Crimejournalist

Feb 09 2024, 07:55

రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్?*


ఇంటింటికి వెళ్లి విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న ఏ డి ఈ శ్రీనివాసులు, ఏఈ అడ్డగట్ల ప్రమోద్

[ Streetbuzz News Crime journalist ]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్ళపల్లి) :- గృహలక్ష్మి పథకంలో భాగంగా నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలో మండలంలోని కరెంట్ వినియోగదారుల కనెక్షన్లన వివరాలను విద్యుత్ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా సేకరిస్తున్నారు. ఈ తరుణంలో మండలంలోని వివిధ గ్రామాలలో విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరెంటు రీడర్లు చేస్తూ ,రేషన్ కార్డ్, ఆధార్ కార్డుతో విద్యుత్ కనెక్షన్ కు అనుసంధానం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏడిఈ శ్రీనివాసులు, ఏఈ అడ్డగట్ల ప్రమోద్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ లు రాజేందర్, కొమురయ్య, రఘు, స్పాట్ బిల్డర్స్ ప్రసాద్, రాజ్ కుమార్, అన్ మ్యాన్డ్స్ కిరణ్, నరేష్, అంజి, యుగంధర్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Crimejournalist

Feb 09 2024, 07:42

బావుల్లో పేలుతున్న మందుపాతరలు-అన్ లైసెన్సుడు ట్రాక్టర్ల వీరంగం*

[Streetbuzz News Crime journalist]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అన్ లైసెన్సుడు మందు పాతరల కొనసాగింపు విచ్చలవిడిగా సాగుతుంది. క్రషర్ ట్రాక్టర్ల ద్వారా బావుల్లో పూసల బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడుతున్నారు. వారికి ఎలాంటి అనుమతులు లేకుండానే యతేచ్చగా దందా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఈ పేలుళ్ల క్రమంలో ఇండ్లపై కూడా రాళ్లు వచ్చి పడుతున్నాయని వారు చెప్తున్నారు.

Crimejournalist

Feb 09 2024, 07:37

*స్రీ అభ్యున్నతికి ఓరుగల్లులో శోభ*

వామపక్ష జాడ! కానరాదే ఏడ!!

టి.జి. ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డా,,చిర్ర రాజు గౌడ్

[Streetbuzz News Crime journalist]

హనుమకొండ జిల్లా:

ప్రశ్నించే గొంతుక డాక్టర్ కందాల శోభారాణి ప్రధమ వర్ధంతి యాది సభలో టిజిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్, కాకతీయ యూనివర్సిటీ టీచింగ్ విభాగం అసిస్టెంట్ రిజిస్టార్ అశోక్ బాబుతో కలిసి గురువారం విద్యారణ్యపురి కాలనీలో స్మరించుకుంటూ..ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ కందాల శోభారాణి రచయిత్రిగా, మానవ హక్కుల గొంతుకగా, ప్రతినిత్యం ప్రజల సమస్యలపై పోరాట ప్రటిమ, స్రీ సాహిత్య సేవకు ఎనలేని కృషి చేసినారని అంతేకాకుండా కాకతీయ యూనివర్సిటీ మహిళా కళాశాలలో అధ్యాపకరాలుగా, కేయూ జ్యోతిరావు పూలే సెల్ డైరెక్టర్ గా సేవలు అందించడం జరిగిందిని టిజిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చిర్రా రాజు గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కీర్తిశేషులు శోభారాణి భర్త రమేష్, మానవ హక్కుల నాయకులు, సంఘ సేవకులు తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 08 2024, 20:13

కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టబోతున్న తొలి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 300 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి


వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తే రాజాకీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది -భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్

[Streetbuzz News Crime journalist]

సూర్యాపేట జిల్లా:

