ఏపీ అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ

ఏపీ అంగన్వాడీలకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఏపీ అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌.

అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకువస్తూ జీవో నెంబరు 2 జారీ చేసింఇఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు చేయటం నిషేధమని పేర్కోంటూ ఉత్తర్వులు ఇష్యూ చేసింది.

అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సమ్మె చేసిన కాలానికి వేతనంలో కోత విధించింది ఏపీ ప్రభుత్వం. అటు అంగన్వాడీ వర్కర్లకు గత నెల వేతనంగా రూ.8050ని మాత్రమే జమ చేసింది ఏపీ ప్రభుత్వం.

గత కొద్ది రోజులుగా అంగన్వాడీలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం….పలు డిమాండ్ల పై సానుకూలంగా స్పందించింది. జీతాల పెంపు, గ్రాట్యుటీ పై పెట్టుబడుతూ సమ్మె కొనసాగిస్తున్నారు అంగన్వాడీలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సీఎం జగన్ పార్టీకి అంబటి రాయుడి యూటర్న్

వైఎస్సార్‌ సీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాకిచ్చారు. గత గురువారం డిసెంబర్ 28 పార్టీలో చేరిన రాయుడు.. సంచలన ప్రకటన చేశారు.

తాను వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నానని.. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుం టున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.

అంబటి రాయుడు వైఎస్సార్‌సీపీలో చేరిన పది రోజుల్లోనే వీడటం సంచల నంగా మారింది. డిసెంబర్ 28న తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పిన సీఎం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.రాజకీయాలతో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నట్లు రాయుడు వారం క్రితం ప్రకటించారు.

సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరటం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని.. ఆయన కులమతాలు, రాజకీయాలతో పని లేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. మరి ఇంతలోనే ఏం జరిగిందో తెలియవలసి ఉంది...

ప్రజాపాలన దరఖాస్తులకు నేడు చివరి రోజు

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారం భించిన ప్రజా పాలన దరఖాస్తులు నేటితో ముగియనున్నాయి.

అభయ హస్తం పేరుతో ఐదు గ్యారంటీ లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు డిసెంబర్‌ 28న దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.

ఇప్పటివరకు కోటి 8 లక్షల కుపైగా (1,08,94,115) దరఖాస్తులు అందాయి. శుక్రవారం ఒక్కరోజే 18,29,274 మంది అభయహస్తం దరఖాస్తులు సమర్పించారు.

నేడు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు.

కాగా, దరఖాస్తుల గడువు పెంచేది లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా దరఖాస్తు చేసుకోనివాళ్లు అవకాశాన్ని ఉపయోగిం చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇప్పుడుపోతే మళ్లీ నాలులు నెలల తర్వాత గానీ అవకాశం రాదని తెలిపారు. ఇక ప్రజా పాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తులను ఈనెల 17వ తేదీలోపు కంప్యూటరీ కరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది...

భారత ఒలింపిక్ సీఈఓ గా :రఘురామ్ అయ్యర్

భారత ఒలింపిక్ అసోసియేషన్ ఐఏసీ,కొత్త సీఈఓగా రఘురామ్ అయ్యర్ శుక్రవారం సాయంత్రం ఎంపికయ్యారు.

గతంలో ఆయన రాజస్థాన్ రాయల్స్ సీఈఓగా పని చేశారు. ఈ మేరకు ఒలిం పిక్ అసోసియేషన్ తెలి పింది. క్రీడా నిర్వహణ లో రఘురామ్ కు విశేష అను భవం దృష్ట్యా ఆయన ఈ బాధ్యతలకు తగిన వ్యక్తి అని వెల్లడించింది.

పలువురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశాక రఘు రాంను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఆయన ఎంపిక ఏకగ్రీవమని కూడా పేర్కొంది.

సీఈఓ నియామకంపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పలుమార్లు గుర్తు చేసిన నేపథ్యంలో రఘు రామ్ నియామకం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ కు సీఈఓగా పని చేసిన రఘురాం గతంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహిం చారు....

ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం రెండు రోజుల పర్యటన

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండు రోజుల పాటు ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.

నేడు హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి బయలుదేరి మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండల కేంద్రానికి చేరుకుంటారు.

ఎర్రుపాలెంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మిషన్ భగీరథ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

ఈరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతి నిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రికి మధిర క్యాంపు కార్యాలయంలో బస చేయ‌నున్నారు.

ఆదివారం ఉదయం మధిర క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి ఉదయం 10:45 గంటలకు చేరుకొని స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్ర మాల్లో పాల్గొన్న తర్వాత ఖమ్మం క్యాంపు కార్యాల యానికి చేరు కుంటారు.

మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం క్యాంపు కార్యాల యం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు ప్రజా భవన్ కు చేరుకుంటారు...

100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం

తెలంగాణ లో కొత్త ప్రభు త్వం ఏర్పడిన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అలోక్‌ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీ హెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు.

ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవ డంతో.. కొత్తది నిర్మించా ల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి వారు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి రేవంత్ సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

వీటిని రాజేంద్రనగర్ పరిధిలోని వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సి టీల్లోని స్థలంలో నిర్మించ డానికి అనుమతి ఇచ్చింది.

శిథిలావస్థకు చేరుకున్న తెలంగాణ హైకోర్టు భవనం

వ్యవసాయ, హార్టికల్చర్ వర్సిటీలో కొత్తగా నిర్మాణం

త్వరలోనే శంకుస్థాపన చేయనున్న రేవంత్ సర్కారు

హైకోర్టు నూతన భవన సముదాయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం ప్రేమావతిపేట, బుద్వేలు గ్రామాల పరిధిలోని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చరల్, కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివ ర్సిటీలకు చెందిన 100 ఎకరాల భూమిని న్యాయ శాఖకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

బుద్వేలులోని 2,533 ఎకరాలను వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాల యాలకు 1966లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది.

పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి

హైకోర్టు నూతన భవన నిర్మాణ అవసరాల దృష్ట్యా ఆ భూమిలోని 100 ఎకరా లను కొత్త భవనానికి కేటా యించాలని నిర్ణయించి నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి.. హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, న్యాయమూర్తులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నూతన భవన సముదాయం నిర్మాణ ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. భవన నిర్మాణం ప్రతిపాదనలు, 100 ఎకరాలు అవసరం, వాటి కేటాయింపుల గురించి ఇరువురు చర్చించారు. దీనికి అనుగుణంగా భూకేటాయింపులపై సీఎం హామీ ఇచ్చారు

అస్సాంలో భూకంపం

అస్పాంలో భూకంపం సంభవించింది. మోరిగన్ లో శుక్రవారం రాత్రి 11.30గంట ల సమయంలో భూప్రకంప నలు చోటుచేసు కున్నాయి.

రిక్టర్ స్కేలుపై 3.1తీవ్రతతో భూమి కంపించినట్లు నేషన ల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. మోరిగన్ లో 10 కిలోమీటర్ లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ఏలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. స్వల్పం గా ఆస్థి నష్టం జరిగినట్లు అధికారులు చెప్పారు. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తిరుపతిలో శనివారం తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది.

ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో మాత్రమే వేచి చూస్తున్నారు.

స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడు తుందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తులుస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించకుం టున్నారు.

కాగా, శుక్రవారం శ్రీవారి 57,441మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమ లలో నిన్న 20,878 మంది భక్తులు నిన్న శ్రీవారికి తల నీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదా యం రూ.3.66కోట్లు వచ్చిం దని టిటిడి అధికా రులు వెల్లడించారు...

జాతీయ పక్షుల దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన: మంత్రి కొండ సురేఖ

ప్రతి సంవత్సరం జనవరి 5వ తేదీని జాతీయ పక్షుల దినోత్సవంగా జరుపు కుంటున్నామని అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ అన్నారు.

పర్యావరణ పరిరక్షణ శిక్షణ , పరిశోధనా సంస్థ ( EPTRI ) పక్షు జాతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై మంత్రి ముఖ్యమైన విష యాలను ప్రస్తావించారు.

పర్యావరణ సమ తుల్య తను కాపాడు కోవడంలో పక్షులు పోషించే కీలక పాత్ర, అవి ఎదుర్కొనే సమస్య లను పరిష్కరించాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు.

ఆ దిశగా అవగాహన పెంచడం కొరకు ఈ రోజును జనవరి 5వ తేదీ జరుపు తున్నామని మంత్రి అన్నా రు. దీనికి సంబంధిం చిన అవగాహన, విజ్ఞాన పోస్ట ర్‌ను పర్యావరణ పరిరక్షణ శిక్షణ , పరిశోధనా సంస్థ సిద్ధం చెయ్యడం జరిగిం దన్నారు.

ఆ పోస్టర్‌ను తన చేతుల మీదుగా ఆవిష్కరిం చడం చాలా సంతోషంగా వుందని మంత్రి కొండా సురేఖ అన్నారు...

హైజాక్‌కు గురైన నౌకలోకి భారత నేవీ కమాండోలు..!

హిందూ మహా సముద్రంలో లైబీరియా జెండా కలిగి ఉన్న ఓ నౌక (MV LILA NORFOLK) గురువారం సాయంత్రం హైజాక్‌కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న భారత నావికాదళం ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధ నౌకను రంగంలోకి దింపింది..

హెలికాప్టర్‌ ద్వారా హైజాకర్లకు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు. బందీలను విడిపించేందుకు నేవీ కమాండోలు హైజాక్‌కు గురైన నౌకలోకి ప్రవేశించి, కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి అక్రమంగా ప్రవేశించారని యూకే మారిటైమ్‌ ఏజెన్సీకి సందేశం పంపడంతో ఈ హైజాక్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నౌకలోని 15 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది..