తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 20 2023, 19:01

మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతుగా ఏకమవుతున్న వృత్తి సంఘాలు

సూర్యాపేటలో మంత్రిని కలిసి మద్దతు తెలిపిన సూర్యాపేట కార్పెంటర్స్ అసోసియేషన్

నూతన సంఘాన్ని అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కి మద్దతుగా వృత్తి కుల సంఘాలు ఏకమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ వైపే మా పయనం అంటూ వృత్తి , కల , సంఘాలు ఒకొక్కరిగా మంత్రి కి మద్దతు తెలుపుతున్నారు.

తాజాగా సూర్యాపేటలో నూతనంగా ఏర్పడిన కార్పెంటర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రిని కలిసి తమ మద్దతును ప్రకటించారు. సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి తో తమకు చేదినిండా పని దొరుకుతుందని, మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రజలకు శ్రీరామరక్ష అని అన్నారు.

సూర్యాపేట ప్రజలంతా మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతుగా ఏకతాటిపై నిలిచి జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కాగా నూతన అధ్యక్షుడు గా బైరోజు లింగాచారి,

కార్యదర్శి గా,కట్టోజు గోపి

ఉపాధ్యక్షులు గా పర్వతం భుషణాచారి,సహాయ కార్యదర్శి.. బహురోజు ..ఉపేందర్ ఎన్నిక అవగా వారందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. గౌరవ అధ్యక్షుడు పుట్టా కిషోర్ ఆద్వర్యం లో జరుగగా కార్యక్రమం లో కాసోజు మాధనాచారి,

కురెళ్లి మనోహర్,కేషవరపు కిరణ్

పోతుగంటి వీరాచారి,జనగాం వీరాచారి మోత్కురి వినోద్ పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 18 2023, 20:50

ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్న రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసిన TPCC మాజీ కార్యదర్శి విజయ్, రాగిడి లక్ష్మారెడ్డి, ఖలీమ్ బాబా. 

టికెట్లు అమ్ముకున్న సాక్షాలు మేము హై కమాండ్ కి పంపించామన్న కక్షతో మమ్మల్ని సస్పెండ్ చేశాడు. 

రేవంత్ రెడ్డికి దమ్ముంటే మొగోడివైతే టికెట్లు అమ్ముకోలేదు అని భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకి వచ్చి ప్రమాణం చేయ్.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 18 2023, 19:01

జిపి కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి పండగపూట పస్తులతో ఉంచొద్దు


 కలెక్టర్ డిపిఓ లకు వినతి పత్రం ఇచ్చిన యూనియన్ నాయకులు.

రాష్ట్రంలో అతిపెద్ద పండుగ అయిన దసరా పండుగ పూట గ్రామపంచాయతీ కార్మికుల్ని పస్తులు ఉంచకుండా పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  

   గ్రామపంచాయతీ కార్మికులకు ఆరు ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఇప్పించాలని జిల్లా కలెక్టర్ మరియు డిపిఓలకు వినతి పత్రం అందజేశారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 844 గ్రామపంచాయతీలలో సుమారు 3200 మంది కార్మికులు వివిధ రకాల పనులు చేస్తున్నారని వీరిలో 90% పైగా పేద దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారని అన్నారు.

      గ్రామ పంచాయతీలలో అనేక కష్టనష్టాలకు ఓర్చి పనిచేస్తున్న వీరికి ఇచ్చే వేతనాలు తక్కువే అని అవి కూడా ఆరేడు నెలలుగా పెండింగ్ లో ఉండడంతో అప్పులు సప్పులు చేసి బ్రతకాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో దసరా ఆ తర్వాత దీపావళి పండుగలు రానున్నాయని ఇప్పటికే అప్పులు పెరిగిపోవడంతో కొత్తగా అప్పులు దొరకక గ్రామపంచాయతీ కార్మికులు దసరాపండుగ రోజున పస్తులు ఉండే పరిస్థితి వచ్చిందని అందుకే జిల్లా కలెక్టర్ డిపిఓ జోక్యం చేసుకొని కార్మికులకు వేతనాలు ఇప్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    ఈ వినతి పత్రం ఇచ్చిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండం పెళ్లి సత్తయ్య, యూనియన్ జిల్లా నాయకులు ఇరిగి ఎల్లేష్, సురేష్ శ్రీకాంత్ నరేష్తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 18 2023, 18:55

మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా దేవలంలో ప్రత్యక పూజలు

మహారష్ట్రలోని షిరిడీ సాయిబాబా దేవాలయానికి వెళ్లి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి - సునీత గార్ల దంపతులు, తుంగతుర్తి శాసనసభ్యులు శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ - కమల గార్ల దంపతులు సాయిబాబా ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

షిరిడీ సాయిబాబా గారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రం పైన, తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ గారి పైన కలకాలం ఉండాలి, మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గార్ల దంపతులను సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు సన్మానించారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 16 2023, 18:31

కిరాయి కార్పెంటర్ షాపులకు 4వ కేటగిరి విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి--సీఐటీయూ

  కార్పెంటర్ షాపులకి నాలుగవ కేటగిరి కింద వర్తిస్తున్న విద్యుత్ సబ్సిడీ కిరాయి షాపులకు కూడా వర్తింపచేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య కోరారు 

         

సోమవారం తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ ఎస్ ఈ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1994 నంద్యాల నరసింహారెడ్డి ఎమ్మెల్యే ఉన్న కాలంలో కమ్మరి వడ్రంగి గోల్డ్ స్మిత్ తదితర షాపులకు నాలుగవ కేటగిరీ కింద విద్యుత్ సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని అంగీకరింప చేయడం జరిగిందని తెలిపారు. నాటినుండి ఈ పథకం అమలవుతుందని అన్నారు. ఎక్కువమంది కార్పెంటర్లు సొంత షాపులు లేకుండా కిరాయి షాపులు నడుపుకుంటున్నారని వారికి విద్యుత్ సబ్సిడీ అమలు కాకపోవడంతో పూర్తి కరెంటు బిల్లు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సొంత షాపులకు ఇస్తున్న సబ్సిడీ మాదిరిగానే లీజు అగ్రిమెంట్ పేపర్ తీసుకొని కిరాయి షాపులకు కూడా సబ్సిడీ వర్తింప చేయాలని వారు కోరారు.

    

ఈ కార్యక్రమంలో కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) నలగొండ పట్టణ అధ్యక్షులు సలివోజు సైదాచారి, కార్యదర్శి దాసోజు ప్రభు చారి, కోశాధికారి కే సురేష్, ఉపాధ్యక్షులు గడగోజు సైదాచారి, సహాయ కార్యదర్శి గుంటోజు సోమయాచారి, శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 16 2023, 18:27

దోరెపల్లి గ్రామం BRS పార్టీ నుండి BJP పార్టీ లోకి వలసల పర్వం

స్థానిక MLA& దోరెపల్లి సర్పంచ్, కనగల్ మండల అధ్యక్షుడి సొంత ఊరి నుండి BRS పార్టీ ఉప సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులు ఆయన ఒంటెద్దు పోకడలకి నిరసనగా BRS పార్టీ నుండి BJP పార్టీ లోకి జాయిన్ అవ్వడం జరిగింది.

కనగల్ మండలం దోరెపల్లి గ్రామం నుండి తెలంగాణ ఉద్యమ కారుడు గ్రామ ఉప సర్పంచ్ దాసరి వెంకన్న, వార్డ్ సభ్యులు నకిరేకంటి నరేష్, మాధగోని విజయలక్ష్మి - శంకర్ , BRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మాధగోని సైదులు, BRS పార్టీ మండల కార్యవర్గ సభ్యులు మాజి గ్రామ శాఖ అధ్యక్షులు మాధగోని ఏడుకొండలు,పసునూరి వెంకన్న బక్క లింగయ్య మాధగోని అశోక్ పగిల్ల రాములు బక్క శివ కుమార్ కిన్నెరా యాదయ్య దాసరి సాయిలు దాసరి లచ్చయ్య భైరగోని చంద్రయ్య మాధగోని నరేందర్ మాధగాని వెంకన్న భైరగోని శివశంకర్ పగిల్ల నర్సింహా పగిల్ల వెంకన్నబీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్* గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నేడు బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ కార్యక్రమంలో BJP పార్టీ కనగల్ మండలం అధ్యక్షులు పులకరం బిక్షం దోరెపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు మాధగోని తిరుమల్ గౌడ్ శక్తి కేంద్రం ఇంచార్జి భైరగోని శేఖర్, సముద్రాల మల్లేష్ నరేష్, బాలకృష్ణ సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 14 2023, 15:25

నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్యే భాజపా అభ్యర్థిగా అవకాశం ఇవ్వండి : పాలకూరి రవి గౌడ్

బడుగు బలహీన వర్గాల మద్దతు మరియు గౌడ సామాజిక వర్గం పూర్తి మద్దతుతో బరిలో ఉన్నాను

ఈ రోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కైలాస్ చౌదరి ని కలిసి నల్గొండ నియోజకవర్గము నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను బరిలో ఉన్నటువంటి విషయాన్ని నల్లగొండ బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి సమక్షంలో వారి దృష్టికి తీసుకెళ్లి పాలకూరి రవి గౌడ్ అనే నాకు అవకాశం కల్పించాలని కోరడం జరిగింది..

 నల్లగొండ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల మద్దతు మరియు గౌడ సామాజిక వర్గం పూర్తి మద్దతు నాకు ఉన్నటువంటి విషయాన్ని వారికి తెలియజేసి, నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి అవకాశం కల్పించాలని కోరుతూ 

 వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది..

ఈ సందర్భంగా బిజెపి నాయకులు కంకణాల నివేదిత రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పాలకూరి ఏలెంద్ర గౌడ్, కట్ట వెంకట్ రెడ్డి, బిజెపి కిసాన్ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Streetbuzz News

SB NEWS

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 13 2023, 16:50

రాష్ట్ర ఎక్సైజ్ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి.శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా

ఈ సందర్భంగా తాను ప్రత్యేకంగా రూపొందించి ముద్రించిన పాలమూరు ప్రగతి నివేదిక పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి పై సమగ్ర సమాచారంతో కూడిన పుస్తకాన్ని చూసి సీఎం హర్షం వ్యక్తం చేశారు.

పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని శాఖల వారీగా, ఆకర్షణీయమైన ఫోటోలను పొందుపరిచి సాధికారిక సమాచారంతో శ్రీనివాస్ గౌడ్ పుస్తకాన్ని రూపొందించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ ను సీఎం శ్రీ కేసీఆర్ ఆశీర్వదించారు.

భవిష్యత్తులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మరింతగా అభివృద్ధి చెందేలా సమిష్టి కృషి కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 13 2023, 15:40

పాల్వాయి రజినికుమారి కుటుంబానికి మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ

భాజపా నాయకురాలు పాల్వాయి రజిని కుమారి కుమారి తో పాటు కుటుంబ సభ్యులను సూర్యాపేట

శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు.

ఇటీవల అనారోగ్యంతో రజనీకుమారి ఏకైక కుమార్తె ఐశ్వర్య స్వర్గస్తురాలయింది. ఏకైక కుమార్తెను కోల్పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న రజనీకుమారి తో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దురదృష్ట సంఘటనకు సంబంధించిన వివరాలను రజనీకుమారిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, బండారు రాజా, మతకాల చలపతిరావు, అయూబ్ ఖాన్, చింతలపాటి చిన్న శ్రీరాములు, మద్ధి శ్రీనివాస్ యాదవ్, బైరు వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 12 2023, 19:35

నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు వీటి కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో... కనగల్ మండలం రేగట్ట గ్రామానికి చెందిన 30 మంది పైగా క

ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ... కెసిఆర్ నాయకత్వంలో సంబండ వర్గాలు..

 కెసిఆర్ అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుకొని...

 సంతోషంగా ఉన్నారని అందుకే వారి నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారని... బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు..

 ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరీం పాషా సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవ రెడ్డి.. మండల పార్టీ అధ్యక్షుడు అయితగోని యాదయ్య,ఎంపీటీసీ, పాలకూరి పుష్ప వెంకటేశం... సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు స్థానిక సర్పంచ్ కడారి కృష్ణయ్య,మాజీ జెడ్పిటిసి,ఎర్రోళ్ల సంజీవ, గోలి నవీన్.... పార్టీలో చేరిన వారిలో.. తిరిగి మల్ల వెంకటరమణ భోగరాజు నవీష్ అంతా సతీష్ సిరిగిమల్ల శ్రీధర్ భోగరాజు అంజయ్య సిరిగిమల్ల మల్లేష్ బొమ్మ పల్లి సైదులు తదితరులు ఉన్నారు