అటవీ శాఖ పేదల పొట్ట గొట్టే ఆలోచన విరమించుకోవాలి.
అటవీ శాఖ పేదల పొట్ట గొట్టే ఆలోచన విరమించుకోవాలి.![]()
తునికాకు టెండర్లు వెంటనే పిలవాలి.
టిఎజి ఎస్ రాష్ర్ట ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా,జనవరి20, : తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టిఎజి ఎస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కాగజ్ నగర్ పట్టణం లోనీ బాల భారతి హై స్కూల్ లో తునికాకు కల్లేదార్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్ మాట్లాడుతూ తునికాకు సేకరణ వ్యవసాయం తర్వాత రెండో పంటగా అటవీ ప్రాంతంలో ఉందని,ఆకు సేకరణ ద్వారా ఆదివాసీలు ఇతర పేదలు ఉపాధి పొందుతారని కుమురం భీం జిల్లాలో సైతం 30 వేల మంది కూలీలు ఉపాధి పొందుతారని, కూలీలతోపాటు కళ్ళేదారులు గోడౌన్ కార్మికులు కాంట్రాక్టు కాంట్రాక్టర్లు కూడా ఆదాయం పొందుతారని, ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఖర్చు లేకుండా ఆదాయం వస్తుందని కానీ జిల్లాలోని ఫారెస్ట్ అధికారులు పెద్ద పులులు సంచరిస్తున్నాయని పేరుతో ఈ సీజన్లో తునికాకు యూనిట్లను రద్దు చేయాలని ప్రభుత్వానికీ సిఫారసులు చేసిందనీ ఈ నిర్ణయం వల్ల పేదలు నష్టపోతారని, జిల్లాలో రెండు డివిజన్ల పరిధిలో మొత్తం 25 యూనిట్లు ఉండగా మైనింగ్, కవాల్ టైగర్ కారిడార్, కడంబ టైగర్ కారిడార్ పేరుతో ఇప్పటికే చాలా యూనిట్లను తగ్గించినటువంటి పరిస్థితి ఉందని, తగ్గిన యూనిట్ల పరిధిలో కూలీలు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. పులుల ఆవాసం 25 యూనిట్ల పరిధిలో లేదని దాని సాకు చూపి పేదల కడుపు కొడితే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పునరాలోచించాలని, దీనిపై ఎమ్మెల్యేలు స్పందించాలని కోరారు. వెంటనే తునికాకు టెండర్లు పిలవాలని లేని పక్షంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తునికాకు కళ్ళేదారుల సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా చన్కపురి కాశినాథ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ కె నాయిమ్, కోశాధికారి గా సోయం తిరుపతి ఉపాధ్యక్షులుగా టేకం హనుమంతు, సహాయ కార్యదర్శిగా ఒండ్రే గణేష్, కమిటీ సభ్యులుగా శ్రీనివాస్ గౌడ్, అజిజ్, బోరెం తిరుపతి, యాదగిరి నాందేవ్, పెందం రవి, ఎల్ములే దశరథ్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు కొరెంగా మాలశ్రీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజo శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ముంజo ఆనంద్ కుమార్ , వివిధ మండలాల కల్లేదార్లు పాల్గొన్నారు.


కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,జనవరి20, : ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2024లో కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఓటరు జాబితా పరిశీలకులుగా నియమించబడిన ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి బి. భారతి లక్‌పతి నాయక్ ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరు అవుతున్నారని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు హాజరు అవుతారని, ఈ క్రమంలో జిల్లాకు చెందిన అధికారులు తమ ప్రగతి నివేదికలతో సకాలంలో సమావేశానికి హాజరుకావాలని తెలిపారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,జనవరి20, : ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2024లో కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఓటరు జాబితా పరిశీలకులుగా నియమించబడిన ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి బి. భారతి లక్‌పతి నాయక్ ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరు అవుతున్నారని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు హాజరు అవుతారని, ఈ క్రమంలో జిల్లాకు చెందిన అధికారులు తమ ప్రగతి నివేదికలతో సకాలంలో సమావేశానికి హాజరుకావాలని తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లా: వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కలప దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నట్లు ఆసిఫాబాద్ ఎఫ్తర్వా అప్పలకొండ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి మండలంలోని భవానీనగర్ సమీపంలో ఎఫ్ఎస్ఓ సాయిచరణ్ బృందంతో కలిసి రెక్కీ నిర్వహించినట్లు చెప్పారు. ఒక వాహనంలో పరిశీలించగా 12 కలప దుంగలు ఉన్నట్లు తెలిపారు. వీటి విలువ రూ. 50 వేల వరకు ఉంటుందన్నారు. కలపను, వాహనాన్ని స్థానిక రేంజ్ కార్యాలయానికి తరలించారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: బీజేపీ అధిష్ఠానం జిల్లా అధ్యక్షులను నియమించింది, ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కసరత్తు ప్రారంభించింది. పనితీరు బాలేని కొన్ని జిల్లాలోని అధ్యక్షులను మార్పులు చేయగా, కొమురంభీం జిల్లా అధ్యక్షుడి డా. శ్రీనివాస్ మాత్రం మార్పు చేయకుండా రెండో సారి ఆయ

నిర్మల్ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఎ విధులు నిర్వహిస్తూ ఆదివారం ఉదయం నిర్మల్ పట్టణంలోని ధర్మసాగర్ చెరువులో ప్రమాదవశాత్తు పడి సిద్ధ శ్రీనివాస్ (45) మృతి చెందాడు. నిర్మల్ అర్బన్ తహశీల్దార్ సుభాష్ చందర్ ఆదేశాల మేరకు మృతుని కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 10,000 ఆర్ ఐ ప్రశాంత్ రెడ్డి, విఆర్ఎ ప్రవీణ్ కుమార్లు అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని గబ్బాయి గ్రామానికి చెందిన ఎలాది రమేష్ కూతురు వెన్నెల ఉట్నూర్ ఏకలవ గురుకులంలో విద్యను భరిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఆదివారం ఆదివాసి నాయకులు కుటుంబాన్ని పరామర్శించి రూ: 7000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు సిడం సకారం, తలండి లక్ష్మణ్, మడావి వెంకట్రావు, ఏన్క శ్రీహరి ,నైతం సత్తయ్య ఆత్రం మాంతయ్య ,ఏలాది నారాయణ తదితరులున్నారు.
Feb 01 2024, 02:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.1k