తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల బ్రేకింగ్ న్యూస్...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లోనూ పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ముందంజ.. వరంగల్ తూర్పులో కొండా సురేఖ, ములుగులో సీతక్క, ఖమ్మంలో తుమ్మల, మధిరలో భట్టి విక్రమార్క, పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లీడ్‌

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. తెలంగాణ వ్యాప్తంగా పోలైన 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 131 టేబుళ్లు ఏర్పాటు..

డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమం..

డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమం..

చెన్నై: డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమం.. చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయ్‌కాంత్.. ఆస్పత్రికి చేరుకుంటున్న డీఎండీకే నేతలు, కార్యకర్తలు.. మియాట్ ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు.

డీకే శివకుమార్ తో పాటు హైదరాబాద్ రానున్న కర్ణాటక ఆరుగురు మంత్రులు...

డీకే శివకుమార్ తో పాటు హైదరాబాద్ రానున్న కర్ణాటక ఆరుగురు మంత్రులు...

హైదరాబాద్‌కు డీకే శివకుమార్‌

హైదరాబాద్‌కు వస్తున్న ఆరుగురు కర్నాటక మంత్రులు

అభ్యర్థులంతా తాజ్‌కృష్ణకు రావాలని అధిష్టానం ఆదేశం

కాంగ్రెస్‌ అభ్యర్థులతో భేటీకానున్న డీకే శివకుమార్‌

రేపు ఫలితాల తర్వాత గెలిచిన వారిని..

ప్రత్యేక విమానంలో బెంగళూరు తరలించనున్న అధిష్టానం

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 56,950 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,463 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు

ఏపీకి 'మిచౌంగ్‌' తుఫాన్‌ ముప్పు..

ఏపీకి 'మిచౌంగ్‌' తుఫాన్‌ ముప్పు..

ఏపీకి 'మిచౌంగ్‌' తుఫాన్‌ ముప్పు.. కోస్తాంధ్ర వైపు దూసుకు వస్తున్న తుఫాన్.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం, రాగల 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే ఆవకాశం.. నెల్లూరుకు 790, మచిలిపట్నం కు 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం.. రాగల 48 గంటల్లో తుఫాన్‌గా మారే ఆవకాశం.. కోస్తాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, మత్స్యకారుల వేటకు వెళ్లరాదని వార్నింగ్‌.

తమిళనాడులో తుఫాన్ అతలాకుతలం

తమిళనాడులో తుఫాన్ అతలాకుతలం

తుఫాన్ సైరన్‌ తమిళనాడును అలా అతలాకుతలం చేస్తోంది. చెన్నై,తిరువల్లూరు, కాంచీపురంలో రెడ్‌ అలర్జ్‌ జారీ అయింది. ఆగకుండా కురుస్తోన్న వానలతో ఇప్పటికే చెన్నైలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. సబ్‌ వేలను క్లోజ్‌ చేశారు. రైల్వే ట్రాక్‌పై వరద పోటెత్తడంతో రైళ్ల రాకపోకలు బందయ్యాయి.

కెసిఆర్ పాలనలోనే కుల వృత్తులకు జీవం

కెసిఆర్ పాలనలోనే కుల వృత్తులకు జీవం

సృష్టికి ప్రతిసృష్టి చేసేది విశ్వకర్మలే 

రాజకులని పట్టించుకోని పాపం గత పాలకులదే

కులవృత్తిదారులకు లక్ష సాయం దేశంలో ఎక్కడా లేదు

ఆశీర్వదించండి ..అండగా ఉంటా

విశ్వబ్రాహ్మణ, రజక సహకార సంఘం ఆత్మీయ సమ్మేళనాలలో మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట

గత పాలకుల హయాంలో కుంటుపడిన కులవృత్తులకు తిరిగి జీవం పోసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని రాష్ట్ర మంత్రి ,సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో విశ్వబ్రాహ్మణ, రజక సంఘం ఆధ్వర్యంలనిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ సృష్టికి ప్రతిసృష్టి చేసేది విశ్వకర్మలు అయితే రెక్కల కష్టమే జీవనం సాగిస్తూ సమాజ సేవకు పాల్పడుతున్న గొప్పతనం రజకులది అన్నారు.అనేక సంవత్సరాలు రాష్ర్టాన్ని పరిపాలించిన గత పాలకులు రజకులను, విశ్వ బ్రాహ్మణులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు . పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో రజకులు, విశ్వ బ్రహ్మణ సోదరులు కులవృత్తిలో ఆర్థికంగా ఎదగడం కోసం లక్ష సాయం,లాండ్రి షాపులకు ఉచిత విద్యుత్‌ను ఇస్తున్న పథకం దేశంలో తెలంగాణలో మినహా ఎక్కడా లేవన్నారు. తెలంగాణలో బీసీ సామాజికవర్గ కులాల్లో ఎక్కువగా అణచివేయబడిన కు రజకులు శ్రమ దోపిడీకి గురై సమాజంలో చిన్నచూపు చూడబడ్డారన్నారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా రజకులు కూడా ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పిస్తున్నదన్నారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రజకుల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నదన్నారు.అలాగే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ, విశ్వకర్మ ,జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని రజక, విశ్వబ్రహ్మణ సంఘాలు గతంలో అనేక పోరాటాలు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తూ ఆత్మగౌర వం పెంపొందించేలా చేసింది. అలాంటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో, విశ్వబ్రాహ్మణ, రజకులు కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

