మెరుస్తున్న సిరిసిల్ల.. బోసిపోయిన కరీంనగర్
కరీంనగర్ :
తెలంగాణ దశాబ్ది వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలు రెడీ అవుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసులు, పబ్లిక్ ప్లేసుల్లో విద్యుత్ లైట్ల వెలుగులతో అలంకరించారు. కానీ ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్లో ఆ ఏర్పాట్లేమీ కనిపించడం లేదు.
కలెక్టరేట్, సిటీలోని బస్టాండ్ జంక్షన్, కోర్టు జంక్షన్, గీతా భవన్ జంక్షన్లలో ఏర్పాట్లు చేయకపోవడంతో చీకట్లోనే ఉన్నాయి.. అమరవీరుల స్థూపానికి సైతం లైటింగ్ ఏర్పాటు చేయలేదు. దీంతో సిటీలో దశాబ్ది ఉత్సవాల సందడి కనిపించలేదు.
పరేడ్ గ్రౌండ్లో వేడుకులకు గంగుల
దశాబ్ది వేడుకలకు సిటీలోని పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. ఉదయం 9 గంటలకు మంత్రి గంగుల కమలాకర్ జెండా ఆవిష్కరించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించనున్నారు. కలెక్టరేట్, మున్సిపల్ ఆఫీస్, జడ్పీ ఆఫీసుల్లో జెండా ఆవిష్కరణలు చేయనున్నారు.
అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలి
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో రాష్ట్ర అవతరణ దశాబ్దిఉత్సవాలను నిర్వహించేందుకు అంతా రెడీ చేశారు. ఇక్కడి వేడుకలకు మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. అన్ని వర్గాల ప్రజల దశాబ్ధి వేడుకల్లో పాల్గొనాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు. జూన్2 నుంచి 22 వరకు జరిగే ఉత్సవాల్లో తెలంగాణ అభివృద్ధి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు...
Jun 04 2023, 09:52