భారిగా నగదు పట్టివేత ₹- 5,12,91,180 నగదు స్వాధీనం - ఆరుగురు అరెస్ట్

భారీగా నగదు పట్టివేత5,12,91,180 నగదు స్వాధీనం

ఆరుగురు ముద్దాయిలు అరెస్ట్ 

గూడూరు :

[Crime journalist 01-02-2024] :- ఎలక్షన్ కోడ్‌ సమీపిస్తున్న తరుణంలోలో భాగంగా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గూడూరు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో గూడూరు రూరల్ సీఐ గూడూరు వన్ టౌన్ సి గూడూరు రూరల్ ఎస్సై మరియు చిలుకూరు ఎస్సైలు సిబ్బందితో కలిసి గురువారం వాహనాలను తనిఖీలు చేపట్టారు. నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైనఏర్పాట్లు చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా చెక్పోస్టులు పెట్టి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లోపోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. ఐదు కోట్ల 12 లక్షల 91 వేల 180 రూపాయలను భారీ నగదును పోలీసులు సీజ్ చేశారు. ఆరుగురు ముద్దాయిలను అరెస్టు చేశారు. గురువారం గూడూరు పట్టణంలోని గూడూరు సర్కిల్ కార్యాలయంలో గూడూరు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకలు పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గూడూరు రూరల్ సీఐ ఎస్సై వారి సిబ్బందితో కలిసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని మూడు కోట్ల 67 లక్షల 41 వేల 180 రూపాయలను నగదును స్వాధీనం చేసుకొని ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గూడూరు రూరల్ పరిధిలోని చిలకలూరి బైపాస్ రోడ్ జంక్షన్ వరద గూడూరు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ ఇబ్బందితో కలిసి 95 లక్షల 80 వేల రూపాయలను నగదును స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గూడూరు వన్ టౌన్ పరిధిలో ముబారక్ బిర్యాని షాప్ వద్ద బిఎస్సార్ లాడ్జి ఎదురుగా గూడూరు వన్ టౌన్ సీఐ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి 50,00,000, నగదును స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు గుర్తుతెలియని వ్యక్తులు నగదును తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అటుగా వెళ్తున్న వారిని తనిఖీ చేశారు. ఆ సంచుల్లో ఐదు కోట్ల 12 లక్షల 91 వేల 150రూపాయలను  తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి ఆ నగదును సీజ్ చేసేమని తెలిపారు . సందర్భంగా ఆయన గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి , గూడూరు వన్ టౌన్ సిఐ పాపారావు , రూరల్ ఎస్సై మనోజ్ కుమార్, చిలుకూరు ఎస్సై అంజిరెడ్డి సిబ్బందిని డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు.

నేడు నాగోబా జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నేడు నాగోబా జాతర కు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

అదిలాబాద్ జిల్లా:

[Crime journalist]

-ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

ఈ నెల 2న (నేడు) ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లా పూర్ గ్రామములో నాగోబా జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కేస్లా పూర్ గ్రామములో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో రెండు గ్యారంటీ లను ఇక్కడినుండే ప్రకటించి అమలు చేయనున్నట్లు సీతక్క అన్నారు

మున్సిపల్ నూతన కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఇ

మున్సిపల్ నూతన కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

తూర్పుగోదావరి జిల్లా:

[Crime journalist 01-02-2024]

అమలాపురం మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీ మనోహర్ ను ఈరోజు మొగళ్లమూరు క్యాంపు కార్యాలయంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల బొక్కేఅందజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఎంపీ,నూతన మున్సిపల్ కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ నెల 2(అనగా రేపు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి లో జరపబోయే సభను విజయవంతం చేయాలి -మంత్రి సీతక్క

ఈ నెల 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి లో జరపబోయే. సభను విజయవంతం చేయాలి -  మంత్రి సీతక్క

అదిలాబాద్:

[Crime journalist 01-02-2024] 

రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారి కామెంట్స్.

