లక్ష్మీనారాయణమ్మ మృత దేహానికి నివాళులు అర్పించి బంధువులకు ఓదార్చి దైర్యం చెప్పిన.. రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు..
నార్పల మండలం బి పప్పూరు గ్రామంలో నెట్టెం లక్ష్మీనారాయణమ్మ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు. హత్యకు గురయిన మహిళ మృతదేహాన్ని గ్రామ సమీపంలోని పొలాల్లో పాతిపెట్టారు. బంధువుల పిర్యాదు మేరకు సమీప పొలాల్లో వెతకడంతో దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ విషయం తెలుసుకున్న *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు* అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృత దేహానికి నివాళులు అర్పించి బంధువులకు ఓదార్చి దైర్యం చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వారిని కటినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.ఆ గ్రామంలోని మహిళ రైతులు పొలాల్లోకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు.తక్షణం నిందితులను తేల్చాలని పోలీసులను డిమాండ్ చేశారు.
వడియం పేట YCP సీనియర్ నాయకులు అనంత వెంకట రెడ్డి గారు వారి నాన్న దాది రెడ్డి గారి జ్ఞాపకార్థము 3 బెడ్స్ ఆసుపత్రికి అందించిన.. ఎంపీపీ దాసరి సునీత
బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపి విభాగానికి మూడు బెడ్స్ ( పరుపులు) ఎంపీపీ దాసరి సునీత గారు మరియు ఎంపీడీవో శ్రీమతి శోభారాణి అందజేయడమైనది, గత నెలలో ఆస్పత్రి అభివృద్ధికి సమావేశంలో మెడికల్ ఆఫీసర్ గారి అభ్యర్థన మేరకు ఎంపీపీ గారు చొరవ తీసుకుని, ఎంపీపీ గారి అభ్యర్థన మేరకు వడియం పేట వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట రెడ్డి గారు వారి నాన్న దాది రెడ్డి గారి జ్ఞాపకార్థము మూడు బెడ్స్ ఆసుపత్రికి అందించడం జరిగింది. అందుకుగాను ఎంపీపీ గారు ఎంపీడీవో గారు ప్రత్యేక ధన్యవాదాలు అనంత వెంకట్ రెడ్డి గారికి తెలియజేశారు. త్వరలోనే ఆసుపత్రికి ఇన్వర్టర్ కూడా ఏర్పాటు చేస్తామని ఎంపీపీ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మోహన్ రావు గారు, పీహెచ్ఎం చెన్నమ్మ, స్టాఫ్ నర్స్ నారాయణ నాయక్, సూపర్వైజర్ ఈశ్వరమ్మ ఎఫ్ ఎన్ ఓ నాగలక్ష్మి, కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు
జగనన్నను దీవించండి.. సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..
జగనన్నను దీవించండి.. సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలన మళ్ళీ రావాలంటే జగనన్నకు ప్రజలందరి దీవెనలు అందించాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని కాలనీలలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలసి పర్యటించారు. పార్టీ నాయకులు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పలకరిస్తూ, మరోసారి జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని, మీ అందరి దీవెనలతో మంచి మెజార్టీతో గెలిపించాలని వారిని విన్నవించుకున్నారు. వీరాంజనేయులు మాట్లాడుతూ జగనన్న పరిపాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. గత పరిపాలన కంటే వైసీపీ పరిపాలన మంచిగా ఉందని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగనన్నని మరోసారి కలిసికట్టుగా ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటూ సమన్వయంతో అందరి సలహాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
సిద్ధం సభను విజయవంతం చేయండి.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి
సిద్ధం సభను విజయవంతం చేయండి.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఎన్నికల శంఖారావం సిద్ధం సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శింగనమల మండల కేంద్రంలోని రామాలయం గుడిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్న దీవెనలతో నియోజకవర్గ సమన్వయకర్తగా ఎం. వీరాంజనేయులు నియమితులయ్యారని అన్నారు. 2019 లో మీ అందరి దీవెనలతో ఎమ్మెల్యేను భారీ మెజారిటీతో గెలిపించిన విధంగానే వీరాంజనేయులును కూడా ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన జరుగుతా ఉంటే ప్రతిపక్షాలు ఏకమై ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగనన్న మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవటానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈనెల 10 తేదీ అనంతపురంలో జరగబోయే "సిద్ధం" సభకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం వీరాంజినేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్న తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అహర్నిశలు కష్టపడి పార్టీని బలోపేతం చేస్తానన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. అందరూ దీవెనలు అందించాలని వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి "సిద్ధం" సభ పోస్టర్ల ను ప్రారంభించారు. రేపటి నుంచి మండల వ్యాప్తంగా పర్యటన* మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం వీరాంజనేయులు పర్యటించనున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని కలవనున్నట్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Breaking.. చింత కాయలు కోయడం కోసం ఈ నెల 01 వ తేది తోటకు వెళ్ళింది.. ఈ రోజు అరటి చెట్లల్లో శవమై తేలింది..
అనంతపురం జిల్లా నార్పల మండలం లోని బి పప్పూరు గ్రామానికి చెందిన నెట్టెం లక్ష్మి నారాయణమ్మ వయసు (52) చింత కాయలు కోయడం కోసం ఈ నెల 01 వ తేది తోటకు వెళ్ళింది.. అప్పటినుంచి ఆమె కనిపించలేదు.. ఈ రోజు బంధువులు వెతకగా గుర్తుతెలియని వ్యక్తులు బండరాలతో మోదీ మెడలోని గొలుసులు, కమ్మలు లాక్కెళ్ళి అరటి తోట లో పూడ్చి వేశారు... నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. హత్య జరిగిన సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్ ను రంగం లోకి దింపుతున్న నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డి....
సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ వెంకట శివారెడ్డి.
మండల అధ్యక్షులు దాసరి సునీత ఆధ్వర్యంలో సాధారణ సర్వ సభ్య సమావేశం.. నూతన పదవీ భాద్యతలు స్వీకరించిన శ్రీమతి యం. శోభారాణి..
బుక్కరాయసముద్రం మండల పరిషత్ కార్యాలయం బుక్కరాయసముద్రము నందు మండల పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించబడినది. ఈ సమావేశానికి గౌరవ మండల అధ్యక్షులు దాసరి సునీత గారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఈ రోజు పదవీ భాద్యతలు స్వీకరించిన శ్రీమతి యం. శోభారాణి గారు, గౌరవ యం.పి. టి సి/ కో ఆప్షన్ సభ్యులు , సర్పంచులు, అందరు మండల స్థాయి అధికారులు, విస్తరనాధికారి గారు,పరిపాలనాదికారి గారు, పంచాయతీ కార్యదర్శులు హాజరు కావడమైనది.
రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డిని మర్యాద పూర్వకంగా కలసిన 3 మండలాలు MPDO లు..
అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శింగణమల, బుక్కరాయసముద్రం, నార్పల మండలాల నూతన ఎంపీడీఓ లు రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందించాలని ఎంపీడీవోలకు తెలియజేశారు.
జగనన్న పాలన చరిత్రాత్మకం - కలసికట్టుగా పని చేద్దాం.. గత రెండు రోజులుగా బుక్కరాయసముద్రం మండలంలో విస్తృత పర్యటన చేస్తున్న వీరాంజనేయులు సమన్వయకర్త
జగనన్న పాలన చరిత్రాత్మకం - కలసికట్టుగా పని చేద్దాం.. జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు రాష్ట్ర రాజకీయ చరిత్రలో జగనన్న పరిపాలన చారిత్రాత్మక మని, సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని పి. కొత్తపల్లి, పసులూరు, దండువారిపల్లి, ఏడావులపర్తి, ఓబుళాపురం, వడియంపేట, పొడరాళ్ళ, బి.కొత్తపల్లి, రేగడికొత్తూరు, గోవిందంపల్లి, భద్రంపల్లి, బోయకొట్టాల, కొట్టాలపల్లి, గ్రామాల్లో రెండవ రోజు ఎం. వీరాంజనేయులుతో కలసి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి పర్యటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీవెనలతో, ఆలూరు దంపతులు, వైఎస్సార్సీపీ నాయకుల సహకారంతో నియోజకవర్గ సమన్వయకర్తగా అధిష్టానం నియమించిందని పార్టీ తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నాయకులను కార్యకర్తలను కలుపుకొని అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవటానికి కలిసికట్టుగా కృషి చేద్దామని గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి సమన్వయకర్త విన్నవించుకున్నారు. తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తించారు. వీరాంజియులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసి.. చిన్నారుల నుంచి వృద్దుల వరకు ప్రతి కష్టంలో తానున్నానని భరోసాని కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
28 మంది ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా సన్మానం చేసి రిలీవ్ చేసిన.. కమాండెంట్ ఇంచార్జీ అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప

చంద్రబాబు నాయుడు గారిని 2024 లో ముఖ్యమంత్రి చేసుకుంటాం.. రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు..
చంద్రబాబు నాయుడు గారిని 2024 లో ముఖ్యమంత్రి చేసుకుంటాం.. రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు.. ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారి ఆదేశాల మేరకు* నార్పల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్లస్టర్ ఇంఛార్జిలు, యూనిట్ ఇంఛార్జి లు, బూత్ ఇంఛార్జి లకు ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు పాల్గొన్నారు.ట్రైనర్ నీలు స్వామి గారు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి క్లస్టర్ ఇంఛార్జి లు,యూనిట్ ఇంఛార్జి లు,బూత్ ఇంఛార్జి లు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. సైకో జగన్ చేస్తున్న అరాచకాలను అడ్డుకట్ట వేయాలంటే మనమందరం కష్ట పడి పనిచేసి కచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు.ఈ సైకో జగన్ వల్ల ఈ రాష్ట్రం భవిష్యత్ అంధకారం అయ్యింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ నిరుద్యోగ సమస్య తీరాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన భాధ్యత మనందరి పైన ఉందన్నారు.తెలుగుదేశం పార్టీ మహాశక్తి సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంఛార్జి లు, బూత్ ఇంఛార్జి లు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.