రైతుబంధు ఆపాలంటూ ఎన్నికల కమీషన్ ఆదేశాల పై స్పందించిన జగదీష్ రెడ్డి

రైతుబంధు ఆపాలంటూ ఎన్నికల కమీషన్ ఆదేశాల పై స్పందించిన  జగదీష్ రెడ్డి 

రైతుబంధు విషయంలో ఎన్నికల కమీషన్ ఆదేశాలు దురదృష్టకరం

ఆనాడు కుట్రపూరితంగా కాంగ్రెస్ ఆపితే నేడు ఎన్నికల కమీషన్ రూపంలో ఆటంకం

రైతుబంధు ఆపిన కాంగ్రెస్ ను ఖతం చేయాలి

ఎవరెన్ని కుట్రలు చేసినా ఆపగలిగేది ఈ నాలుగు రోజులే 

రైతులకు ఎలాంటి బెంగ అవసరంలేదు , తాత్కాలిక ఆటంకాలతో అధైర్యపడొద్దు

ఎన్నికల తరువాత యధావిధిగా రైతు బంధు చేరుతుంది

మళ్ళీ కేసిఆరే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి

కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండగా రైతుబంధు 24 గంటల కరెంటు రైతు బీమా ఆగదు

 ఏ ఒక్క సంక్షేమ పథకం ఆపేవాడు ఎవడు లేదు

ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు

నల్లగొండ జిల్లా లో 12 కు 12 స్థానాలలో బిఆర్ఎస్ విజయం ఖాయం 

 సూర్యాపేట

రైతుబంధు ఆపిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఖతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. రైతుబంధు పంపిణి నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి,రైతుబంధు విషయంలో ఎన్నికల కమీషన్ ఆదేశాలుదురదృష్టకరంఅన్నారు.ఆ నాడు కుట్రపూరితంగా కాంగ్రెస్ ఆపితే నేడు ఎన్నికల కమీషన్ రూపంలో ఆటంకం కలిగింది అన్నారు.ఎవరెన్ని కుట్రలు చేసినా ఆపగలిగేది ఈ నాలుగు రోజులే ఆన్న మంత్రి,

రైతులకు ఎలాంటి బెంగ అవసరంలేదన్నారు.తాత్కాలిక ఆటంకాలతో అధైర్యపడొద్దు అన్నారు.

ఎన్నికల తరువాత యధావిధిగా రైతు బంధు చేరుతుంది అన్నారు.

మళ్ళీ కేసిఆరే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు.కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండగాకేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండగా రైతుబంధు ,24 గంటల కరెంటు, రైతు బీమా తో పాటు 

 ఏ ఒక్క సంక్షేమ పథకం ఆపేవాడు ఎవడు లేరాన్నారు.

ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవొద్దన్నారు..సూర్యాపేటలో 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్న మంత్రి, ప్రజల నుంచి వస్తున్న స్పందన అపూర్వమన్నారు. గ్రామాలకు ప్రచారంలోకి వెళ్తున్న సందర్భంగా అభ్యర్థులుగా గుర్తించకుండా, ప్రజలు వినతులు , విజ్ఞాపనలతో తమను అక్కున చేర్చుకుంటున్నారని తెలిపారు.

అభివృద్ధి వెంటే మేము -విద్యా సంస్థల ఐక్య వేదిక భూపాలన్న గెలుపే మా లక్ష్యమంటూ ఏకగ్రీవ తీర్మానం

అభివృద్ధి వెంటే మేము -విద్యా సంస్థల ఐక్య వేదిక

భూపాలన్న గెలుపే మా లక్ష్యమంటూ ఏకగ్రీవ తీర్మానం

 ప్రెవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్నా అర్హులైన సిబ్బందికి రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, గృహలక్ష్మి మరియు డబల్ బెడ్రూమ్ మంజూరులో ప్రాధాన్యత కల్పిస్తామని MLA కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు.

 స్థానిక ఎన్.ఆర్.ఎస్ గార్డెన్ మర్రిగూడ బైపాస్ యందు ఏర్పాటు చేసిన నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి విద్యా సంస్థల ఐక్య వేదిక ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ..తన గెలుపు కొరకు సంఘీభావం ప్రకటించిన ప్రైవేటు విద్యా సంస్థల సిబ్బంది మరియు యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు.

ఈ సందర్బంగా ట్రాస్మాగౌరవ అధ్యక్షులు యానాల ప్రభాకర్ రెడ్డి మరియు విద్యా సంస్థల ఐక్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ .. తెలంగాణా రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించాలంటే మరోమారు బి.ఆర్.ఎస్. కె పట్టం కట్టాలని దానిలో భాగంగా మన నల్గొండ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి‌, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కార్యదర్శి తలకోల పురుషోత్తం,,డిగ్రీ మరియు పీజీ కళాశాలల సామాల వెంకటేశ్వర్లు, జూనియర్ కళాశాల సంఘం అధ్యక్షులు చందం శ్రీను, ట్రాస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి.రావ్, పట్టణ అధ్యక్షులు ఎం.డి అజీజ్, ఇంజనీరింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్, లీగల్ సెల్ సలహాధారు కె.జవహర్, కేజీ టు పీజీ పరిశీలకులు ఇ.రాధాకృష్ణ, గొర్రె వెంకట్ రెడ్డి, వై శివశంకర్, ఎ. ప్రణీత్, పాముల అశోక్, గిరిధర్ గౌడ్, శ్రీమతి అమరావతి, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షబ్బీర్ అలీ, జిల్లా టి.పి.టి ఫేడరేషన్ ప్రతినిధులు బక్క నర్సింహా, ఏ.వెంకన్న, బి.రాంబాబు, బొజ్జ రాజు మరియు టి.పి.టి. ఫోరం ప్రతినిధులు మధుమూర్తి, సంజీవ రెడ్డి, సోమయ్య సహా వందలాది మంది నియోజకవర్గం పరిధి లోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు, లెక్చరర్స్,యాజమాన్య ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు