madagoni surendar

Feb 03 2024, 21:02

వ్యక్తి దారుణ హత్య
వ్యక్తి దారుణ హత్య
                                  నల్లగొండ జిల్లా: (కేతేపల్లి):-  ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగింది.వివరాల్లోకెలితే   ఇప్పలగూడేంలో  ఓ వ్యక్తిని దారుణం గా హత్య చేశారు. కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో వంటల సైదులు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి నరికి చంపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్లు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చెపటరు.ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

madagoni surendar

Feb 03 2024, 21:17

వ్యక్తి దారుణ హత్య.

వ్యక్తి దారుణ హత్య

నల్లగొండ జిల్లా:

(కేతేపల్లి):- ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగింది.వివరాల్లోకెలితే ఇప్పలగూడేంలో ఓ వ్యక్తిని దారుణం గా హత్య చేశారు. కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో వంటల సైదులు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి నరికి చంపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్లు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చెపటరు.ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

madagoni surendar

Feb 03 2024, 11:46

: రైలు కింద పడి యువకుడి సూసైడ్
చిత్తూరు జిల్లా : రైలు కింద పడి యువకుడి సూసైడ్ వాల్మీకిపురం- కలికిరి మార్గంలోని కలికిరి వద్ద మదనపల్లి పట్టణం ఎస్టేట్ వద్ద వుండే టిఎన్ఆర్ కాలనీకి చెందిన పెద్దారెడ్డి కుమారుడు ఏ. సోమశేఖర్ రెడ్డి శుక్రవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న కదిరి రైల్వే హెచ్ సి బాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

madagoni surendar

Feb 03 2024, 11:17

సమ్మక్క-సారక్క వనదేవతలను సతీసమేతంగా దర్శించుకున్న.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ముల్లుగు జిల్లా :- . .. .. తెలంగాణలో అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క - సారక్క వన దేవతలను సతీసమేతంగా  నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే  అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. సమ్మక్క సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల పై పసుపు, కుంకుమ, బెల్లం, నూతన వస్త్రాలను సమర్పించి గిరిజన సంప్రదాయ పద్దతులో అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు..

madagoni surendar

Nov 17 2023, 16:00

బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బిజెపి కి ఓటు వేయాలి.నకిరేకల్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి నకిరేకంటి మొగులయ్య.

బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బిజెపికి ఓటు వేయాలి.నకిరేకల్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి నకిరేకంటి మొగులయ్య

Streetbuzz news నల్గొండ జిల్లా:

బంగారు తెలంగాణ నిర్మాణం బీజేపీతోనే సాధ్యమని అందుకోసం ప్రతి ఒక్కరు బిజెపికి ఓటు వేసి గెలిపించాలని.నకిరేకల్ అసెంబ్లీ బిజెపి అభ్యర్థి నకిరేకంటి మొగులయ్య అన్నారు.శుక్రవారం పామునగుండ్ల, యరసాని గూడెం, ముత్యాలమ్మ గూడెం, దుగినవేల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకంటి. మొగులయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం వాటిని అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యాడని, అన్ని వర్గాలను సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. కేసీఆర్ పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారి కోసం మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకునే కుట్రలు చేస్తారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నకిరేకల్ నియోజకవర్గంలో చిరుమర్తి లింగయ్య. నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, కేవలం వారు మాత్రమే అభివృద్ది చెందారని ఆరోపించారు. బీజేపీ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని, కేంద్రంలో ప్రధాని మోడీ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆదరించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నకిరేకల్ లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు....ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఐతగోని అనిత,మండల అధ్యక్షులు పబ్బు వెంకటేశ్వర్లు,బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పసుల సైదులు,పాదూరి వెంకట్ రెడ్డి,కోమటి భాస్కర్,పులకరం శంకర్,గున్నల.నాగరాజు,కారంపూడి సాయి, ఉట్కూరి చిరంజీవి,పులకరం రూప,ఉట్కూరి కృష్ణ,నీలం నాగరాజు,పులకరం నాగరాజు,కాడింగ్ నాగరాజు,ఉడుగుండ్ల శేఖర్,గజానాబోయిన శ్రీను,జాడిగాల వీరేష్,బంటు ప్రశాంత్, కడింగు గణేష్, బొమ్మకంటి నాగరాజు, బక్క శివ తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Jul 20 2023, 13:29

హైదరాబాద్ .బీసీ మంత్రులకు టికెట్లు ఇవ్వనని కేసీఆర్ డిసైడయ్యారు.చనగాని దయాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి*

గాంధీ భవన్

బీసీ మంత్రులకు టికెట్లు ఇవ్వనని కేసీఆర్ డిసైడయ్యారు.చనగాని దయాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి*

మంత్రులు కేసీఆర్ దగ్గర తమ గ్రాఫ్ పెంచుకుని టికెట్లు తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ని తిడుతున్నారు.

