నిజందాగదుక్షణంఆగదు

Oct 15 2023, 09:51

సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని పోలీసుల కారునే ఆపిన వ్యక్తి..

సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని పోలీసుల కారునే ఆపిన వ్యక్తి.. రూల్స్‌ సామాన్యులకేనా అంటూ నిలదీత, వీడియో వైరల్


కారు ఫ్రంట్‌ సీట్‌లో కూర్చుని సీటు బెల్ట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను గుర్తించి నిలదీశాడు ఓ సాధారణ వ్యక్తి. రూల్స్‌ సాధారణ ప్రజలకేనా పోలీసులకు వర్తించవా అంటూ ప్రశ్నించారు. నడిరోడ్డుపై ఓ యువకుడు పోలీసులను ప్రశ్నించిన తీరు చూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


కారు డ్రైవ్‌ చేసేటప్పుడు డ్రైవర్‌తో పాటు ఫ్రంట్‌ సీట్లో కూర్చున్న వారు సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడం తప్పనిసరి. లేదంటే జరిమానా తప్పదు. కొందరు సీట్‌ బెల్ట్‌ లేకుండా ప్రయాణిస్తూ.. మధ్యలో వాహన తనిఖీలు ఎదురైనప్పుడు సీట్ బెల్ట్‌ పెట్టుకుంటారు. మెట్రో పాలిటన్‌ నగరాల్లో సీట్ బెల్ట్‌(Police Without Seatbelt) పెట్టుకోకుండా ప్రయాణించేవారికి ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధిస్తారు.

సీట్ బెల్ట్‌ పెట్టుకోకపోవడం కారణంగా ప్రమాదాల్లో చాలా మంది మృత్యువాత పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అందుకే ఆయా ప్రభుత్వాలు సీట్‌ బెల్ట్‌ను సేఫ్టీ ఫీచర్‌గా తప్పనిసరి చేశాయి. చాలా మంది దీనిని ఉల్లంఘిస్తూ జరిమానాలు ఎదుర్కోవడమే కాకుండా యాక్సిడెంట్స్‌లో బలి అవుతున్నారు. అయితే ఈ నిబంధన కేవలం సాధారణ వ్యక్తులకేనా అంటే కాదు.. అందరికీ వర్తిస్తుంది.

ఈ నేపథ్యంలో పోలీసులు సీట్‌ బెల్ట్‌(Police Without Seatbelt Viral Video) పెట్టుకోకపోవడంతో యువకుడు కారును ఆపి వారిని నిలదీసిన సంఘటన కేరళలో చోటుచేసుకుంది. కన్నూర్‌లో పోలీసులు సీట్‌ బెల్టులు పెట్టుకోకుండా కారులో పెట్రోలింగ్‌కు వచ్చారు. అయితే ఇది గమనించిన అక్కడే ఉన్న ఓ యువకుడు వారు పోలీసులు అని కూడా చూడకుండా వారి కారును ఆపాడు.

Man-Stopped-Police-Vehicle-For-Not-Wearing-Helmet

చట్టం సామాన్య ప్రజల కోసమేనా.? పోలీసులకు వర్తించదా అంటూ కారులో ఫ్రంట్‌ సీట్లో కూర్చున్న సీనియర్ పోలీసు అధికారిని ప్రశ్నించాడు.

అయితే ఈ సంభాషణ అంతా మళయాళంలో జరుగుతుంది. యువకుడు నిలదీయడంతో కోపం వచ్చిన పోలీసు అధికారి కారులో నుంచి దిగి అతడితో వాగ్వాదానికి దిగారు. అయినప్పుడు ఆ వ్యక్తి వెనక్కి తగ్గలేదు. ఆ కాసేపటికి కారులో వెనుక కూర్చున్న పోలీసులు సైతం కిందికి దిగి అతడితో గొడవకు దిగారు.

డ్యూటీలో ఉన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించావంటూ యువకుడిని పోలీసులు తిట్టిపోస్తున్నారు. వెంటనే కారులో నుంచి పేపర్‌, పెన్‌ తీసుకుని యువకుడికి వ్యతిరేకంగా కంప్లెయింట్‌ రాస్తూ సంతకం చేయమని ఆ వ్యక్తిని బలవంతం చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే ఈ గొడవ మొత్తాన్ని అక్కడే ఉన్న సాధారణ ప్రజలు గమనిస్తున్నారు.

యువకుడిని ఒక్కడిని చేసి పోలీసులు గొడవకు దిగుతున్నారని భావించిన స్థానికులు.. యువకుడికి మద్దతుగా నిలిచారు. సంఘటనను తమ ఫోన్లలో రికార్డు చేశారు. ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ పోలీసులతో గొడవకు దిగారు. గొడవ పెద్దది అవుతుండటంతో లాభం లేదనుకున్నారేమే.. కాసేపటికి అక్కడి నుంచి తమ వాహనంలో వెళ్లిపోయారు.

