ఎస్ఐ మాధవ్ గౌడ్ కు బండి సుదర్శన్ గౌడ్ ఆత్మీయ సన్మానం


ఎస్ఐ మాధవ్ గౌడ్ కు బండి సుదర్శన్ గౌడ్ ఆత్మీయ సన్మానం

[Crime Journalist జయశంకర్ భూపాలపల్లి జిల్లా]:

(మొగుళ్ళపల్లి):- మొగుళ్ళపల్లి ఎస్ఐగా ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన తీగల మాధవ్ గౌడ్ ను చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ సోమవారం పోలీస్ స్టేషన్ లోని తన చాంబార్ లో మర్యాదపూర్వకంగా కలిసి..స్వీట్లు తినిపించి..ఆత్మీయంగా శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి సుదర్శన్ గౌడ్ మాట్లాడారు. ఎస్ఐగా బాధ్యతలను స్వీకరించిన వెనువెంటనే మండలంలోని ప్రజలతో మమేకమై..అన్ని వర్గాల వారితో సత్సంబంధాలను ఏర్పరచుకొని క్రైమ్ రేట్ పెరగకుండా మండలంలో తగు జాగ్రత్తలను చేపడుతున్న ఎస్ఐ మాధవ్ గౌడ్ ఫ్రెండ్లీ పోలీస్ ను అమలు చేస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారని కొనియాడారు.

మొగుళ్ళపల్లి లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్


•మొగుళ్ళపల్లి లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ కాంగ్రెస్ లోకి సర్పంచులు - కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర •

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(Crime journalist భూపాలపల్లి):- త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో మొగుళ్ళపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ నేతృత్వంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లడంతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ద్వితీయ శ్రేణి నాయకులు క్యూ కడుతున్నారన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మొగిస్తుందన్నారు.

బీసీలు పాలితులేనా?..పాలకులయ్యేదెప్పుడు? -వేముల మహేందర్ గౌడ్

బీసీలు పాలితులేనా?..పాలకులయ్యేదెప్పుడు? - వేముల మహేందర్ గౌడ్* 

బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు -వేముల మహేందర్ గౌడ్

[జయశంకర్ భూపాలపల్లి జిల్లా Crime journalist ] :

(తెలంగాణ రాష్ట్రం):- దేశంలో నేటికీ బీసీల భవితవ్యం కోసం జరగాల్సినంత కృషి జరగలేదు. రాజకీయ పార్టీలు బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూశాయి తప్ప, వాళ్ల జీవన ప్రమాణాలను పెంచేందుకు చేసిందేమీ లేదు. బీసీల అభ్యున్నతి అంటే ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్‌లు ప్రకటించి చేతులు దులిపేసుకోవటమేనని గత 8 దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. దేశానికి స్వాతంత్య్రం వస్తే బహుజన మహాజనావళికి ఏం చేస్తారో చెప్పాలని 150 ఏండ్ల కిందటే మహాత్మా జ్యోతిబా ఫూలే అడిగిన ప్రశ్నకు నేటికీ సమాధానం దొరకలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ..బీసీలకు అన్ని రంగాల్లో రావాల్సిన ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్య్రం మాత్రం ఇంకా రాలేదు.

