులు తదితరులు.

.

madagoni surendar

Feb 07 2024, 17:12

మెట్రో ట్రైన్ లో ప్రయాణించిన రాష్ట్రపతి

న్యూ ఢిల్లీ :-మెట్రో ట్రైన్ లో ప్రయాణించిన రాష్ట్రపతి

న్యూ ఢిల్లీ :-

చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ వికాస్‌ కుమార్‌ కూడా రాష్ట్రపతితో కలిసి ప్రయాణించారు.

ఈ సందర్భంగా మెట్రో ప్రయాణం గురించిన వివరాలను రాష్ట్రపతికి వికాస్‌ కుమార్‌ వివరిం చారు. ఆమె కొందరు అధికారులతో కలసి ఖాళీ బోగీలో ప్రయాణిస్తున్న 27 సెకన్ల వీడియో నెట్లో వైరల్ అవుతోంది.

అయితే రాష్ట్రపతి ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ప్రయాణించారు, ఎందుకు ప్రయాణించారు వంటి వివరాలు మాత్రం తెలియరాలేదు..

madagoni surendar

Feb 07 2024, 10:48

తెలంగాణలో 9వేల అంగన్వాడి టీచర్లు, హెల్పేర్ల నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో 9వేల అంగన్వాడి టీచర్లు, హెల్పేర్ల నోటిఫికేషన్ జారీ

హైదరాబాద్::-

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 9,వేల అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అనుమతించిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనున్నారు.

గతంలో అంగన్‌వాడీ టీచర్ల పోస్టులకు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉండేది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఉపాధ్యాయులతో పాటు హెల్పర్లుగా నియమితులైన వారు కనీసం ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

అదేవిధంగా, వయోపరి మితి 18 నుండి 35 సంవత్సరాలు.. 65 సంవత్సరాలు దాటిన తర్వాత వారి సేవలను పొందకూడదు. విద్యార్హత మార్కులు, స్థానికత, ఇంటర్వ్యూ మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో అంగన్వాడీ టీచర్‌తోపాటు, హెల్పర్ ఉంటారు. గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైనవారు రాజీ

madagoni surendar

Feb 06 2024, 12:51

భారత్‌ రైస్‌' ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం

డిల్లీ :-భరత్ రైస్ ' ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం

దిల్లీ: దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. 'భారత్‌ రైస్‌' (భారత్ రైస్ ) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

₹29కే కేజీ భారత్‌ రైస్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ దిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. భారత ఆహార సంస్థ (ఫ్ సి ఐ) నుంచి సేకరించిన 5లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(యన్ ఏ ఫ్ ఇ డి ), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (యన్ సీసీఫ్ ), కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల ద్వారా తొలి విడతలో విక్రయించనున్నారు.ఈ రైస్‌ను 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే భారత్‌ గోధుమపిండి కిలో రూ.27.50, భారత్‌ శనగ పప్పును రూ.60 చొప్పున నాఫెడ్‌బజార్‌.కాం తదితర ఈ-కామర్స్‌ వేదికల్లో విక్రయాలకు మంచి స్పందన వస్తుండగా.. భారత్‌ రైస్‌కు సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.