గతేడాది టాటా సన్స్ గ్రూప్ మాజీ ఛైర్మన్ కారు ప్రమాదంలో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి ప్రమాదాల కారణంగానే కారు వెనుక సీట్లలో కూర్చున్న వారికి కూడా సీట్ బెల్ట్ ధరించడం ఆవశ్యకతపై ఆటో మేకర్లు దృష్టి సారిస్తున్నారు. పోలీసులు కూడా సీటు బెల్టు పెట్టుకోని వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 17:01

బీఆర్ఎస్ పార్టీలోకి పొన్నాల లక్ష్మయ్య...!
*

*

నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 16:02

ఆడపడుచులతో కలిసి బతుకమ్మలను పేర్చి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి

ప్రకృతిని ఆరాధించే పండుగ ‘బతుకమ్మ’

ఆడపిల్లలను ‘బతుకు అమ్మా’అని మనసారా ఆశీర్వదించే పండుగ ఈ బతుకమ్మ పండుగ

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతిభింభం

ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించే ఏకైక జాతి తెలంగాణ

తెలంగాణ సంస్కృతి ని విశ్వవ్యాప్తం చేసింది బతుకమ్మ పండుగ

 మధ్య లో నిరాదరణకు గురైన బతుకమ్మ పండుగ ను ఇంటికి ఇంటికి చేర్చిన ఘనత తెలంగాణ ఉద్యమానిదే 

ఆడ పడుచులకు అందరికీ బతుకమ్మ పండుగ శభాకాంక్షలు 

➖➖➖➖➖➖➖➖➖➖

సూర్యాపేట లో మంత్రి జగదీష్ రెడ్డి నివాసం లో బతుకమ్మ సంబరాలు

 ఆడపడుచులతో కలిసి బతుకమ్మలను పేర్చిన మంత్రి జగదీష్ రెడ్డి

బతుకమ్మ పాటలతో మహిళల సంబరాలు

➖➖➖➖➖➖➖➖➖➖

ఆడపిల్లలను ‘బతుకు అమ్మా’అని మనసారా ఆశీర్వదించే పండుగ బతుకమ్మ పండుగ అని సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.సూర్యాపేట లోని విద్యానగర్ మంత్రి నివాసంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ను పేర్చి ఆశ్చర్యపరిచారు. తీరొక్క పూలతో ఆడపడుచులు బతుకమ్మను పేర్చారు. ఈ వేడుకల్లో మంత్రి సతీమణి సునీత మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ , పలువురు మహిళలు పాల్గొన్నారు. సునీత జగదీష్ రెడ్డి బతుకమ్మ పాటలు పాడుతూ అందరిని ఉత్తేజపరిచారు. బతుకమ్మ పాటలతో మంత్రి నివాసం మర్మోగిపోయింది. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ 

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతిబింభం అన్నారు.మహిళలకు ప్రతిబింభం అయిన పూలను ఆరాధించమంటే వారిని గౌరవించడమే అన్నారు.ప్రపంచంలో అనేక జాతులు ఉన్నా, ప్రకృతిని ఆరాధించే ఏకైక జాతి తెలంగాణ జాతి అన్నారు. ప్రకృతిని ఆరాధించే ఈ బతుకమ్మ పండుగ సంస్కృతి తెలంగాణ పేరును విశ్వవ్యాప్తం చేసింది అన్నారు.మధ్య లో కొంత నిరాదారణకు గురైన బతుకమ్మ పండుగ ను ఇంటికి ఇంటికి చేర్చిన ఘనత తెలంగాణ ఉద్యమానిదే అన్నారు. రాష్ట్ర సాధనలో ప్రజలను ఏకం చేయడంలో  బతుకమ్మ పండుగ ప్రముఖ పాత్ర వహించింది అన్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే వేడుకలు సూర్యాపేటలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. రాష్ట్రంలో వైభవంగా జరిగే బతుకమ్మ వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో సూర్యాపేట కూడా ఉంటుందన్నారు. సద్దుల చెరువు ట్యాంకుబండ వద్ద నిర్వహించే వేడుకల్లో వేలాది మంది ఆడపడుచులు పాల్గొంటారని తెలిపారు.ఆడపడుచులు అంతా ఒకచోట చేరి సాంప్రదాయం ఉట్టిపడేలా, ఊరంతా ఒకటై తమలో బీదా గొప్పా వర్ణం ,వర్గం అంతా ఒకటే అంటూ జరుపుకునే సాంస్కృతిక పండుగ బతుకమ్మ పండుగ అన్నారు.బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారని అన్నారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయన్నారు. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉందన్నారు.అందుకే బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ, బతుకమ్మ అంటే పూల పండుగ, బతుకమ్మ అంటే మనిషి ప్రకృతితో మమేకం అయ్యే అత్యంత అరుదైన అద్భుతమైన పండుగ బతుకమ్మ పండుగ అన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ మంత్రి జగదీష్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్ష లు తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 11:06

నేడు అరుదైన సూర్య గ్రహణం: పాటించాల్సిన జాగ్రత్తలు

నేడు అరుదైన సూర్య గ్రహణం: పాటించాల్సిన జాగ్రత్తలు


వాషింగ్టన్: నేడు సూర్యగ్రహణం (Solar eclipse) ఏర్పడబోతోంది. ఇది పాక్షికం. అత్యంత అరుదైన గ్రహణం ఇది. మహాలయ పితృపక్ష అమావాస్యతో కలిసి రావడం దీని ప్రత్యేకత. ఇదివరకు ఇలాంటి సందర్భం ఎప్పుడూ రాలేదు. అదే సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్ (Ring of fire) కనువిందు చేయనుంది.


ఈ సూర్య గ్రహణం భారత్‌లో కనిపించదు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఆయా దేశాల ప్రజలు మాత్రమే పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. అమెరికా, కెనడా, నికరాగ్వా, బ్రెజిల్, కొలంబియా, కోస్టారికా, అర్జెంటీనా, హోండురస్, పనామా దేశాల ప్రజలు ఈ సూర్య గ్రహణాన్ని చూడగలరు.


ఈ సూర్యగ్రహణాన్ని అమెరికన్లందరూ తిలకించే అవకాశం లేదు. నార్త్ కాలిఫోర్నియా, నార్త్ ఈస్ట్ నెవడా, సెంట్రల్ ఉటా, నార్త్ ఈస్ట్ అరిజోనా, సౌత్ వెస్ట్ కొలరాడో, సెంట్రల్ న్యూ మెక్సికో, సదరన్ టెక్సాస్ ప్రజలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌ను ఎంజాయ్ చేయగలరు. ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది.

