ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ఎస్ఐ.తిరుపతి
ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన కోహెడ ఏస్ ఐ తిరుపతి
సిద్దిపేట జిల్లా [Crime journalist 31-01-2024]:-
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం :
( కోహెడ మండలం ):- భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో రూపొందించిన క్యాలెండర్ ను ప్రముఖ సామజిక కార్యకర్త, పీవీ సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో కోహెడ సబ్ ఇన్స్ పెక్టర్ సి హెచ్ తిరుపతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ దక్షణ భారతదేశంలో జన్మించి సుమారు 18భాషల్లో ప్రావీణ్యం పొందిన తెలుగు తొలి ప్రధాని పీవీ నరసింహారావు నూతన ఆర్థిక సంస్కరణలు, విద్యా సంష్కరణలు, భూ సంష్కరణ లు రూపొందించిన అపార చాణిఖ్యలు వారి పేరుతో వారి కుటుంబ సభ్యులు, సురభి విద్యాసంస్థలు నిర్మాణం చేసిన క్యాలెండర్ నూ ఆవిష్కరణ చేసినందుకు చాలా గర్వాంగా ఉంది అని ఏస్ ఐ తిరుపతి అన్నారు. భారత దేశ ప్రధాని పేరుతో గత పదిహేను ఏళ్లుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నా రాజుని ప్రత్యేకంగా అభినందించారు. ఈకార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లింగారెడ్డి,కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,గ్రామ కార్యదర్శి బండి శ్రీనివాస్,వి శంకర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Jan 31 2024, 17:45