హైదరాబాద్ కల్లు సొసైటీ ల పైన ఉద్దేశపూర్వకమైన దాడులు ఆపాలని డిమాండ్ చేసిన గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అద్యక్షులు

హైద్రాబాద్ కల్లు సొసైటిల పైన ఉద్దేశపూర్వకమైన దాడులు ఆపాలని డిమాండ్- నారాయణ గౌడ్ 

గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అద్యక్షులు

పోరం పర్ గుడ్ గవర్నెన్స్ వారికి హైద్రాబాద్ లో 

గల్లీ గల్లీ లో గంజాయి; డ్రగ్ దందాలు

కనిపించడం లేదా; కేవలం కల్లుగీత వృత్తిదారుల పైన; వేలాది మంది సొసైటిల పైన ఆదరపడిన గీతన్నల పైన మీ అక్కాస్ ఎందుకు?

హైదరాబాద్:[Crime journalist]:-

 కల్తీ కల్లు పేరు చెప్పి మొత్తం వేలాది మంది ఆదరపడిన కల్లుగీత సొసైటిల పైన మీ ఆరోపనలు అర్ధ రహితం ; హైద్రాబాద్ లో అనేక ఆహార పదార్థాలు; పాలు; ఎన్నో పేరెన్నికగన్న సంస్థల పేరుతో కల్తీ జరుగుతుంటే మీకు అవి ఏవి కనిపించడం లేదా; హైద్రాబాదు కు వచ్చే అనేక ఆహార పదార్థాలు; పాలు; కూరకాయలు సుదురా ప్రాంతాల నుండి రావడం లేదా కేవలం కల్లుకు మాత్రమే యాబై కిలో మీటర్ల పరిధి Golden,కేవలం ఒక సామాజిక వర్గమైన గౌడ సమజం పైన కావాలని చేస్తున్న కుట్రగా గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటి గా మేము బావిస్తున్నాము.దీనిపైన బహిరంగ చర్చ కు మేము సిద్ధంగా ఉన్నాము; మీరు సిద్ధంగా ఉన్నారా:

కల్లుగీత వృత్తిదారుల పైన; గౌడ సామాజిక వర్గంపైన మీ ఉద్దేశ పూర్వకమైన దాడులు ఆపాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటిగా డిమాండ్ చేస్తున్నాను.

విద్యార్థినీ విద్యార్థులకు ట్రాఫిక్ ర్యాగింగ్, యాంటీ హ్యూమన్,బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాల గురించి అవగాహన కల్పించిన ఎస్ఐ

విద్యార్థినీ విద్యార్థులకు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ ర్యాగింగ్,యాంటీ హ్యూమన్, ఈవ్ టీజింగ్ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాల గురించి అవగాహన కల్పించిన షీటీమ్ బృందం, ఎస్ఐ

సిద్దిపేట జిల్లా:

(గజ్వేల్ నియోజకవర్గం):

Crime journalist తేదీ 03-ఫిబ్రవరి-2024]

(మునిగడప):- జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, నిర్మూలన గురించి, మానవ అక్రమ రవాణా నిర్మూలన, గుడ్ టచ్, బాడ్ టచ్, సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించిన జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్ గజ్వేల్ షీటీమ్ ఏఎస్ఐ శ్రీరాములు.

 సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

 అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దు

 తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగి చదువుకోవాలి

చదువు ఒక్కటే మన జీవితాన్ని మార్చగల శక్తి ఉంది  

ఈ సందర్భంగా జగదేవపూర్ ఎస్ఐ.చంద్రమోహన్ మాట్లాడుతూ* అందరు కలిసిమెలిసి ఉండాలనిఒకరికొకరు చదువులో సహాయం చేసుకుంటూ ఒక లక్ష్యం, గోల్ ఏర్పాటు చేసుకుని దాని కనుగుణంగా కష్టపడి చదువుకోవాలని అన్నారు. ఎవరు కూడా బాల్య వివాహాలు చేసుకొని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బాల్య వివాహాలు, మానవ అక్రమా రవాణా గురించి సమాచారం ఉంటె మాకు తెలియజేయాలని సూచించారు. సెల్ ఫోన్స్ అవసరం మేరకు ఉపయోగించాలని, ఎవరు కూడా సైబర్ నేరాలకు గురికావద్దు అని, తెలియని వ్యక్తులు నుండీ వచ్చే మెసేజ్ లకు రెస్పాండ్ కావద్దని, బ్యాంక్ అధికారులము అంటు ఎవరైన ఫోన్ చేసి అకౌంట్ వివరాలూ అడిగితే చెప్పవద్దు అని తెలిపారు.విద్యార్థులను ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీటీమ్ నెంబర్ 8712667434 కాల్ చేయాలని సూచించారు. మహిళల రక్షణకు ఎల్లప్పుడు షీటీమ్ అండగా ఉంటుందని తెలిపారు. అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని ఈ వయసులో ప్రేమ పెళ్లి అంటూ చెప్పే వారి మాటలు నమ్మవద్దని సూచించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగి చదువుకోవాలని మనిషి జీవితాన్ని మార్చేది చదువు ఒక్కటేనని చదువు ఉంటే ఎక్కడైనా బతుకుచ్చని తెలిపారు. ఇష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ కనకయ్య, అధ్యాపకులు, గజ్వేల్ షీటీమ్ బృందం శ్రీరాములు ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు రామచంద్రారెడ్డి, మహేష్, మహిళా కానిస్టేబుళ్లు శ్యామల, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మె నోటీసు ను ఎంఈఓ కార్యాలయంలో ఎం ఐ ఎస్ సురెందర్ కు సమర్పించిన సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు

ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మె నోటీసు ను ఎంఈఓ కార్యాలయంలో ఎం,ఐ,ఎస్ కోఆర్డినేటర్ సురెందర్ కు సమర్పించిన సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు.

•కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే కార్మిక పరిషత్తుల సమస్యలు పరిష్కరించాలి •

సిద్దిపేట జిల్లా:

[కొండపాక Crime journalist] :- కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజల ఐక్యతకు విఘాతం కలిగిస్తూ ప్రజలపై అనేక ఆంక్షలు విధించి దేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తుందని బాల నర్సయ్య మండిపడ్డారు. శనివారం రోజున ఎంపీడీవో రామిరెడ్డి,ఎం ఈ ఓ ఆఫీసులో ఎం ఐ యస్ కోఆర్డినేటర్ సురేందర్ లకు ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బందులో కార్మికులు కర్షకులు పాల్గొంటున్నట్టు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల నరసయ్య మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలను చేపడుతూ ప్రజలపై భారాలు మోపుతుందన్నారు. సాగు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చే రైతుల భవిష్యత్తును నాశనం చేసే విధానాలు చేపట్టిందన్నారు పోరాడి సాధించుకున్న కార్మిక కర్షక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దుచేసి పెట్టుబడిదారు కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడులను తీసుకువచ్చే కార్మిక హక్కులను హరించి వేసింది అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రజలపై మోయలేని బారాలు పడుతున్నాయన్నారు .దేశంలో రోజురోజుకు ఆకలి దరిద్రం నిరుద్యోగం పేదరికం పెరిగిపోతుందన్నారు.కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు దేశ సంపదలను దోచిపెడుతున్నారని ప్రభుత్వ రంగ సంస్థలను దివాలా తీసివేసి తీయించి ప్రైవేటీకరణ విధానాలను యదేచ్చగా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. స్కీం వర్కర్ ల సమస్యలు పరిష్కరించే కనీస వేతనాలు 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు .గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ పెంచాలని గ్రామపంచాయతీ కార్మికులు అందర్నీ పర్మినెంట్ చేసి కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. 51 జీవోను సవరించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేసి ప్రస్తుతం కొనసాగుతున్న కేటగిరీలను కొనసాగించాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ జీతాలు బిల్లులు చెల్లించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి కార్మిక పరిషత్తుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ లో హమాలీలు గ్రామపంచాయతీ కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు స్కీం వర్కర్లు అంగన్వాడి ఆశ వివిధ రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బర్మా కొమురయ్య, మండల మండల అధ్యక్ష కార్యదర్శులు ఆరుట్ల నరసింహులు, జాలిగామ ప్రభాకర్ ,లస్కర్ రామచంద్రం ,మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ మండల కార్యదర్శి బైరెడ్డి లీలా రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కాస రమేష్, కొమ్ము పద్మ ,కాసా నాగలక్ష్మి, కొమ్ము లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 16న జరిగే సమ్మె నోటీసు ను తహసీల్దారు కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన మధ్యాహ్న భోజన పథక కార్మికులు