భారత కాలమానం ప్రకారం- ఈ రాత్రి 9 గంటలకు సూర్యగ్రహణ కాలం ఆరంభమౌతుంది. అర్ధరాత్రి దాటిన తరువాత అంటే మరుసటి రోజు తెల్లవారు జామున 1:45 నిమిషాలకు గరిష్ఠస్థాయికి చేరుకుంటుంది. 1:06 నుంచి 2:23 నిమిషాల వరకు సూర్యుడు పాక్షికంగా చీకట్లో ఉంటాడు.



సూర్యుడు- చంద్రుడు- భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంటుంది. సూర్యుడు-భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనిపించడు. ఈ సారి ఏర్పడే రింగ్ ఆఫ్ ఫైర్ 5:17 సెకెండ్ల పాటు కనువిందు చేస్తుంది.

సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకూడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నేరుగా సూర్యుడిని చూడటం వల్ల కంటిచూపుపై ప్రభావం పడుతుంది. సూర్యుడిని చూడటానికి సరైన ఫిల్టర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికోసం బ్లాక్ కలర్ ఫిల్మ్స్ వాడొచ్చు. ఈ సూర్యగ్రహణాన్ని నాసా లైవ్‌లో చిత్రీకరించనుంది. తన అధికారిక వెబ్ సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.


నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 10:50

IND vs PAK: గిల్ ఈజ్ బ్యాక్.. ఆ ఇద్దరు ఔట్.. జట్టులోకి నిప్పులు చెరిగే బౌలర్.. పాక్ తో భారత తుదిజట్టు ఇదే!

IND vs PAK: గిల్ ఈజ్ బ్యాక్.. ఆ ఇద్దరు ఔట్.. జట్టులోకి నిప్పులు చెరిగే బౌలర్.. పాక్ తో భారత తుదిజట్టు ఇదే!

IND vs PAK: ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలో ఈ రెండు జ‌ట్లూ త‌ల‌ప‌డితే అభిమానుల‌కు కన్నుల పండ‌గే. టీవీల‌కు అతుక్కుపోతారు. ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న ఈ హై ఓల్టేజ్ పోరుకు కౌంట్ డౌన్ షురూ అయింది.





  • Follow us on

1/ 9

క్రికెట్‌లో భార‌త్‌-పాకిస్తాన్ (IND vs PAK) జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆస‌క్తిక‌ర‌మే. ఉత్కంఠ‌త‌కు గురి చేసేదే. వార్ వ‌న్ సైడ్ అయిన‌ట్టు మ్యాచ్ మొత్తాన్నీ భార‌త్ త‌న వైపు లాగేసుకున్నా స‌రే! చివ‌రి నిమిషం వ‌ర‌కూ మ్యాచ్ మొత్తాన్నీ త‌నివి తీరా చూస్తారు భార‌త అభిమానులు. చివ‌రి బంతి వ‌ర‌కు ఆట‌ను ఆస్వాదిస్తారు.

ఇక ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలో ఈ రెండు జ‌ట్లూ త‌ల‌ప‌డితే అభిమానుల‌కు కన్నుల పండ‌గే. టీవీల‌కు అతుక్కుపోతారు. ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న ఈ హై ఓల్టేజ్ పోరుకు కౌంట్ డౌన్ షురూ అయింది. అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు అహ్మదాబాద్ గడ్డపై అడుగుపెట్టాయి.



మరోవైపు.. డెంగ్యూ కారణంగా శుభ్‌మన్ గిల్ రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే అహ్మదాబాద్ చేరుకుని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. దీంతో.. ఈ యంగ్ ప్లేయర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్లేయింగ్ ఎలెవన్ లో మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది.


దీంతో.. టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు చోటు చేసుకునున్నాయి. దీంతో.. టీమిండియా తుది జట్టు అంచనాపై ఓ లుక్కేద్దాం.

ఓపెనర్లుగా రోహిత్ తో పాటు ఇషాన్ కిషన్ లేదా గిల్ ఇద్దరిలో ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉంది. శనివారం ప్రాక్టీస్ సెషన్ అనంతరం గిల్ ఫిట్నెస్ ఓ అంచనాకు రానున్నారు. గిల్ జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్ బెంచ్ కే పరిమితం కానున్నాడు.


విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ ఆడనుండగా.. ఐదో స్థానంలో రాహుల్ బరిలోకి నిలవనున్నాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఫినిషర్ రోల్ ప్లే చేయనున్నాడు.


అయితే.. బౌలింగ్ లైనప్ లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కన్పిస్తుంది. పిచ్ కండిషన్స్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. అప్పుడు శార్దూల్ ఠాకూర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వస్తాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే మాత్రం అశ్విన్ బెంచ్‌కే పరిమితమవుతాడు.


అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన మహమ్మద్ సిరాజ్‌ను కూడా పక్కనపెట్టే అవకాశం ఉంది. సిరాజ్ స్థానంలో అనుభవం కలిగిన మహమ్మద్ షమీని ఆడించే అవకాశాలున్నాయి. లేకపోతే సిరాజ్ ను కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అయితే.. ఐపీఎల్ లో షమీ గుజరాత్ తరఫున ఆడేవాడు. దీంతో.. అహ్మదాబాద్ కండీషన్లపై షమీకి పట్టుంది. దీంతో.. షమీని జట్టులోకి తీసుకోవాలని టీమిండియా భావిస్తుంది.


భారత్ తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్/ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/శార్దూల్ ఠాకూర్/షమీ, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్/మహమ్మద్ షమీ

నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 10:38

మొన్న ఉల్లిగడ్డ,నిన్న టమాటా..ఇప్పుడు వెల్లుల్లి..డబుల్ సెంచరీ దాటిన కిలో ధర

Garlic Price: మొన్న ఉల్లిగడ్డ,నిన్న టమాటా..ఇప్పుడు వెల్లుల్లి..డబుల్ సెంచరీ దాటిన కిలో ధర

Garlic Price: నిత్యవసర సరుకులకు రెక్కలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కూరల్లో వాడే కూరగాయలు, మసాలా దినుసులుగా ఉపయోగించే కిచెన్ పదార్ధాల ధరలు భగ్గుమంటున్నాయి. మొదట్లో టమాటా ధరలు అటుపై ఉల్లిగడ్డ ధరలు కిలో 200రూపాయలు పలికాయి. ఇప్పుడు వెల్లుల్లి వంతు వచ్చింది.


1/ 9

నిత్యవసర సరుకులకు రెక్కలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కూరల్లో వాడే కూరగాయలు, మసాలా దినుసులుగా ఉపయోగించే కిచెన్ పదార్ధాల ధరలు భగ్గుమంటున్నాయి. మొదట్లో టమాటా ధరలు అటుపై ఉల్లిగడ్డ ధరలు కిలో 200రూపాయలు పలికాయి. (Photo:pexels)

2/ 9

ఇప్పుడు వెల్లుల్లి వంతు వచ్చింది. పౌష్టికారంలో నిత్యం వాడే మసాలా దినుసుల్లో ప్రధానమైనది వెల్లుల్లి. అందుకే ప్రతీ వంటింట్లో కనిపించే ఈ వెల్లుల్లి ఇప్పుడు మార్కెట్‌లో, కూరగాయల షాపుల్లో కనిపించకుండాపోతోంది. (Photo:pexels)

3/ 9

కొద్దిరోజుల క్రితం వరకు కిలో 100రూపాయల నుంచి 140-160 రూపాయల వరకు మార్కెట్‌లో దొరికేవి. కాని ఇప్పుడు వెల్లుల్లి ధర డబుల్ సెంచరీ దాటేసింది. అందుకే మార్కెట్‌లో వెల్లుల్లి కొనేందుకు వినియోగదారులు వెనుక ముందు ఆలోచిస్తున్నారు. (Photo:pexels)

4/ 9

గతంలో దేశ వ్యాప్తంగా వెల్లుల్లి సాగు, సప్లై బాగా ఉండేది. కాని ప్రస్తుతం మార్కెట్‌లోకి వెల్లుల్లి సప్లై తగ్గడం కారణంగానే ధర అమాంతం పెరిగిందని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశ ఆర్దిక రాజధాని ముంబైలో కిలో రూ.160 పలుకుతోంది. (Photo:pexels)

5/ 9

హోల్ సేల్ మార్కెట్లోనే కిలో రూ. 160 కి చేరింది వెల్లుల్లి. దీంతో రిటైల్ మార్కెట్లో కిలో రూ.280 దాకా పెరిగింది. మార్కెట్ లోకి సప్లై తగ్గడం వల్లే వెల్లుల్లి ధరలు పెరుగుతున్నాయని, నెల రోజుల్లో ధరలు మళ్లీ సాధారణ స్థాయికి వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.(Photo:pexels)

6/ 9

ముంబై నగరంలోనే కాదు ..హైదరాబాద్‌లో కూడా కిలో వెల్లుల్లి ధర గత వారం రోజుల క్రితం 100-120 రూపాయలు ఉండగా ఇప్పుడు 200-220రూపాయలకు విక్రయిస్తున్నారు. (Photo:pexels)

7/ 9

అటు నవీ ముంబైలోని మార్కెట్ కు నిత్యం 24 నుంచి 30 వాహనాలలో వచ్చే వెల్లుల్లి స్టాకు ప్రస్తుతం తగ్గిపోయిందని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) వెల్లడించింది. ఇప్పుడు రోజూ 15 ట్రక్కులకు మించి రావడంలేదని చెబుతున్నారు. (Photo:pexels)

8/ 9

సప్లై దాదాపు 40 శాతం పడిపోవడం వల్లే ఇంత డిమాండ్ ఏర్పడింది. మార్కెట్లో వెల్లుల్లి ధర ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. మే నెల మొదట్లో కిలో వెల్లుల్లి ధర రూ.30 నుంచి రూ.60 వరకు ఉండేది. ఇప్పుడు అప్పటి ధరకు ఏడు రెట్లు పెరిగింది. (Photo:pexels)

9/ 9

ఇదే పరిస్థితి కొనసాగితే వెల్లుల్లి ధర కిలో మే నెల ధర కంటే పది రెట్లు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నాయి మార్గెట్ వర్గాలు. స్పైసీ కోసం వంటలో తప్పక వాడే వెల్లుల్లి..ఈవిధంగా రేటు పెరగడంతో వినియోగదారులు కళ్లు తేలేస్తున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 10:23

IND vs PAK: ఒక స్థానం.. రేసులో ముగ్గురు ఆటగాళ్లు.. హై ఓల్టేజ్ పోరులో రోహిత్ ఎవరికి ఓటు వేస్తాడు..?

IND vs PAK: ఒక స్థానం.. రేసులో ముగ్గురు ఆటగాళ్లు.. హై ఓల్టేజ్ పోరులో రోహిత్ ఎవరికి ఓటు వేస్తాడు..?

IND vs PAK: టీమిండియా అతి పెద్ద మ్యాచుకు రెడీ అయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం.. అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ బ్లాక్ బస్టర్ పోరు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా గేమ్ ప్లాన్ సిద్దం చేసుకుంటుంది.