బీసీలకు అన్ని రంగాల్లో దక్కాల్సిన వాటా దక్కలేదు. దేశంలో వలస భారతమంటే అది బీసీల కన్నీటి భారతమేనని చెప్పాలి. దేశంలో సగానికిపైగా ఉన్న బీసీల కులగణన ఇప్పటికీ జరగలేదు. కులగణన చేయాలన్న బీసీల డిమాండ్‌ను నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ మొదలుకొని నేటి ప్రధాని మోదీ వరకు అందరూ పక్కన పెట్టారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్‌గాంధీ చెప్తున్నారంటే కులగణన డిమాండ్‌ను ఇంతకాలం పాలకులు ఎంతలా తొక్కిపెట్టారో బీసీలకు బాగా అర్థం అయ్యింది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. బీజేపీ, కాంగ్రెస్‌ మాత్రమే కాదు, దేశంలోని అన్ని రాష్ర్టాల్లోని పాలకులదీ అదే రీతి.బీసీల అభ్యున్నతికి పాటుపడకపోగా, బీసీ కులాలన్నీ ఐకమత్యంగా ఉండవని, ఎప్పటికీ కలవవని, బీసీలు సమీకృతం కాకుండా కొన్ని పాలకపక్షాలు విష ప్రచారం చేస్తూ వచ్చాయి. దీన్ని తిప్పికొట్టి బీసీలంతా ఒక్కతాటిపై నిలిచి కులగణన కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించాలి. కులగణన చేసి చట్టసభల నుంచి స్థానిక సంస్థల దాకా బీసీల జనాభా దామాషా ప్రకారం సీట్లివ్వాలి. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో, దేశ స్థాయిలో జమిలిగా ఉద్యమాలు జరగాలి. అది మహాత్మా జ్యోతిబా ఫూలే చూపిన అహింసామార్గంలో శాంతియుత మహోద్యమంగా మారాలి. ఈ మానవహక్కుల ఉద్యమానికి పౌరహక్కుల, మానవహక్కుల ఉద్యమకారులంతా తోడై వస్తారు. అధికార పార్టీలో ఉన్నవారి దగ్గర్నుంచి అన్ని పార్టీల్లో ఉన్న బీసీలంతా ఒక్కటి కావాలి. ఇప్పటిదాకా మనం అన్ని పార్టీల జెండాలను మోశాం.

మన బలం, మన మద్దతు లేకుండా ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి, ఏ స్థానిక సంస్థల పదవైనా చేపట్టలేరు. బీసీలు లేకుండా దేశంలో ఏ ఉద్యమమైనా, ఏ పోరాటాలైనా ముందుకుసాగవు. ఇప్పటి దాకా అన్ని ఉద్యమాలకు, అన్ని రాజకీయ పార్టీలకు, అధికారంలో ఉన్న వారి దగ్గర్నుంచి అన్నలు ట్రిగ్గర్‌ నొక్కే వేళ్ల వరకు అన్నింటిలో మనమే ముందుండి, అన్ని పోరాటాలకు మన గొంతుకలనిచ్చి గర్జించాం. ఇప్పుడు మన కోసం, కులగణన కోసం, మన హక్కుల కోసం గొంతెత్తి భాస్వరాలమై భగ్గుమందాం.

ఇప్పటిదాకా అందరికీ జైకొట్టినం. ఇకపై మన అస్తిత్వ సామాజిక ఉద్యమానికి జైకొట్టి కదులుదాం. సై కొట్టి సాగుదాం. ఎన్నెన్నో తిరుగుబాట్లకు పురుడుపోసిన మనం, మన కోసం, మనం తిరుగుబాటు జన జాతరలను చేద్దాం. మన ఉద్యమ వ్యూహరచనను మనమే రచించుకుందాం. కులగణన చేయకుండా పక్కనపెట్టిన కుట్ర రాజకీయాలను చేధించాలి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని నెలకొల్పాలి. బీసీల హక్కుల కోసం మనకు మనంగా సమీకృతమవుతున్న సందర్భంలో బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసుకుందాం.అనేక దశాబ్దాలుగా బీసీ హక్కుల కోసం ఉద్యమిస్తున్న అక్కలు, అన్నలు ఎందరెందరో ఉన్నారు. బీసీల జీవితాలు బాగుపడాలని బహుజన తాత్త్వికతతో నిలబడ్డ యోధులు, పోరాడి అసువులు బాసిన వాళ్లు, బీసీల హక్కుల కోసమే తపిస్తూ జీవితాలను అంకితం చేసి పనిచేస్తున్న వాళ్లెందరో ఉన్నారు. వాళ్లందరికీ పాదాభివందనాలు. బీసీలుగా మనందరం కలిసి కులగణన కోసం కలబడే సమయం ఆసన్నమైంది. మనల్ని విడదీయాలని కుట్రలు చేసే శక్తుల్ని ఒక కంట కనిపెడుతూ సామూహిక స్వరంగా ముందుకు సాగాలి. రాష్ట్రంలో ఎవరికి వాళ్లుగా ఉన్న మన బీసీ సంఘాలన్నీ ఒక్కటై నిలిస్తే మనకంటే శక్తిమంతమైన సంఘం మరొకటి ఉండదు. పోలీసుల దగ్గర్నుంచి ఐటీ సెక్టార్‌ వరకు, రాష్ట్ర సచివాలయం దగ్గర్నుంచి స్థానిక సంస్థల వరకు, పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల దగ్గర్నుంచి సింగరేణి బొగ్గును మండించే గని కార్మికుల వరకు పనిచేసే శక్తులలో సగానికి పైగా బీసీలేనని మరువకండి. సంపద పంచే చేతులు మనవే. వాటిని పొందాల్సింది మనమే.

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా బీసీలు, బీసీ జనగణన గురించి రాజకీయ పార్టీలు గొంతెత్తి మాట్లాడతాయి. కానీ, అమలులో వాటికి చిత్తశుద్ధి ఎంత ఉందో చూడాలి. అదేందో గానీ, ఎన్నికలప్పుడే బీసీలు గుర్తుకువస్తారు. మ్యానిఫెస్టోల్లో గాంభీర్యంగా బీసీలకు వరాలు ప్రకటిస్తారు. బీసీలపై డిక్లరేషన్‌లు తెస్తారు. అది కామారెడ్డి, నాగపూర్‌ కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ కావచ్చు, 2019 బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో కావచ్చు. కాకా కాలేల్కర్‌ కమిషన్‌ వేసి ఆ నివేదికను బుట్టదాఖలు చేసిన నెహ్రూ దగ్గర్నుంచి నేటి ప్రధాని నరేంద్రమోదీ వరకు బీసీ జనగణన కోసం చేసిందేమీ లేదు.బీసీల మొగ్గు ఎటువైపు ఉంటే అటువైపే ఎన్నికల్లో విజయం ఉంటుంది. ఈ లెక్కలు రాజకీయ పార్టీలకు బాగా తెలుసు. అందుకే, ఎన్నికల ముందు బీసీల అభ్యున్నతే తమ ధ్యేయమని ఊదరగొడతాయి. బీహార్‌లో నితీశ్‌ ప్రభుత్వం ఉదంతమే దీనికి ఉదాహరణ. నితీశ్‌ సర్కార్‌ జనగణన చేస్తే.. కొంతమంది కోర్టులను ఆశ్రయించి దాన్ని అమలవకుండా అడ్డుతగిలారు. దీంతో ‘మేం బీసీ జనగణన చేశాం. కానీ, ఆ విషయం కోర్టుల పరిధిలో ఉన్నది. తీర్పు వచ్చాక పరిశీలిద్దాం’ అని నితీశ్‌కుమార్‌ తప్పించుకున్నారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్రమే బీసీ జనగణనకు సిద్ధం కావాలి.బీసీల హక్కుల కోసం తమ జీవితాలను అంకితం చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్‌.కృష్ణయ్య, ప్రొ.తిరుమలి, ప్రొ.సింహాద్రి, ప్రొ.మురళీమనోహర్‌ జోషి, తదితరులు చేస్తున్న ఉద్యమాలు, విజ్ఞప్తులను ప్రభుత్వాలు వింటున్నట్టు నటిస్తాయి. కాని వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు వెతకరు. బీసీల హక్కులు ఎందుకో ఈ దేశంలో ప్రగతిశీలవాదులకు మానవహక్కుల్లా, పౌరహక్కుల్లా కనిపించవు.బీసీల జనగణన జరిగితే దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. పార్లమెంట్‌, అసెంబ్లీల నుంచి స్థానిక సంస్థల వరకు అన్నింటిలో సగానికిపైగా బీసీలే ఉంటారు. అలా జరగకూడదనే నామినేటెడ్‌ పదవులను ఎరగా వేసి పబ్బం గడుపుకొంటున్నాయి. బీసీల కులగణన చేస్తామని, జనాభా ఆధారంగా రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి బీసీల పట్ల తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.

ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం - జిల్లా కాంగ్రెస్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్ & మార్క సతీష్,

ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం - జిల్లా కాంగ్రెస్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్ & మార్క సతీష్,

•ప్రతి చెరువును నింపేందుకు కృషి చేస్తాం-యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ వీర్ •

[సిద్దిపేట జిల్లా Crime Journalist]

(నారాయణరావుపేట 05-02-2024) :- మండలంలోని జక్కాపూర్ గ్రామంలో బతుకమ్మ చెరువులో గంగమ్మకు పూజ చేసి హారతి ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సొప్పదండి చంద్రశేఖర్ & మార్క సతీష్ మాట్లాడుతూ రంగనాయక సాగర్ ఎడమ కాలువ నుండి దాదాపు 70 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే ద్యేయంగా పెట్టుకున్న ప్రభుత్వ, ఈ ఎడమ కాలువ ద్వారా చిన్నకోడూర్, నారాయణరావుపేట, సిరిసిల్లలోని తంగలపెళ్లి మండలాల రైతులకు వ్యవసాయానికి నీళ్లు అందుతాయని అన్నారు. అలాగే యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ వీర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కేవలం పెద్ద కాలువలు మాత్రమే నిర్మించారని, అవ్వి కూడా అక్కడక్కడా పూర్తిగా అవ్వలేదని, దీని వలన చెరువులకు, కుంటాలకు, చెక్ డ్యాంలకు నీళ్ళు తీసుకపోవలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పరిస్థితి ఉందన్నారు. ఈ జక్కాపూర్ కాలువల ద్వారా నారాయణరావుపేట మండలంలోని కొన్ని గ్రామాలకు, తంగలపల్లి మండలంలోని కొన్ని గ్రామాలకు నీళ్లు వెళ్తున్నాయని, అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ త్వరలోనే అధిగమించి ప్రతి చెరువును నింపుతామని అన్నారు. ప్రధానంగా శనిగకుంటా మధిర గ్రామానికి ఆనాటి ప్రభుత్వం ఎలాంటి కాలువను చేయకపోవడం వలన ఈ రోజు సరిపడా నీళ్లు ఉన్న అక్కడికి అక్కడి రైతులకు అందకపోవడం ఇబ్బంది అన్నారు, ఈ విషయం త్వరలోనే మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, శరవేగంగా కాలువల నిర్మాణం జరిగేందుకు కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా రైతులు ఎవ్వరు కూడా ఈ నీళ్ళ విషయంలో గందరగోళనికి గురి కావద్దని, ఎలాంటి సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకువస్తే, మంత్రుల మాట్లాడతాం అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పల్లె శ్రీనివాస్, బుచ్చెల్లి రవి, ఎల్లం, మండల నాయకులు రాగుల అశోక్, పల్లె పర్శరాములు, గ్రామ అధ్యక్షులు బోయిని బాలయ్య, ఉపాధ్యక్షులు మాట్ల రాజు, నిరుగొండ దేవయ్య, పల్లె ప్రశాంత్, సారుగు హరికృష్ణ, దాసరి కాంతయ్య, జక్కుల కనకయ్యా, పనుగట్ల ఆంజనేయులు, కంకణాల రమేష్,విట్టల్, ఎండి హైమద్, గుండెలి వేణు తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లో రాణించిన శ్రీ చైతన్య విద్యార్థులను అభినందించింన - ప్రిన్సిపాల్ తిరుమల్

క్రీడల్లో రాణించిన శ్రీ చైతన్య విద్యార్థులను అభినందించింన

- ప్రిన్సిపాల్ తిరుమల్ 

[Crime Journalist సిద్దిపేట జిల్లా : ఫిబ్రవరి05 ]