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు ఈ నెల 16వ తేదీన జరిగే సమ్మె నోటీసు ను తహసీల్దారు కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన సిఐటియూ మధ్యాహ్న భోజన పథక కార్మికులు

సిద్దిపేట జిల్లా:

[Crime journalist] (కొండపాక):- కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు ఈ నెల 16న సమ్మె నోటీసును ఎంఈఓ కొండపాక మండల ఆఫీసులో ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ సురేందర్ కు వినతి పత్రం ఇస్తున్న సిఐటియు మధ్యాహ్న భోజన పథక కార్మికులు.

డిగ్రీ పూర్తైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అవగాహన కరపత్రం విడుదల చేసిన కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్

డిగ్రీ పూర్తైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అవగాహన కరపత్రం విడుదల చేసిన కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ 

కేయూ క్యాంపస్

[Crime journalist]

•ఈనెల 6న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కు ఆఖరి తేదీ•

డిగ్రీ పూర్తయిన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అవగాహన కరపత్రాన్ని విడుదల చేసిన కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ టిజీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్.

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముందు కేయూ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం (టి.జి.ఫ్) అధ్యక్షులు ఎర్రం రమేష్ గారి ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమం కరపత్రాన్ని విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ బి.విజయ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు ఉన్నా గాని మళ్లీ కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్లకే ఓటు హక్కు ఉంటుందని రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ అధికారి వికాస్ రాజు నోటిఫికేషన్ లో తెలిపారు, కావున ఏదైనా డిగ్రీ 2020 నవంబర్ 1 నాటికి పూర్తి చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టి.జి.ఫ్ రాష్ట్ర అధ్యక్షులు కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్ మాట్లాడుతూ ఈనెల ఫిబ్రవరి 6వ తారీఖు నాడు ఆఖరి తేదీ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ఆన్లైన్ లో ceotelangana.nic.in link ద్వారా స్వయంగా మీ మొబైల్ ఫోన్లో గాని, ఇంటర్నెట్ సెంటర్లో గాని, మీ సేవలో గాని గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు చేసుకోవాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర నాయకులు ,కాకతీయ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. రాంబాబు, కాకతీయ యూనివర్సిటీ పోటీ పరీక్షల సంచారకులు డాక్టర్ టి. నాగయ్య, కేయూ ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ కర్రే సదాశివ్, డాక్టర్ మంజుల, డాక్టర్ శ్రీలత, డాక్టర్ సంధ్య, డాక్టర్ ఆగపాటి రాజ్ కుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి

శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరను సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి -స్పెషల్ అధికారులకు జాతర డైరెక్టర్ల విన్నపం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

[Crime journalist]:-

(మొగుళ్ళపల్లి):- మండలంలోని మొగుళ్ళపల్లి-ముల్కలపల్లి గ్రామాల మధ్యన జరిగే శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జాతర ఉత్సవ కమిటీ డైరెక్టర్లు మొగుళ్లపల్లి, ముల్కలపల్లి గ్రామాలకు చెందిన స్పెషల్ అధికారులకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభమైనప్పటినుండి రాజకీయ పార్టీలకతీతంగా మొగుళ్ళపల్లి, ముల్కలపల్లి గ్రామాలకు చెందిన డైరెక్టర్లందరూ కలిసి జాతర ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొని, ప్రశాంతమైన వాతావరణంలో జాతర ఉత్సవాలను నిర్వహించుకునే వారమని డైరెక్టర్లు తెలిపారు. కాగా ప్రస్తుతం జాతర ఉత్సవ కమిటీలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడంతో..జాతర ఉత్సవ కమిటీ ఎన్నికల్లో జాప్యం జరుగుతుందన్నారు. కాగా డైరెక్టర్లమంతా కలిసి జాతర ఉత్సవాలను సజావుగా నడిపించే సమర్థత కలిగిన వారిని ఎంపిక చేసుకుందామనుకుంటే అందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడంతో..కొంతమేర జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా రెండు గ్రామాలకు చెందిన గ్రామపంచాయతీ స్పెషల్ అధికారులు, ఎండోమెంట్ అధికారులు చొరవ తీసుకొని డైరెక్టర్లమంతా కలిసి జాతర ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

