కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం.. కోజికోడ్ లో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం.. కోజికోడ్ లో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు

వైరస్ కారణంగా ఇద్దరి మృతి 

విద్యాసంస్థలకు రేపటి వరకు సెలవులు

కోజికోడ్ కు చేరుకున్న కేంద్ర బృందం

ఇతర రాష్ట్రాల నుండి కేరళ వెళ్లే ప్రయాణికులు జాగ్రత.. అని హెచ్చరిస్తున్న.. ఆరోగ్య నిపుణులు

కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కోజికోడ్‌లోని పాఠశాలలు, కళాశాలలకు రేపటి వరకు సెలవులను పొడిగించింది. రాష్ట్రంలో ఈ వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కోజికోడ్ జిల్లాలోని అంగన్‌వాడీలు, మదర్సాలు, ట్యూషన్ సెంటర్లు, ప్రొఫెషనల్ కాలేజీలు సహా అన్ని విద్యాసంస్థలకు గత రెండు రోజులుగా సెలవులు ఇచ్చారు. అనవసర ప్రయాణాలు, సమావేశాలకు దూరంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోజికోడ్ కలెక్టర్ ప్రజలను కోరారు. 

మరోవైపు రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రం నుంచి ఒక బృందం కోజికోడ్ చేరుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులతో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమావేశమయ్యారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ సమావేశంలో ఆగస్టు 30న మరణించిన మొదటి వ్యక్తిని కాంటాక్ట్ అయిన హై-రిస్క్ కాంటాక్ట్ గ్రూప్‌లో ఉన్న వారందరి నమూనాలను తీసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం 14 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. వారి నమూనాలను కూడా తీసుకొని ల్యాబ్‌కు పంపుతామన్నారు. వైరస్ సోకిన 9 ఏళ్ల బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

వెల్డింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పని కల్పించాలి,సింగరేణిలో యూస్ అండ్ త్రో విధానం పోవాలి వెల్డింగ్

వెల్డింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పని కల్పించాలి

 సింగరేణిలో యూస్ అండ్ త్రో విధానం పోవాలి వెల్డింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పని కల్పించాలి

సింగరేణిలో యూస్ అండ్ త్రో విధానం పోవాలి

 సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్*

  

 సింగరేణి కొత్తగూడెం సెంట్రల్ వర్క్ షాపులో గత 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వెల్డింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పని కల్పించాలని పర్మనెంట్ కార్మికుల వచ్చారు కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు పని లేదు అని టెండర్లు పిలవకుండా కాంట్రాక్ట్ కార్మికులకు పని లేకుండా చేయడం సరైనది కాదని తక్షణమే వారికి పని కల్పించాలని AITUC అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు.శుక్రవారం నాడు సెంట్రల్ వర్క్ షాప్ జనరల్ మేనేజర్ శ్రీ యన్.దామోదర్ గారికి వినతి పత్రం సమర్పించిన అనంతరం వెల్డింగ్ కాంట్రాక్టు కార్మికుల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ..

వర్క్ షాపులో వెల్డర్స్ లేనప్పుడు మరియు కరోనా అత్యవసర పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయించుకొని నేడు టెండర్లు పిలవకుండా అనేక సంవత్సరాల నుంచి పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పనిలేకుండా చేయడం చాలా దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే పనిని నమ్ముకొని ఆధారపడి ఉన్న వెల్డింగ్ కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలను వీధిన పడేయటం సరైనది కాదని విమర్శించారు.ఇప్పటికైనా సింగరేణి ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తక్షణమే టెండర్లు పిలవడం కానీ, ప్రత్యామ్నాయ పనులు కల్పించడం ద్వారా కానీ వెల్డింగ్ కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు జహెద్, మదర్,రవి,అజయ్,శంకర్ తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్సీ కుర్ర. సత్యనారాయణను కలిసిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ, విద్యార్థి సంఘం నాయకులు కట్టెల శివకుమార్

ఎమ్మెల్సీ కుర్ర. సత్యనారాయణ కలిసిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ, విద్యార్థి సంఘం నాయకులు

హైదరాబాదులోని తెలంగాణ ఎరుకల సంఘం( కుర్రు) రాష్ట్ర గౌరవ వ్యవస్థాపకులు. మాజీ శాసనసభ్యులు . కాబోయే.ఎమ్మెల్సీ . కుర్ర . సత్యనారాయణ ను ఆయన చాంబర్లో గురువారం ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపల్లి బిక్షపతి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

అంగన్ వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు తెలియజేస్తున్న బిజెపి నాయకులు నాగం వర్షిత్ రెడ్డి

అంగన్ వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు తెలియజేస్తున్న బిజెపి నాయకులు

నల్లగొండ పట్టణంలో ఐసీడీఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ జేఏసీ ఆధ్వర్యంలో అంగన్వాడి ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలని కనీస వేతనం 26000 రూపాయలు చెల్లించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్లు పెంచాలని గత నాలుగు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె కు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు నాగం వర్శిత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి చాకిరి చేయిస్తుంది కానీ వారికి పనికి తగ్గ ప్రతిఫలం అందియకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వ తీరును ఎండగట్టారు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు నిధులు ఇస్తున్న సరిగ్గా వినియోగించుకోలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేశారు.అంగన్వాడి ఉద్యోగుల డిమాండ్లు నెరవేరిచే వరకు మేము వారితో పాటు అండగా ఉండి పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దాసోజు యాదగిరచారి,కాశమ్మ,నరేందర్ రెడ్డి,పల్లె ప్రకాష్,మధు,శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు రక్షణ కోట్ లు ఇవ్వాలి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్

సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు రక్షణ కోట్ లు ఇవ్వాలి     ---------- కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్

      

సింగరేణిలో పనిచేస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డులందరికీ వర్షం మరియు చలి వల్ల డ్యూటీ ల వద్ద ఇబ్బందులు కలగకుండా రక్షణ కోసం వర్షం,చలి కోట్ లను ఇవ్వాలని ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం నాడు కార్పొరేట్ లోని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతు సింగరేణి ఎస్ అండ్ పిసి వారు సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా వర్షము చలి కోట్ లను ఇప్పించ వలసి ఉన్నదని అందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.ఇతర విభాగాల కార్మికులకు చెల్లించినట్టుగా మెడికల్ కు సంబంధించిన డబ్బులను రియంబర్స్మెంట్ చేసి ప్రైవేట్ గార్డులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రేయింబవళ్లు సింగరేణి ఆస్తులను కాపాడటంలో మరియు భద్రతను కల్పించడంలో నేడు ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల శ్రమ కీలకంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, జాకీర్, మోహన్, గౌస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులకు, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులకు, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. అనర్హులను సభ్యులుగా నియమించడం పై అభ్యంతరం

శివ శంకర్. చలువాది

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఆలయాన్ని నిర్వహించే సంస్థ టీటీడీ.. ఈ సంస్థ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశ్యం స్వామివారి ఆలయం బాగోగులు చూడడమే.. 

అంతేకాదు దేశం నలువైపులా వివిధ సామజిక, ధార్మిక, సాంస్కృతి వంటి అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ హిందూ ధర్మాన్ని విస్తరింపజేస్తుంది.

 ఈ నేపథ్యంలో టీటీడీ సంస్థ నిర్వహణ కోసం చైర్మన్, బోర్డు మెంబర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే కొత్తగా టీటీడీ సభ్యులను ప్రభుత్వం నియమించింది. 

వారికీ, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నేర చరిత్ర ఉన్నవారిని బోర్డు సభ్యులుగా నియమించడంపై అభ్యంతరం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.

టీటీడీలో ఏర్పాటు చేసిన కొత్త పాలకమండలి సభ్యుల్లో కొందరికి నేర చరిత్ర ఉందని హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు స్పందించింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ నోటీసులు జారీచేసింది. ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డికి పర్సనల్ నోటీసులు జారీ చేసింది హైకోర్టు. వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు విజయవాడకి చెందిన మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు.. మంచి నడవడిక లేని, అనర్హులను, నేర చరిత్ర ఉన్నవారిని టీటీడీ సభ్యులుగా నియమించడం చట్ట వ్యతిరేకమని హైకోర్టుకు విన్నవించారు.. పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్, జస్టిస్ రఘునందన రావు ధర్మాసనం.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. శిక్ష ఇంకా విధించని కారణంగా వారు నేరస్థులుగా పరిగణించలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.

మరోవైపు.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మెడికల్ కౌన్సిల్ ఇండియా సభ్యత్వం నుండి తొలగింప బడిన కేతన్ దేశాయ్‌ను టీటీడీ సభ్యుడిగా నియమించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు చింతా వెంకటేశ్వర్లు తరపు న్యాయవాది శ్రావణ్.ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి విచారణ ఎదుర్కొన్నారని, సామినేని ఉదయభానుపై క్రిమినల్ కేసులు వున్నాయని పిటిషనర్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

అమెజాన్లో బధిరులకు ఉద్యోగాలు..

అమెజాన్లో బధిరులకు ఉద్యోగాలు..

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో బధిరులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలంగాణ వికలాంగుల మరియు వయోవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ తెలిపింది.

ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌లో బధిరులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు తెలంగాణ వికలాంగుల, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్‌ వ్యక్తుల సాధికారత శాఖ తెలిపింది.

