ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగుతోంది

యాగంలో ఈరోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ దంపతులు స్వయంగా ఈ పూజలో పాల్గొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు యాగ క్రతువును పర్యవేక్షిస్తున్నారు.

బీఆర్ఎస్ కు జై కొడుతున్న దివ్యాంగులు

బీఆర్ఎస్ ప్రభుత్వ హ్యాట్రిక్ ను కాంక్షిస్తూ ట్రై మోటార్ సైకిల్ పై ప్రచారం

 ప్రచారానికి శ్రీకారం చుట్టిన మేడ్చల్ జిల్లా శామీర్ పేట కు చెందిన మహేష్ అనే దివ్యాంగుడు

సూర్యాపేట కు చేరుకున్న ప్రచార యాత్ర

సూర్యాపేట పార్టీ కార్యాలయం లో జెండాఊపి ప్రచారయాత్ర ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

ప్రమాదవశాత్తు ఎమ్మెల్సీ గారి కాన్వాయ్ వాహనం తగిలి వ్యక్తికి గాయాలు

స్వయంగా హాస్పిటల్ కు తీసుకెళ్ళి వైద్య సహాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారు 

ములుగు నియోజకవర్గం బి అర్ ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ చార్జీ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన ప్రచారానికి వెళుతుండగా, దామెర మండలం ఊరుగొండ వద్ద ఆ గ్రామానికి చెందిన దేవులపల్లి సాంబయ్య హటాత్తుగా రోడ్డు దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఎమ్మెల్సీ కాన్వాయ్ లోని ఒక వాహనం తగిలి, స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే ఎమ్మెల్సీ స్వయంగా ఆ వ్యక్తిని సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్యం అందించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. సాంబయ్య కుటుంబ సభ్యులను పిలిపించి, వారికి ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చులు భరించడం తో పాటు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో, సాంబయ్య కుటుంబం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

అభివృద్ధిని చూసి ఆశీర్వదిచండి,మీఆశీర్వాదమే మాకు కొండంత అండ అని రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మంత్రి జగదీష్ రెడ్డి గారికి హ్యాట్రిక్‌ విజయాన్ని అందించాలి’ అని ప్రజలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి,బీఆర్‌ఎస్‌ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీమణి సునిత జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సూర్యాపేట పట్టణంలోని 14 వ వార్డు వినాయక నగర్, కృష్ణ కాలనీ లలో బుదవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు , సూర్యాపేట లో జరిగిన అభివృద్ధి ను వివరించారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో లేవన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే సూర్యాపేట ను మెట్రో నగరానికి దీటుగా మంత్రి జగదీష్ రెడ్డి గారు అభివృద్ధి చెయడం ఖాయం అన్నారు.సూర్యాపేట లో ఉన్న ప్రశాంత వాతావరణానికి తోడు పరుగులు పెడుతున్న అభివృద్ధి చూసే కార్పొరేట్ వ్యాపార సంస్థలు క్యూ కడుతున్నాయని అన్నారు. కాలి నడకన ఇంటికి ఇంటికి తిరిగిన సునిత జగదీష్ రెడ్డి బొట్టు పెడుతూ , మ్యానిఫెస్టో ను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.

ఘర్ వాపస్ అయిన వెంకటాపూర్ ఎంపీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు రామంజపూర్ వార్డు మెంబర్

కాంగ్రెస్ కి బిగ్ షాక్ మళ్ళీ తిరిగి సొంతగూటికి చేరిన వెంకటాపూర్ మండల ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య గార్లు వెంకటాపూర్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు రామాచారి రామంజపూర్ వార్డు మెంబర్ అనిల్

గౌరవ ఎమ్మెల్సీ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గులాబీ కండువా కప్పి తిరిగి పార్టీ లోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజలు నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ వెంటే ఉంటారని బడే నాగజ్యోతికి ఆరునూరైనా ములుగు నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టడం ఖాయమని ఎమ్మెల్సీ గారు ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు TSRDC చైర్మన్ ములుగు నియోజకవర్గ మూడు మండలాల ఎలక్షన్ ఇంచార్జ్  మెట్టు శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

శత చండీయాగం నిర్వహించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్

లోక కళ్యాణార్థం ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు దంపతులు బుధవారం వారి వ్యవసాయ క్షేత్రంలో శతచండీ యాగం నిర్వహించారు. 

శత చండీయాగంలో భాగంగా.. గురు, దేవతా ప్రార్థన, మహా సంకల్పం, గణపతి పూజా, స్వస్తి పుణ్యాహవాచనము, ఆచార్యాది ఋత్విగ్వరణము యాగశాలా సంస్కారము, గో పూజా, సహస్ర మోదక గణపతి హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము, నవాక్షరీ మూల మంత్ర జప అనుష్ఠానము, రాహు బృహస్పతి నంధిశాంతి, త్రైలోక్య మోహన గౌరీ హోమము , అఘోరాస్త్ర హోమ కార్యాలను, చండీ సప్తశతీ పారాయణములు, చతుర్వేద పారాయణములు, మహామంగళారతి, మంత్రపుష్పము, అష్టావధాన – సేవ తదితర కార్యక్రమాలను సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా వేద పండితులు నిర్వహించారు.

అనంతరం సీఎం కేసీఆర్ దంపతులు తీర్థ ప్రసాద వితరణము గావించారు.