(మునగాల ఫిబ్రవరి 08):- బడ్జెట్లో వికలాంగులకు అధిక నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి బడ్జెట్లో వికలాంగులకు భరోసా కల్పించేలా నిధులు కేటాయించకుంటే బడ్జెట్ మంత్రి బట్టి విక్రమార్క ఇంటిని ముట్టడిస్తామని మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెంలో నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉద్ఘాటన.తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న తొలి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కు విజ్ఞప్తి చేసినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలిపారు గురువారం మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో నిర్వహించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మునగాల మండలం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తొలిసారి ప్రవేశపెట్టనన్న బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 300 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి అయిన బట్టి విక్రమార్కను తమ సంఘం ఆధ్వర్యంలో కలిసి విజ్ఞప్తి చేశామని తమ విజ్ఞప్తి మేరకు వికలాంగుల సంక్షేమానికి భరోసా కల్పించేలా బడ్జెట్ మంత్రి బట్టి విక్రమార్క నిధులు కేటాయించాలి లేకుంటే బడ్జెట్ మంత్రి బట్టి ఇంటిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతోని అల్లాడిపోతుందని గత ప్రభుత్వ హయాంలోనూ ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు వికలాంగుల సంక్షేమ శాఖకు పైసా ఇవ్వకుండా వికలాంగులు సమాజాన్ని విస్మరించడంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజ్యం పాలయిందని వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తే రాజకీయ పార్టీల మనగుడా ప్రశ్నార్ధకమే అవుతుందని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెబుతుంది కానీ అట్టడుగున ఉన్న వికలాంగుల సామాజిక వర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న హామీ అమలు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తుందని ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ముందుకు రాకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రాష్ట్ర సాధన ఉద్యమంలో వైకల్యాణీ సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్న వికలాంగుల సమాజానికి సంబంధించిన వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని ఇల్లు లేని నిరుపేద వికలాంగులకు ప్రభుత్వమే 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు కోసం ఏండ్ల తరబడి సబ్సిడీ రుణాల కోసం ఎదురుచూస్తున్న వికలాంగులకు వెంటనే బ్యాంకు లింకేజీ తో సంబంధం లేకుండా రుణాలను మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని వికలాంగుల పెన్షన్ 6000 వేలకు పెంచాలని వికలాంగుల మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్. ఇటీవల నల్గొండలో జరిగిన వికలాంగుల దినోత్సవ సభలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వికలాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందంటూ గొప్పలు చెప్పటం శుభపరిణామామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల కోసం నల్లగొండ సీటును త్యాగం చేస్తానని చెప్పారని మంత్రికి వికలాంగుల సమాజంపై చిత్తశుద్ధి ఉంటే వికలాంగుల జిల్లాగా పేరుపొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న భువనగిరి నల్లగొండ అసెంబ్లీ స్థానాలను వికలాంగులకు కేటాయించేలా కాంగ్రెస్ అధిష్టానం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.సంఘం మునగాల మండల అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్, తిమ్మారెడ్డి గూడెం మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ,సైదిరెడ్డి, సంఘం నాయకులు బలుపూనూరి శ్రీనివాస్ రెడ్డి, తిమ్మరెడ్డి, ఏసు రెడ్డి,ఎర్ర నాగలక్ష్మి ,కేతిరేడ్డి పిచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Crimejournalist

Feb 08 2024, 13:42

*బోసిపోతున్న గ్రామపంచాయతీలు వెల వెల..! స్పెషల్ ఆఫీసర్లు రారు..సిబ్బంది ఉండరు

[ Streetbuzz News Crime journalist ]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్ళపల్లి) :-గత జనవరి నెల 31 తో గ్రామపంచాయతీ సర్పంచుల పాలన కాలం గడువు ముగిసిపోయింది. దీంతో ప్రత్యేక అధికారులను ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయించారు. ఈ క్రమంలో స్పెషల్ ఆఫీసర్లు కాని రావడం లేదు. గ్రామపంచాయతీ సిబ్బంది కూడా ఉండడం లేదు. దీంతో మొగుళ్ళపల్లి మండలంలోని గ్రామపంచాయతీలు అన్ని వెల వెల బోతున్నాయి. గతంలో పనిచేసిన సర్పంచ్ లు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక అవస్థలను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మారినప్పటికీ సర్పంచుల దౌర్భాగ్య పరిస్థితి నేటికి మిగిలే ఉంది.

Crimejournalist

Feb 08 2024, 13:22

మొగుళ్లపల్లి పీహెచ్సీలో ఏడు పోస్టుల ఖాళీలు

[Streetbuzz News Crime r]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్లపల్లి ఫిబ్రవరి 08):- మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహిళా సూపర్వైజర్ పోస్టులు రెండు, మేల్ సూపర్వైజర్ పోస్ట్ ఒకటి, మేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు మూడు, స్టాఫ్ నర్స్ పోస్ట్ ఒకటి ఖాళీలుగా ఉన్నాయి. ఈ కాళీ పోస్టులను భర్తీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇటీవల కాలంగా ప్రబలుతున్న నూతన వైరల్ ప్రభావం ప్రభంజిస్తున్న తరుణంలో జనం జడుసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని జనం కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్లపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ప్రజా సమస్యలను తీర్చిదిద్దాలనికోరుతున్నారు.

Crimejournalist

Feb 08 2024, 13:08

కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా లింగారావు!పార్టీ ఉనికి లేనప్పప్పుడే సింగిల్ విండో చైర్మన్ గా

[Streetbuzz News Crime Journalist]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్లపల్లి) :- రంగాపురం గ్రామానికి చెందిన పోలినేని లింగారావు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా వ్యవహరించారు. మండలంలో పార్టీ ఉనికి లేనప్పుడు పిఎసిఎస్ చైర్మన్ గా తొమ్మిది సంవత్సరాలు కొనసాగారు. ఎన్,ఎస్,యు, ఐ తో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన డిగ్రీలో వివిధ పదవులను చేపట్టారు. ఎన్ ఎస్,యు, ఐ లో జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ మెంబర్ గా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు.ఆసమయంలోనే మొగుళ్ళపల్లి సింగిల్ విండో చైర్మన్ గా పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ క్రమంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి క్రాఫ్ లోన్స్, సబ్సిడీ ఎరువులను అందజేసి రైతాంగానికి తోడ్పడ్డారు. 9 సంవత్సరాల కాలంలో ఆయన రైతుల మన్ననలు పొందడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గెలుపు కోసం మండలంలోని ముఖ్యులను కలిసి విజయ బావుటాను ఎగురవేశారు.

Crimejournalist

Feb 08 2024, 08:39

బీసీల పట్ల నాడు వివక్ష నేడు జ్యోతి పూలే పేరుతో కవిత కొత్త రాజకీయం

గౌడ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్ 

[Streetbuzz News Crime Journalist]

తెలంగాణ రాష్ట్రం:- 10 సంవత్సరాల కేసిఆర్ పాలనలో బీసీలకు న్యాయం జరిగిందా కవిత గారు?తమరు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జ్యోతి పూలే విగ్రహాన్ని పెడితే ఎవరైనా వద్దన్నారా?దయచేసి జ్యోతి పూలే లాంటి మహాత్ముల పేరుతో రాజకీయాలు మానుకొని ఆత్మ విమర్శ చేసుకొని గతంలో తమరు బీసీల పట్ల ఎలాంటి విధానాన్ని అనుసరించారు గుర్తు చేసుకోండి?బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడమే కాకుండా బీసీ బందు పేరుతో బీసీ కులాల్లో చిచ్చుపెట్టారు?తెలంగాణలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ ఆలోచించండి బీసీల పేరుతో రాజకీయం చేసే ఇలాంటి వాళ్లను రాజకీయ సమాధి చేయండి.

Crimejournalist

Feb 08 2024, 08:20

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన

సింగన్నగూడ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన గజ్వేల్ ఏసిపి యం. రమేష్, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, గజ్వేల్ షీటీమ్ బృందం

 సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి

 అపరిచిత వ్యక్తుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దు

తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని ఇష్టపడి చదువుకోవాలి

చదువు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు

 ప్రభుత్వ,ప్రైవేటుఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకొని ఉద్యోగం సాధించిన వారే 

[Streetbuzz News Crime journalist]

సిద్దిపేట జిల్లా:

