ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్ ను సందర్శించిన ప్రజాసంఘాల నాయకులు
నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి: మండల కేంద్రంలో ఎస్టీ ట్రైబల్ బాలికల గురుకుల హాస్టల్ ను, ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్ లు సందర్శించి హాస్టల్ బాలికల తోటి కలిసి భోజనం చేశారు. అక్కడ సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. విద్యార్థులకు హాస్టల్లో వాటర్ సమస్య ఉందని, పాఠశాలలు మొదలు అయ్యి నెల రోజులు గడుస్తున్నా కూడా హాస్టల్ విద్యార్థులకు నోట్ బుక్స్ ఇవ్వలేదని తెలిపారు. తక్షణమే వాటర్ సమస్య పరిష్కరించాలన్నారు. చిన్న పిల్లలకు వాటర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హాస్టల్స్ కు నోట్ బుక్స్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ధర్మపురం శీను, జిల్లా రాములు తదితరులు పాల్గొన్నారు.
9వ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె
నల్గొండ జిల్లా, మర్రిగూడెం: తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె మండల కేంద్రంలో నేటితో తొమ్మిదో రోజుకు చేరుకుంది. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ జిపి కార్మికుల సమస్యలను పరిష్కరించలన్నారు.

నల్గొండ జిల్లా, మర్రిగూడెం: తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె మండల కేంద్రంలో నేటితో తొమ్మిదో రోజుకు చేరుకుంది. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ జిప

రైతు బీమా కోసం అప్లై చేశారా..!
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం: కొత్తగా వ్యవసాయ భూమిని పట్టా చేసుకున్న రైతులు, రైతు బీమా కోసం అప్లై చేయాలని లెంకలపల్లి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి సుజాత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల రైతు బీమా ఉన్న వ్యక్తి మరణించినట్లయితే రూ. 5,00,000/- భీమా డబ్బులు వారి కుటుంబానికి అందుతాయని తెలిపారు. రైతు బీమా కోసం రైతు వేదిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు ఫారంతో పాటు
1. పట్టా పాస్ పుస్తకం లేదా ధరణి కాఫీ
2. రైతు ఆధార్ కార్డు
3. నామిని ఆధార్ కార్డు
అందజేయాలని అన్నారు.
దోస్త్ హెల్ప్ డెస్క్ నిర్వహణకు అనుమతి
నల్గొండ: జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గన్ శ్యామ్ ను, బుధవారం  స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకులపల్లి నరేష్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దోస్తు(డిగ్రీ) ద్వారా సీట్లు పొందిన విద్యార్థుల సందేహాల కొరకు, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో HELP-DESK నిర్వహించుటకు అనుమతి తీసున్నట్లు ఆకులపల్లి నరేష్ తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మేడి వాసుదేవ్, ఇట్టమల్ల రాకేష్ ఉన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు
యాదాద్రి జిల్లా, చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని  20వ వార్డులో ఉన్నటువంటి తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల/ జూనియర్ కళాశాలలో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ఏర్పాటు చేయడం కొరకు బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు శంకుస్థాపన చేశారు.        కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బాబా షరీఫ్, ప్రిన్సిపాల్ సరోజినీ, పాఠశాల చైర్మన్ చింతల సాయిలు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
లెంకలపల్లి లో ముమ్మరంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో  గామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ సూచనల మేరకు ముమ్మరంగా ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వాతావరణ శాఖ వారు నేడు, రేపు వర్షాలు అనే ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో మొక్కలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించాలని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ యాదయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది కందికంటి స్వామి, గ్రామస్తులు దాసరి వెంకన్న, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
జీవో 60 ప్రకారంగా వేతనాలు ఇవ్వాలి: చినపాక లక్ష్మీనారాయణ
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: మండల కేంద్రంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఆరవ రోజుకు చేరింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ.. మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, 60 జీవో ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని, గ్రామపంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి ఊరి పక్క లింగయ్య, పోలేపల్లి రాములు, నక్క నరసింహ, పెరుమాండ్ల మంజుల, అమ్రాబాద్ సునీత, ఐతపాక పద్మ, సిల్వేరు రమేష్, లక్ష్మీకాంత్ గుండెపురి నరసింహ, ఆవుల ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు
బిఆర్ఎస్ పార్టీలో చేరిన చామలపల్లి వార్డ్ మెంబెర్
నల్లగొండ జిల్లా, చండూర్ మండలంలోని చామలపల్లి గ్రామం నుండి వార్డ్ మెంబెర్ కొండల్, యూత్ అధ్యక్షుడు,  వారితో పాటు పలువురు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇతర పార్టీ నుండి, నేడు బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో జాయిన్ అయినవారు మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఐదవ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: మండలంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె సోమవారం 5వ రోజుకు చేరుకుంది. సిఐటియు కార్యాలయం నుండి మర్రిగూడ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. జిపి వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు ఒట్టిపళ్లి హనుమంతు, ఊరిపక్క లింగయ్య పెరుమాండ్ల మంజుల, పోలేపల్లి రాములు, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ ఉద్యోగుల మహాధర్నా
నల్లగొండ: ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలని, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సలీం మాట్లాడుతూ.. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ 26,000 చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటి చెల్లించాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.