జగనన్న పాలన చరిత్రాత్మకం - కలసికట్టుగా పని చేద్దాం.. గత రెండు రోజులుగా బుక్కరాయసముద్రం మండలంలో విస్తృత పర్యటన చేస్తున్న వీరాంజనేయులు సమన్వయకర్త
జగనన్న పాలన చరిత్రాత్మకం - కలసికట్టుగా పని చేద్దాం.. జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు రాష్ట్ర రాజకీయ చరిత్రలో జగనన్న పరిపాలన చారిత్రాత్మక మని, సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని పి. కొత్తపల్లి, పసులూరు, దండువారిపల్లి, ఏడావులపర్తి, ఓబుళాపురం, వడియంపేట, పొడరాళ్ళ, బి.కొత్తపల్లి, రేగడికొత్తూరు, గోవిందంపల్లి, భద్రంపల్లి, బోయకొట్టాల, కొట్టాలపల్లి, గ్రామాల్లో రెండవ రోజు ఎం. వీరాంజనేయులుతో కలసి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి పర్యటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీవెనలతో, ఆలూరు దంపతులు, వైఎస్సార్సీపీ నాయకుల సహకారంతో నియోజకవర్గ సమన్వయకర్తగా అధిష్టానం నియమించిందని పార్టీ తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నాయకులను కార్యకర్తలను కలుపుకొని అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవటానికి కలిసికట్టుగా కృషి చేద్దామని గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి సమన్వయకర్త విన్నవించుకున్నారు. తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తించారు. వీరాంజియులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసి.. చిన్నారుల నుంచి వృద్దుల వరకు ప్రతి కష్టంలో తానున్నానని భరోసాని కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Feb 04 2024, 08:03