నిజంనిప్పులాంటిది

Oct 14 2023, 09:45

తెలంగాణ లో గ్రూప్-2 పరీక్షల వాయిదా.. మనస్తాపంతో వరంగల్ యువతి ఆత్మహత్య.. అర్ధరాత్రి వరకు ఉడికిపోయిన హైదరాబాద్..

•నిన్న సాయంత్రం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న ప్రవళిక

•విషయం తెలిసి హాస్టల్‌కు చేరుకున్న వందలాదిమంది గ్రూప్స్ అభ్యర్థులు

•ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు

•అర్ధరాత్రి వరకు మృతదేహం తరలింపును అడ్డుకున్న వైనం

•విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్

•అర్ధరాత్రి దాటాక ప్రవళిక మృతదేహం తరలింపు

•కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయని పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23) అశోక్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతోంది. నవంబరు 2,3 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది.

పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటున్న ప్రవళిక వాయిదా పడడంతో మనస్తాపానికి గురైంది. నిన్న సాయంత్రం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆత్మహత్యకు ముందు ప్రవళిక తల్లిదండ్రులకు రాసినట్టుగా ఉన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనను క్షమించాలని, తానో నష్టజాతకురాలినని ఆ లేఖలో ప్రవళిక ఆవేదన వ్యక్తం చేసింది. ‘నా వల్ల మీరెప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా. నన్ను కాళ్లు కిందపెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. ఏడవకండి అమ్మా. మీ కోసం నేను ఏమీ చేయలేకపోతున్నా. నాన్న జాగ్రత్త’ అని ఆ లేఖలో ప్రవళిక పేర్కొంది. కాగా, ప్రవళిక కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఆధార్‌కార్డు ప్రకారం తండ్రి లింగయ్య అని మాత్రం తెలుస్తోంది.

లాఠీ చార్జీ చేసి మృతదేహం తరలింపు

ప్రవళిక ఆత్మహత్యతో అశోక్‌నగర్‌లో అర్ధరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు కదలబోమని గ్రూప్స్ అభ్యర్థులు భీష్మించుకున్నారు. అర్ధరాత్రి వరకు నిరసన తెలిపారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించాల్సి వచ్చింది. చివరికి అర్ధరాత్రి తర్వాత అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. దీంతో అభ్యర్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. చివరికి అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అభ్యర్థులతో కలిసి ఆందోళనకు దిగిన సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

రోజులు దగ్గరపడ్డాయి బిడ్డా

ప్రవళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ప్రవళిక ఆత్మహత్య బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నియంత కేసీఆర్ కుటుంబం బాగుంటే సరిపోదని పేర్కొన్నారు. వందలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయి బిడ్డా అని హెచ్చరించారు. నిరుద్యోగ అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు అధైర్యపడొద్దని.. తొందరపాటు చర్యలు వద్దని హితవు పలికారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, మన నియామకాలు మనమే చేసుకుందామని, ఈ దొంగ దొరను తరిమి కొడదామని పిలుపునిచ్చారు.

నిజంనిప్పులాంటిది

Oct 14 2023, 09:18

Bathukamma Festival 2023 : నేటి నుంచే పూల సంబురం.. ఎంగిలి పూల బతుకమ్మతో పండుగ ప్రారంభం..

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ ఎంతో ప్రత్యేకమైనది. పల్లె పట్నం అని తేడా లేకుండా.. రాష్ట్రమంతటా తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు..

నేటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యే పండుగ.. చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

దేవునికి పూలను పెట్టి పూజిస్తాం. కానీ పూలనే పూజించే విశిష్ఠమైన సంప్రదాయం బతుకమ్మ. తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి మొదలైన పూలతో.. బతుకమ్మలను అందంగా తయారు చేయడం ఈ పండుగ ప్రత్యేకత..

SB NEWS

Streetbuzz News

STREETBUZZ NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Oct 14 2023, 09:14

SI Mains Exam: నేడు, రేపు ఎస్సై మెయిన్స్‌ పరీక్షలు..

ఈ రోజు, రేపు.. ఈ నెల 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి.. ఈ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు..

విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు మెయిన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.. మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష ఉండగా.. ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్‌ విధానంలో మరో రెండు పేపర్లు ఉండనున్నాయి.. కాగా, ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో మెయిన్‌ పరీక్షకు మొత్తం 31,193 మంది అర్హత సాధించారు. వీరిలో 27,590 మంది పురుష అభ్యర్థులు.. 3,603 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు..

ఈ రోజు పేపర్‌-1 అంటే డిస్క్రిప్టివ్‌ విధానంలో జరిగే పరీక్ష నిర్వహించనున్నారు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుండగా.. రేపు ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే పేపర్‌-3 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు..