  • Follow us on



వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023) లో భారత క్రికెట్ జట్టు దుమ్మురేపుతుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఐసీసీ మెగా టోర్నమెంట్‌లో టీమిండియా సత్తా చాటుతుంది. రోహిత్ శర్మ అండ్ కంపెనీకి చెందిన కారవాన్ ఇప్పుడు చెన్నై, ఢిల్లీ మీదుగా అహ్మదాబాద్ చేరుకుంది. అక్కడ బ్లాక్ బస్టర్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ శనివారం (అక్టోబర్ 14) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.


పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ ,ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ లకు ఓ తలనొప్పి మొదలైంది. ఒక స్థానం కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. మరి.. ప్లేయింగ్ ఎలెవన్ లో రోహిత్ ఎవరికి అవకాశం ఇస్తాడు..? ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు..? ఇక్కడ తెలుసుకుందాం.

టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి 2023 వన్డే ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌.అశ్విన్‌కు టీమిండియాలో చోటు దక్కగా.. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. మహ్మద్ షమీ పాకిస్థాన్‌తో (IND vs PAK) జరిగే హై ఓల్టేజ్ మ్యాచులో జట్టులో చోటు సంపాదించవచ్చు. (AP)


పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత పేస్ అటాక్‌లో మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించగలడు. షమీకి పాకిస్థాన్‌తో చాలా వన్డేలు ఆడే అవకాశాలు రాలేదు. అతను ఇప్పటివరకు పాకిస్తాన్‌తో 3 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మూడు మ్యాచుల్లో అతను 5 వికెట్లు తీసుకున్నాడు.


పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో మహమ్మద్ షమీ 28 ఓవర్లు బౌలింగ్ చేసి 107 పరుగులు ఇచ్చాడు. పాకిస్థాన్‌పై షమీ 35 పరుగులకు 4 వికెట్లు పడగొట్టడం అత్యుత్తమ బౌలింగ్ స్పెల్.


అహ్మదాబాద్‌లోని బ్యాటింగ్ పిచ్‌లో ఏదైనా మార్పు ఉంటే.. అప్పుడు రోహిత్ శర్మ నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పెద్ద బౌండరీని పరిగణనలోకి తీసుకుని రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి బరిలోకి దిగవచ్చు.

ఆహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామం. ఇక్కడ పరుగుల వరద పారుతుంది. అయితే ఈ వికెట్ గతంలో స్పిన్నర్లకు కూడా సహాయపడింది. అశ్విన్‌కు బ్యాటింగ్ చేయగల సత్తా కూడా ఉంది. అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని.. అశ్విన్ కి ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ఇవ్వచ్చు.


అహ్మదాబాద్ పిచ్‌పై పరుగులు చేసే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. భారత జట్టు శార్దూల్ ఠాకూర్‌ కూడా అవకాశం ఇవ్వచ్చు. అయితే ఆఫ్ఘనిస్తాన్‌పై భారత టాప్ ఆర్డర్ బ్యాట్‌తో సందడి చేసిన తీరు చూస్తుంటే.. టీమిండియాకు 8వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్, ద్రవిడ్ నిఖార్సైన బౌలర్ కు ఓటు వేయవచ్చు


టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కూడా పాకిస్థాన్‌పై భారత జట్టు శార్దూల్ ఠాకూర్‌కు బదులుగా మహ్మద్ షమీని ప్లేయింగ్ ఎలెవన్‌లోని తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.


ఈ మెగాటోర్నీలో పాకిస్థాన్‌పై విజయం సాధించడం ద్వారా వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు హ్యాట్రిక్ విజయాలను పూర్తి చేస్తుంది. వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు 7 సార్లు తలపడగా, ఏడింటిలోనూ భారత జట్టు విజయం సాధించింది.

నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 10:07

బిజెపి కార్యకర్తలను గులాబీ కండువాతో బి.ఆర్.ఎస్ పార్టీలోకి స్వాగతం పలికిన మంత్రి జగదీష్ రెడ్డి

అందరిచూపు బీఆర్‌ఎస్‌ వైపే..

బీఆర్‌ఎస్‌లో చేరుతున్న కాంగ్రెస్ ,బీజేపీ నేతలు

సూర్యాపేట రూరల్ మండలం బాలెంల బిజేపి గ్రామ శాఖ అద్యక్షుడు, ఆత్మకూరు మండలం మక్త కొత్తగూడెం కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు చేరిక

గులాబీ కండువాతో స్వాగతం పలికిన మంత్రి జగదీష్ రెడ్డి

 సూర్యాపేట 

 సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధితో అందరిచూపు బీఆర్‌ఎస్‌ వైపే మళ్లుతుంది.

తాజాగా సూర్యాపేట రూరల్ మండలం బాలెంల బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు తంతేలపల్లి నాగరాజు తో సహా 20 మంది బిజెపి కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఆత్మకూరు మండలం ముక్తా కొత్తగూడెం చెందిన కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలుకోట రవి, ఇప్పటి మహేష్, కోట భీమయ్య, తిప్పర్తి శ్యాంబాబు, ప్రవీణ్ నేనెవరు, వేణు, బిక్షం 

 పార్టీలను వీడి కారెక్కారు. వీళ్ళందరికీ గులాబీ కండువాతో స్వాగతం పలికిన మంత్రి మాట్లాడుతూ,

తొమ్మిదేండ్లలోనే ఊహించని అభివృద్ధి చేశామని, ప్రజలు మరోసారి ఆశీర్వదించి మరింత అభివృద్ధికి సహకరించాలని కోరారు.

