TS: నేడు కొమురం భీమ్ జయంతి

అక్టోబరు 22,  1901 జన్మించిన కొమురం భీమ్.. తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాకు  చెందిన గిరిజనోద్యమ నాయకుడు.

కొమురం భీం.. ఆదిలాబాద్ అడవులలో గోండు  కుటుంబంలో జన్మించారు. ఈయన గిరిజన  గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు.. ఇప్పటి ఆసిఫాబాద్ జిల్లా లోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు.  పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది. కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకొని, అన్ని రకాల నిజాం అధికారాలను (అనగా న్యాయస్థానాలు, చట్టాలు) తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా  ఆయుధాలు  తీసుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా మరియు తమ భూమి లో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్(భూమి. అడవి.నీరు మాదే) అనే నినాదంతో ఉద్యమించి  1940 అక్టోబరు 27న  వీరమరణం పొందాడు. ఇప్పటికీ కొమరం భీమ్ నినాదమైన జల్ జంగల్ జమీన్ నినాదం ఎంతో ప్రాచుర్యంలో ఉంది.
TS: నేడు టిటిడిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం
హైదరాబాద్: టిటిడిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, హైదరాబాద్ నందు రాష్ట్ర పార్టీ సమావేశం జరుగును. ఈ సమావేశానికి పోలిట్ బ్యూరో, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్లమెంట్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ లు హజరుకానున్నారని తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటనలో తెలియచేసింది.

SB NEWS TELANGANA
TS: నేడే సద్దుల బతుకమ్మ...
TS: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక గా నిలిచే బతకమ్మ పండుగ సంబరాలలో చివరిరోజైన 'సద్దుల బతుకమ్మ' పండుగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా జరపనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం సద్దుల బతుకమ్మ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నేడు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో భాగంగా మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు, నేడు చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగియనుంది. సాయంత్రం వేళలో మహిళలు బతుకమ్మలను పేర్చి ఒక చోటకు చేరి బతుకమ్మ ఆటపాట లతో ఘనంగా నిర్వహించి అనంతరం బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేరుస్తారు.
నకిరేకల్ నియోజకవర్గంలో బీఎస్పీ జెండా ఎగరవేయడం ఖాయం: బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం: పది ప్రధాన హామీలతో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో విడుదల చేసిన మ్యానిఫెస్టో.. రాష్ట్రంలో బహుజనులకు భరోసా కల్పించే అసలైన మేనిఫెస్టో అని నకిరేకల్ బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థిని మేడి ప్రియదర్శిని అన్నారు. శనివారం నార్కట్ పల్లి మండలం చిప్పలపల్లి, తిరుమలగిరి, జువ్వుగూడెం, చిన్న కపర్తి, అవులోనిబావి గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో భాగంగా గడప గడపకు తిరుగుతూ, ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని మేడి ప్రియదర్శిని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బీఎస్పీ మ్యానిఫెస్టోలో అందరికీ విద్య, వైద్యం, యువతకు ఉద్యోగాలు, రైతు సంక్షేమం,పేదలకు భూమి హక్కు, చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి పేరిట మహిళలకు వరాలు, ఇంటి హక్కు మొదలైన వాటికి పెద్దపీట వేసిందని తెలిపారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా రూపొందించిందన్నారు. ఈసారి నకిరేకల్ నియోజకవర్గంలో బీఎస్పీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, చిట్యాల మండల అధ్యక్షులు జోగు శేఖర్, మహేష్, యోగి, ఉదయ్, మల్లేష్, వినయ్, మల్లికార్జున్, బి ఎస్ పి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

SB NEWS NATIONAL MEDIA
మరో ఘనతను సాధించేందుకు సిద్ధమైన ఇస్రో
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి శనివారం ఉదయం 8.30 గంటలకు గగన్‌యాన్‌ టెస్ట్‌ వెహికల్‌ను ఇస్రో ప్రయోగించనుంది. దీని ద్వారా క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ పనితీరును పరీక్షించనున్నారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు, ఇస్రో ప్రతిష్టాత్మకంగా గగన్‌యాన్‌ మిషన్‌ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సన్నాహకంగా పలు కీలక పరీక్షలను ఇస్రో చేపట్టనుంది.

తొలుత క్రూ మాడ్యూల్‌ వ్యవస్థను పరీక్షించనున్నది. అనుకోని ప్రమాదం తలెత్తితే వ్యోమగాములు సురక్షితంగా బయటపడేలా చూసే లక్ష్యంతో ఈ పరీక్షను చేపడుతున్నారు. ఇందులో భాగంగా డీ1 రాకెట్‌ ద్వారా క్రూ మాడ్యూల్‌ని నింగిలోకి పంపనున్నారు. అయిదారు గంటలకి తిరిగి భూమిని చేరేలా డిజైన్‌ చేశారు. బంగాళాఖాతంలోకి పడేలా రూపకల్పన చేశారు.

SB NEWS
NLG: లెంకలపల్లి లో ఘనంగా దుర్గామాత పూజలు
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం లోని లెంకలపల్లి గ్రామంలో.. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా  గాంధీ సెంటర్ వద్ద  ఏర్పాటుచేసిన దుర్గామాత మంటపం వద్ద మహిమాన్విత శక్తి స్వరూపిణి దుర్గామాతకు ఐదవ రోజు శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహించారు. 5 వ రోజు శుక్రవారం అమ్మవారు సరస్వతీ మాత గా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా భవానీలు మరియు పలువురు భక్తులు సరస్వతి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
TS: ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షలు
హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు బోనస్‌ కింద తెలంగాణ ప్రభుత్వం రూ.711 కోట్లు విడుదల చేసింది. దీంతో సింగరేణిలో పనిచేస్తున్న ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షల బోనస్‌ ఇవ్వనున్నట్టు యాజమాన్యం వెల్లడించింది. ఈ నిర్ణయంతో సింగరేణి కాలరీస్ లో పనిచేస్తున్న 42వేల మంది కార్మికులకు రూ.1.53 లక్షల చొప్పున బోనస్‌ అందనుంది. ఒకటి రెండు రోజుల్లో పండుగ అడ్వాన్స్‌ కూడా చెల్లించనున్నట్టు అధికారులు తెలిపారు.

SB NEWS TELANGANA
TS: కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీతో జేఏసీ నాయకులు కోదండరాం భేటీ
కరీంనగర్ జిల్లా:  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీతో టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం భేటీ అయ్యారు. ఇవ్వాళ ఉదయం కరీంనగర్‌ వీపార్క్‌ హోటల్‌కు చేరుకున్న కోదండరాం.. రాహుల్‌ గాంధీ తో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్‌ను రాహుల్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోదండరాంను రాహుల్ కోరగా.. పోటీకి ఆసక్తి లేదని తేల్చి ప్రొఫెసర్ తేల్చిచెప్పారు. ఎన్నికల్లో అవగాహన, బీఆర్ఎస్‌ ను ఎదుర్కునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రయోజనల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రయోజనల కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని జన సమితి నిర్ణయించింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ముథోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను తెలంగాణ జనసమితి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ నియంత పాలన దించడానికే టీజేఎస్ ఏర్పడిందని కోదండరాం వెల్లడించారు. ఈ భేటీలో కేసీ వేణు గోపాల్, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

SB NEWS TELANGANA
బీఎస్పీ సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తాం: పోలెపల్లి రాజేష్
NLG: సాగర్ నియోజకవర్గం, హాలియా పట్టణ కేంద్రంలో ఉన్న బీఎస్పీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం  నియోజకవర్గ సమీక్ష సమావేశానికి, నియోజకవర్గ అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఇన్చార్జ్ పోలె పల్లి రాజేష్ హాజరై మాట్లాడుతూ..  వచ్చే సాధారణ ఎన్నికలలో సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని అందుకుగాను నియోజకవర్గం లో 6 మండలాలలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీ అగ్రకుల పేద ప్రజలు ప్రస్తుతం ఉన్న అగ్రకుల పార్టీ ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రమావత్ రమేష్ రాథోడ్, నియోజకవర్గ సహాయ కార్యదర్శి కుక్కముడి ముత్యాలు , నియోజకవర్గ మహిళా కన్వీనర్ బైరాగి విజయ, అనుముల మండల అధ్యక్షుడు జిల్లా మధు , గుర్రంపోడు మండల అధ్యక్షుడు కొమ్ము రమేష్ , సోషల్ మీడియా ఇన్చార్జ్ మామిడి నరేందర్ , నిడమానూరు మండల మహిళా అధ్యక్షురాలు దుబ్బ జ్యోతి, బహుజన సింగర్ నగేష్ నాయక్ , వలికి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
RR: యువతకు ఉపాది కల్పనలో ప్రభుత్వం విఫలం: మల్ రెడ్డి రంగారెడ్డి
యాచారం మండలం, నందివనపర్తి గ్రామానికి చెందిన 30 మంది యువకులు వివిధ పార్టీల నుండి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. టిపిపిసి వైస్ ప్రెసిడెంట్ మల్ రెడ్డి రంగారెడ్డి, వారికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలనుండి కెసిఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసిన విషయాన్నీ యువత తెలుసుకున్నదని, కాబట్టి కాంగ్రెస్ లోకి వలసలు గా వస్తున్నారని అన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం లో యువత కు తప్పకుండా న్యాయం చేయడం జరుగుతుందని, కోరుకొని తెచ్చుకున్న తెలంగాణ లో యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమం లో ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎదుళ్ల పాండు రంగారెడ్డి, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, ఓబీసి సెల్ చైర్మన్ సుబ్బురు పాండు, మండల పార్టీ ప్రెసిడెంట్ మస్కు నర్సింహా, సీనియర్ నాయకులు, అమృత కేసరి సాగర్, గుండ్లపల్లి ధనరాజ్ గౌడ్, కౌన్సిలర్ కాకుమాను సునీల్,మేతరి దర్శన్, గులాం అక్బర్, మోటే శ్రీశైలం,బిక్షపతి, రామ్ నాథ్ రెడ్డి, మొహమ్మద్ గౌస్, శ్రీశైలం, శ్యామ్ లాల్, విజయ్, తదితరులు పాల్గొన్నారు