కెసిఆర్ పాలన లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలో నే నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన కెసిఆర్ నాయకత్వం లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని తెలంగాణ రాష్ట్ర మాజీ విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జోగులాంబ నుంచి ఆలంపూర్ వరకు అందరూ బిఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయినప్పటికీ సూర్యాపేట మాత్రం బొడ్రాయిలానిలిచి గెలిచిందని అన్నారు. మళ్లీ ఎన్నికల వరకు ఒక్కటి లేకుండా అన్ని గెలుస్తామన్నారు. మంచి కొరకు నిలబడి త్యాగాలకు సిద్ధపడిన చరిత్ర సూర్యాపేట ప్రజలదని అందుకు నా ఈ గెలుపే నిదర్శనం అన్నారు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జరిగిన లోటుపాట్లను ఆలోచన చేసుకావాలని అవి మరల పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ప్రతిపక్ష నాయకులు కుట్రపూరితంగా పదేళ్లు అధికారంలో ఉన్నారని ఒక వాదన తీసుకువచ్చి తప్పుదోవ పట్టించారని అన్నారు. రెండుసార్లు తెలంగాణలో అధికారం ఇస్తే కెసిఆర్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా చేశారని అన్నారు. రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ గెలిచేందుకు నీళ్లు కరెంటు రోడ్లు సరిపోతాయని అంటున్నారన్నారు. కెసిఆర్కు ఉన్న విజన్ ఆలోచన ఇవాళ అధికారంలోకి వచ్చిన వాళ్లకు లేదని అన్నారు ప్రజలు మనకు ప్రతిపక్ష బాధ్యతను ఇచ్చారని ప్రజల ఆలోచనలతో నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలన్నారు. నాలుగేండ్లు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని ఆ రాష్ట్రం ముందు ముందు మంచిగా ఉండాలంటే మనం ఆ బాధ్యత తీసుకోవాలన్నారు మనం ముందుగా అనుకున్నట్లుగానే చిల్లర వేషాలు మొదలయ్యాయని ఇవి మన నల్లగొండలో ముఖ్యంగా సూర్యాపేటలో అధికంగా ఉంటాయన్నారు. కెసిఆర్ కొట్లాటలు గొడవలు ఉండొద్దని అవి అభివృద్ధికి ఆటంకాలని పది ఏళ్లుగా ప్రశాంతంగా ఉంచారాని గుర్తు చేశారు. మనలాగా చేయడం ఎవరితోనూ కాదని అది అందరికీ తెలుసని అన్నారు ఎన్నికల ముందే నేను చెప్పినట్లుగానే వృద్ధ సింహం గాండ్రిస్తుందని అసెంబ్లీకి పోకున్నా అన్ని చేస్తామని అంటున్నాడని ఎలా చేస్తాడు ఏం చేస్తాడు నాలా 24 గంటలు కష్టపడి నాతో కలిసి నాలుగు గంటలకు లేస్తాడా అని అన్నారు సూర్యాపేట ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ఆలోచనతో డివైడర్ కట్టించామని ఇప్పుడు ఆ డివైడర్ను తొలగించి రోడ్డు ప్రమాదాలకు కారకులు కాబోతున్నారని అన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన నాడే బోరు బావులు మూసివేయించాడని బోరు బావుల్లో పడితే పెద్ద వార్త అని గత పదేళ్లగా ఒక పిల్లవాడు కూడా బోరుబావిలో పడిన సంఘటన లేదన్నారు చేష్టలతో ప్రజలను మెప్పించలేరని తిరుగులేని అధికారం ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు మనం ఒకేలా ఉన్నామని ఉంటామని అన్నారు. కాంగ్రెస్ డిసెంబర్ 9న రైతుబంధు ఇస్తామని ఇవ్వలేదని తాము ఇస్తామంటే ఈసీకి ఫిర్యాదు చేశారని ఇప్పుడు పాత పద్ధతి వేస్తామని అంటున్నారని అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తాము అవసరమైతే కొత్త రుణాలు తీసుకోమన్నారు అది కూడా అమలు కాలేదు అన్నారు ధాన్యంకు కింటాకు భోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారని ఇంతవరకు దాని వూసే లేదనీ అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చరని నెరవేర్చినట్లు చరిత్రలో కూడా లేదన్నారు రోజులు కాదు కదా 900 రోజులు ఆగిన హామీలు అమలు కావని ప్రజల నుంచి ప్రశ్న రావాలని అప్పటివరకు ఓపికగా ఉండాలన్నారు. ఇవ్వడం చేతకాక దాని నుంచి తప్పించుకునేందుకు అప్పులు చేశారని అంటారని అసెంబ్లీలో నన్ను అడిగితే దానికి సమాధానం నేను చెప్పేవాన్ని అన్నారు గత ప్రభుత్వాల్లో 6 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అయితే ఇప్పుడు 18 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నామని, అప్పుడు జెన్కో ఆస్తులు 18 వేల కోట్లు అయితే ఇప్పుడు 50 వేల కోట్లు అయ్యాయనిఇప్పుడొచ్చింది ఆరు గంటల కరెంటు అయితే ఇప్పుడు నేను ఇచ్చేది 24 గంటల కరెంట్ అని అన్నారు. చేసేందుకు దమ్ము ధైర్యం ఉండాలని సాకులు చెబితే నడవదని అసెంబ్లీలో చర్చ వాళ్ళు పెట్టడం కాదు నేనే పెట్టి ఉన్నది ఉన్నట్లు చెబుతాను అన్నారు. నడిపిన వారమంతా అసెంబ్లీలోనే ఉన్నామని మాట్లాడతామని అధికారం ఎక్కువ రోజులు ఏం ఉండదని అవకాశాలు వాళ్లే ఇస్తారని మనంఅందిపుచ్చుకోవాలన్నారు. రెండు మూడు రోజుల జరుగుతున్న సంఘటనలతో ఇక్కడ నేను గెలిచాను కాబట్టి నాకు ఓటు వేయని వారు కూడా ఇప్పుడు ధైర్యంగా ఉన్నారని అన్నారు. అధికారం ఉన్న లేకున్నా అనిగిమనిగి ఉండడం రాజకీయంగా తరగని పెట్టుబడి అని అన్నారు. అధికారంలో ఉన్న వారి వైపే అధికారులు ఉంటారని అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలపై వారంలో స్పష్టత వస్తుందని దానిపై ఆలోచన చేద్దామన్నారు ప్రజలు విజ్ఞులని వారు ఆలోచన చేస్తారని అన్నారు పార్టీ ఏ పిలుపునిచ్చిన వెంటనే స్పందించడమే మనప్రధాన బాధ్యతఅన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల తరఫున పోరాడటమే మన ప్రధాన కర్తవ్యమని దీన్ని నాయకులు కార్యకర్తలు దృష్టిలో ఉంచుకొని చైతన్యవంతులై పని చేయాలని పిలుపునిచ్చారు

