success story: ఒక దినసరి కూలీ.. పట్టుదలతో చదివి పిహెచ్డీ సాధించింది

AP: ఆమె ఒక దినసరి కూలీ, అయితేనేం.. పట్టుదలతో చదివి ఆమె కెమిస్ట్రీలో పీహెచ్డీ పట్టా సాధించింది. ఆమె పేరు సాకే భారతి.  సోమవారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రాంగణమంతా స్నాతకోత్సవ సందడి అలముకుంది. వేదిక పసిడి కాంతులు పులుముకుంది. కార్యక్రమానికి ఛాన్సలర్‌ హోదాలో ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్‌ నజీర్‌ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.


అంతా హడావిడిగా ఉండటంతో వేదిక దిగువ నుంచి వెదజల్లుతున్న మట్టి పరిమళాలను ఎవరూ గుర్తించలేకపోయారు. కొంత సమయం తరువాత మైకులో సాకే భారతి అనే పిలుపు వినిపించింది. మోడరన్ దుస్తులు ధరించిన అమ్మాయి వేదికపైకి వస్తుందనుకున్నారంతా. కానీ.. అలా జరగలేదు.


పీహెచ్‌డీ పట్టా అందుకోవడానికి వేదిక మీదకు భర్త, కూతురితో కలిసి వచ్చింది సాకే భారతి. అరిగిపోయిన హవాయి చెప్పులూ, ఓ సాదా చీర కట్టుకొచ్చిన ఆమె ఆహార్యాన్ని చూసి వేదికమీది పెద్దలూ, అతిథుల ముఖాల్లో ఒకటే ఆశ్చర్యం. పేదరికం లక్ష్యసాధనకు అడ్డంకి కాదని రుజువు చేస్తూ నడిచొస్తున్న ఆ చదువుల సరస్వతిని చూసి అబ్బుర పడ్డారంతా. పీహెచ్‌డీ పట్టా ఆమె చేతుల్లో చేరి కాంతులీనింది. అప్రయత్నంగా చేతులన్నీ ఒక్కటై చప్పట్లతో ప్రాంగణమంతా మార్మోగింది. అయినా.. భారతిలో ఇసుమంతైనా గర్వం కనిపించలేదు.
మరోసారి మానవత్వం చాటుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా: ఆపదలో ఉన్నవారికి తన శక్తి మేరకు సహాయం అందించాలని తపన పడే నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన రాజకీయ రంగ ప్రవేశం నుండి ఇప్పటివరకు అనేకమంది నిరుపేదలకు కోట్ల రూపాయల సహాయ సహకారాలు అందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన గొప్ప నాయకుడు. మరోసారి ఆయన తన మానవత్వాన్ని చాటుకున్నారు.
మునుగోడు మండలంలోని చీకటిమామిడి గ్రామానికి చెందిన పగిళ్ల శంకర్ తీవ్రమైన అనారోగ్యానికి గురై, నల్లగొండలోని రివర్ నీమ్స్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వీరిది నిరుపేద కుటుంబం కావడంతో ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచ్, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సైదులు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 50,000/- బాధిత కుటుంబ సభ్యులకి అందించారు. కార్యక్రమంలో పగిళ్ల నగేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
లెంకలపల్లి బీజేపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో పదివేలు ఆర్ధిక సహాయం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో అనారోగ్య కారణాలవల్ల కీ.శే. ఏర్పుల భీమయ్య సతీమణి ఏర్పుల కమలమ్మ బుధవారం మరణించారు. మానవతా దృక్పథంతో బిజెపి నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి స్పూర్తితో లెంకలపల్లి బీజేపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఏర్పుల కమలమ్మ కుటుంబ సభ్యులకు రూ. 10,000/- ఆర్ధిక సహాయం అందించారు.  కార్యక్రమంలో ఎంపీటీసీ ఎర్పుల శ్రీశైలం, మేతరి శంకర్, నందికొండ లింగారెడ్డి, కాటగోని రవిశేఖర్, నాగరాజు, చాపల రాజు,ఎర్పుల వెంకటేష్, బుర్కల శేఖర్, చాపల రవి, ఏర్పుల రవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
TS: మరికాసేపట్లో మోస్తారు వర్షం...
తెలంగాణలోని పలు జిల్లాలో కాసేపట్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రము బుధవారం తెలిపింది. హైదరాబాదు, కొత్తగూడెం, జనగాం, భూపాలపల్లి, గద్వాల్, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి, మెహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, పెద్దపల్లి, నిజాంబాద్, సిరిసిల్ల, సూర్యాపేట, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాలలో ఈ రోజు ఒంటిగంటలోగా మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థికి ల్యాప్ టాప్ బహుకరించిన నాగం వర్షిత్ రెడ్డి
నల్లగొండ: ఇంజనీరింగ్ చదువుతున్న
బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్ చిన్న కుమారుడుకి, మంగళవారం బిజేపి నాయకులు డా•నాగం వర్షిత్ రెడ్డి ల్యాప్ టాప్ బహుకరించి ఇంకా ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని విద్యార్థిని ప్రోత్సహించారు. ఇంకా ముందు ముందు ఎలాంటి సహాయ సహకారాలైన అందిచడానికి ముందు ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత సెల్ కన్వీనర్ తీరాందాసు కనకయ్య,గడ్డం మహేష్, పల్ రెడ్డి నరేందర్ రెడ్డి, శాంతి స్వరూప్ ఉన్నారు.
DVK: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేసిన గ్రామపంచాయతీ కార్మికులు
నల్లగొండ జిల్లా, దేవరకొండ: గ్రామ పంచాయతీ కార్మికులు గత 13 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలపై దృష్టి సారించకపోవడం అన్యాయమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు నల్ల వెంకటయ్య, జేఏసీ కార్యదర్శి యజ్ఞ నారాయణ, ఏఐటియూసీ జిల్లా అద్యక్షులు నూనె రామస్వామి అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు నేడు దేవరకొండ ఆర్డీఓ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలలో పనిచేయుచున్న పారిశుద్ధ్య కార్మికులు, స్వీపర్లు, ఎలక్ట్రిషన్లు, డ్రైవర్లు, కారో బార్లు, బిల్ కలెక్టర్లు గా తదితర విభాగాలలో గత 20 నుండి 30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని వీరు నర్సరీలు, వైకుంఠధామాలు, పార్కులు, ఆఫీసు పరిసరాలు తదితర ప్రాంతాలలో పనులు నిర్వహిస్తూ, తమ ఆరోగ్యాలను సైతం చెడగొట్టుకొని ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం శ్రమిస్తున్నారని ఇలాంటి కార్మికులకు రాష్ట్రంలో కనీస వేతనాల జీవోలు సైతం అమలు కావటం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి కార్మిక సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. కార్మిక చట్టాలైనటువంటి కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, పండగ, జాతీయ ఆర్జిత సెలవులు లాంటి ఏ హక్కుల్ని కార్మికులు నోచుకోకపోవడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు, జే. వెంకట్రాములు, ఏ. మల్లయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా అద్యక్షులు వి. ఆంజనేయులు, సీఐటీయూ ఎన్. నాగరాజు, లక్ష్మణ్, శ్రీను, జేఏసీ నాయకులు సతీష్, జి. కొండల్, అయోధ్య, వీరయ్య, సైదులు, జవహర్ లాల్, పండ్ల అంజమ్మ, ఎర్ర వెంకటమ్మ, గణేష్, బొజ్య, దేవరాజ్, యాదయ్య, భారతి, లలిత, రాములమ్మ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.
NLG:జాతీయస్థాయికి ఎంపికైన నల్లగొండ టైక్వాండో క్రీడాకారుడు
నల్లగొండ పట్టణంలోని టైక్వాండో & ఫిట్‌నెస్ అకాడమీ క్రీడాకారుడు సోహం జాతీయస్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర 6వ క్యాడెట్ టైక్వాండో కైరోగీ & పూమాస్ ఛాంపియన్‌షిప్,  సోమవారం హైదరాబాద్‌లోని రామచంద్రాపురం బాలాజీ గార్డెన్స్‌లో జరిగింది, దీంట్లో నల్లగొండ టైక్వాండో క్రీడాకారుడు సోహమ్ మొదటి స్థానాన్ని పొందారు. ఈ సందర్భంగా కోచ్ అంబటి ప్రణీత్ మాట్లాడుతూ.. ఈ నెల 27 నుండి 30 వరకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఛాంపియన్షిప్ లో జాతీయస్థాయికి క్రీడాకారుడు సోహం ఎంపికైనట్లు తెలిపారు.
''పల్లెవెలుగు టౌన్ బస్ పాస్'' కు శ్రీకారం చుట్టిన టిఎస్ఆర్టిసి
TS: ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు కొత్తగా ''పల్లెవెలుగు టౌన్ బస్ పాస్'' కు టిఎస్ఆర్టిసి శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. 

ఈ టౌన్‌ పాస్ తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్ నగర్ లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ధరను సంస్థ ఖరారు చేసింది.

ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది.  ఆ బస్ పాస్ ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”ను సంస్థ తెచ్చింది.

హైదరాబాద్‌ లోని బస్‌ భవన్‌లో సోమవారం "పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌" పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 మంగళవారం నుండి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

“జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చిందని సజ్జనార్ అన్నారు.

ఈ బస్ పాస్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్‌ రవిందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఈడీలు మునిశేఖర్‌, కృష్ణకాంత్, పురుషోత్తం, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు: బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపిన పెండెం ధనుంజయ్
మునుగోడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ నాయకులు పెండెం ధనుంజయ్ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సోమవారం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆషాడ మాసంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే రీతిలో, తెలంగాణ ప్రజలు బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారని అన్నారు. బోనాల పండుగతో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం నిండాలని, సకాలంలో వర్షాలు పడి, పంటలు బాగా పండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి:టిడిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలంలో గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టిడిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికుల  న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పగడాల లింగయ్య, పుప్పాల యాదయ్య, అంజయ్య, గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.