పేపర్‌-4 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల నిర్వహించనున్నారు.. ఇక, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఎస్సై పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.. అభ్యర్థుల ఎత్తు కొలిచే పరికరాల్లో తప్పిదం వల్ల వేలాది మంది విద్యార్థులు అర్హత కోల్పోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

2019లో అర్హత సాధించిన అభ్యర్థులు 2023లో ఎలా అనర్హతకు గురవుతారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎత్తు విషయంలో తమకు అర్హత వున్నప్పటికీ తమని అన్యాయంగా అనర్హతకు గురి చేశారని దాఖలైన పలు పిటిషన్లు మీద హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు సైటేషన్లను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనర్హత పొందిన అభ్యర్థులు అందరికీ మళ్లీ శరీర ధారుడ్యం పరీక్షలకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది..

నిజంనిప్పులాంటిది

Oct 14 2023, 09:12

అహ్మదాబాద్ స్టేడియంలో భారత్ Vs పాకిస్తాన్ వార్

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్ జట్ల మధ్య శనివారం పోరు జరుగనుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ' మొతెరా' స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచకప్‌కే ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. 1.30 లక్షల మందికి పైగా అభిమానుల సమక్షంలో దాయాదుల మధ్య పోరు జరుగనుంది. ఇరు జట్లు కూడా ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి జోరుమీదున్నాయి.

ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌లతో జరిగిన మ్యాచుల్లో భారత్ జయభేరి మోగించింది. నెదర్లాండ్స్, శ్రీలంకలతో ఉప్పల్ వేదికగా జరిగిన తొలి రెండు మ్యాచుల్లో పాకిస్థాన్ జయకేతనం ఎగుర వేసింది.

లంకతో జరిగిన చివరి మ్యాచ్‌లో పాక్ 345 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. భారత్ కూడా కిందటి మ్యాచ్‌లో అఫ్గాన్‌పై కళ్లు చెదిరే విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక దాయాది పాక్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. పాకిస్థాన్ కూడా ఇదే లక్షంతో ఉంది.

జోరుమీదున్న రోహిత్..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కిందటి మ్యాచ్‌లో కళ్లు చెదిరే శతకం సాధించడం జట్టుకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రోహిత్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే పాక్‌పై భారీ స్కోరును సాధించడం టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదు.

ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగుతాడా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. అతను అందుబాటులో లేకపోతే ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. ఇషాన్‌తో పాటు విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జడేజా తదితరులు ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశమే.

అయితే శ్రేయస్ అయ్యర్‌లో నిలకడ లోపించడం ఒక్కటే కాస్త ఆందోళన కలిగిస్తోంది. కిందటి మ్యాచ్‌లో అతను బ్యాట్‌ను ఝులిపించడం సానుకూల అంశమే. ఇక బౌలింగ్‌లో కూడా భారత్ చాలా బలంగా ఉంది.

బుమ్రా, సిరాజ్, జడేజా, కుల్దీప్, హార్దిక్‌లతో బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. రెండు విభాగాల్లోనూ సమతూకంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

నిజంనిప్పులాంటిది

Oct 14 2023, 09:10

16 నుంచి తెలంగాణ లో ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు

ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ సార్వత్రిక ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 16 నుంచి 26 వరకు జరగనున్నాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ స్టడీసెంటర్‌లో హాల్‌ టికెట్లు పొందవల్సిందిగావిద్యాశాఖ తెలిపింది,లేదంటే అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్ల‌డించింది.

పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంబంధిత పరీక్ష కేంద్రాల్లో జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు..

నిజంనిప్పులాంటిది

Oct 14 2023, 09:07

తిరుమలలో నేటి నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం అంకురార్పణ చేశారు.నేటి నుంచి ఈనెల 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఈనెల 19న సాయంత్రం 6:30కు శ్రీవారి గరుడోత్సవం జరగనుంది. ఇవాళ్టి నుంచి ఈనెల 23 వరకు శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

శుక్రవారం నుండి శనివారం వరకు సర్వదర్శనాలను రద్దు చేయడం జరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు...

నిజంనిప్పులాంటిది

Oct 13 2023, 21:29

మంత్రి శ్రీనివాస్ గౌడ్ భద్రతను 3 అంచెలుగా పెంచాలి : గట్టు నరేష్ గౌడ్

• రాష్ట్ర అధ్యక్షులు & JAC చైర్మన్ తెలంగాణ గౌడ యువజన సంఘం

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్న భధ్రతపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్న తెలంగాణ గౌడ యువజన సంఘం..

