అమరావతి.. ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత.. అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన..
అమరావతి.. ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత.. అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన. జాబ్ క్యాలండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు. బారికేడ్స్ పెట్టి అడ్డుకున్న పోలీసులు. పోలీసులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం. పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన టీడీపీ నేతలు. ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లిన తెలుగుదేశం నేతలు.
Hot Topic.. నార్పల సత్యనారాయణరెడ్డి నివాసంలో డీఎస్పీ శ్రీనివాస్ మూర్తి తో పలువురు నాయకులు
డీఎస్పీ శ్రీనివాస్ మూర్తి గారు నార్పల సత్యనారాయణరెడ్డి నివాసంలో చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశాల్లో తుంపెర పక్కిర్ రెడ్డి, దుగ్గుమర్రి నారాయణ రెడ్డి , గుగుడు శివ శంకర్ రెడ్డి నార్పల యరప రెడ్డి వెంకటంపల్లి , నాయనపల్లి, గొల్లపల్లి ,పప్పురు,మద్దలపల్లి గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.. మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది..
సంక్షేమ సారథికి మళ్ళీ పట్టం కడదాం.. సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు కార్యక్రమంలో విద్యా సహాదారులుఆలూరు సాంబశివారెడ్డి జిల్లాఅధ్యక్షులు పైలా నరసింహయ్య
సంక్షేమ సారథికి మళ్ళీ పట్టం కడదాం - సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య నిరుపేదల సంక్షేమ సారథి ముఖ్యమంత్రి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు పిలుపునిచ్చారు. శింగనమల మండల పరిధిలోని బండమీదపల్లి, చక్రాయపేట, పోతురాజుకాల్వ, పెరవలి, జలాలపురం, జులకాల్వ అలంకారాయునిపేట, కొరివిపల్లి, చిల్లేపల్లి, సలకంచెర్వు, ఈస్ట్.నరసాపురం, చిన్న మట్లగొంది, పెద్ద మట్లగొంది, సోదనపల్లి, గోవిందురాయని పేటగ్రామాలు, మండల కేంద్రంలోని కాలనీలలో ఆయన పర్యటించారు. గ్రామాల్లోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పలకరిస్తూ, జగనన్న తనను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారని మీ అందరి దీవెనలతో గెలిపించాలని కోరారు. జగనన్నే మనందరి ధైర్యమని ఆయన చేసిన మంచే మనల్ని గెలిపిస్తుందని తెలిపారు. రాష్ట్రం బాగుండాలి అంటే నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి జగనన్నని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామన్నారు. ఈనెల 10వ తేదీన జరగబోయే సిద్ధం సభకు భారీగా జనాలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రంలో జయహో బీసీ కార్యక్రమం..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో *ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కిష్టయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్నా *శింగనమల నియోజకవర్గ అబ్జార్వ్ గుర్రప్ప నాయుడు గారు, టీడీపీ SC సెల్ రాష్ట్ర అధ్యక్షులు MS రాజు గారు, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు,జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు* మరియు మండల కన్వీనర్ అశోక్ కుమార్,బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి నాగరాజు గారు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ, లక్ష్మినారాయణ, కేశన్న, S. నారాయణ స్వామి, EX. MPP SK వెంకటేశు గారు, మల్లికార్జున రెడ్డి గారు, అదిశేషయ్య గారు,బెస్త నారాయణస్వామి,మాజీఎంపీటీసీ నారాయణ స్వామి, భూసి, హరి, బాబాయ్య, చిత్తంబారి,నరేంద్రయాదవ్, బోలె అక్కులప్ప గారు, రామకృష్ణ రెడ్డి గారు , తిప్పన్న గారు ,మలేష్ గారు , వన్నూర్ గారు, పరుశురాం గారు, కొయ్యగుర పెద్దన్న గారు మరియు తదితర టీడీపీ బీసీ నాయకులు, మండల టీడీపీ నాయకులు మరియు పెద్దయేతున్న టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రొత్త ప్రిన్సిపాల్ అర్జున్ నాయక్ రాకతో మారబోతోన్న ST గురుకుల పాఠశాల రూపరేకలు..
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ST గురుకుల పాఠశాల కు క్రొత్త ప్రిన్సిపాల్ అర్జున్ నాయక్ పెద్దలు రాకతో పాఠశాల దిశ మారబోతోన్నది ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ లో అద్భుతమైన స్పీచ్ తో అతని విధివిధానాలు పేరెంట్స్ క్లుప్తంగా వివిరించారు పేరెంట్స్ కూడా సానుకూలంగా స్పదించారు.. పేరెంట్స్ ద్వారా కూడా  ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.. ఇక నుంచి పాఠశాల దిశ మార్చుష్టాన్న ధీమా వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ అర్జున్ నాయక్
లక్ష్మీనారాయణమ్మ మృత దేహానికి నివాళులు అర్పించి బంధువులకు ఓదార్చి దైర్యం చెప్పిన.. రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు..