ఈ నెల 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంద్రవెల్లి సభ విజయవంతం చేయాలి

-వెనుకబాటుకు గురైన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

-వందలాది గ్రామాల్లో త్రాగు నీటి సమస్య ఉంది

-ఇంద్ర వెల్లి లో అమరవీరుల స్మృతి వనాన్ని ప్రారంభించనున్న ముఖ్య మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రేపు ఇంద్ర వెల్లి లో జరగనున్న సభ విజయవంతం చేయాలి.కెసిఆర్ 10 యేండ్ల పాలనలో అదిలాబాద్ జిల్లా వెనుకబాటుకు గురైంది.మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పైన కూడా బిఆర్ ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్ల రూపాయల ప్రజా ధనం వృదా. అదిలాబాద్ జిల్లా పోరాటాలకు పుట్టిన ఇల్లు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా పాలన ఉంటుంది. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుంది.ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చినం.ఇంటింటికి మిషన్ భగీరథ నీరు ఇచ్చినం అని చెప్పిన బిఆర్ ఎస్ నాయకులు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో మంచి నీటి కలెక్షన్లు లేవు,కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి మిగితా ప్రాంతాలకు సమాంతరంగా అదిలాబాద్ ను నిలుపుతాం.రండి కదలి రండి ఈ నేల 2న జరిగే ఇంద్రవెల్లి సభ విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రేవంత్ రెడ్డి అభిమానులకు పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ సాగర్,జిల్లా అధ్యక్షురాలు సురేఖ గారితో పాటు కార్మిక సంఘం నాయకులు జనక్ ప్రసాద్,గణేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు

గ్రామపంచాయతీ పాలకవర్గం వీడ్కోలు ఆత్మీయ సమ్మేళన మహోత్సవం

గ్రామపంచాయతీ పాలకవర్గం వీడ్కోలు ఆత్మీయ సమ్మేళన మహోత్సవం

సిద్దిపేట జిల్లా:

[Crimejournalist01-02-2024] :

కోహెడ మండలం వెంకటేశ్వర్లపల్లిలో గ్రామ పంచాయతీ పాలకవర్గం వీడ్కోలు ఆత్మీయ సమ్మేళనం మహోత్సవం జరిపారు.ఈ మహోత్సవం లో పాల్గొన్న స్థానిక సర్పంచ్ తోట భాగ్యలక్ష్మి ఆంజనేయులు దంపతులను, ఉపసర్పంచ్ అనుమాండ్ల శ్రీనివాస్ రెడ్డి,వార్డు మెంబర్స్, కార్యదర్శి గార్లను స్థానిక ఎంపిటిసి తరుపున శాలువాలతో సన్మానించిన కోహెడ ఎంపిటిసి ఖమ్మం స్వరూపవేంకటేశం దంపతులు. వెంకటేశ్వర్ల పల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం వీడ్కోలు ఆత్మీయ సమ్మేళనం మహోత్సవం పురస్కరించుకుని స్థానిక సర్పంచ్ తోట భాగ్యలక్ష్మి , ఉపసర్పంచ్ అనుమాండ్ల శ్రీనివాస్ రెడ్డి , పంచాయితీ కార్యదర్శి ఇల్లందుల నరేష్ గౌడ్ , వార్డు మెంబర్స్ గౌవబోయిన రజిత , కంది శ్రీనివాస్ రెడ్డి , బింరెడ్డి భారతవ్వ , సాధనవేణి రాజు, సయ్యద్ ఇమాంబీ , షేక్ సజన్ బీ, గార్లను శాలువలతో సన్మానించిన Mptc ఖమ్మం స్వరూపవేంకటేశం ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది,ఆశా పిడిశెట్టి తారా , అంగన్వాడీ టీచర్లు బీ. జ్యోష్ణ , మహిళ సంఘాల వి ఏ వో జయ , మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ ల సేవలు మరువలేనివి

సర్పంచుల సేవలు మరువలేనివి

సిద్దిపేట జిల్లా:

గజ్వేల్: [ Crime journalist 01-02-2024]

గజ్వేల్ తెలంగాణ గ్రామీణ అభివృద్ధి లో సర్పంచులు కీలక పాత్ర పోషించారని తెలంగాణ స్టేట్ బిఆర్ఎస్ యూత్ వింగ్ &ఏజెడ్ ఫౌండేషన్ జుబైర్ పాషా ప్రశంసించారు.ఐదు ఏళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో వారి వీడ్కోలు సందర్భంగా ఆయన మాట్లాడారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నూతన పంచాయతీ రాజ్ చట్టానికి రూపకల్పన చేసి గ్రామీణాభివృద్ధి కి పెద్ద పీఠ వేయడం జరిగిందన్నారు. 

