హైదరాబాద్ కల్లు సొసైటీ ల పైన ఉద్దేశపూర్వకమైన దాడులు ఆపాలని డిమాండ్ చేసిన గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అద్యక్షులు
హైద్రాబాద్ కల్లు సొసైటిల పైన ఉద్దేశపూర్వకమైన దాడులు ఆపాలని డిమాండ్- నారాయణ గౌడ్
గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అద్యక్షులు
పోరం పర్ గుడ్ గవర్నెన్స్ వారికి హైద్రాబాద్ లో
గల్లీ గల్లీ లో గంజాయి; డ్రగ్ దందాలు
కనిపించడం లేదా; కేవలం కల్లుగీత వృత్తిదారుల పైన; వేలాది మంది సొసైటిల పైన ఆదరపడిన గీతన్నల పైన మీ అక్కాస్ ఎందుకు?
హైదరాబాద్:[Crime journalist]:-
కల్తీ కల్లు పేరు చెప్పి మొత్తం వేలాది మంది ఆదరపడిన కల్లుగీత సొసైటిల పైన మీ ఆరోపనలు అర్ధ రహితం ; హైద్రాబాద్ లో అనేక ఆహార పదార్థాలు; పాలు; ఎన్నో పేరెన్నికగన్న సంస్థల పేరుతో కల్తీ జరుగుతుంటే మీకు అవి ఏవి కనిపించడం లేదా; హైద్రాబాదు కు వచ్చే అనేక ఆహార పదార్థాలు; పాలు; కూరకాయలు సుదురా ప్రాంతాల నుండి రావడం లేదా కేవలం కల్లుకు మాత్రమే యాబై కిలో మీటర్ల పరిధి Golden,కేవలం ఒక సామాజిక వర్గమైన గౌడ సమజం పైన కావాలని చేస్తున్న కుట్రగా గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటి గా మేము బావిస్తున్నాము.దీనిపైన బహిరంగ చర్చ కు మేము సిద్ధంగా ఉన్నాము; మీరు సిద్ధంగా ఉన్నారా:
కల్లుగీత వృత్తిదారుల పైన; గౌడ సామాజిక వర్గంపైన మీ ఉద్దేశ పూర్వకమైన దాడులు ఆపాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటిగా డిమాండ్ చేస్తున్నాను.
Feb 04 2024, 13:04