ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల స్నేహభావంతో వ్యవహరించాలి : జిల్లా అదనపు కలెక్టర్.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది స్నేహభావంతో వ్యవహరించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లాలోని సిర్పూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉండాలని, విధుల పట్ల సమయపాలన పాటించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం సిర్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయులు, అధికారులతో 10వ తరగతి వార్షిక పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్జెక్టుల వారిగా ఉపాధ్యాయులు కార్యచరణ ప్రకారంగా విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని, విద్యార్థులు అందరూ 10 జి పి ఎ సాధించేలా కృషి చేయాలని తెలిపారు. విద్యార్థుల ప్రగతి ఆధారంగా తక్కువ ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. వార్షిక ఫలితాలలో జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందుంచే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వి ఎం ఓటరు అవగాహన కేంద్రం : జిల్లా కలెక్టర్.


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో ఈ. వి. ఎం. ఓటరు అవగాహన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల జి.13 లో ఏర్పాటు చేసిన ఈ. వి. ఎం. ఓటరు అవగాహన కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానాన్ని ప్రజలకు వివరించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటు వేసే విధానాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. అనంతరం ఓటరు అవగాహన కేంద్రంలో ఈవీఎం ద్వారా ఓటు వేసే విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది జితేందర్, మధు, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.
అటవీ శాఖ పేదల పొట్ట గొట్టే ఆలోచన విరమించుకోవాలి.
అటవీ శాఖ పేదల పొట్ట గొట్టే ఆలోచన విరమించుకోవాలి.
తునికాకు టెండర్లు వెంటనే పిలవాలి.


టిఎజి ఎస్ రాష్ర్ట ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్.






కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా,జనవరి20, : తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టిఎజి ఎస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కాగజ్ నగర్ పట్టణం లోనీ బాల భారతి హై స్కూల్ లో తునికాకు కల్లేదార్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్ మాట్లాడుతూ తునికాకు సేకరణ వ్యవసాయం తర్వాత రెండో పంటగా అటవీ ప్రాంతంలో ఉందని,ఆకు సేకరణ ద్వారా ఆదివాసీలు ఇతర పేదలు ఉపాధి పొందుతారని కుమురం భీం జిల్లాలో సైతం 30 వేల మంది కూలీలు ఉపాధి పొందుతారని, కూలీలతోపాటు కళ్ళేదారులు గోడౌన్ కార్మికులు కాంట్రాక్టు కాంట్రాక్టర్లు కూడా ఆదాయం పొందుతారని, ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఖర్చు లేకుండా ఆదాయం వస్తుందని కానీ జిల్లాలోని ఫారెస్ట్ అధికారులు పెద్ద పులులు సంచరిస్తున్నాయని పేరుతో ఈ సీజన్లో తునికాకు యూనిట్లను రద్దు చేయాలని ప్రభుత్వానికీ సిఫారసులు చేసిందనీ ఈ నిర్ణయం వల్ల పేదలు నష్టపోతారని, జిల్లాలో రెండు డివిజన్ల పరిధిలో మొత్తం 25 యూనిట్లు ఉండగా మైనింగ్, కవాల్ టైగర్ కారిడార్, కడంబ టైగర్ కారిడార్ పేరుతో ఇప్పటికే చాలా యూనిట్లను తగ్గించినటువంటి పరిస్థితి ఉందని, తగ్గిన యూనిట్ల పరిధిలో కూలీలు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. పులుల ఆవాసం 25 యూనిట్ల పరిధిలో లేదని దాని సాకు చూపి పేదల కడుపు కొడితే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పునరాలోచించాలని, దీనిపై ఎమ్మెల్యేలు స్పందించాలని కోరారు. వెంటనే తునికాకు టెండర్లు పిలవాలని లేని పక్షంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తునికాకు కళ్ళేదారుల సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా చన్కపురి కాశినాథ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ కె నాయిమ్, కోశాధికారి గా సోయం తిరుపతి ఉపాధ్యక్షులుగా టేకం హనుమంతు, సహాయ కార్యదర్శిగా ఒండ్రే గణేష్, కమిటీ సభ్యులుగా శ్రీనివాస్ గౌడ్, అజిజ్, బోరెం తిరుపతి, యాదగిరి నాందేవ్, పెందం రవి, ఎల్ములే దశరథ్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు కొరెంగా మాలశ్రీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజo శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ముంజo ఆనంద్ కుమార్ , వివిధ మండలాల కల్లేదార్లు పాల్గొన్నారు.
సమావేశానికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,జనవరి20, : ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2024లో కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు ఓటరు జాబితా పరిశీలకులుగా నియమించబడిన ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి బి. భారతి లక్‌పతి నాయక్‌ ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరు అవుతున్నారని జిల్లా కలెక్టర్‌ బొర్కడే హేమంత్ సహదేవరావు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, బూత్‌ స్థాయి అధికారులు హాజరు అవుతారని, ఈ క్రమంలో జిల్లాకు చెందిన అధికారులు తమ ప్రగతి నివేదికలతో సకాలంలో సమావేశానికి హాజరుకావాలని తెలిపారు.
సమావేశానికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,జనవరి20, : ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2024లో కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు ఓటరు జాబితా పరిశీలకులుగా నియమించబడిన ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి బి. భారతి లక్‌పతి నాయక్‌ ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరు అవుతున్నారని జిల్లా కలెక్టర్‌ బొర్కడే హేమంత్ సహదేవరావు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, బూత్‌ స్థాయి అధికారులు హాజరు అవుతారని, ఈ క్రమంలో జిల్లాకు చెందిన అధికారులు తమ ప్రగతి నివేదికలతో సకాలంలో సమావేశానికి హాజరుకావాలని తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత.