పదో తరగతి.. ఆపై చదువుకున్న 18 నుంచి 35 ఏండ్ల వయసున్న బధిరులు ఈ నెల 15న హైదరాబాద్‌ (మలక్‌పేట)లోని కార్యాలయంలో తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నది.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తొలి ట్రాన్స్‌జెండ‌ర్

*అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తొలి ట్రాన్స్‌జెండ‌ర్* 

కెనడాకు చెందిన డేనియెల్లె మెక్‌గ‌హే(Danielle McGahey) త్వ‌ర‌లోనే అంత‌ర్జాతీయ‌ క్రికెట్‌లో అరంగేట్రం చేయ‌నుంది. దాంతో, తొలి ట్రాన్స్‌జెండ‌ర్ క్రికెట‌ర్‌(First Transgender Cricketer)గా ఆమె గుర్తింపు చరిత్ర సృష్టించ‌నుంది.

ఓపెనింగ్ బ్యాట‌ర్ అయిన డేనియెల్లె వ‌చ్చే ఏడాది పొట్టి ప్రపంచ క‌ప్ క్వాలిఫ‌యింగ్ స్క్వాడ్‌(2024 Women’s T20 World Cup Qualifying Squad)లో చోటు ద‌క్కించుకుంది.

ఐసీసీ(ICC) నుంచి ఎలాంటి అభ్యంత‌రాలు లేక‌పోవ‌డంతో కెన‌డా సెలెక్ట‌ర్లు డేనియెల్లేను సెలెక్ట్ చేశారు.

‘నేను క్రికెట‌ర్ అవుతాన‌ని క‌లలో కూడా అనుకోలేదు. అలాంటిది ఇప్పుడు మా క‌మ్యూనిటీ త‌ర‌ఫున దేశానికి ప్రాతినిధ్యం వ‌హించ‌బోతున్నా. అందుకు చాలా సంతోషంగా, చాలా గ‌ర్వంగా ఉందని అన్నారు.

క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి కాదు!

క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి కాదు!

```డాక్టర్ గుప్తా మాట్లాడుతూ, నిర్లక్ష్యంతో పాటు ఎవరూ క్యాన్సర్‌తో చనిపోకూడదు. ;(1) చక్కెర తీసుకోవడం మానేయడం మొదటి దశ. మీ శరీరంలో చక్కెర లేకుండా, క్యాన్సర్ కణాలు సహజంగా చనిపోతాయి.

 ;(2) రెండవ దశ ఒక కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసి 1-3 నెలల పాటు ఉదయం భోజనానికి ముందు తాగితే క్యాన్సర్ పోతుంది. మేరీల్యాండ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, కీమోథెరపీ కంటే వేడి నిమ్మ నీరు 1000 రెట్లు మెరుగైనది, బలమైనది మరియు సురక్షితమైనది.

(3) మూడవ దశ ఏమిటంటే, ఉదయం మరియు రాత్రి 3 టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ కొబ్బరి నూనెను త్రాగాలి, క్యాన్సర్ అదృశ్యమవుతుంది, మీరు చక్కెరను నివారించడం సహా ఇతర రెండు చికిత్సలలో దేనినైనా ఎంచుకోవచ్చు.

అజ్ఞానం ఒక సబబు కాదు. నేను 5 సంవత్సరాలకు పైగా ఈ సమాచారాన్ని పంచుకుంటున్నాను. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ చెప్పండి, క్యాన్సర్‌తో చనిపోవడం ఎవరికైనా అవమానకరం; ప్రాణాలు కాపాడేందుకు విస్తృతంగా షేర్ చేయండి.

స్వచ్ఛ సర్వేక్షణ్ కింద నల్లగొండ నియోజకవర్గంలో అప్పాజిపేట ఎంపిక

స్వచ్ఛ సర్వేక్షణ్   కింద నల్లగొండ నియోజకవర్గంలో అప్పాజిపేట ఎంపిక           

 నల్లగొండ : స్వచ్ఛ సర్వేక్షణ్  గ్రామీణ -2023 సంవత్సరం కింద నల్లగొండ మండలం అప్పాజిపేట ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. నల్లగొండ జిల్లాలో మొత్తం 12 గ్రామ పంచాయతీలు ఎంపిక కాగా , నల్లగొండ నియోజకవర్గంలో అప్పాజిపేట సెలక్ట్ అయ్యింది.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్తులో గ్రామ సర్పంచ్ పబ్బతిరెడ్డి రవీందర్ రెడ్డిని , కార్యదర్శి ఉపేందర్ ను జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి , కలెక్టర్ ఆర్ వి. కర్ణన్ లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ , జడ్పీ సిఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి , ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి , ఎంపీవో మాధవరెడ్డిలు ఉన్నారు.