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదివారం యశోద దవాఖానలో పరామర్శించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్, మాజీ మంత్రి శ్రీ హరీష్ రావు, యశోద డాక్టర్లను కలిసి కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ఎంవీ రావు తదితరులున్నారు.

సీఎం వెంట మంత్రి శ్రీమతి సీతక్క, శ్రీ షబ్బీర్ అలీ తదితరులున్నారు.

మహిళలకు RTC బస్సులలోఉచిత ప్రయాణం కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి... నూనె వెంకట్ స్వామి

RTC బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం మంచిదే, ప్రజలందరూ దీన్ని హర్షిస్తున్నారు. ఒకటి మంచి చేయబోతే మరొకటి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులే ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోవడమ్, అంతంత మాత్రంగా ఉన్న ఆటో డ్రైవర్ల జీవితలు ఈ కారణం చేత అభద్రతకు ఉపాధి కోల్పోవడానికి కారణమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఎటువంటి పథకాలు కానీ ఆదుకోవడం గాని జరుగుతున్న పరిస్థితి లేదు. గతంలో ఉన్న BRS ప్రభుత్వం గానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఆటో డ్రైవర్లను ఏ విధంగాను ఆదుకోలేదు. ఈ కారణం చేత భార్య మెడ పై ఉన్న పుస్తేలను కూడా కుదువబెట్టి ఆటోలను తెచ్చి, ఇన్సూరెన్స్లను కట్టి, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నూతన రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ల యూనియన్లను అసోసియేషన్లను రాష్ట్ర ప్రభుత్వం పిలిచి వారి యొక్క అభిప్రాయాలు తీసుకుని ఏ చర్యల ద్వారా ఉపాధి నిలబడుతుందో ఆ చర్యలను చేపట్టాలి

తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం...

తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతోన్న ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం.. ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన 51 మంది ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు

కరెంటు ఆర్థిక స్థితిగతులను దాచి 85 వేల కోట్లు అప్పులు చేసి దాన్ని ప్రజలకు తెలియనీయకుండా దాచిపెట్టినాడు

కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు ఉంటాయని ప్రజలు తప్పు దోవ పట్టించడానికి ఈ పని చేశారు

ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దు

ఈరోజు ఆయన పిలిపించి 85 వేల కోట్ల అప్పు ఎలా అయింది ఎందుకయింది, ఎలా అయింది, ఏమి కొన్నారు. ఆయన ద్వారానే ప్రజలకు తెలిపే ప్రయత్నము

ఒకవేళ లెక్కలు సరిగ్గా తేలకపోతే, అప్పుడప్పుడే  ప్రభాకర్ రావు ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది

కరెంటు సెగ మన మాజీ మంత్రుల కు తగిలే అవకాశం ఉంది, , కెసిఆర్ అనారోగ్యంతో, హాస్పిటల్ యశోదలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పేరిట విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది

ఇప్పుడే అందిన సమాచారం, ప్రభాకర్ రావు, విదేశాలకు పారిపోయే ప్రయత్నం, అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం.. చూద్దాం ఏం జరుగుతుందో

ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను పరిశీలించుకుని ముందుకెళ్తాం

జూలకంటి రంగారెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

శాసనసభ ఎన్నికల్లో సిపిఎం పార్టీ పోటీ చేసిన స్థానాలలో ఓటమికి గల కారణాలను పరిశీలించుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని *సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు, 

 శుక్రవారం రోజున సిపిఎం జిల్లా కమిటీ, సమావేశం స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన

 ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నజూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు రెండు ప్రధానమైన పార్టీల మధ్య పోటీగా చూశారని టీఆర్ఎస్ ఓడిపోవాలంటే కాంగ్రెస్ కు ఓట్లు వేశారని తెలిపారు. కాంగ్రెస్ రావద్దు అనేవారు టిఆర్ఎస్ కు టిఆర్ఎస్ రావద్దు అనేవారు కాంగ్రెస్ కు ఓట్లు వేశారని మూడవ పార్టీ వైపు ఓటర్సు చూడలేదని ఓటు వేయాలని ఆలోచించలేదని తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు సక్రమంగా అమలు చేయకపోవడం, కారణమని అన్నారు .మరియు దళిత బంధు, బీసీ బందు, మైనారిటీ బందు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకా పోవడం వలనే, టిఆర్ఎస్ ను ఓడించారని మరియు నిరంకుశ ప్రజాస్వామిక పోకడలు కుటుంబ పాలన నిధుల దుర్వినియోగం జరిగినట్లు ప్రజలు నమ్మారని అన్నారు. అవినీతి అక్రమాలు మరియు స్థానిక ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత అందర్నీ కలుపుకొని పోకపోవడం వలన, టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ వ్యతిరేకత మరియు ఆరు పథకాలు ప్రజల ముందు పెట్టడం ప్రజలు వాటిని నమ్మడం అందరూ కలిసి పనిచేయడం వలన గెలిచిందని, తెలిపారు.సిపిఎం పోటీ చేసిన నియోజకవర్గాలలో ఓట్లు నిలబెట్టుకోలేక పోయామని ఒంటరిగా గెలవలేరని మెజారిటీ, శ్రేణులు కాంగ్రెస్కు ఓటు వేసినారని, అన్నారు టిఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతో సిపిఎం శ్రేణులు కాంగ్రెస్కు ఓట్లు వేశారని అన్నారు ఇలాంటి పరిస్థితులను ఎక్కడ పొరపాటు చేసినాము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అలాగే పార్టీ నిర్మాణం సరి దిద్దుకోవటం ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని రానున్న స్థానిక సంస్థలఎన్నికలు ఎదుర్కోవడానికి ఇప్పటినుండే సిద్ధం కావాలని తెలియజేశారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆశిస్తున్నామని తెలిపారు. 

           ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ,రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, డబ్బికారు మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున. బండ శ్రీశైలం, కందాల ప్రమీల,సయ్యద్ హష0, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

దళిత మహిళను దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

 నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన వల్లందాసు మంజుల (35) దళిత వివాహిత మహిళను అత్యంత దారుణంగా చున్నీతో ఉరిబెట్టి రాళ్లతో కొట్టి చంపిన వాజిద్ మరికొంతమంది నిందితులను కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున mrps జిల్లా సీనియర్ నాయకులు బాకరం శ్రీనివాస్ తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి బిక్షం డిమాండ్ చేశారు. ఈ రోజు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాదారు. దళిత మహిళలపై అత్యంత దారుణ సంఘటనలు జరుగుతున్నాయని నిందితులు ఏదేచ్ఛగా తిరుగుతున్నారని ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు విధించాలని దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని, డిమాండ్ చేశారు. నిందితులపైన హత్య, sc st అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, మంజుల కుటుంబానికి 20లక్షల పరిహారం ఇవ్వాలని,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,3 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక dsp గారు సమగ్రంగా విచారణ జరిపి దోషులను కటినంగా శిక్షించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కెవిపిస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను విద్యార్థి సంగం అధ్యక్షులు కొండేటి మురళి కత్తుల సన్నీ మృతురాలి కుమారుడు మరియు పోతే పాక సహదేవ వెలుగుపల్లి వార్డు మెంబర్లు పోతుపాక కిరణ్ పోతుపాక సతీష్ నాగార్జున బ్రహ్మచారి గ్రామస్తులు పూతపాక యాదయ్య పోతుపాక లింగయ్య పూతపాక రవి పూతపాక సైదులు పోతపాక నవీన్ చింతపల్లి వెంకన్న కండే యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేటలో కారు టాప్ గేర్

కారు స్పీడుకు చెల్లాచెదురు అవుతున్న కాంగ్రెస్, బిజెపిలు. 

ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

కాంగ్రెస్‌, బీజేపీ వీడి గులాబీ కండువా కప్పుకుంటున్న నేతలు

మంత్రి జగదీష్ రెడ్డి వ్యూహాంతో ఖాళీ అవుతున్న కాంగ్రెస్‌

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్ది సూర్యాపేట నియోజకవర్గం లో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. సూర్యాపేట నియోజకవర్గం లో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు సొంతపార్టీని వీడి గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు. కారు స్పీడు కు కాంగ్రెస్ , బిజేపి లు చెల్లాచెదురు అవుతున్నాయి. మంత్రి,బిఆర్ఎస్ అభ్యర్ధి జగదీష్ రెడ్డి వ్యూహాంతో ఖాళీ అవుతున్న కాంగ్రెస్‌, బిజేపి లు ఖాలీ అవుతుండగా, భారీ మెజారిీ విజయం దిశగా జగదీష్ రెడ్డి దూసుకుపోతున్నారు.

సీఎం కేసీఆర్‌తోనే తండాల అభివృద్ధి

 తండాలను పంచాయితీ లుగా చేసిన మానవతవాధి కేసిఆర్

చిల్లర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ,బీజేపీకి లకు గుణపాఠం చెప్పాలి

త్వరలోనే ‘గిరిజన బంధు’ అమలు చేస్తాం 

రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే నా ధ్యేయం

ఎకరానికి లక్ష ఆదాయం వచ్చే లా చేయడమే నా లక్ష్యం

తండాలను పంచాయితీ లుగా చేసిన గొప్పమానవతవాధి ముఖ్యమంత్రి కేసిఆర్ అని సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని సూర్యాపేట రూరల్ మండలం రాజా నాయక్ తండ, లక్ష్మీ నాయక్ తండ, చివ్వెంల మండలం బడితండ,పీర్ల తండా,మున్యానాయక్ తండ, పాండ్య నాయక్ తండా లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారంగిరిజన తండాలు, గూడేలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటి వరకు తండాలను పట్టించుకున్న ప్రభుత్వాలే లేవన్నారు. స్వరాష్ట్రంలోనే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని అన్నారు. మిషన్‌భగీరథతో స్వచ్ఛమైన తాగునీరు అందిస్తు న్నామని తెలిపారు. తండాలకు రహదారులు నిర్మించామని పేర్కొన్నారు. గతంలో జరిగిన అభివృద్దిని, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్దిపై బేరీజు వేయాలని ప్రజలకు సూచించారు.గత ప్రభుత్వాలు తండాల అభివృద్ధి గురించి పట్టించు కో కేవలం ఓటుబ్యాంక్ గానే చూశాయని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన సీఎం కేసీఆర్‌ గిరిజనుల ఆరాధ్యుడన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గురుకులాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గిరిజన కుటుంబ సంఘటన నుంచే కల్యాణలక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారని త్వరలో భూమిలేని గిరిజనుల కోసం గిరిజన బంధు పథకం వస్తుందని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి గిరిజనులు అండగా నిలువాలని కోరారు.

సూర్యాపేట లో జరిగిన అభివృద్ధి మీ కళ్ళ ముందే కనబడుతుందని అన్నారు.గతంలో పాలించిన దామోదర్ రెడ్డి తన హయాంలో ఏమి చేయకపోగా, కొట్లాటలను ఘర్షణలను ప్రోత్సహించి, మూడు కొట్లాటలు ఆరు కేసులను ఇచ్చాడే తప్ప గిరిజన అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఎన్నికలవేళ మాయమాటలు చెబుతున్న దామోదర్ రెడ్డిని ఏం చేశాడో ప్రజలే ప్రశ్నించాలని కోరారు. మళ్లీ ఆశీర్వదిస్తే ఎకరానికి లక్ష ఆదాయం వచ్చే విధంగా చేయడమే నా లక్ష్యం అన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగాలనిన్నదే నాధ్యేయం ఆన్న మంత్రి, దానికి కావాల్సిన ప్రణాళిక నా దగ్గర సిద్ధంగా ఉందన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే , డ్రై పోర్టు తీసుకొచ్చి వేలాదిమందికి ఉపాధి కల్పిస్తానని అన్నారు. రాబోయే డ్రైపోర్టుతో మీ భూముల ధరలకు రెక్కలు వస్తాయని, అందరూ కోటీశ్వరులు కావడం ఖాయం అన్నారు. తండాలలో అభివృద్ధిని పరుగులు పెట్టించి

నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరు గర్వపడేలా చేస్తానన్నారు.

భాస్కర్ రావు గెలుపు కోరుతూ బాపూజీ నగర్ లో బారి చేరికలు

బి ఆర్ ఎస్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ అభ్యర్థి భాస్కరరావు గారి గెలుపును మరియు మిర్యాలగూడ అభివృద్ధిని కాంక్షిస్తూ ఉమ్మడి బాపూజినగర్ నుండి వివిధ పార్టీల యువ నాయకులు దొంతరబోయిన శ్రీనివాస్ , సింగిరాల విజయ్,Sk ఎక్బాల్ ,పెంట సైదులు,సింగిరాల రవి, అకులపల్లి సుధాకర్,సాంబశివ రావు, మున్నయ్య, షబ్బీర్,లతీఫ్ బుచ్చయ్య, రఫీ, ధర్మేంద్ర మీసాల తదితరులు మునిసిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణుగారి అధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు గారి సమక్షంలో బీ ఆర్ యస్ పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంజనేయ రాజు, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, పున్నా రాధ కృష్ణ, యార్రమళ్ళ దినేశ్, చిన్న మల్లయ్య, మీసాల జగదీష్, పెంకే రాంబాబు, sk అజ్గర్, ఆవుల బాలు యాదవ్, సత్యనారాయణ చారి, కుంచం శివకృష్ణ, పెరుమాళ్ల ధనమ్మ, మర్రి పద్మ తదితరులు పాల్గొన్నారు