(హుస్నాబాద్ నియోజకవర్గం):- చైతన్య విద్యాసంస్థలు సిద్దిపేట జోన్ లోని జోనల్ మీట్ లో భాగంగా సిద్దిపేటలోని రంగధాంపల్లి బ్రాంచ్ నందు గత శనివారం నాడు సిరిసిల్ల, హుస్నాబాద్, చేర్యాల, సిద్దిపేట బ్రాంచ్ లోని విద్యార్థినీ విద్యార్థులకు జూనియర్, సీనియర్ విభాగంలో కబడ్డీ, కో -కో, రిలేపరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ జోనల్ మీట్ లో హుస్నాబాద్ బ్రాంచ్ నుండి కబడ్డీ జూనియర్ బాయ్స్ మొదటి బహుమతి, కబడ్డీ జూనియర్ గర్ల్స్ రెండో బహుమతి, కోకో సీనియర్స్ గర్ల్స్ మొదటి బహుమతి, 4×100 రిలే పరుగు పందెం బాయ్స్ ప్రథమ, ద్వితీయ బహుమతి సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ తిరుమల్ తెలిపారు. గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ తిరుమల్, ఏవో తిరుపతి,డీన్ తిరుపతి, పీఈటి రాజు, రమ్య   ఉపాధ్యాయబృందం,తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.

మేడారం జాతర వెళ్లేవారికి ఆధార్ తప్పనిసరి.

మేడారం జాతర వెళ్లేవారికి ఆధార్ తప్పనిసరి.

మేడారం: [ Crime journalist మేడారం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. మేడారంలో ఎత్తు బంగారాన్ని (బెల్లం) కొనుగోలు చేసిన భక్తుల వివరాలను సేకరించి తమకు అందజేయాలని వ్యాపారులను ఎక్సైజ్ శాఖ నుంచి ఆధార్ జిరాక్స్, ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ తీసుకుని బెల్లాన్ని విక్రయించాలని అధికారులు తెలిపారు. గుడుంబా తయారీకి బెల్లం పక్కదారి పట్టే అవకాశం ఉండడంతో ఈ నిబంధనలు పెట్టామన్నారు. గుడుంబా తయారీకి బెల్లాన్ని విక్రయించిన వారికి రూ. లక్ష జరిమానా విధిస్తామన్నారు. ఇది ఇలా ఉండగా,ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా చదువు అన్నారెడ్డి

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా చదువు అన్నారెడ్డి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: [ Crime Journalist ]:

(మొగుళ్ళపల్లి):- మండలంలోని మొగుళ్ళపల్లి-ముల్కలపల్లి గ్రామాల మధ్యన నిర్వహించే శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రెండు గ్రామాల జాతర ఉత్సవ కమిటీ డైరెక్టర్లు తెలిపారు. శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా చదువు అన్నారెడ్డి, ఉపాధ్యక్షులుగా మల్సాని నరసింగారావు, బుర్ర మహేందర్, ఎలేటి రాజిరెడ్డి, బుర్ర సదయ్య, బండారి బొందయ్య, రాజయ్య, పడిదల జగ్గారావు, కొడారి ఓదెలు, సహాయ కార్యదర్శులుగా శనిగరపు లింగయ్య, వెన్నెండ్ల రవి, చెక్క కొమురయ్య, పసునూటి సార పాపయ్య, కోశాధికారులుగా వీణవంక నవీన్ కుమార్, రక్తాన్ని గోపాల్ రావు, పడిదల నర్సింగారావు, వీణవంక రాజు, చింతకింది నగేష్, కనికిరెడ్డి మల్లయ్య, వీణవంక రాజన్న, బండారి పోచయ్య, ఓనపాకల బాబు, నల్లభీమ్ మల్లయ్య, గాజుల దామోదర్, బత్తిని శంకరయ్య, వీణవంక నిరంజన్, అన్న సదయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు డైరెక్టర్లు తెలిపారు.