కొందరు స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మితే మళ్లీ అభివృద్ధి వెనక్కి వెళ్లిపోతుందన్నారు. నియోజవర్గంలో గత పాలనలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై ఎవరికి వారే సమీక్ష చేసుకోవాలని కోరారు. పార్టీలకతీతంగా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ లో చేరుతుండడం శుభ పరిణామం,అభినందనీయమన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 10:00

హమాస్ దాడులు ఉగ్ర చర్యే: పాలస్తీనా స్వతంత్రపై భారత్ కీలక ప్రకటన

హమాస్ దాడులు ఉగ్ర చర్యే: పాలస్తీనా స్వతంత్రపై భారత్ కీలక ప్రకటన


న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తల నేపథ్యంలో భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. పాలస్తీనా(Palestine) స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందడాన్ని భారత్ సమర్థిస్తుందని తెలిపింది. అయితే, ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఉగ్రచర్యగా భావిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి భారత్ విధానాన్ని తెలియజేశారు.


'ఇజ్రాయెల్-పాలస్తీనా విషయంలో భారత్ వైఖరి చాలా కాలంగా స్థిరంగా ఉంది. ఇజ్రాయెల్‌తో శాంతియుత చర్చలు జరిపి.. గుర్తింపు పొందిన సరిహద్దుల్లో నివసిస్తూ.. సార్వభౌమాధికారం, పూర్తి స్వతంత్రతో వ్యవహరించే పాలస్తీనా ఏర్పాటును భారత్ ఎప్పుడూ సమర్థిస్తుంది. ఇందుకోసం పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు నేరుగా సంప్రదింపులు జరపాలని భారత్ ఆశిస్తోంది' అని బాగ్చి పేర్కొన్నారు.


భారతదేశం-ఇజ్రాయెల్ సంబంధం గత దశాబ్దంలో లేదా బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం చట్రంలో వికసించింది. ప్రధాని మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక, భారతదేశం అత్యంత విశ్వసనీయమైన రక్షణ, భద్రతా భాగస్వాములలో ఇజ్రాయెల్ ఒకటి.ఇజ్రాయెల్ (Israel), గాజా (Gaza)లో ఇరువర్గాలు అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటించాలన్నారు. ఇదే సమయంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌కు భారత్.. ఆయుధపరంగా సాయం అందిస్తోందా? అని మీడియా ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. కాగా, ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్‌ను ప్రకటించింది.



కాగా, ఇజ్రాయెల్‌పై గత కొద్ది రోజుల క్రితం ఒక్కసారిగా దాడి చేసి అనేక మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ ఉగ్రవాదులు బలి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్ ఇప్పుడు హమాస్ ఉగ్రవాదుల వేట కొనసాగిస్తోంది. హమాస్ పై భీకర దాడులకు దిగుతోంది. హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడులతో ఇరువైపులా వేలాది మంది మరణించారు. అనేక మంది గాయాలపాలయ్యారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 09:45

ఇజ్రాయిల్ మీద హమాస్ దాడి కి సంవత్సరం క్రితమే పథక రచన జరిగింది!

ఇజ్రాయిల్ మీద హమాస్ దాడి కి సంవత్సరం క్రితమే పథక రచన జరిగింది!

సూత్రధారులు రష్యా, ఇరాన్, టర్కీ!

రష్యా, ఇరాన్,టర్కీ దేశాలలో హమాస్ తీవ్రవాదులకు కమెండో ఆపరేషన్ లో శిక్షణ ఇచ్చాయి మూడు దేశాలు!

మొత్తం 1000 మంది హమాస్ ఉగ్రవాదులు కమాండో ట్రైనింగ్ తీసుకున్నారు!

కమాండో ట్రైనింగ్ కోసం 20 నుండి 25 ఏళ్ల యువకులని ఎంపిక చేశారు!

రష్యా : SPETSNAZ ఇది రష్యన్ స్పెషల్ ఫోర్స్ పేరు.

కౌంటర్ ఇన్సర్జన్సీ, పవర్ ప్రొజెక్షన్ మిషన్స్ ని నిర్వహిస్తుంది! రష్యన్ లైట్ ఇంఫాన్ట్రీ ఫోర్సెస్( Light Infantry Forces) డివిజన్ లో భాగంగా ఉంటుంది ఈ Spetsnaz. యుద్ధం జరుగుతున్నప్పుడు లైట్ ఇన్ ఫాన్ట్రీ ముందు వెళుతుంటే దాని వెనుకగా Spetsnaz కమండోలు ఉంటారు. ఒక వేళ శత్రు సైన్యపు బంకర్లు నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నపుడు Spetsnaz కమాండో లకి మిషన్ అప్పచెప్తారు. Spetsnaz కమాండోలు ముందుకి వెళ్లి ఒక్కసారిగా బంకర్లు మీద దాడి చేసి అందులో ఉన్న వాళ్ళని చంపేస్తారు! 

మెరుపు వేగంగా కదులుతూ శత్రువు బంకర్ల మీద దాడి చేస్తారు. వీళ్ళు ఫెన్సింగ్ కట్టర్ల తో పాటు హాండ్ గ్రనేడ్స్, రివాల్వర్,మిలటరీ గ్రేడ్ డాగర్ ని వాడతారు. పని పూర్తవగానే తిరిగి వెనక్కి వచ్చేస్తారు. ముఖ్యంగా పక్క బంకర్ల లో ఉండేవాళ్ళకి తెలియకుండా పని కానిచ్చేస్తారు.

Spetsnaz చేత 200 మంది హమాస్ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది రష్యా!

సంవత్సరం నుండి మూడు బాచ్ లుగా విడదీసి ట్రైనింగ్ ఇచ్చింది రష్యా! అయితే ఇరాన్ లో ఇదంతా జరిగింది!