ఆసిఫాబాద్ జిల్లా: వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కలప దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నట్లు ఆసిఫాబాద్ ఎఫ్తర్వా అప్పలకొండ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి మండలంలోని భవానీనగర్ సమీపంలో ఎఫ్ఎస్ఓ సాయిచరణ్ బృందంతో కలిసి రెక్కీ నిర్వహించినట్లు చెప్పారు. ఒక వాహనంలో పరిశీలించగా 12 కలప దుంగలు ఉన్నట్లు తెలిపారు. వీటి విలువ రూ. 50 వేల వరకు ఉంటుందన్నారు. కలపను, వాహనాన్ని స్థానిక రేంజ్ కార్యాలయానికి తరలించారు.
రెండోసారి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా డా. శ్రీనివాస్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: బీజేపీ అధిష్ఠానం జిల్లా అధ్యక్షులను నియమించింది, ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కసరత్తు ప్రారంభించింది. పనితీరు బాలేని కొన్ని జిల్లాలోని అధ్యక్షులను మార్పులు చేయగా, కొమురంభీం జిల్లా అధ్యక్షుడి డా. శ్రీనివాస్ మాత్రం మార్పు చేయకుండా రెండో సారి ఆయ
నే కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంది. గురువారం సాయంత్రం ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పాఠకులకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలయాలలో అందుబాటులో ఉంచాలి : జిల్లా కలెక్టర్.

స్ట్రీట్ బజ్ న్యూస్,జనవరి 12, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలో నూతనంగా చేపట్టిన జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, పాఠకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్మితమవుతున్న జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జిల్లా కేంద్రంలోని శాఖ గ్రంధాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. శాఖా గ్రంధాలయాలలో పాఠకులకు అవసరమైన పుస్తకాలతో పాటు పోటీ పరీక్షలకు సర్నార్థమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో కేసిఆర్ కు ఓటమి భయం.. ! మాజీ మంత్రి షబ్బీర్ అలీ.

కామారెడ్డి న్యూస్ ప్రతినిధి ;తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు చేశారు. రింగ్ రోడ్ల పేరుతో తెలంగాణలో పేదల భూములన్నీ లాక్కుంటున్న కేసీఆర్.. చివరకు ఆ భూములను కేసీఆర్ బంధువుల పేరిట మార్పిడి చేసుకుంటున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఇక్కడి నుంచి తరిమి కొడతామని అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. " ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయడానికి సిద్ధపడుతున్న కామారెడ్డి నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ తో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు అమ్ముకున్న కేసీఆర్.. ఇప్పుడు కామారెడ్డి జిల్లా కేంద్రం చుట్టు పక్కల ఉన్న భూములను అమ్ముకునేందుకు వస్తున్నారు అని మండిపడ్డారు. నాసిరకం డబుల్ బెడ్ రూంలు నిర్మించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు అని ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై విచారణ జరిపించి ఆమెను జైలుకు పంపే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని అన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది అని ఆరోపించిన షబ్బీర్ అలీ... తండ్రి కేసీఆర్ లిక్కర్ షాపులు పెడితే, కూతురు కవిత ఆ లిక్కర్ దందాకి రాణి అయిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రోళ్లు పెప్పర్ స్ప్రే కొట్టినా వెనుకకు రాకుండా తెలంగాణ బిల్ పాస్ చేసిన ధైర్యశీలి సోనియా గాంధీ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్ము ప్రజలకు పంచుతామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. బిఅర్ఎస్ పార్టీ హయాంలో విద్యా రంగం, వైద్యం .. రెండూ మూలనపడ్డాయని, బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఅర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసి కేసీఆర్‌ని బొందపెడతామన్నారు. తాను కామారెడ్డి గడ్డ మీద పుట్టానని, ఇక్కడే చస్తానని, ఒక్కసారి తనను ఆశీర్వదించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్టుగా గజ్వెల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసినట్టయితే.. అక్కడ కేసీఆర్ కి పోటీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీనే కానున్నారు అనే విషయం తెలిసిందే.

ప్రమాదవశాత్తు చెరువులో పడి వీఆర్ఎ మృతి.
ప్రమాదవశాత్తు చెరువులో పడి వీఆర్ఎ మృతి.


నిర్మల్ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఎ విధులు నిర్వహిస్తూ ఆదివారం ఉదయం నిర్మల్ పట్టణంలోని ధర్మసాగర్ చెరువులో ప్రమాదవశాత్తు పడి సిద్ధ శ్రీనివాస్ (45) మృతి చెందాడు. నిర్మల్ అర్బన్ తహశీల్దార్ సుభాష్ చందర్ ఆదేశాల మేరకు మృతుని కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 10,000 ఆర్ ఐ ప్రశాంత్ రెడ్డి, విఆర్ఎ ప్రవీణ్ కుమార్లు అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.