వైసిపి పార్టీ కి రాజీనామా చేసిన మంగళగిరి పట్టణ వైసిపి అధ్యక్షుడు మునగాల మళ్ళేశ్వరరావు

వైసీపీకి బిగ్ షాక్

వైసిపి పార్టీ కి రాజీనామా చేసిన మంగళగిరి పట్టణ వైసిపి అధ్యక్షుడు మునగాల మళ్ళేశ్వరరావు

[Crime journalist మంగళగిరి ]:- వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న నియోజకవర్గ కేంద్రం మంగళగిరి పట్టణ వైసీపీ అధ్యక్షుడు పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.వై సీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. తాను వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా పనిచేశానని కానీ తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా శనివారం నాడు తనకు ఉన్న పట్టణ పార్టీ అధ్యక్ష పదవికి, వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నేడు ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు తనకి సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. 

భద్రాచలంలో మాజీ మంత్రి హరీష్ రావు తో తమ ఆవేదన చెప్పిన ఆటో డ్రైవర్ లు

భద్రాచలంలో మాజీ మంత్రి హరీశ్ రావుతో తమ ఆవేదన చెప్పుకున్న ఆటో డ్రైవర్లు

భద్రాచలం [Crime journalist]:-

ప్రభుత్వ నిర్ణయంతో నడి రోడ్డుమీద పడ్డామని బాధపడ్డ ఆటో డ్రైవర్లు తెలిపారు.తమను ఆదుకోవాలని, తమ పక్షాన పోరాటం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావును కోరిన ఆటో డ్రైవర్లు.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించి, ప్రతి నెలా ఆర్థిక సహాయం అందేలా చేస్తామని చెప్పిన హరీశ్ రావు.ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు బాధాకరమన్న హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం దిగివచ్చి న్యాయం చేసే దాకా పోరాటం చేస్తామన్నారు.

భద్రాచలం రాముడిని దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వద్ది రాజు

మాజీ మంత్రి హరీష్ రావు తో కలిసి భద్రాచలం రాముడిని దర్శించుకున్న ఎంపీ వద్దిరాజు

భద్రాచలం:

[ Crime journalist ఫిబ్రవరి, 3] :-

మాజీ మంత్రి హరీష్ రావు భద్రాచలం పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. తొలుత ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. అంతరాలయంలోకి తోడ్కొని వెళ్లారు. గర్భ గుడిలో స్వామి వారి దివ్య మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హరీష్ రావు తో పాటు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, దిండిగాల రాజేందర్ తదితరులు ఉన్నారు.

రోడ్డెక్కిన ఆసరా ఫించన్ దారులు

రోడ్డెక్కిన ఆసరా పింఛన్‌ దారులు

రహదారిపై గంటపాటు ట్రాఫిక్‌ జామ్‌

జనవరి నెల ఆసరా పింఛన్లు అందక లబ్ధిదారులు రోడ్డెక్కారు.

నారాయణపేట జిల్లా:

[Crime journalist]

(నారాయణపేట):- శుక్రవారం నారాయణపేట జిల్లా జాజాపూర్‌ గ్రామంలో చోటుచేసుకున్నది. ప్రభుత్వం ఆలస్యంగా ఇవ్వడం, పోస్టాఫీస్‌లో బీపీఎంను తొలగించడం వంటి సమస్యతో పింఛన్లు అందకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు.స్థానిక గ్రామ పంచాయతీ భవనం ఎదుట మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-యాద్గీర్‌ ప్రధాన రహదారిపై పింఛన్‌దారులు బైఠాయించారు. దీంతో గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని సంబంధిత పోస్టల్‌ అధికారులకు సమాచారం అందించారు. పింఛన్లు అందిస్తామని పోస్టల్‌ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నారాయణపేట ఎంపీడీవో వెంకయ్య సైతం గ్రామానికి చేరుకుని కారణాలను తెలుసుకున్నారు.