NLG: SVEEP పై ఆర్పీ లకు, వార్డు ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో  మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి మరియు జిల్లా పరిషత్ సీఈవో ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించి, సిస్టమాటిక్ ఓటర్స్  ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం SVEEP పై ఆర్పీ లకు, వార్డు ఆఫీసర్లకు  శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతంలో ఓటు నమోదు శాతాన్ని పెంచాలని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని, ఓటు నమోదు శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలని సందర్శించి ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, ఓటు నమోదు శాతాన్ని పెంచాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
తెలంగాణలో అన్ని అధికారాలు ఒక కుటుంబానికే పరిమితం: రాహుల్ గాంధీ
భూపాలపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో.. రాహుల్ గాంధీ మూడు రోజులు బస్సు యాత్రలో భాగంగా రెండో రోజైన ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మీదుగా విజయభేరి బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. మేడిపల్లి వద్ద పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ ద్వార కాటారం కార్నర్ సెంటర్ కి రాహుల్‌ గాంధీ చేరుకొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే అవినీతి ప్రభుత్వము ఒక తెలంగాణలోనే ఉందని, తెలంగాణలో అన్ని అధికారాలు ఒక్క కుటుంబానికే పరిమితమైందని ఆరోపించారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయన్నారు. కెసిఆర్ అవినీతిపై ఈడి, సిబిఐ, విచారణ ఎందుకు జరపడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కెసిఆర్ అవినీతి పాలన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారని విమర్శించారు. తెలంగాణలో పేదల, రైతుల, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఏర్పాటు చేస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి మహిళలే వెన్నుముక అన్నారు.కాటారంలో ఈ జన ప్రభంజనం చూస్తుంటే కెసిఆర్ ఓటమి ఖాయమన్నారు. అంతకుముందు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కే.టి.పీ.పీ గోదావరి గెస్ట్ హౌస్ లో నేడు రేవూరి ప్రకాష్ రెడ్డి తో పాటు మరికొంతమంది రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అనంతరం బస్సు యాత్ర కేటీకే 5వ గని నుండి బాంబులగడ్డ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. కేటికే 1.వ గని వద్ద సింగరేణి కార్మికులతో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గేట్ మీటింగ్ నిర్వహించారు.అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. సింగరేణి ఒకటో గని గేట్ మీటింగ్ కి రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంతో చర్చనీయాంశంగా మారింది.
నేడు మహా చండి దేవి అలంకారంలో  విజయవాడ కనకదుర్గమ్మ
విజయవాడ: శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా.. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఈ రోజు మహా చండి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఐతే ప్రతి ఏటా 5వ రోజున స్వర్ణకవచాలంకృత దుర్గ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చేవారు. ఈ సారి మాత్రం వైదిక కమిటీ నిర్ణయం మేరకు చండి అలంకారానికి మార్చారు. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. ఈ ఏడాది అధిక శ్రవణం, తిథిలో హెచ్చుతగ్గుల తేడా రావటంతో ఈ ఏడాది అమ్మవారి అలంకారాలలో కూడా మార్పులు చేయాల్సి వచ్చిందని పండితులు అంటున్నారు. 70 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటి సరిగా, సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహా చండీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి , మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్బవించింది. చండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువైఉన్నారు. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వ దేవతలను ప్రార్ధించినట్లే అని పండింతులు తెలుపుతున్నారు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభించి.. శత్రువులు మిత్రులు గా మారడం, ఏ కోర్కెల కోసం అయితే ప్రార్ధిస్తామో అవి సత్వరమే నెరవేరతాయనేది భక్తుల విశ్వాసం

నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. మొదటి మూడు రోజుల్లోనే రెండు లక్షల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఇవాళ ప్రత్యేక అలంకారం కావడంతో భారీస్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.



TS: వారంలో రూ.101 కోట్లకు పైగా స్వాధీనం
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల కోడ్ విధించిన కారణంగా.. రాష్ట్రంలో వారం రోజుల్లో  నగదు, మద్యం, బంగారం స్వాధీనం విలువ.. రూ. 101 కోట్లు దాటిందని తెలంగాణ పోలీస్ అధికారులు తెలిపారు. ఈనెల 9వ తేదీన ప్రారంభమైన ఎన్నికల నియమావళి నుండి నేడు 17వ తేదీ వరకు రూ.101 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఐతే 2018 సంవత్సరానికి గాను మొత్తం ఎలక్షన్స్ టైంలో  103 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈసారి వారం రోజుల్లోనే 2018 ఎలక్షన్ సమయంలో స్వాధీనం చేసుకున్న మొత్తానికి దాదాపుగా సమానంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగదు, విలువైన  ఆభరణాలు, మద్యం, మాదకద్రవ్యాలు  మొదలైన వాటితో సహా అన్ని సీజ్‌ లు కలిపి ఈ 8 రోజుల స్వల్ప కాలానికి రూ.101,18,17,299/- దాటాయి. కాగా అసెంబ్లీ ఎన్నికలు-2018లో మొత్తం రూ. 103 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు, భారత ఎన్నికల సంఘం జారీచేసిన ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని డిజిపి సూచించారు.