ఎన్నికల సమయంలో పర్యాటనలలో బాగంగా ఎక్కువ సమయం వేల మంది జనాభలో ఉండే ఉధ్యమ కారుడు మంత్రి సీనన్న గౌడ్ పై కేసు ఓడిపోయిన వ్యక్తులు అది జీర్ణించుకోలేక ఎ నిమిషమైన మంత్రి సీనన్న గౌడ్ గారిని హతమార్చాలని కుట్ర పన్నుతున్నారని తెలసింది.

ఇదివరకే ఒకసారి సుపారి గ్యాంగ్ తొ కుట్ర పన్నారు అది బెడసికొట్టడంతొ ఎన్నికల ప్రచార సమయమే హత్య చేసేందుకు అనుకూలంగా బావిస్తున్నట్లు తెలుస్తుంది.

కావున తక్షణమే బి.సి మంత్రి అయిన డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి రాష్ట్ర ప్రభుత్వం లేద ఎన్నికల కమిషన్ ఉన్న భధ్రతను 3 అంచెలుగా పెంచాలని తెలంగాణ గౌడ యువజన సంఘం డిమ్యాండ్ చేస్తుంది లేని పక్షంలో మంత్రి గారికి ఎలాంటి ప్రమాధం జర్గిన రాష్ట్రం మొత్తం అగ్గిగుండగా మారుతుందని హెచ్చరిస్తున్నాను.

SB NEWS

STREETBUZZ NEWS

నిజంనిప్పులాంటిది

Oct 13 2023, 14:06

సోషల్ మీడియాలోఎన్నికల ప్రచారం మొదలెట్టిన కేసీఆర్ మనవడు

రాష్ట్రంలో ఎన్నికలకు నెల రోజుల గడువే ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం మొదలెట్టారు. అవకాశం ఉన్న ప్రతీ చోట ప్రభుత్వ సంక్షేమ పథకాల విశిష్టతను వివరిస్తున్నారు.

అంతేకాదు.. సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టడంతో పాటు కేసీఆర్ వన్స్ ఎగైన్’ అంటూ గత నాలుగైదు రోజులుగా ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈసారి ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ మనవడు, కల్వకుంట్ల హిమాన్షు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. సోషల్ మీడియా వేదికగా పార్టీకి తనవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే గతకొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను, కేసీఆర్ పరిపాలనను వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. రెండ్రోజుల క్రితం ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు.

చిన్న సినిమాగా విడుదలై ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కార్తికేయ-2 చిత్రంలోని ఒక డైలాగ్‌ను సీఎం కేసీఆర్‌ను వీడియోలకు లింక్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్టు చేశారు.

ఈ పోస్టుకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మళ్లీ కేసీఆరే గెలుస్తారని అంటుండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం హైదరాబాద్ నగరాన్నే అభివృద్ధి చేశారు. గ్రామాలను గాలికొదిలేశారు. ఎట్టిపరిస్థితుల్లో ఈసారి కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

మరి హిమాన్షు సోషల్ మీడియా ప్రచారం బీఆర్ఎస్‌కు ఎంతమేర పనిచేస్తుందో చూడాలి..

నిజంనిప్పులాంటిది

Oct 13 2023, 14:04

తెలంగాణలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా?

తెలంగాణ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది.

ఇప్పటికే భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఇబ్బందులపై అలెర్ట్ అయింది.

ఎన్నికల కోడ్ అమలవుతున్న అక్టోబర్9వ తేదీ నుంచి ఈరోజు ఉదయం వరకు భారీగా నగదు పట్టుకున్నారు. దాదాపు 20,నుండి 25కోట్లకు పైగా సీజ్ చేశారు.

షెడ్యూల్ విడుదల అయిన నాలుగు రోజుల్లోనే కోట్లాది రూపాయలు పట్టుబడటంతో ప్రత్యేక నిఘా పెట్టింది.

ఎన్నికల నాటికీ డబ్బు పంపిణీ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉండటంతో వంద బలగాలను తెలంగాణ రాష్ట్రానికి సీఈసీ పంపించింది...

నిజంనిప్పులాంటిది

Oct 13 2023, 14:01

బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార ఇంఛార్జిల నియామకం

బిఆర్‌ఎస్ ఎన్ని కల ప్రచారానికి 54 నియోజకవర్గాలకు ఇంఛార్జీలు నియమించింది. తాజాగా గురువారం సాయంత్రం జాబితాను విడుదల చేసింది.

ఎంపి వెంకటేశ్ నేతా కు (బెల్లంపల్లి (ఎస్‌సి) నియోజకవర్గం),

ఎంఎల్‌సి భానుప్రసాదరావు (మంచిర్యాల),

ఎంఎల్‌సి దండె విఠల్ (ఖానాపూర్ (ఎస్‌సి),

మాజీ ఎంఎల్‌సి పురాణం సతీష్ కుమార్ (ముథోల్),

ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత (బోధన్),

మాజీ ఎంఎల్‌సి వి.గంగాధర్ గౌడ్ ఎల్లారెడ్డి

ఎంఎల్‌ఎ గంపా గోవర్ధన్, ఎంఎల్‌సి శేరి సుభాష్ రెడ్డి, ఇంఛార్జి మినిష్టర్ కెటిఆర్ ఇంఛార్జి) (కామారెడ్డి

ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ అర్బన్

ఎంఎల్‌సి ఎల్.రమణ, మాజీ మంత్రి రాజేశంగౌడ్ జగిత్యాల

చైర్మన్ రవీందర్‌సింగ్ పెద్దపల్లి

మంత్రి గంగుల కమలాకర్ చొప్పదండి ఎస్‌సి

మాజీ ఎంపి బి.వినోద్ కుమార్ వేములవాడ

సుడా చైర్మన్ జివి రామకృష్ణ మానకొండూరు ఎస్‌సి

కె.తిరుపతిరెడ్డి:మెదక్

మాజీ ఎంఎల్‌సి ఫరూఖ్ హుస్సేన్ ఆంధోల్ (ఎస్‌సి),

ఎంఎల్‌సి వెంకట్రామిరెడ్డి నర్సాపూర్

మాజీ చైర్మన్ దేవీప్రసాద్ జహీరాబాద్ (ఎస్‌సి),

చైర్మన్‌లు వి.భూపాల్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ (సంగారెడ్డి),

చైర్మన్ బాలమల్లు దుబ్బాక

మంత్రి హరీశ్‌రావు, ఎంఎల్‌సి డాక్టర్ యాదవ్‌రెడ్డి, చైర్మన్ వి.ప్రతాప్‌రెడ్డి(గజ్వేల్),

ఎంఎల్‌సి శంభీపూర్ రాజు మల్కాజ్‌గిరి

చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి ఉప్పల్

ఎంపి రంజిత్‌రెడ్డి :చేవెళ్ల ఎస్‌సి

వికారాబాద్(ఎస్‌సి), ఎంఎల్‌సి ఎంఎస్ ప్రభాకర్

ముషీరాబాద్ కట్టెల శ్రీనివాస్‌యాదవ్,

అడ్వకేట్ మోహన్‌రావు(అంబర్‌పేట),

మంత్రి శ్రీనివాస్‌యాదవ్ (సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్‌సి),

చైర్మన్ ఆంజనేయగౌడ్ (మక్తల్),

మాజీ చైర్మన్ రాకేశ్ చిరుమళ్ల గద్వాల్

ఎంఎల్‌సి చల్లా వెంకట్రామిరెడ్డి (అలంపూర్ (ఎస్‌సి),

చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ (అచ్చంపేట (ఎస్‌సి),

చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి(కల్వకుర్తి),

ఎంపి పి.రాములు కొల్లాపూర్

ఎంఎల్‌సి కోటిరెడ్డి, రాంచంద్ర నాయక్ నాగార్జునసాగర్

విజయసింహారెడ్డి(నల్గొండ), హూజూర్‌నగర్

ఎంఎల్‌సి టి.రవీందర్‌రావు కోదాడ

జెడ్‌పి చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి నల్గొండ

ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ (నకిరేకల్(ఎస్‌సి),

మాజీ ఎంఎల్‌సి బి.వెంకటేశ్వర్లు, చైర్మన్ డాక్టర్ రాజయ్య, మంత్రి హరీష్‌రావు(ఇంఛార్జి), జనగామ

మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ (ఎస్‌టి),

చైర్మన్ వి.ప్రకాష్ (నర్సంపేట),

కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ వరంగల్ (ఈస్ట్)

ఎంఎల్‌సి బసవరాజు సారయ్య భూపాలపల్లి

ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (ములుగు (ఎస్‌టి),

ఎంపి వడ్డిరాజు రవిచంద్ర (ఇల్లందు (ఎస్‌టి),

మంత్రి పువ్వాడ అజయ్, కొండబాల కోటేశ్వరరావు మధిర (ఎస్‌సి),

ఎంపి నామా నాగేశ్వరరావు (వైరా (ఎస్‌టి),

ఎంపి పార్థసారథి రెడ్డి (సత్తుపల్లి (ఎస్‌సి),

ఖమ్మం డిసిఎంఎస్ శేషగిరిరావు (అశ్వారావుపేట (ఎస్‌టి),

ఎంఎల్‌సి తాత మధు (భద్రాచలం (ఎస్‌టి).లను నియమించినట్టు తెలిసింది...