NLG:అంగన్వాడీల డిమాండ్స్ న్యాయమైనవే: సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం: అంగన్వాడీల డిమాండ్స్ న్యాయమైనవే సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు, మండల కేంద్రంలోని అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ నిర్వహిస్తున్న సమ్మె 23వ రోజుకు చేరిన సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం వారికి సంఘీభావం తెలిపి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. హరీష్ రావు కేటీఆర్ ఉద్యమాన్ని పక్కదో పట్టించి చేతులు దులుపుకోవడానికి మాటలు చెబుతున్నారని, తక్షణమే వారిని చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన ఆశ వర్కర్లకు కూడా సంఘీభావం తెలిపారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని సత్యం అన్నారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఈదుల బిక్షం రెడ్డి, తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చేల్లం పాండురంగారావు, ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల కోశాధికారి కొట్టం శ్రీనివాస్, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు ఆకుల రఘుమయ్య, వెంకటయ్య, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ శోభ, రజిత, నిర్మల, శోభారాణి, విఘ్నేశ్వరి, సువర్ణ, లక్ష్మి, విజయశ్రీ, రమాదేవి, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: అమరుల కుటుంబాలకు పెద్ద కొడుకుగా కాంగ్రెస్: పాల్వాయి స్రవంతి
మునుగోడు: రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరుల కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని టీపీసీసీ అధికార ప్రతినిధి, మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాల్వాయి స్రవంతి అన్నారు. అమరుల కుటుంబాలకు పెద్ద కొడుకుగా కాంగ్రెస్ ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమరుల తల్లిదండ్రులకు 25 వేల పెన్షన్, మరియు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం అని పాల్వాయి స్రవంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: రామగిరి కార్మిక అడ్డా ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి

నల్లగొండ: అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని రామగిరి కార్మిక అడ్డా ఆధ్వర్యంలో, సోమవారం స్థానిక రామగిరి గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ..

స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పోరాటం, వారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం పట్టణ ప్రగతి, అన్ని వర్గాలకు సంక్షేమం దక్కిన నాడే కార్మికులకు నిజమైన గాంధీ జయంతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేలావత్ నాగేష్ నాయక్, అడ్డా రామగిరి అధ్యక్షులు శంబురెడ్డి, రుద్రాక్ష నరసింహ, తదితరులు ఉన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

NIA: తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల సోదాలు.. ప్రకటన విడుదల చేసిన ఎన్‌ఐఏ
HYD: తెలుగు రాష్ట్రాల్లో 62 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. ఏపీ, తెలంగాణలోని పౌరహక్కుల నేతలు, అమరబంధు మిత్రుల సంఘం నాయకుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు సంఘాలతో సంబంధాల కేసులో ఈ సోదాలు చేశారు. సోదాలకు సంబంధించిన వివరాలతో ఎన్‌ఐఏ ప్రకటన విడుదల చేసింది. ముచింగిపట్టు మావోయిస్టు కేసులో భాగంగా తనిఖీలు చేసినట్లు పేర్కొంది. ఒకరిని అరెస్టు చేయగా.. ఆయుధాలు, నగదు, విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ''తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల తనిఖీలు చేశాం. ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకుడు చంద్ర నర్సింహులును అరెస్టు చేశాం. తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం అని ఎన్ఐఎ తెలిపింది. కడపలో రూ.13 లక్షల నగదు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నాం. ఏపీలో 53 చోట్ల, తెలంగాణలో 9 చోట్ల సోదాలు నిర్వహించాం అని NIA తెలిపింది.
తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హనుమకొండ, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సోదాలు చేశాం.
ఏపి లో గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, ప్రకాశం, ఏలూరు, విశాఖ, విజయనగరం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూల్‌లో సోదాలు జరిగాయి.

సీఎల్‌సీ, ఏబీఎంసీ, సీఎంఎస్, కేఎన్‌పీఎస్, పీడీఎం, పీకేఎస్, పీకేఎం, ఆర్‌డబ్ల్యూఏ, హెచ్‌ఆర్‌ఎఫ్, సీఆర్‌పీపీ, ఐఏపీఎల్ నాయకుల ఇళ్లల్లో సోదాలు జరిపాం. మావోయిస్టు అనుబంధ సంఘాల నాయకులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు ఆధారాలున్నాయని ఎన్‌ఐఏ ప్రకటనలో వెల్లడించింది.
TS: 'పే స్కేల్' చెల్లింపు కోసం 'పే రివిజన్ కమిటీ' నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 'పే స్కేల్' చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు సోమవారం నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ ఛైర్మన్ గా ఎన్. శివశంకర్ రిటైర్డ్ ఐఎఎస్ ను, సభ్యునిగా బి. రామయ్య రిటైర్డ్ ఐఎఎస్ ను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.కమిటీ 6 నెలల లోపు నివేదికను ప్రభుత్వానికి అందచేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. పీఆర్సీ కి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, స్టాఫ్ ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

