నల్గొండ జిల్లా :బీఆర్ఎస్ ప్లీనరీని విజయవంతం చేయాలి.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

*బీఆర్ఎస్ ప్లీనరీని విజయవంతం చేయాలి.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

Streetbuzz news. నల్గొండ జిల్లా:

.

ఈ నెల 25 న నకిరేకల్ పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో నిర్వహించే బీఆర్ఎస్ నియోజకవర్గ ప్లినరీని విజయవంతం చేయాలనీ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ 2001 ఏప్రిల్ 27 న టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ నెల 25 న నియోజకవర్గ వ్యాప్తంగా గులాబీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు ప్లినరీ సమావేశానికి ప్రతి గ్రామం నుంచి 30 నుంచి 50 మంది హాజరుకావాలన్నారు ఈ సమావేశంలో పార్టీ ఆధ్వర్యంలో సాధించిన రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పార్టీ తరుపున చేపట్టిన కార్యక్రమాలన్నిటిని విస్తృతంగా చర్చించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి,గ్రంధాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి , కౌన్సిలర్లు,ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా :దీక్షాదక్షతకు ప్రతీక ఈద్ - ఉల్ - ఫితర్. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండగ రంజాన్.మాజీ ఎమ్మెల్యే.

*దీక్షాదక్షతకు ప్రతీక ఈద్ - ఉల్ - ఫితర్. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండగ రంజాన్.మాజీ ఎమ్మెల్యే వేదాస్ వెంకయ్య

Streetbuzz news. నల్గొండ జిల్లా :

.

రంజాన్ పర్వదినం సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని మసీదు వద్ద నిర్వహించిన సామూహిక ప్రార్థనలలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వేదాస్ వెంకయ్య పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు..

ఈ సందర్భంగా వేదాసు వెంకయ్య మాట్లాడుతూ..

నెలరోజుల పాటు ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి,ప్రేమ,దయ , సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని,తెలంగాణలో గంగా జమునా తహజీబ్ కు రంజాన్ పండుగ ప్రతీక అని ఆయన తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ముగింపు వేడుక అన్ని అన్నారు.

నియోజకవర్గ ప్రజలంతా భక్తి, శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఇంటిల్లిపాది రంజాన్ పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో.మాజీ వార్డ్ నెంబర్ గుణగంటి రాజు నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గుండ జలంధర్ రెడ్డి,ఎస్సీ సెల్ అధ్యక్షులు కోతపల్లి సైదులు,నకిరేకల్ మండల యూత్ అధ్యక్షులు బొంబాయి శ్రీను,శివ,మహేష్,తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా :ముస్లిం సోదర, సోదరి మణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి..

ముస్లిం సోదర, సోదరి మణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

.

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నకిరేకల్ పట్టణంలోని ఈద్గా దగ్గర ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...అందరికి అల్లా దీవెనలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.అత్యంత పవిత్ర పర్వదినం గా భావిస్తున్న ఈద్ ఉల్ ఫితర్ ను సాంప్రదాయ బద్దంగా సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు.గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణా ప్రతీక అని లౌకిక వాదం, మత సామారస్యం కాపాడడం లో తెలంగాణా యావత్ భారత దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో.నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,జడ్పీటీసీ మాద ధనలక్ష్మినగేష్,కౌన్సిలర్లు, మైనార్టీలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్ లో షాదీఖానా నిర్మాణానికి రూ. కోటి రూపాయలు మంజూరు చేసిన సీఎం.ఎమ్మెల్యే చిరుమర్తి.

నకిరేకల్ లో షాదీఖానా నిర్మాణానికి రూ. కోటి రూపాయలు మంజూరు చేసిన సీఎం.ఎమ్మెల్యే చిరుమర్తి.

నకిరేకల్ లో షాదీఖానా నిర్మాణానికి రూ.1 కోటి రూపాయలు మంజూరు..

ఎమ్మెల్యే చిరుమర్తికి జీ.ఓ కాపీని ప్రగతి భవన్ లో అందజేసిన సిఎం కేసీఆర్..

షాదీఖాన నిర్మాణానికి నిధులిచ్చిన సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే చిరుమర్తి..

బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ పూర్తికి నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ను వివరించిన ఎమ్మెల్యే చిరుమర్తి..

మే నెలలో ట్రయల్ రన్ వేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సిఎం కేసీఆర్..

వాటితోపాటు నియోజకవర్గంలో పలు పెండింగ్ పనులను సిఎం కేసీఆర్ కు వివరించిన ఎమ్మెల్యే చిరుమర్తి..

సానుకూలంగా స్పందించిన సిఎం కేసీఆర్, అధిక నిధుల కేటాయింపుకు సముఖత..

ఐపీల్ లో కి అడుగు పెట్టబోతున్న రామ్ చరణ్..! ఆర్‌ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఐపీల్ లో కి అడుగు పెట్టబోతున్న రామ్ చరణ్..!

ఆర్‌ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఆర్‌ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే ఈ హీరో తన సతీమణితో కలిసి మల్దీవ్స్ టూర్స్‌లో ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్క టీమ్ కూడా లేదు.

కాగా ఏపీ నుంచి కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని చరణ్ సన్నాహాలు చేస్తున్నారని, దీనికి సంబంధించి ప్లాన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయని, వచ్చే సంవత్సరం ఈ హీరో ఫ్రాంచైజీ నుంచి ఒక కొత్త ఐపీఎల్ టీమ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే ఈ టీమ్‌కు వైజాగ్ వారియర్స్ పేరు కూడా ఫిక్స్ చేశారట. కానీ దీన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ న్యూస్‌తో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

నల్గొండ జిల్లా :సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి చంద్రం ఫౌండేషన్ చైర్మన్, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్ లక్ష రూపాయలు విరాళం.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి చంద్రం ఫౌండేషన్ చైర్మన్, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్ లక్ష రూపాయలు విరాళం.

Streetbuzz news. నల్గొండ జిల్లా ::

.

శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో ప్రతిష్టించనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి చంద్రం ఫౌండేషన్ చైర్మన్, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్ లక్ష రూపాయలు విరాళం వల్లాల గౌడ సంఘం అధ్యక్షులు

 కట్టగూరి శ్రీనివాస్ కి అందజేశారు అనంతరం వల్లాల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వల్లాల ఎంపిటిసి మాధగోని కవిత రామలింగం మాజీ సర్పంచ్ కట్టగూరి యాదగిరి బుడిగ వెంకటేశ్వర్లు మాదగొని ప్రశాంత్ భూపతి వెంకటేశ్వర్లు రమేష్ సత్యనారాయణ రాములుదామోదర్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు,

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు,

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన సందర్బంగా ప్రగతి భవన్ లో. శాలువా కప్పి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన.ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు.ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు,జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,చిరుమర్తి చేయూత ఫౌండేషన్ చైర్మన్ చిరుమర్తి మనోజ్,తదితరులు ఉన్నారు.

నల్గొండ జిల్లా.:ఘనంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకల

ఘనంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు

..

Streetbuzz news. నల్గొండ జిల్లా :

వేలాదిగా తరలివచ్చిన చిరుమర్తి అభిమానులు, బిఆర్ఎస్ శ్రేణులు..

జనసంద్రంగా మారిన నార్కట్ పల్లి పట్టణం..

నార్కట్ పల్లి, నకిరేకల్ లో వేర్వేరుగా రక్తదాన శిబిరాల ఏర్పాటు..

నార్కట్ పల్లిలో రూ. 16 కోట్లతో సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులకు శంకుస్థాపన..

హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో..ఎంపీపీలు, జడ్పీటీసీలు,ఎంపిటిసిలు సర్పంచులు,ఉపసర్పంచ్లు,వార్డ్ నెంబర్లు,వివిధ హోదాలో ఉన్న ప్రజా ప్రతినిధిలు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా:కేతేపల్లి:వీబీకే ల సమస్యలు తీర్చాలి.బీజేపీ మండల అధ్యక్షులు రాచకొండ గోపి గౌడ్.

వీబీకే ల సమస్యలు తీర్చాలి.బీజేపీ మండల అధ్యక్షులు రాచకొండ గోపి

కేతేపల్లి బీజేపీ మండల అధ్యక్షులు రాచకొండ గోపిగౌడ్ ఆధ్య్వర్యంలో వీబీకే ల సమస్యలు తీర్చాలి అని కేతేపల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు మండల వీబీకే లతో కలిసి వారికీ మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేతేపల్లి మండల ఇంచార్జి బీజేపీ రాష్ట్ర నాయకులు షేపురి రవీందర్, పాల్గొని. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వీబీకే లకు ప్రస్తుతం నెలకు ఇచ్చే 3600 రూపాయలు సరిపొవట్లేదని వారి జీతాలు పెంచాలి అని , వారికీ పది లక్షల ఆరోగ్య భీమా కల్పించాలి అని ,అర్హత కలిగిన వారిని సీసీ లుగా గుర్తించాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఐతగొని అనిత,జిల్లా కార్యవర్గ సభ్యలు జటంగి రాంచంద్రయ్య,మాజీ మండల అధ్యక్షులు తాడోజు నర్సింహా చారీ,మండల ప్రధాన కార్యదర్శి పిట్టల వెంకట్, కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి, మండల కోశాధికారి ఐతగొని చంద్రశేఖర్,బూతు అధ్యక్షులు సమ్మెట రాఘవరాజు,తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా::రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లిం లకు దుస్తువులు పంపిణీ చేసిన .కట్టంగూర్.ఎంపీపీ,జెడ్పీటీసీ.

రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లిం లకు దుస్తువులు పంపిణీ చేసిన.ఎంపీపీ' జెడ్పీటీసీ.

కట్టంగూర్ పట్టణ కేంద్రం ఎమ్మార్వో ఆఫీస్ లో రంజాన్ మాసం సందర్బంగా పేద ముస్లింలకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను పంపిణీ చెసిన.ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య మరియు. జెడ్పీటీసీ తరాల బలరామ్,అనంతరం. వారు మాట్లాడుతూ..సర్వ మతాల సంప్రదాయాలకు ఆధార వ్యవహారాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ,పి ఏ సి ఎస్.చైర్మన్ నూక సైదులు, ఎమ్మార్వో సునీత, మండల కో ఆప్షన్ మెంబర్ ఎస్ కే జానిపాషా, ఎంపిటిసి లు ఎడ్ల పురుషోత్తం రెడ్డి,మల్లేబోయిన శ్రీలత కృష్ణ,బెల్లి సుదాకర్, మాజీ సర్పంచ్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత. గద్దపాటి దానయ్య,మండల నాయకులు పెద్ది బాలనరసింహ,అటిపాముల.గ్రామ శాఖ అధ్యక్షులు చౌగోని నాగరాజు,రేఖల బిక్షం, జహంగీర్,స్లిమ్,తదితరులు పాల్గొన్నారు...