మొక్కలు నాటిన మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు
నల్లగొండ జిల్లా, చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని లక్కారం మోడల్ స్కూల్ పక్కన ఉన్నటువంటి ఈద్గాలో  మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు, ఆదివారం ముస్లిం సోదరులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎం.డి బాబా షరీఫ్, కొయ్యడ సైదులు, నాయకులు దండ అరుణ్ కుమార్, షాదిఖాన ఛైర్మెన్ ఖలీల్, ముషీర్, జమీర్, చోటెబాబా, కదీర్, జమీర్, ఇబ్రహీం, గోరేమియ, ఖరీం మరియు మున్సిపల్ అధికారులు ఈఈ రేణు కుమార్, సూపర్వైజర్ నరసింహ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శేశలేటి వాగు ఫీడర్ చానల్ కు తక్షణమే మరమ్మతులు: ఎమ్మెల్యే కూసుకుంట్ల
నల్లగొండ జిల్లా, నాంపల్లి మండలం: శేషలేటి వాగు ఫీడర్ చానల్ మరమ్మతు పనులను  వెంటనే ప్రారంభించి నాంపల్లి , పెద్దాపురం చెరువులకు  నీరంధిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  తెలిపారు.  శనివారం నీటిపారుదల శాఖ అధికారులు, రైతులతో కలిసి నెవిళ్ళగూడం, బండ్ల గూడం గ్రామాల్లో  ఫీడర్ చానల్ దెబ్బతిన్న ప్రాంతాలను  ఆయన పరిశీలించారు.  రూ. 25 లక్షలతో తక్షణమే పీడర్ ఛానల్ మరమ్మతు పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.  కొన్నిచోట్ల కెనాల్  ఆక్రమణకు గురికాగా, రైతులతో మాట్లాడి సహకరించాలని కోరారు.  ఉప ఎన్నిక  సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.  ఇడికూడ- కొండమల్లేపల్లి డబుల్ రోడ్డు నిర్మాణం పనులకు రూ. 55 లక్షలతో జిఓ వచ్చిందని, త్వరలో టెండర్లు పిలుస్తారని అన్నారు.  పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా  మండలంలోని పలు గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం పట్ల ప్రతిపక్షాలు తప్ప ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నట్లు చెప్పారు.  తెలంగాణలో విద్యుత్ కష్టాలు లేవని, రైతులు ఏ ఒక్క రోజు కూడా రోడ్డెక్కలేదని గుర్తు చేశారు.  తెలంగాణలో సాగు విస్తీర్ణం, దిగుబడి రెట్టింపు అయ్యాయని, రైతుబంధు రైతు బీమా ఉచిత విద్యుత్ పథకాలతో రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు.  పెద్దాపురంలో సీసీ రోడ్ల నిర్మాణానికి , అసంపూర్తిగా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సిడిపి నిధులు   ఇవ్వనున్నట్లు చెప్పారు.  ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి అధ్యక్షులు ఏడుదొడ్ల  రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడపు నరసింహారావు మరియు ఎంపీటీసీలు, సర్పంచులు, మార్కెట్, సింగిల్ విండో డైరెక్టర్లు ,రైతులు, ఇరిగేషన్ అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
'సీఎం సహాయనిధి పథకం పేదలకు వరం': ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం, నాంపల్లి మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎంఆర్ఎఫ్) కింద 11 మందికి మంజూరైన  చెక్కులను ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శనివారం పెద్దాపురం గ్రామంలో లబ్ధిదారులకు అందజేశారు. షర్బాపురం కు చెందిన రాసిక భద్రయ్యకు రూ.10,000/-, గట్ల మల్లెపల్లికి చెందిన నారోజు ఉదయ కళ్యాణ్ కు రూ. 18,000/-, కేతేపల్లికి చెందిన పల్లేటి శ్రీను కు రూ. 12,000/-, మేళ్ళవాయికి చెందిన గుండెబోయిన వెంకటయ్య కు రూ. 20,000/-, పగిళ్ళ కవితకు రూ. 22,000/- బొడ్డుపల్లి పద్మ కు రూ.11,500/-, పస్నూరు కు చెందిన చింతకాయల సత్యనారాయణ కు రూ. 9500/-, పగిళ్ల యాదయ్యకు రూ. 30,500/- కండె పద్మకు రూ. 60,000, రేవల్లికి చెందిన మేకల కలమ్మకు రూ. 24,000/- తుమ్మలపల్లి కి చెందిన శేషలేటి రేణుక కు రూ.18,000/- విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 'సీఎం సహాయనిధి పథకం పేదలకు వరం' అని అన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
మాల్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా, యాచారం: మండలం మాల్ ధగ్గర రాఘవేంద్ర హోటల్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం సాయంత్రం 7 గంటల సమయం లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. హోటల్ ముందు క్రూయిజర్, బైక్  ఢీ కొన్న ప్రమాదం లో వడ్ల వీరబ్రహ్మం (45) రామంతపూర్ హైదరాబాద్ నివాసి, సొంత గ్రామం మలిగిల్ల మహబూబ్ నగర్, మరియు నారోజు శల్వచారి (40) తిరుగండ్లపల్లి గ్రామం మర్రిగూడ మండలం నల్గొండ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఘటన స్థలానికి యాచారం సిఐ సైదయ్య చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సైదయ్య  తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
జిపి కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