SB NEWS TELANGANA

NLG: ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల నందు జాతీయ సేవా పథకం( ఎన్ ఎస్ ఎస్) యూనిట్ల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ మరియు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డా. లక్ష్మణ్ గౌడ్, సిఓఈ బి.నాగరాజు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఈ.యాదగిరి రెడ్డి, ఎన్ వేణు, లైబ్రేరియన్ డా. ఏ. దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ కె. మల్లేష్, అధ్యాపకులు డా. కృష్ణ కౌండిన్య, కె. ప్రవీణ్ రెడ్డి, డా. నాగరాజు, ఎన్ నరసింహ, వాసుదేవ్, గోవర్ధనగిరి, శంకర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
సేవాలాల్ మహారాజ్ మందిరం కోసం స్థలం కేటాయించాలని వినతిపత్రం

నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం, అజిలాపురం గ్రామం ఐదో వార్డులో ఉన్న దాదాపు 100 సంవత్సరాల క్రితం నాటి డాక్ తోట బావి స్థలమును బంజారా ఆరాధ్య దైవం.. సద్గురు సేవాలాల్ మహారాజ్ మందిరం కోసం, బంజారా కమిటీ హాల్ కోసం, గ్రామపంచాయతీ తీర్మానం చేయాలని గ్రామస్తులు సర్పంచ్ మరియు కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. గ్రామకంఠం రికార్డులను పరిశీలించి వీలైనంత తొందరలో తీర్మానించి చుట్టుపక్కల స్థలము ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేసి గ్రామకంఠం స్థలాన్ని కాపాడాలని కోరారు .

చండూరు: ముందస్తు అరెస్ట్ అయిన బీఎస్పీ నాయకులు
నల్లగొండ జిల్లా, చండూరు: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, సమాచార సాంకేతిక (ఐటీ) శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు నల్లగొండలో ఐటీ హబ్ ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా, చండూరు మండల బీఎస్పీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టు అయిన వారిలో బహుజన్ సమాజ్ పార్టీ చండూరు మండల అధ్యక్షులు నేరెళ్ల ప్రభుదాసు, ఉపాధ్యక్షులు కడారి సైదులు యాదవ్, మున్సిపల్ అధ్యక్షులు బుషిపాక మాణిక్యం, ఎర్రజల్ల నాగేంద్ర శ్యామ్ ఉన్నారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: మర్రిగూడెం మండలంలో కొనసాగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడి ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది, నేడు 22వ రోజుకు చేరుకుంది.

జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా అంగన్వాడి ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు.

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య పిఎన్ఎమ్ జిల్లా కార్యదర్శి చెల్లం పాండురంగా రావు లు అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపి, మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాడ్యుయేట్ చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు హెల్పర్ కు ఐదు లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు అంగన్వాడీ ఉద్యోగుల పోరాటం ఆగదని వారు హెచ్చరించారు జరగబోయే ఎన్నికల్లో అంగన్వాడీ ఉద్యోగులు తలుచుకుంటే ప్రస్తుత ప్రభుత్వం కూలిపోక తప్పదని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ శోభ, కాకులవరం రజిత, బొబ్బిలి శోభారాణి, చిట్యాల సువర్ణ, విగ్నేశ్వరి, అనంతలక్ష్మి, శిలువేరు లక్ష్మి, ఉడుతల లక్ష్మి, అరుణ, పద్మ, సులోచన, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

మర్రిగూడెం: గాంధీ చిత్రపటానికి వినతిపత్రం అందజేసిన ఆశాలు
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం: ఆశా వర్కర్ల సమ్మె శిబిరం వద్ద, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా, ఆశాలు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ.. గాంధీ చిత్రపటానికి  వినతిపత్రం అందజేశారు. ఇకనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అన్నారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ 18,000/- నిర్ణయించాలని, పిఎఫ్ ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని సెప్టెంబర్ 25 నుండి చేస్తున్న ఆశా ల సమ్మె న్యాయమైనదని అన్నారు.  ఆశల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు మా పోరాటం కొనసాగిస్తామని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు జంపాల వసంత, భీమనపల్లి అరుణ, పందుల పద్మ, కాలం సుజాత, పొనుగోటి సునీత, లప్పంగి దుర్గమ్మ, కోయ మంజుల, ఐతరాజు సునీత, కంసల్య, జయమ్మ, జాజాల అనిత, కలమ్మ,దామెర యాదమ్మ, సైదా బేగం, సునీత, విజయమ్మ, ఆర్ లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA