విశ్వసనీయతకు నిదర్శనం సీఎం జగనన్న జగనన్న మాటను నిలబెట్టుకుందాం నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు,విద్యా సలహాదారు ఆలూరు ఆలూరు సాంబశివారెడ్డి
విశ్వసనీయతకు నిదర్శనం సీఎం జగనన్న - జగనన్న మాటను నిలబెట్టుకుందాం నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తిస్థాయిలో అమలు చేసి ముఖ్యమంత్రి వైయస్ జగనన్న విశ్వసనీయతకు నిదర్శనంగా నిలిచారని శింగనమల వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు అన్నారు. శింగనమల మండలం లోలూరు, రఘునాథపురం, ఆకులేడు, మదిరేపల్లి, గురుగుంట్ల, నాగులగుడ్డం, నాగులగుడ్డం తాండ, నరసాపురం, చిన్న జలాలపురం, నాయనవారిపల్లి, ఇరువెందుల, రాచేపల్లి, నిదనవాడ, ఆనందరావుపేట, తరిమెల, కల్లుమడి, గుమ్మేపల్లి, ఏకులనాగేపల్లి, గ్రామాలలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి పర్యటించారు. గ్రామాల్లోని వైస్సార్సీపీ నాయకులు ఇళ్లకు వెళ్లి అందరి ఆశీర్వాదం కావాలని కోరారు. అందరి సహాయ సహకారాలతో సమన్వయం చేసుకుంటూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. వీరాంజనేయులు మాట్లాడుతూ.. చరిత్రలో నిలిచేలా శింగనమల చెరువును లోకలైజేషన్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైయస్ జగనన్నకు దక్కుతుందన్నారు. అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న చేపడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి గొప్ప పరిపాలన మళ్లీ మనకు రావాలంటే జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరి చల్లని దీవెనలతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Feb 08 2024, 07:53