తలసాని చదువుకోలేదు కాబట్టి ఆయనకి సంస్కారం ఉండదు.

9 ఏళ్ల నుండి కేసీఆర్ బీసీలకు చేసింది ఎంటి?

తలసాని బీసీ ముసుగు వేసుకొని నాటక కంపెనీ మొదలుపెట్టాడు.

తెలంగాణ అమరుడు దొడ్డి కొమరయ్య కు నివాళి అరిపించావా

ఈ నలుగురు బీసీ మంత్రులు బీసీల సమస్యలపై ఎప్పుడైనా మాట్లాడారా?

తన కొడుకు గోదావరి నది గురించి అవగాహన లేని మాటలు మాట్లాడినట్టు ఇప్పుడు తలసాని బీసీల గురించి తలసాని కి గొర్లు తెలియడు గొర్ల మంద తెలియడు.

అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు.

తలసాని HMDA భూములను పాన్ పరాగ్ నలిమినట్టు నములుతున్నాడు.

కేసీఆర్ కేటీఆర్ లతో కోట్లాడి మీ పార్టీ బీసీ నేతలకు పదవులు ఇప్పించండి.

సామాజిక న్యాయం పాటించే ఏకైక పార్టీ కాంగ్రెస్.

madagoni surendar

Jul 20 2023, 13:21

నల్గొండ జిల్లా :బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన కట్టంగూర్ పోలీసులు

బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన కట్టంగూర్ పోలీసులు

Streetbuzz news.

.

.

డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై బీజేపి పోరుబాట

"పేదోడి సొంతింటి కోసం టిఆర్ఎస్ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలను ఎండగడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ అసమర్ధ పాలన ను నిలదీయడం కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో బాటసింగారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల క్షేత్ర స్థాయి పరిశీలన కోసం వస్తున్న సందర్భంగా బాటసింగారంలో మా నాటకాలు బయట పడతాయని BRS ప్రభుత్వం బటసింగారం వెళ్లకుండా బిజెపి కార్యకర్తలను ఎక్కడిక్కడ అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.బీ ఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల చేత చేయిస్తున్న ఈ అక్రమ అరెస్టులు నశించాలని అప్రజాస్వామిక పాలను కొనసాగిస్తున్న బీ ఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెపుతారని కట్టంగూర్ లో అరెస్ట్ అయిన బీజేపీ నాయకులు అన్నారు అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పసుల. సైదులు, మాజీ మండల అధ్యక్షులు ముడుసు. బిక్షపతి, పాదూరి. వెంకట్ రెడ్డి, కత్తుల. హనుమంతు, బసవోజు వినోద్, ఓరుగంటి. హరిబాబు తదితరులు ఉన్నారు

madagoni surendar

Jul 19 2023, 16:53

హైదరాబాద్::శ్వేతా మహంతి కి కేంద్ర సర్వీస్ లోకి బదిలీ*

శ్వేతా మహంతి కి కేంద్ర సర్వీస్ లోకి బదిలీ

Streetbuzz news:

.:

హైదరాబాద్ జులై 19

తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిణి శ్వేతా మహంతి కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. నాలుగేళ్ల పాటు కేంద్ర సర్వీసుల్లో పని చేసేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని క్యాబినెట్ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సెక్రటరీగా ఆమెను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2011 కేడర్‌కు చెందిన శ్వేతా మహంతి ప్రస్తుతం తెలంగాణ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకు ముందు హైదరాబాద్, వనపర్తి జిల్లాలకు కలెక్టర్‌గా వ్యవహరించారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన శ్వేతా మహంతి.. ఆ తర్వాత సివిల్స్ వైపు అడుగులు వేశారు. రెండో ప్రయత్నంలోనే ఏకంగా ఆల్ ఇండియా రెండో ర్యాంకు సాధించి కలెక్టర్ అయ్యారు....

madagoni surendar

Jul 17 2023, 15:08

నల్గొండ జిల్లా: కేతపల్లి మండలం::గ్రామపంచాయతీ సిబ్బంది అందర్నీ పర్మినెంట్ చేయాలి.బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని*

గ్రామపంచాయతీ సిబ్బంది అందర్నీ పర్మినెంట్ చేయాలి.బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని 