కంచర్ల కృష్ణా రెడ్డి సమక్షంలో 41 వ వార్డు సభ్యులు చేరిక

కంచర్ల భూపాల్ రెడ్డి గెలుపు కాంక్షిస్తూ 41 వ వార్డ్ యువకులు పెద్ద ఎత్తున కంచర్ల క్రిష్ణా రెడ్డి గారి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు

భూపాల్ రెడ్డి గెలుపు కోసం 41 వ వార్డ్ యూత్ మెంబర్స్ అందరూ బారి ఎత్తున పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ మాజీజెడ్పీటీసి పార్టీలో చేరిక

గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన ఉప్పుతల కోటి గారు కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీ గౌరవ ఎమ్మెల్సీ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.

గులాబీ కండువా కప్పి కోటి గారిని ఎమ్మెల్సీ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో TSRDC చైర్మన్ శ్రీ మెట్టు శ్రీనివాస్ ఉమ్మడి వరంగల్ జెడ్పీ చైర్మన్ శ్రీ సాంబారి సమ్మరావు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు,కార్యకర్తలు,మరియుతదితరులు పాల్గొన్నరు

సూర్యాపేట నియోజకవర్గం లో దూసుకుపోతున్న కారు

కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన పెన్ పహడ్ మండలం ధర్మాపురం, సూర్యాపేట రూరల్ మండలం ఆరెగూడెం వాసులు

గులాబీ కండువాతో స్వాగతం పలికిన మంత్రి జగదీష్ రెడ్డి ఆయన వ్యక్తిగత సహాయకులు ప్రభాకర్ రెడ్డి

   సూర్యాపేట నియోజకవర్గం లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనకు మద్దతుగా రోజురోజుకు నియోజకవర్గంలో కాంగ్రెస్ బిజెపి నుండి టిఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. దీంతో గులాబీ పార్టీలో నయా జోష్ సంతరించుకుంది.

స్వరాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, సూర్యాపేట లో మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వం లో జరిగిన అభివృద్ధికి ఆకర్షితులైన కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.

తాజాగా పెన్ పహాడ్ మండలం ధర్మాపురం కాంగ్రెస్ 3వ వార్డు మెంబర్ పిట్టల రామకృష్ణ, యూత్ అధ్యక్షులు చౌగాని సతీష్ గౌడ్, బి జె పి గ్రామ కార్యదర్శి తాడూరి లింగయ్య, చింతకాయల సతీష్, పిట్టల సురేష్, పిట్టల రాజశేఖర్,చింతకాయల నరేష్, అంజయ్య, వెంకటేష్ లు పెన్ పహాడ్ మండలం బక్తలాపురం లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువా కప్పి మంత్రి జగదీష్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. మరోవైపు పార్టీ కార్యాలయంలో సూర్యాపేట రూరల్ మండలంఆరెగూడెం వార్డ్ మెంబర్ సిరపంగి సరిత, మధు, అజిత, గీత, వెంకటేష్, ముత్యాలు, రామదాసు, రాంబాబు, శ్రీను, రాములమ్మ, యాకూబ్, ప్రమీల, కవిత, రజిత,తదితరులు కాంగ్రెస్కు రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు. జడ్పిటిసి జీడి బిక్షం, మండల అధ్యక్షుడు రంగాల శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో మంత్రి జగదీశ్ రెడ్డి గారి వ్యక్తిగత సహాయకులు ప్రభాకర్ రెడ్డి గులాబీ కండువా కప్పి నూతనంగా వచ్చిన వారిని ఆహ్వానించారు..

నర్సాపూర్ నుంచి బరిలోకి దిగుతా

- పార్టీ కోసం కష్టపడిన నన్నే పక్కకు పెట్టేస్తారా?

- టికెట్ విషయంపై అధిష్ఠానం పునరాలోచించాలి

- బీఆర్ఎస్ కు, సునీతాలక్ష్మారెడ్డికి రాజిరెడ్డి కోవర్ట్

- మూడురోజుల్లో నిర్ణయం తీసుకోకుంటే మా కార్యచరణ ప్రకటిస్తాం

కాంగ్రెస్ పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్న తనకు టికెట్ ఇవ్వకపోవడం బాధకరమని ఆ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్ చార్జి గాలి అనిల్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండో జాబితాలో తనకే టికెట్ వస్తుందని భావించిన గాలి అనిల్ కుమార్ టికెట్ తనకు రాకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

దీంతో ఆయన శనివారం తన అనుచరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ పార్టీలోని నాయకులు తనకు ఏ పని చెప్పిన కష్టపడి చేశానని, అలాంటి తనకు కాకుండా బీఆర్ఎస్ పార్టీకి, సునీతాలక్ష్మారెడ్డికి కోవర్ట్ అయినా ఆవుల రాజిరెడ్డికి టికెట్ కేటాయించడం దారుణమన్నారు. గత ఎన్నికల్లో కూడా తాను పటాన్ చెరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించానని అక్కడ కాకుండా నర్సాపూర్ టికెట్ కేటాయిస్తామన్నారని, ఇక్కడ పార్టీని అభివృద్ధి చేశానని, నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పోతూ పార్టీని బలపర్చానన్నారు. ఇప్పుడు తనకు టికెట్ కేటాయించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికేనా పార్టీ నిర్ణయం మార్చుకుని మూడురోజుల్లో టికెట్ తనకు కేటాయించకుంటే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నరు.