TS: అమరవీరుల స్థూపం వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్: నేడు మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీకి వచ్చిన రేవంత్‌ రెడ్డి అక్కడి నుండి ఒంటి గంటకు అమరవీరుల స్థూపం వద్దకు బయల్దేరారు. రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌ కు చేరక ముందే పోలీసులు గన్ పార్క్ వద్ద మోహరించారు. రెండు రోజుల క్రితం కేసీఆర్‌ కు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయడానికి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అందుకు అనుగుణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్థూపం వద్దకు అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి వచ్చారు. డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమా.. అని కేసీఆర్ కు.. రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. గన్ పార్క్ వద్ద ఉన్న అమర వీరుల స్థూపం వద్దకు భారీగా కార్యకర్తలతో కలిసి రావడంతో పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దాదాపు పావు గంటకు పైగా పోలీసులతో రేవంత్ రెడ్డి,  వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కార్యక్రమాలను అనుమతించలేమని పోలీసులు వివరించారు. గన్‌పార్క్‌ వద్దకు వెళ్లి తీరుతామని చెప్పడంతో అందుకు పోలీసులు అంగీకరించలేదు. చివరకు పోలీసుల వాహనంలో రేవంత్‌ రెడ్డిని తరలించారు.

SB NEWS TELANGANA
బీఎస్పీ మేనిఫెస్టో: భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి
హైదరాబాద్: బహుజన భరోసా పేరుతో బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. 2023 అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో.. నేడు బీఎస్పీ  మేనిఫెస్టోను విడుదల చేశారు.  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 10 పథకాలతో కూడిన బీఎస్పీ మేనిఫెస్టో ను విడుదల చేసారు.

మేనిఫెస్టో లోని 10 అంశాలు

1. కాన్షీ యువ సర్కార్: యువతకు ఐదేళ్ల లో 10 లక్షల ఉద్యోగాలు.. అందులో మహిళలకు 5 లక్షల కొలువులు

2. పూలే విద్యా దీవెన: మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్. ప్రతి మండలం నుండి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య. Data, AI, మరియు కోడింగ్‌ లో శిక్షణ

3. బహుజన రైతు ధీమా: ప్రతి పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు కచ్చితమైన ప్రభుత్వ రాయితీ, ధరణి పోర్టల్ రద్దు.

4. చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి: మహిళా కార్మికులు మరియు రైతులకు ఉచిత వాషింగ్ మెషిన్, స్మార్ట్ ఫోన్, మరియు డ్రైవింగ్ శిక్షణ. అంగన్‌వాడీ, ఆశావర్కర్ల ఉద్యోగులు క్రమబద్దీకరణ. మహిళా సంఘాలకు ఏటా లక్ష రూపాయలు.

5. భీం రక్షా కేంద్రాలు: వృద్ధులకు హాస్టల్, ఆహారం మరియు ఉచిత వైద్య సేవలు. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు మరియు ఒంటరి మహిళలకు తోడ్పాటు.

6. బ్లూ జాబ్ కార్డ్‌: పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ. రోజూ కూలీ రూ. 350కి పెంపు. కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య మరియు జీవిత బీమా

7. నూరేళ్ల ఆరోగ్య ధీమా: ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ. ఏటా రూ. 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆహార బడ్జెట్‌ కేటాయింపు

8. వలస కార్మికుల సంక్షేమ నిధి: 5,000 కోట్ల నిధి తో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు వలస కార్మికులకు వసతి గిగ్ కార్మికులు, లారీ మరియు టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు.

9. షేక్ బందగీ గృహ భరోసా: ఇల్లు లేని వారికి 550 చ.గ. ఇంటి స్థలం ఇల్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షల సహాయం ఇంటి పునర్నిర్మాణానికి రూ. లక్ష సహాయం

10. దొడ్డి కొమురయ్య భూమి హక్కు : భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా.
దామెర భీమనపల్లి గ్రామపంచాయతీ వద్ద ఏసిఎఫ్ క్యాంపు
నల్లగొండ జిల్లా
మర్రిగూడ: మండల టీబి, లెప్రసీ నోడల్ సూపర్వైజర్ ప్రేమ కుమార్  ఆధ్వర్యంలో మంగళవారం దామెర భీమనపల్లి గ్రామపంచాయతీ వద్ద ఏసిఎఫ్ క్యాంపు నిర్వహించారు.

రెండు వారములకు పైబడి దగ్గు ,ఆకలి లేకపోవడం, బరువు మరియు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, చాతిలో నొప్పి, రక్తంతో కూడిన తేమడ, రాత్రి చెమటలు రావటం, జ్వరం రావడం క్షయ వ్యాధి లక్షణాలు, దగ్గినప్పుడు మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా గాలి ద్వారా ఇతరులకు వ్యాపించి క్షయవ్యాధిని వ్యాప్తి చేస్తాయి. కనుక ప్రాథమిక దశలోనే తెమడ పరీక్ష మరియు ఎక్స్రే ద్వారా ఈ వ్యాధిని గుర్తించి లక్షణాలు ఉన్నవారికి పీహెచ్సీ ద్వారా ఉచిత మందులు ఇవ్వబడతాయి. అనుమానితుల నుంచి తెమడ శాంపిల్స్ తీసుకొని ఆసుపత్రికి పంపడం జరిగినదని ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ క్యాంపులో బిపి మరియు షుగర్ పరీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి, సిహెచ్ఓ, హెచ్ వి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST
నల్లగొండలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ కాంగ్రెస్ లో చేరిక
నల్లగొండ మున్సిపాలిటీకి చెందిన బిఆర్ఎస్ పార్టీ పలువురు కౌన్సిలర్లు ఈరోజు హైదరాబాదులోని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సిలర్ లకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
బిఆర్ఎస్ పార్టీకి మరోషాక్ తగిలింది.. హస్తం గూటికి చేరేందుకు రెడీ అయిన రాథోడ్ బాపురావు !
TS: రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు బీఆర్ఎస్‌ పార్టీ కి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. కారు దిగి హస్తం గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కు నిరాశే ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా బాపూరావు స్థానంలో అనిల్‌ జాదవ్‌ కు టికెట్ కేటాయించారు. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీపై బాపూరావు అసంతృప్తిగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగగా.. ఇవాళ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ పై ఆయనతో చర్చించారు.

ఈనెల ములుగు జిల్లా రామాజపురంలో జరగనున్న కాంగ్రెస్ భారీ బహిరంగసభలో ఢిల్లీ నేతల సమక్షంలో పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు సార్లు నియోజవర్గంలో గెలిచినా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా.. తనకు టికెట్ ఇవ్వకుండా ఇతరులకు కేటాయించడంపై బాపూరావు తీవ్ర సంతృప్తికి లోనయ్యారు. బుజ్జగింపు కోసం వేచి చూసిన ప్రయోజనం లేకపోవడంతో పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం. మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సైతం ఇదే ముహూర్తంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

SB NEWS TELANGANA
మర్రిగూడ: రైతు సంఘం మండల కమిటీ సమావేశం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ నాంపల్లి, మండలాల తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సమావేశం సోమవారం, సిపిఎం పార్టీ కార్యాలయంలో కొట్టం యాదయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ బండ శ్రీశైలం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన రుణమాఫీ 100 కు 40 శాతం మందికి రుణమాఫీ రాకుండా పోయింది. రైతుబంధు పెండింగ్లో ఉన్నవారికి ఇవ్వలేదు. పెండింగ్లో ఉన్న రైతుబంధు రైతు ఖాతాలో జమ చేయాలని, రుణమాఫీ రైతు ఖాతాలో జమచేయాలేని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, కనీసం ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి, రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బందు, సంక్షేమ పథకాలు.. నిరుపేదలను గుర్తించి గ్రామసభల ద్వారా ఎంపిక చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ దీనికి భిన్నంగా సంపన్నులకు టిఆర్ఎస్ కార్యకర్తలకు ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు.

రేపు జరగబోయే ఎన్నికల్లో అధికార పార్టీ వారిని ప్రజాప్రతినిధులను గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి బాష్పాక ముత్తి లింగం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి, ఏర్పుల యాదయ్య, ఉప్పునూతల వెంకటయ్య, నీలకంఠం రాములు, చెల్లం ముత్యాలు, గిరి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.