అటవీ శాఖ పేదల పొట్ట గొట్టే ఆలోచన విరమించుకోవాలి.
అటవీ శాఖ పేదల పొట్ట గొట్టే ఆలోచన విరమించుకోవాలి.
తునికాకు టెండర్లు వెంటనే పిలవాలి.
టిఎజి ఎస్ రాష్ర్ట ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా,జనవరి20, : తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టిఎజి ఎస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కాగజ్ నగర్ పట్టణం లోనీ బాల భారతి హై స్కూల్ లో తునికాకు కల్లేదార్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్ మాట్లాడుతూ తునికాకు సేకరణ వ్యవసాయం తర్వాత రెండో పంటగా అటవీ ప్రాంతంలో ఉందని,ఆకు సేకరణ ద్వారా ఆదివాసీలు ఇతర పేదలు ఉపాధి పొందుతారని కుమురం భీం జిల్లాలో సైతం 30 వేల మంది కూలీలు ఉపాధి పొందుతారని, కూలీలతోపాటు కళ్ళేదారులు గోడౌన్ కార్మికులు కాంట్రాక్టు కాంట్రాక్టర్లు కూడా ఆదాయం పొందుతారని, ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఖర్చు లేకుండా ఆదాయం వస్తుందని కానీ జిల్లాలోని ఫారెస్ట్ అధికారులు పెద్ద పులులు సంచరిస్తున్నాయని పేరుతో ఈ సీజన్లో తునికాకు యూనిట్లను రద్దు చేయాలని ప్రభుత్వానికీ సిఫారసులు చేసిందనీ ఈ నిర్ణయం వల్ల పేదలు నష్టపోతారని, జిల్లాలో రెండు డివిజన్ల పరిధిలో మొత్తం 25 యూనిట్లు ఉండగా మైనింగ్, కవాల్ టైగర్ కారిడార్, కడంబ టైగర్ కారిడార్ పేరుతో ఇప్పటికే చాలా యూనిట్లను తగ్గించినటువంటి పరిస్థితి ఉందని, తగ్గిన యూనిట్ల పరిధిలో కూలీలు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. పులుల ఆవాసం 25 యూనిట్ల పరిధిలో లేదని దాని సాకు చూపి పేదల కడుపు కొడితే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పునరాలోచించాలని, దీనిపై ఎమ్మెల్యేలు స్పందించాలని కోరారు. వెంటనే తునికాకు టెండర్లు పిలవాలని లేని పక్షంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తునికాకు కళ్ళేదారుల సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా చన్కపురి కాశినాథ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ కె నాయిమ్, కోశాధికారి గా సోయం తిరుపతి ఉపాధ్యక్షులుగా టేకం హనుమంతు, సహాయ కార్యదర్శిగా ఒండ్రే గణేష్, కమిటీ సభ్యులుగా శ్రీనివాస్ గౌడ్, అజిజ్, బోరెం తిరుపతి, యాదగిరి నాందేవ్, పెందం రవి, ఎల్ములే దశరథ్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు కొరెంగా మాలశ్రీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజo శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ముంజo ఆనంద్ కుమార్ , వివిధ మండలాల కల్లేదార్లు పాల్గొన్నారు.
Feb 04 2024, 20:48
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.1k