Spetsnaz దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్లే దక్షిణ ఇజ్రాయెల్ లో ఉన్న IDF చెక్ పోస్ట్ ల మీద దాడి చేసి సరిహద్దు పట్టణాలలోకి ప్రవేశించారు.

ఇరాన్: సముద్రంపై,సముద్రం నీటి అడుగున ఎలా వేగంగా, నిశ్శబ్దంగా ప్రయాణించాలో శిక్షణ ఇచ్చింది.

చిన్న చిన్న స్పీడ్ బొట్లతో శత్రువు మీద దాడి చేసే సామర్ధ్యం ఇరాన్ కి ఉంది.

గత దశాబ్ద కాలంగా అమెరికా విమాన వాహక నౌకలని చిన్న స్పీడ్ బొట్లలో RDX ని నింపి ఎలా ధ్వంసం చేయవచ్చో అనే ప్రయోగాల కోసం నమూనా విమాన వాహక నౌకల మీద దాడి చేసి వాటి ఫలితాలని విశ్లేషిస్తూ వస్తున్నది.

అలాగే స్కూబా డైవింగ్ సూట్లని ధరించి సముద్రం లోపల 3 నాటికల్ మైళ్ళు ఎలా ఈదాలో హమాస్ కి శిక్షణ ఇచ్చింది!

100 మంది హమాస్ ఉగ్రవాదులకి AK47 లని మోసుకుంటూ ఈద గలిగేలా శిక్షణ ఇచ్చింది!

చిన్న చిన్న బొట్లలో మధ్యధరా సముద్రంలోకి వచ్చి ఇజ్రాయెల్ తీరానికి 3 నాటికల్ మైళ్ళ దూరంలోనే సముద్రంలో ఈదుకుంటూ తీర ప్రాంతానికి చేరుకొని దాడి చేశారు!

టర్కీ: పారా గ్లైడింగ్ కి టర్కీ ప్రసిద్ధి!

100 మంది హమాస్ ఉగ్రవాదులు టూరిస్ట్ వీసా తో టర్కీ కి వచ్చి పారా గ్లైడింగ్ లో శిక్షణ పొందారు.

అఫ్కోర్స్ ప్రెసిషన్ & కంట్రోల్డ్ గ్లైడింగ్ లో శిక్షణ ఇచ్చింది టర్కీ!

ఈ శిక్షణ తక్కువ దూరంలో గాలిలోకి ఎగిరి కంట్రోల్ గా దిగవలసిన చోట 100 మీటర్లు అటూ ఇటుగా ఎలా గ్లైడ్ చేయాలో శిక్షణ ఇచ్చింది. టర్కీ సైన్యంలో ప్రత్యేక విభాగం ఉంది గ్లైడింగ్ కోసం!

ఇక గ్లైడర్స్ విషయానికి వస్తే కేవలం గాలి ఆధారంగా కాకుండా వెనక ప్రొపెల్లర్ తో ముందుకు నెట్టే గ్లైడర్స్ ని వాడారు హమాస్ తీవ్రవాదులు. అలాగే గాల్లో ఉండగానే కింద ఎవరన్నా IDF సైనికులు ఉంటే కింద ఉన్న టార్గెట్ ని షూట్ చేయడం కూడా ప్రాక్టీస్ చేశారు.

ట్రైనింగ్ పూర్తయ్యాక దాడి కోసం మాక్ డ్రిల్ నిర్వహించారు…అదెలాగా అంటే…

1. సముద్ర మార్గం ద్వారా ఇజ్రాయెల్ లోకి రావాలంటే ముందు ఎక్కడ దాకా బోట్లలో వచ్చి ఈదుకుంటూ వస్తే ఎంత సమయం పడుతుంది? దానికోసం ఎంత ముందుగా సిద్ధం అవ్వాలి? ఇలాంటి లెక్కలు కేవలం మిలటరీ మాత్రమే ఇవ్వగలదు.

2. లేబనాన్ నుండి గ్లైడర్స్ ద్వారా ఇజ్రెయేల్ లోకి ప్రవేశించడానికి ఎంత సమయం పడుతుంది? ఎప్పుడు బయలు దేరితే ఎప్పుడు లాండ్ అవుతారు?

3. ఇక గాజా నుండి సొరంగం ద్వారా బయటికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ భూభాగంలో ఎవరు ఎక్కడ రక్షణగా ఉండాలి ?

4. గాజా నుండి ఇజ్రాయెల్ చెక్ పోస్టుల దగ్గర ఎంతమంది IDF సైనికులు కాపలాగా ఉంటున్నారు? 

5. రాకెట్ దాడి జరిగినప్పుడు IDF తోపాటు పౌరులు ఎలా స్పందిస్తున్నారు? ఈ డేటా ని జాగ్రత్తగా సమకూర్చుకున్నారు!

6. IDF బేస్ ల దగ్గర ఉన్న సైనికులు సైరన్ మోగగానే అందరూ అండర్ గ్రౌండ్ బంకర్ లోకి వెళ్లిపోతున్నారా? లేక బేస్ పైన ఎవరన్నా కాపలాగా ఉంటున్నారా? ఈ డేటా ని కూడా సేకరించారు!

పైన పేర్కొన్న అంశాలని సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడానికి కమాండ్ సెంటర్ ఎక్కడ ఉండాలి?

కమాండ్ & కంట్రోల్ సెంటర్ ని పక్కనే ఉన్న జోర్డాన్ లో ఏర్పాటు చేశారు. జోర్డాన్ నుండి హమాస్ ముఖ్య నాయకులు శాటిలైట్ ఫోన్ ద్వారా సమన్వయం చేశారు.