(ములుగు ఫిబ్రవరి 07);- సింగన్నగూడ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన గజ్వేల్ ఏసిపి యం. రమేష్, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, గజ్వేల్ షీటీమ్ బృందంఈ సందర్భంగా గజ్వేల్ ఏసిపి యం. రమేష్ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. షీటీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి, సైబర్ నేరాల గురించి, ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి, ఇవి టీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్ తదితర అంశాల గురించి, సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్ సెక్యూరిటీ, మైనర్ డ్రైవింగ్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి. గతంలో జరిగిన నేరాల గురించి నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి. భరోసా సెంటర్లో ఫోక్సో కేసులలో 18 సంవత్సరాలు లోపు ఉన్న బాలికలకు అందిస్తున్న సేవల గురించి. మహిళలు గృహహింసకు వరకట్నం గురించి శారీరకంగా మానసికంగా హింసించే తదితర అంశాల గురించి స్నేహిత మహిళా సెంటర్లో నిర్వహించే కౌన్సిలింగ్ గురించి వివరించారు. విద్యార్థులు యొక్క గోల్ గురించి,అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలని అంశాల గురించి,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, మరియు తదితర అంశాల గురించి మరియు చట్టాల గురించి విద్యార్థినిలకు వివరించారు. మరియు ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100, నెంబర్ కు సిద్దిపేట షిటీమ్ వాట్సప్ నెంబర్ 8712667434 స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ 9494639498, మహిళా పోలీస్ స్టేషన్ సిద్దిపేట 8712667435 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నేరస్తులు పంపే ఏ లింకులు కూడా ఓపెన్ చేయొద్దని, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, స్కూల్ హెడ్మాస్టర్ మహమ్మద్ అబ్దుల్ రహీమ్,

అధ్యాపకులు,గజ్వేల్ షీటీమ్ సిబ్బంది శ్రీరాములు, ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుళ్లు శ్యామల, లావణ్య, కానిస్టేబుళ్లు మహేష్, రామచంద్రారెడ్డి.తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 08 2024, 07:57

గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి- 16న జరిగే సమ్మె గ్రామీణ బందును జయప్రదం చేయాలి

[Streetbuzz News Crime journalist]

సిద్దిపేట జిల్లా:

(కొండపాక):- కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా 2024 ఫిబ్రవరి16న అఖిల భారత స్థాయిలో కార్మికుల సమ్మె గ్రామీణ బందుకు పాల్గొంటామని తెలియజేస్తూ ఉమ్మడి కొండపాక మండల ఎంఈఓ శ్రీనివాసరెడ్డి మరియు తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ కి మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు ఉమ్మడి మండల కార్యదర్శి అమ్ముల బాల నర్సయ్య మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 /- వేలు నిర్ణయించి అమలు చేయాలని కార్మికుల్ని బానిస తత్వంలోకి నెట్టే 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని మధ్యాహ్న భోజన నిర్వహణ స్వచ్చంద సంస్థలకు ఇచ్చే నిర్ణయం ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం వాటాల అమ్మకం ప్రైవేట్ పరం చేయడం ఆపాలని,కేంద్ర స్కీంలకు బడ్జెట్ తగ్గించవద్దు, స్కీం వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల ఆహారవస్తులపై జిఎస్టి ఉపసంహరించాలని నూతన విద్యా విధానం 2022 చట్టాన్ని రద్దు చేయాలని గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని అవసరమైన గ్యాస్ ను సబ్సిడీకి ఇవ్వాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు గుడ్డుకు 8 రూపాయలు పెరిగినందున అధానంగా బడ్జెట్ ఇవ్వాలని కోరారు.లేనియెడల పిల్లలకు రెండే రోజులు గుడ్లు పెడదామని తెలియజేశారు. గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలి ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని అక్రమ తొలగింపులు అరికట్టాలని రాజకీయ వేధింపులు ఆపాలని వంట షెడ్డు వంట పాత్రలు మౌలిక వసతులు కల్పించాలని కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలని సామాజిక భద్రత కల్పించాలని ప్రమాద బీమా పి ఎఫ్ ఈ ఈ ఎస్ ఐ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ 16న జరిగే సమ్మెలో మేము సైతం పాల్గొంటున్నామని తెలియజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు కృష్ణ,ఉప్పలయ్య,పుష్ప,అరుణ,కలవ్వ అనిత, అంసవ్వ, తదితరులు పాల్గొన్నారు.