కుల గణనకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్ కు ధన్యవాదాలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అనిల్ గౌడ్

కుల గణనకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్ కు ధన్యవాదాలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అనిల్ గౌడ్

తెలంగాణ రాష్ట్రం:

[ Crime journalist ]:-

రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీల జీవిత కాల వాంఛ అయిన కుల గణనకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్ కి ధన్యవాదాలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అనిల్ గౌడ్

మేమెంతో మాకంత అన్న నినాదాన్ని నిజం చేయడంలో కుల గణన తొలి అడుగు

తొలి అడుగుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క గారికి, తెలంగాణ క్యాబినెట్ మంత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు

అణగారిన వర్గాల ఆకాంక్షలు నెరవేరాలంటే జనాభా లెక్కలు తేలాలి

అందుకే కుల గణనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది

బీసీలు అంటే వెనకబడ్డ కులాలు కాదు రాష్ట్రానికి, దేశానికి వెన్నెముక వర్గాలు

వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందడానికి ఈరోజు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయమే సాక్ష్యం

సంక్షేమమే మా అజెండా.. సమాజిక న్యాయమే మా జెండా

ఏసీబీ కి చిక్కిన మహ్మదాబాద్ ఎస్ఐ.సురేష్

ఏసీబీ కి చిక్కిన మహ్మదాబాద్ ఎస్ఐ.సురేష్

మహబూబ్ నగర్ జిల్లాలో ఏసీబీ కి చిక్కిన మహ్మదాబాద్ ఎస్సై సురేష్

[ Crime journalist] :-

మహ్మదాబాద్ మం. పగిడాల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారునీపై ప్రేమ వ్యవహారంపై మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఎస్సై సురేష్ 50 వేలు డిమాండ్ చేశారు, బాధితులు మొదటగా 30 వేలు చెల్లించగా, మిగతా నగదు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న జిరాక్స్ సెంటర్ యజమాని మూసాకి 20,000 డబ్బులు చెల్లించాలని, లేనియెడల మీ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేస్తామాని ఎస్సై బెదిరింపులకు పాల్పడడంతో భాదితులు కృష్ణారెడ్డి ఏసీబీ అధికారులు ఆశ్రయించారు., రాత్రి సమయంలో జిరాక్స్ యాజమానీ మూసాకి బాధితులు 20 వేల డబ్బు చెల్లిస్తూ ఉండడంతో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు ,ఎస్సై సురేష్ పై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు

ఆర్థిక స్థితిపై భర్తను భార్య అవహేళన చేయడమూ క్రూరత్వమే : హైకోర్టు

ఆర్థిక స్థితిపై భర్తను భార్య అవహేళన చేయడమూ క్రూరత్వమే : హైకోర్టు

ఆర్థిక స్థితి గురించి భర్తను భార్య తరచుగా ఎత్తిపొడవడం, అవహేళన చేయడం కూడా మానసిక క్రూరత్వమేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

ఇటువంటి క్రూరత్వాన్ని ఎదుర్కొన్న సందర్భాల్లో విడాకులను కోరే హక్కు భర్తకు లభిస్తుందని తెలిపింది.

ఆర్థిక స్థోమతకు మించిన కలలను నెరవేర్చమని భర్తపై భార్య ఒత్తిడి చేయడం సరికాదని న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైత్ , నీనా బన్సల్ కృష్ణలతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.

అనవసర అంశాలపై రాద్ధాంతం చేస్తూ భర్తపై భార్య ఒత్తిడిని పెంచడం సరికాదు. దీనివల్ల జీవితంలో సంతృప్తి, ప్రశాంతతలకు చోటులేకుండా పోతుంది. భర్తపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

వైవాహిక జీవితంలో ఉన్నవారు తమ అవసరాలు, కోరికల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి’’ అని ధర్మాసనం సూచించింది.

భార్య టార్చర్‌ను భరించలేక విడాకుల కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌కు ఫ్యామిలీ కోర్టు అనుమతించింది. దీన్ని సవాల్ చేస్తూ సదరు మహిళ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను విచారిస్తూ ఢిల్లీ హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది.

విడాకులను పొందేందుకు బాధిత భర్తకు అనుమతి ఇస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధించింది.

తన తల్లిదండ్రుల నుంచి రూ.8వేలు అప్పు తీసుకున్న విషయాన్ని పదేపదే చెప్పి భర్తను భార్య టార్చర్ చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

హర్యానా నుంచి ఢిల్లీకి కుటుంబాన్ని షిఫ్ట్ చేయాలని భర్తను ఆమె బలవంత పెట్టడాన్ని కూడా న్యాయస్థానం తప్పుపట్టింది.