మహిళను దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టి బంగారు ఆభరణాలు తీసుకెళ్లిన కేసులో యువకుడి అరెస్టు..
మహిళను దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టి బంగారు ఆభరణాలు తీసుకెళ్లిన కేసులో యువకుడి అరెస్టు ఫిబ్రవరి ఒకటో తారీఖున నార్పల మండలం బండ్లపల్లి పప్పూరు గ్రామంలో అరటి తోటలో మహిళను హత్య చేసి పూడ్చిపెట్టి బంగారు ఆభరణాలు తీసుకెళ్లడం జరిగింది ఎటువంటి ఆధారాలు లేని ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూడు రోజులలోనే చేదించిన పోలీసులునేరం జరిగిన విధానము* ఫిబ్రవరి 3వ తారీఖున నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి తన చెల్లెలు అయిన లక్ష్మీనారాయణమ్మ బండ్లపల్లి పప్పూరు గ్రామంలో ఫిబ్రవరి ఒకటో తారీకు నుంచి కనిపించడం లేదు అని చెప్పడం జరిగింది, అంతలోనే పప్పూరు గ్రామం నుండి లక్ష్మీనారాయణమ్మను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి అరటి తోటలో పూడ్చిపెట్టినట్టు పప్పూరు గ్రామం నుండి సమాచారం వచ్చింది అని నార్పల పోలీసులకు చెప్పగా వెంటనే అరటి తోటలోకి వెళ్లి శవాన్ని వెలికి తీసి పరిశీలించగా లక్ష్మీనారాయణమ్మగా బంధువులు గుర్తించడం జరిగింది...ఫిబ్రవరి ఒకటో తారీఖున లక్ష్మీనారాయణమ్మ చింతకాయల కోసము రామ నాయుడు అరటి తోటపక్కన ఉన్న చింత చెట్టు దగ్గరికి వెళ్లినప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి అరటి తోటలో పూడ్చిపెట్టి వెళ్లి ఉండవచ్చు అని వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్పల పోలీస్ స్టేషన్లో హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది.. ఎటువంటి ఆధారాలు లేని ఈ కేసులో అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ కేకేన్ అంబురాజన్ సార్ గారి సూచనల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ విజయ భాస్కర్ రెడ్డి సారు గారి పర్యవేక్షణలో అనంతపురం రూరల్ డిఎస్పి వెంకట శివారెడ్డి గారి ఆధ్వర్యంలో సింగనమల సిఐ శ్రీ వి శ్రీధర్, బుక్కరాయసముద్రం సీఐ వెంకటేశ్వర్లు ,నార్పల ఎస్సై n. రాజశేఖర్ రెడ్డి గార్లు మరియు సిబ్బంది ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసును మూడు రోజుల్లోనే చేదించి ముద్దాయిని అరెస్టు చేయడం జరిగింది.. *ముద్దాయి అరెస్టు వివరాలు* చల్లా నరేంద్ర వయసు 29 సంవత్సరాలు తండ్రి రామానాయుడు b.పప్పూరు గ్రామం నార్పల మండలం అను వ్యక్తి బీకాం చదివి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు, ఈ మధ్యకాలంలో అతను షేర్ మార్కెట్లో వ్యాపారం చేసి పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయినాడు, దీనికోసం సుమారు 5 లక్షల వరకు వ్యక్తిగతంగా అప్పులు చేసినాడు, ఈ మొత్తాన్ని ఏ విధంగా సంపాదించాలి, ఏదైనా క్రైమ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు, ఈ క్రమంలో ఫిబ్రవరి ఒకటో తారీఖున నరేంద్ర యొక్క అరటి తోటలోకి చనిపోయిన వ్యక్తి లక్ష్మీనారాయణమ్మ చింతకాయలు ఏరుకోవడానికి వచ్చినది, ఆ సమయంలో చుట్టుప్రక్కల ఎవరూ లేనిది గమనించిన నరేంద్ర మృతురాలి మెడలోని బంగారు గొలుసును లాగడానికి ప్రయత్నం చేసి నప్పుడు ఆమె కేకలు వేయగా నిందితుడు పదునైన అంచు గల రాయిని తీసుకొని ఆమె తలపై బలంగా కొట్టి ఆమెను చంపివేసి ఆమె వద్ద నుంచి బంగారు గొలుసు, ఇత్తడి ఉంగరము, ఇత్తడి గాజు మరియు సెల్ ఫోను తీసుకొని ఎటువంటి ఆధారాలు లేకుండా చేయాలని ఉద్దేశంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని సుమారు 2 అడుగుల లోతు గుంత తీసి కప్పి పెట్టడం జరిగింది... విశ్వసనీయ సమాచారం మేరకు ముద్దాయి చల్లా నరేంద్ర ను ఈ దినము మధ్యాహ్నము 3.30pm కి సింగనమల సీఐ శ్రీ శ్రీధర్ గారు, నార్పల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మరియు సిబ్బంది సహాయంతో b. పప్పూరు గ్రామంలోని స్కూలు దగ్గర అరెస్టు చేసి అతని వద్ద నుండి బంగారు గొలుసు, ఇత్తడి గాజు, ఉంగరము మరియు సెల్ఫోను స్వాధీనం చేసుకోవడం జరిగింది, ముద్దాయిని రిమాండ్ పంపించడం జరుగుతుంది.. ఎటువంటి ఆధారాలు లేని కేసును అతితక్కువ సమయంలో చేదించిన రూరల్ డిఎస్పి వెంకట శివారెడ్డి గారిని, సింగనమల సీఐ శ్రీధర్, bks ci వెంకటేశ్వర్లు, నార్పల si రాజశేఖర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని అనంతపురం జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది...
Feb 07 2024, 07:23