కేసీఆర్ గారి అడుగు జాడల్లో సర్పంచులు ముందుకు సాగడం జరిగిందన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామ గ్రామాన స్మశాన వాటికలు, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ లు, డంపింగ్ షేడ్, నర్సరీలు, పార్కులు, క్రీడా మైదానాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.గ్రామీణ అభివృద్ధి లో కీలకపాత్ర పాత్ర పోషించిన సర్పంచుల పాత్ర మరువలేమన్నారు.గజ్వేల్ నియోజకవర్గం లో అభివృద్ధి తో పాటు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఘన విజయం అందించడంలో ప్రత్యేక కృషి చేసిన సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉన్న వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.గజ్వేల్ నియోజకవర్గం ములుగు, వర్గల్ మండలాల పక్షన గ్రామ ప్రాంచాయతి పాలక వర్గంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .వారి సేవలు మరువలేమన్న

తెలంగాణ స్టేట్ బిఆర్ఎస్ యూత్ వింగ్&ఏజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పాస్ పుస్తకాలు ఇంట్లోని వస్తువులు దగ్దం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పాస్ పుస్తకాలు దగ్ధం

     

     

సూర్యాపేట జిల్లా:

[ Crime journalist 01-02-2024 ] :-కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామం పదో వార్డు నివాసి శీలం సీతారాములు ఇంటిలో కరెంటు షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి పాస్ పుస్తకాలు విలువైన వస్తువులు సుమారు 12 వేల రూపాయలు వరకు పూర్తిగా కాలిపోయినవి. ఇంట్లో ఉన్న మొత్తం వస్తువులు గిన్నెలు పూర్తిగా దగ్ధం అయిపోయినవి.వార్త తెలుసుకున్న మరుక్షణమే స్థానిక సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ పరిశీలించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శీలం సీతారాములు భార్య భర్తలు ఇద్దరూ వృద్ధులు వృద్ధాప్యంలో జీవనం సాగిస్తున్నారు జీవన ఉపాధి సాగించడం కష్ట పరిస్థితుల్లో ఉన్నది భార్య భర్తలు ఇద్దరు వికలాంగులైన జీవనం సాగిస్తున్నారు ఆర్థిక పరిస్థితి బాగాలేదని వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ తెలియజేశారు.

ఉల్లి పంట ఉత్పత్తిలో రాణిస్తున్న రైతును సన్మానించిన భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షుడు

ఉల్లి పంట ఉత్పత్తిలో రాణిస్తున్న రైతును సన్మానించిన

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు

సిద్దిపేట జిల్లా[ Crime journalist 01-02-2024] :-

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం మండల కేంద్రంలో ఉల్లి గడ్డ పంటను అత్యధిక దిగుబడి సాదించి అమ్ముతున్నా గంగాధర బాలయ్య అనే రైతును ప్రముఖ సామజిక కార్యకర్త, పిడిశెట్టి రాజు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా సన్మానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ బెజ్జంకి మండలం షీలాపూర్ పల్లి గ్రామానికి కీ చెందిన ఉల్లి గడ్డ రైతు రెండు ఎకరాలు వేసి మూడు లక్ష రూపాయల పంటను తీసి ఉల్లి పంటలో విశేషంగా రాణిస్తున్న బాలయ్య బుధవారం మండల కేంద్రంలో తన ట్రాక్టర్ లో ఉల్లిగడ్డ ను అమ్ముతున్నా వారిని పలువురు ప్రత్యేకంగా అభినందించారు. పెట్టుబడి ఇతర ఖర్చులు పోనూ మంచి లాభం ఉంటుందనీ రైతు తెలిపారు. ఈకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జాక్ కన్వీనర్ మంద మల్లేశం, ఉస్మానియా విశ్వవిధ్యాలయం తెలుగు పరిశోధకులు వేల్పుల శంకర్,పవ్వాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సిఎం రేవంత్ రెడ్డి పరామర్శించాలని కోరిన ఓయూ విద్యార్థి నేత

BREAKING NEWS 

[Crime journalist 01-02-2024]

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారిని పరామర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి ని కోరిన ఓయూ విద్యార్థి నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్,త్వరలో చుక్కా రామయ్య గారి నివాసానికి వెల్దామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి,ఉద్యమ కారుల పట్ల మేధావుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు.గద్దర్ జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక మీదట నంది అవార్డుల బదులుగా గద్దర్ అవార్డులుప్రకటిస్తామని చెప్పడం చారిత్రాత్మకమైన రోజుగా బావించాలి,చనగాని దయాకర్

టీపీసీసీ అధికారుల ప్రతినిధి

ఓయూ విద్యార్థి నేత.

రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై బిఆర్ఎస్ నాయకులు చేసిన వాక్యల పై క్షమాపణ చెప్పాలని డిమాండ్

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై బిఆర్ఎస్ నాయకులు చేసిన వాక్యల పై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు దైద రవీందర్

నల్లగొండ జిల్లా:

[Crime journalist 31-01-2024]

నకిరేకల్ నియోజకవర్గంలో నకిరేకల్ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై బిఆర్ఎస్ నాయకులు చేసిన వాక్యాలపై క్షమాపణ చెప్పాలని నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు దైద రవీందర్.