నల్లగొండ జిల్లా మర్రిగూడ: మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె శనివారం పదవరోజు కు చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, సిపిఐ మండల కార్యదర్శి ఈదుల బిక్షం రెడ్డి, ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూడిద సురేష్, కొన్ రెడ్డి గిరి శనివారం కార్మికుల సమ్మె శిబిరం వద్దకు వచ్చి మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ.. కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే ఆలోచించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. లేనియెడల  రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో  కార్మిక సంఘాలను ఏకం చేసి, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, యూనియన్ మండల కార్యదర్శి ఊరు పక్క లింగయ్య, పెరుమాండ్ల మంజుల, పోలేపల్లి రాములు, ఒంపు ముత్తమ్మ, సిల్వర్ మహేష్, గ్యార యాదగిరి, ఎండి ఆసిఫ్, ఐతపాక పద్మ, కటికల భారతమ్మ, గుండెపురి నరసింహ, ఏపూరి ముత్తయ్య, ఆవుల ముత్తయ్య, పోతరాజు కృష్ణయ్య, రాములమ్మ, అమ్రాబాద్ సునీత, తదితరులు పాల్గొన్నారు
అజిలాపురం గ్రామంలో టీబీ, లెప్రసీ వ్యాధులపై అవగాహన కార్యక్రమం
నల్లగొండ జిల్లా మర్రిగూడెం: మండలంలోని అజిలాపురం గ్రామంలో టీబీ, లెప్రసీ నోడల్ ఆఫీసర్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీబీ మరియు లెప్రసీ వ్యాధుల గురించి వివరించి, వ్యాధి వ్యాపించే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చికిత్స గురించి గ్రామస్తులకు వివరించారు. వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా అనిపించిన వ్యక్తుల శాంపిల్స్ సేకరించి పరీక్ష కొరకు ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిఎంపిఓ చంద్రశేఖర్, ఎస్ టి ఎస్ సైదులు, ఏఎన్ఎం ఫైమీన్, ఆశాలు ధనమ్మ, వెంకటమ్మ, యాదమ్మ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్ ను సందర్శించిన ప్రజాసంఘాల నాయకులు
నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి: మండల కేంద్రంలో ఎస్టీ ట్రైబల్ బాలికల గురుకుల హాస్టల్ ను, ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్ లు సందర్శించి హాస్టల్ బాలికల తోటి కలిసి భోజనం చేశారు. అక్కడ సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. విద్యార్థులకు హాస్టల్లో వాటర్ సమస్య ఉందని, పాఠశాలలు మొదలు అయ్యి నెల రోజులు గడుస్తున్నా కూడా హాస్టల్ విద్యార్థులకు నోట్ బుక్స్ ఇవ్వలేదని తెలిపారు. తక్షణమే వాటర్ సమస్య పరిష్కరించాలన్నారు. చిన్న పిల్లలకు వాటర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హాస్టల్స్ కు నోట్ బుక్స్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ధర్మపురం శీను, జిల్లా రాములు తదితరులు పాల్గొన్నారు.
9వ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె
నల్గొండ జిల్లా, మర్రిగూడెం: తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె మండల కేంద్రంలో నేటితో తొమ్మిదో రోజుకు చేరుకుంది. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ జిపి కార్మికుల సమస్యలను పరిష్కరించలన్నారు.

నల్గొండ జిల్లా, మర్రిగూడెం: తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె మండల కేంద్రంలో నేటితో తొమ్మిదో రోజుకు చేరుకుంది. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ జిప

రైతు బీమా కోసం అప్లై చేశారా..!
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం: కొత్తగా వ్యవసాయ భూమిని పట్టా చేసుకున్న రైతులు, రైతు బీమా కోసం అప్లై చేయాలని లెంకలపల్లి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి సుజాత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల రైతు బీమా ఉన్న వ్యక్తి మరణించినట్లయితే రూ. 5,00,000/- భీమా డబ్బులు వారి కుటుంబానికి అందుతాయని తెలిపారు. రైతు బీమా కోసం రైతు వేదిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు ఫారంతో పాటు
1. పట్టా పాస్ పుస్తకం లేదా ధరణి కాఫీ
2. రైతు ఆధార్ కార్డు
3. నామిని ఆధార్ కార్డు
అందజేయాలని అన్నారు.
దోస్త్ హెల్ప్ డెస్క్ నిర్వహణకు అనుమతి
నల్గొండ: జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గన్ శ్యామ్ ను, బుధవారం  స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకులపల్లి నరేష్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దోస్తు(డిగ్రీ) ద్వారా సీట్లు పొందిన విద్యార్థుల సందేహాల కొరకు, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో HELP-DESK నిర్వహించుటకు అనుమతి తీసున్నట్లు ఆకులపల్లి నరేష్ తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మేడి వాసుదేవ్, ఇట్టమల్ల రాకేష్ ఉన్నారు.