దాడికి ముందు అంటే ఉదయం 6 గంటలకి ఇజ్రాయెల్ సరిహద్దు కంచె మీద ఏర్పాటు చేసిన నిఘా కెమెరా వ్యవస్థని రష్యా, ఇరాన్ కి చెందిన హ్యాకర్లు నెట్వర్క్ ని తమ ఆధీనంలోకి తీసుకొని ఆ నెట్వర్క్ లో డూప్ వీడియో ని ప్రవేశ పెట్టారు. అంటే ప్రతి కెమెరా నుండి వెళ్లే వీడియో ఒకే రకంగా అంతా బాగున్నట్లే చూపిస్తాయి.

ఇటీవలే హ్యాకింగ్ చేయడానికి వీలు లేని విధంగా సెక్యూరిటీ నెట్వర్క్ ని AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో అప్గ్రేడ్ చేసింది ఇజ్రాయెల్. ఎవరన్నా హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే కమాండ్ సెంటర్ లో సైరన్ మొగుతుంది కానీ అలా జరగలేదు అంటే ఎంత పకడ్బందీగా హ్యాక్ చేశారో రష్యన్, ఇరాన్ హ్యాకర్లు!

ఎప్పుడయితే సరిహద్దు కంచె మీద ఉన్న నిఘా వ్యవస్థని హ్యాక్ చేశారో ఆ విషయం జోర్డాన్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కి తెలపగానే దాడి మొదలు పెట్టమని జోర్డాన్ నుండి ఆదేశాలు వెళ్లాయి మూడు చోట్లకి.

సముద్రం ద్వారా దాడి చేయడానికి నియమించిన వాళ్ళని ముందు రోజు రాత్రి మధ్యధరా సముద్రంలోని అంతర్జాతీయ జలాలలో చేపలు పట్టే ట్రాలర్స్ లో వేచి ఉన్నారు.

మొదట 6.30 కి రాకెట్ దాడి మొదలుపెట్టగానే గాజా నుండి వివిధ ప్రాంతాలలో సిద్ధంగా ఉన్నవాళ్లు 10 నిముషాలలో ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం గ్రూపులుగా విడిపోయి ఫెన్సింగ్ చెక్ పాయింట్ ల మీద దాడిచేశారు. తమతో పాటు ప్రతి చెక్ పాయింట్ కి దగ్గరలో ఒకటికి రెండు బుల్డోజర్లని సిద్ధంగా ఉంచారు.

ఫార్వార్డ్ దళాలు చెక్ పాయింట్ మీద మెరుపు దాడి చేసి అక్కడ ఉన్న IDF కి చెందిన ఇద్దరు సైనికులని చంపి విజిల్ వేయగానే దూరంగా ఉన్న బుల్డోజర్ ని తీసుకొచ్చి కంచెని తొలిగించడం వెంటనే ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లోకి చొరపడడం అన్ని చోట్లా ఒకేసారి చేశారు.

ఇజ్రాయెల్ భూభాగంలో ప్రవేశించిన వాళ్లలో కొంతమంది ముందే మార్కింగ్ చేసిన చోటికి వెళ్లి సొరంగ మార్గం ఔట్ పాయింట్ దగ్గర కాపలా కాయడం సొరంగమ్ నుండి పైకి వచ్చిన వాళ్ళకి సేఫ్ పాసేజ్ ఇచ్చారు.

TIME & DISTANCE !

దాడి మొత్తం మిలటరీ వ్యూహంతో చాల యాక్యురేట్ గా, ప్రెసిషన్ గా జరిగింది అంటే అది రష్యా, ఇరాన్,టర్కీ మిలటరీ వ్యూహకర్తలు కలిసి డిజైన్ చేశారు కాబట్టి విజయవంతం అయ్యింది!

ఆపరేషన్ అల్-ఆక్స ఫ్లడ్ అని పేరు పెట్టడం అనేది ఇరాన్ పని! ఇలాంటి పేర్లు కేవలం మిలటరీ మాత్రమే పెడుతుంది!

ఇక దాడి చేస్తున్న హమాస్ కి సలహాలు, సూచనలు జోర్డాన్ నుండి హమాస్ ముఖ్య నాయకులు చేయగా ఇరాన్,టర్కీ కి చెందిన మిలటరీ వ్యూహకర్తలు పక్కనే ఉండి సమీక్షించారు.

దాడి సక్సెస్ అవుతున్న వేళ మధ్యాహ్న సమయానికి ఇరాన్,టర్కీ మిలటరీ అధికారులు ప్రయివేట్ బిజినెస్ జెట్ లో అంకారా వెళ్లిపోయారు!

లేబనాన్ నుండి హాంగ్ గ్లైడేర్స్ ద్వారా ఇజ్రాయిల్ లోకి హమాస్ చొరబడింది అంటే లేబనాన్ కూడా ఇందులో పాల్గొంది!

దాడి చేసే రోజుని సెలెక్ట్ చేయడo లో కూడా వ్యూహం ఉంది!

యెమ్ కిప్పుర్(Yom Kippur) యుద్ధం (1973 అక్టోబర్6 నుండి 25) జరిగి అందులో అరబ్ లీగ్ ని ఓడించి విజయసాధించి 50 ఏళ్ళు అయిన సందర్భంగా,

మరియు ఈజిప్టు నుండి యూదులు ఇజ్రాయెల్ కి తిరిగి వచ్చిన సందర్భంగా, మన సంక్రాంతి లాగా వ్యవసాయ పండుగ సందర్భంగా మొత్తం7 రోజులు సెలవలు ప్రకటించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం.

ప్రజలు,ఉద్యోగులు7 రోజుల సెలవుల మత్తులో ఉన్నారు.

ఇది ప్రతి సంవత్సరం జరిగేదే కానీ ఈసారి సెలవులు ఎక్కువ వచ్చాయి!

టార్గెట్ డేట్ ని సమర్ధ వంతంగా వాడుకున్నారు .