నార్పల మండలం బి పప్పూరు గ్రామంలో నెట్టెం లక్ష్మీనారాయణమ్మ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు. హత్యకు గురయిన మహిళ మృతదేహాన్ని గ్రామ సమీపంలోని పొలాల్లో పాతిపెట్టారు. బంధువుల పిర్యాదు మేరకు సమీప పొలాల్లో వెతకడంతో దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ విషయం తెలుసుకున్న *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు* అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృత దేహానికి నివాళులు అర్పించి బంధువులకు ఓదార్చి దైర్యం చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వారిని కటినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.ఆ గ్రామంలోని మహిళ రైతులు పొలాల్లోకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు.తక్షణం నిందితులను తేల్చాలని పోలీసులను డిమాండ్ చేశారు.
వడియం పేట YCP సీనియర్ నాయకులు అనంత వెంకట రెడ్డి గారు వారి నాన్న దాది రెడ్డి గారి జ్ఞాపకార్థము 3 బెడ్స్ ఆసుపత్రికి అందించిన.. ఎంపీపీ దాసరి సునీత
బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపి విభాగానికి మూడు బెడ్స్ ( పరుపులు) ఎంపీపీ దాసరి సునీత గారు మరియు ఎంపీడీవో శ్రీమతి శోభారాణి అందజేయడమైనది, గత నెలలో ఆస్పత్రి అభివృద్ధికి సమావేశంలో మెడికల్ ఆఫీసర్ గారి అభ్యర్థన మేరకు ఎంపీపీ గారు చొరవ తీసుకుని, ఎంపీపీ గారి అభ్యర్థన మేరకు వడియం పేట వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట రెడ్డి గారు వారి నాన్న దాది రెడ్డి గారి జ్ఞాపకార్థము మూడు బెడ్స్ ఆసుపత్రికి అందించడం జరిగింది. అందుకుగాను ఎంపీపీ గారు ఎంపీడీవో గారు ప్రత్యేక ధన్యవాదాలు అనంత వెంకట్ రెడ్డి గారికి తెలియజేశారు. త్వరలోనే ఆసుపత్రికి ఇన్వర్టర్ కూడా ఏర్పాటు చేస్తామని ఎంపీపీ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మోహన్ రావు గారు, పీహెచ్ఎం చెన్నమ్మ, స్టాఫ్ నర్స్ నారాయణ నాయక్, సూపర్వైజర్ ఈశ్వరమ్మ ఎఫ్ ఎన్ ఓ నాగలక్ష్మి, కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు
జగనన్నను దీవించండి.. సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..
జగనన్నను దీవించండి.. సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలన మళ్ళీ రావాలంటే జగనన్నకు ప్రజలందరి దీవెనలు అందించాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని కాలనీలలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలసి పర్యటించారు. పార్టీ నాయకులు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పలకరిస్తూ, మరోసారి జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని, మీ అందరి దీవెనలతో మంచి మెజార్టీతో గెలిపించాలని వారిని విన్నవించుకున్నారు. వీరాంజనేయులు మాట్లాడుతూ జగనన్న పరిపాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. గత పరిపాలన కంటే వైసీపీ పరిపాలన మంచిగా ఉందని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగనన్నని మరోసారి కలిసికట్టుగా ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటూ సమన్వయంతో అందరి సలహాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
సిద్ధం సభను విజయవంతం చేయండి.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి
సిద్ధం సభను విజయవంతం చేయండి.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఎన్నికల శంఖారావం సిద్ధం సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శింగనమల మండల కేంద్రంలోని రామాలయం గుడిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్న దీవెనలతో నియోజకవర్గ సమన్వయకర్తగా ఎం. వీరాంజనేయులు నియమితులయ్యారని అన్నారు. 2019 లో మీ అందరి దీవెనలతో ఎమ్మెల్యేను భారీ మెజారిటీతో గెలిపించిన విధంగానే వీరాంజనేయులును కూడా ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన జరుగుతా ఉంటే ప్రతిపక్షాలు ఏకమై ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగనన్న మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవటానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈనెల 10 తేదీ అనంతపురంలో జరగబోయే "సిద్ధం" సభకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం వీరాంజినేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్న తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అహర్నిశలు కష్టపడి పార్టీని బలోపేతం చేస్తానన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. అందరూ దీవెనలు అందించాలని వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి "సిద్ధం" సభ పోస్టర్ల ను ప్రారంభించారు. రేపటి నుంచి మండల వ్యాప్తంగా పర్యటన* మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం వీరాంజనేయులు పర్యటించనున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని కలవనున్నట్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Breaking.. చింత కాయలు కోయడం కోసం ఈ నెల 01 వ తేది తోటకు వెళ్ళింది.. ఈ రోజు అరటి చెట్లల్లో శవమై తేలింది..
అనంతపురం జిల్లా నార్పల మండలం లోని బి పప్పూరు గ్రామానికి చెందిన నెట్టెం లక్ష్మి నారాయణమ్మ వయసు (52) చింత కాయలు కోయడం కోసం ఈ నెల 01 వ తేది తోటకు వెళ్ళింది.. అప్పటినుంచి ఆమె కనిపించలేదు.. ఈ రోజు బంధువులు వెతకగా గుర్తుతెలియని వ్యక్తులు బండరాలతో మోదీ మెడలోని గొలుసులు, కమ్మలు లాక్కెళ్ళి అరటి తోట లో పూడ్చి వేశారు... నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. హత్య జరిగిన సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్ ను రంగం లోకి దింపుతున్న నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డి....
సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ వెంకట శివారెడ్డి.