గ్రామ పంచాయతీ కార్మికులందరిని పర్మినెంట్ వేతనాలు ఉద్యోగ, పర్మినెంట్ చేసి పెంచాలని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేతపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న పరిశుద్ధ కార్మికులకు మద్దతు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారు.పారిశుధ్య కార్మికులు, స్వీపర్లు,పంపు ఆపరేటర్లు,ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు బిల్ కలెక్టర్లు వివిధ కేటగిరిలో పనిచేస్తూన్నా పనికితగ్గ వేతనాలు రావడం లేదన్నారు.గ్రామపంచాయతీ సిబ్బందికి కేటగిరి వారిగా వేతనాలు నిర్వహించాలని,కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జిఓ నెం.51 తీసుకొచ్చి మల్టీ పర్పస్ విధానాన్ని అమలుచేస్తుంది.గ్రామంలో చెత్త చెదారం,జంతు కలేభరాలు,కుళ్ళిపోయిన శవాలను తొలగిస్తూ మురికికాల్వలను శుభ్రం చేస్తూ జీవితాంతం వెట్టి చాకిరి చేయాల్సివస్తుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికులందరికీ కనీస వేతనం 19500/- రూ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేసి, ఆరోగ్యభద్రత కల్పించాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, సునీత,వంటపాక సుదర్శన్, సూరారపు నవీన్,వంటేపాక శివ,రాజు పారిశుద్ధ కార్మికులు సైదులు, తానేష్, కేశవులు, దిలీప్, గుర్వమ్మ, నరేందర్, జానయ్య, వెంకటేష్, వెంకటయ్య లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

madagoni surendar

Jul 04 2023, 16:39

బిజెపి -బిఆర్ఎస్ మిలాకత్ తోనే బండి మార్పు... కిషన్ రెడ్డి నియామకం.- టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్-*

బిజెపి -బిఆర్ఎస్ మిలాకత్ తోనే బండి మార్పు... కిషన్ రెడ్డి నియామకం.- టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్-

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ...ఈ నేపథ్యంలోనే బిజెపి రాష్ట్ర పార్టీ లో మార్పులు జరిగాయని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్ పేర్కొన్నారు. బిజెపికి బిఆర్ఎస్ పార్టీ బీ టీం అని చెప్పుకుంటున్న క్రమంలోనే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ని మార్చి కిషన్ రెడ్డిని నియమించడం తో బిజెపి బిఆర్ఎస్ మీలాకాతు అయిందని స్పష్టంగా తెలుస్తుందని ఆయన వివరించారు. బిజెపి అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ను సీఎంగా కూర్చోబెట్టడానికి అనేక కుట్రలు చేస్తున్నదని చెప్పారు. ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి రాజకీయ వ్యూహాలు పన్నుతూ టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తో రహస్య ఒప్పందం చేసుకున్నారని వివరించారు. ఖమ్మం సభకు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి ప్రసంగించడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని చనగా నీ దయాకర్ పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో బిఆర్ఎస్ బిజెపి పార్టీల నాయకులు కోడిగుడ్డుపై ఈకలు పీకేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి బిజెపి బీఆర్ఎస్ ఆటలు ఇకనుంచి తెలంగాణ రాష్ట్రంలో చెల్లబోవు అని ఆయన వివరించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన పై బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడడం హాస్యాస్పదంగా, వింతగా విడ్డూరంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ పేరుతో కెసిఆర్ కుటుంబం లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని రాజకీయ పబ్బం గడుపుతున్నారని, ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పడంతో టిఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయని అన్నారు. కెసిఆర్ కుటుంబ లక్షల కోట్ల సంపాదన పై తెలంగాణ ప్రజలు గ్రహించారని, అందువల్లే రాష్ట్రంలో రాజకీయ మార్పులు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, ఈ దిశగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఊరు ఊరు నా వాడ వాడనా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఇది చూసి ఓర్వలేకనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి మతతత్వ బిజెపి పార్టీతో, అదా నీ అంబానీలకు పెట్టుబడిదారులకు దోచిపెడుతున్న పార్టీతో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కుమ్మక్కయ్యారని వివరించారు. ఇలాంటి వాస్తవాలను ప్రజలు గ్రహించారని, ఇక కెసిఆర్ చెప్పే కల్లబొల్లి మాటలను వినడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. రానున్న మూడు నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం త్వరలోనే రాబోతుందని ఆయన ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని నిజంగానే కూల్చాలని ఆలోచన ఉంటే ఈటెల రాజేందర్ వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయనను చనగాని దయాకర్ ఆహ్వానించారు.