madagoni surendar

Apr 17 2023, 18:58

సూర్యాపేట జిల్లా ::జాన్ పహాడ్ దర్గాలో భక్తులను నిలువునా..దోచేస్తున్నారు.

జాన్ పహాడ్ దర్గాలో భక్తులను నిలువునా..దోచేస్తున్నారు

ఏప్రిల్ 17 : సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్ పహాడ్ గ్రామంలో సైదులు స్వామి దర్గా వద్ద మొక్కులు తీర్చుకొనేందుకు వచ్చిన భక్తులను నిలువునా దోచేస్తున్నారు.

దర్గాలోనికి వెళ్లాలంటే 700 రూపాయలు, దర్గాలోపల మరోచోట 1100 రూపాయలు చెల్లించకపోతే దర్గాలోనికి అనుమతించడం లేదు.

దర్శనానికి వెళ్ళితే అదనంగా మరో 100 రూపాయలు వసూలు చేస్తున్నారు.

ఇన్ని జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు వాపోతున్నారు.

దేవుని దర్శనానికి వచ్చి మొక్కులు తీర్చుకోవాలంటే దర్గా లోపలా, బయట కలిపి మొత్తం దాదాపు 5వేల రూపాయల ఖర్చు అవుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

madagoni surendar

Apr 17 2023, 16:43

నల్గొండ జిల్లా. నకిరేకల్ ::హత్ జోడో అభియాన్ యాత్ర సన్నాక సమావేశానికి హాజరైన. మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య.

హత్ జోడో అభియాన్ యాత్ర సన్నాక సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య.

నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలంలోనీ జేపీ ఫంక్షన్ హాల్ లో జరిగిన హత్ సే హత్ జోడో అభియాన్ యాత్ర సన్నాక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య. ఈ సందర్భంగా. మాజీ ఎమ్మెల్యే వెంకయ్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రామన్నపేట మండలం నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ,యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు .పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాముల శేఖర్ .మాజీ మండల అధ్యక్షుడు శరత్ చంద్ర. యూత్ కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షులు గుండా జలంధర్ రెడ్డి. మైనార్టీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యూసుఫ్ జానీ .కిసాన్ సెల్ రాష్ట్ర కో_ఆర్డినేటర్ అల్గుబెల్లి మహేందర్ రెడ్డి . రామన్నపేట మండల చేనేత విభాగం అధ్యక్షులు సాయిబాబు. కేతపల్లి మాజీ మండలాధ్యక్షుడు కోట పుల్లయ్య . నకిరేకల్ మాజీ వార్డ్ మెంబర్ గుణగంటి రాజు గౌడ్ .ఐ.యన్. టి.యు.సి. జిల్లా జనరల్ సెక్రెటరి తాటిపాముల కిరణ్ కుమార్. ఐ.యన్.టి .యు.సి. అధ్యక్షుడు లింగం గౌడ్. ఎస్సీ సెల్ రామన్నపేట మండల అధ్యక్షుడు గురక శివ. నకిరేకల్ మండలం అధ్యక్షుడు కొత్తపెళ్లి సైదులు .నకిరేకల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంబాయి శీను. బయ్య ముత్తయ్య.మరియు రామన్నపేట మండలంలోని వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 17 2023, 15:55

నల్గొండ జిల్లా :నకిరేకల్ ::పేద ముస్లింలకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను పంపిణీ చేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి*

పేద ముస్లింలకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను పంపిణీ చేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

Streetbuzz news. నల్గొండ జిల్లా :

రామన్నపేట మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో రంజాన్ మాసం సందర్బంగా పేద ముస్లింలకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను సోమవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి.మాట్లాడుతూ...సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని ఆయన తెలిపారు.వారి ఉన్నతికి అనేక సంక్షేమ పధకాలను తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కింది అని ఆయన అన్నారు.సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు బాగుంటే నే అది మంచి సమాజం అవుతదని నమ్మిన నేత కేసీఆర్ అన్నారు.అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తున్నది.

madagoni surendar

Apr 16 2023, 19:04

నల్గొండ జిల్లా :నకిరేకల్:: ఎల్ ఓ సి. చెక్కును అందజేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

ఎల్ ఓ సి చెక్కును అందనేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

రామన్న పేట మండలం లక్ష్మ పురం గ్రామానికి చెందిన నీల లింగయ్య. ఆనారోగ్యంతో బాధపడుతూ అత్యసవర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పధకం కింద మంజూరైన రూ. 2 లక్షల రూపాయల ఎల్ ఓ సి.ని ఆదివారం నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,అందజేశారు. అనంతరం. చిన్నారి ని అశిర్వదించిన.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కట్టంగూర్ ఉప సర్పంచ్ అంతటీ శీనుగౌడ్ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశిన.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.ఈ కార్యక్రమంలో.గ్రంథాలయ చైర్మన్ మల్లికార్జున, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ్మ గౌడ్,నాయకులు రాచకొండ శ్రవణ్ గౌడ్,పోగుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 15 2023, 12:51

నల్గొండ జిల్లా ::నకిరేకల్ :మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.

పేద ముస్లింలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.శనివారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ పండుగ సందర్బంగా పేద ముస్లిం కుటుంబాలకు బట్టల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.....సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని ఆయన తెలిపారు.వారి ఉన్నతికి అనేక సంక్షేమ పధకాలను తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కింది అని ఆయన అన్నారు.సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు బాగుంటే నే అది మంచి సమాజం అవుతదని నమ్మిన నేత కేసీఆర్ అన్నారు.అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తున్నది. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ జడ్పీటీసీ మాద ధనలక్ష్మినాగేష్,మండల కో ఆప్షన్ నెంబర్ డాక్టర్ ఖాసీం ఖాన్,కౌన్సిలర్లు,మైనార్టీలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు,

madagoni surendar

Apr 14 2023, 19:58

నల్గొండ జిల్లా :నకిరేకల్ పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

నకిరేకల్ పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో డా. బీ.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్బంగా నాయకులతో కలిసి బస్టాండ్ దగ్గర విగ్రహానికి పులామాల వేసి నివాళులు అర్పించి. పట్టణ బూత్ లలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బి జె కే యమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడుగుంట్ల సాయన్న,పట్టణ అధ్యక్షులు పల్స శ్రీనుగౌడ్ మాట్లాడుతూ..అంబేద్కర్ ఆలోచనలకు అనుకూలంగా భారత ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అంబేద్కర్ దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఇస్తా అన్నా మూడు ఎకరాల భూమి ఇవ్వలేదని,డబుల్ బెడ్రూం ఇవ్వలేదు,ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు,దళితులకు దళిత బంధు ఇస్తా అని ఇవ్వకుండా వీటిని మభ్యపరిచేందుకు 125 అడుగుల విగ్రహం కట్టిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మనసుకు శాంతి చేకూరదని తెలంగాణ ప్రజలు బి ఆర్ ఎస్. ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాలడుగు నగేష్,మైల శ్రీనివాస్,అప్పం అంజయ్య,నిమ్మల ఉమ,నడికుడి నవీన్,వంగురి సైదులు,ఏర్పుల నరేష్,శ్యామ్ రెడ్డి,జాల వెంకన్న,రాపోలు ఉపేంద్రా,ప్రవీణ్,తదితర మిత్రులు పాల్గోన్నారు.*

madagoni surendar

Apr 14 2023, 19:50

నల్గొండ జిల్లా :నకిరేకల్ :డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి*

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున హుస్సేన్ సాగ‌ర్ తీరాన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భార‌త రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ 125 అడుగుల మహా విగ్ర‌హాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో. జిల్లా మంత్రి వర్యులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి మరియు జిల్లా ప్రజా ప్రతినిధులతో కలసి పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,నకిరేకల్ నియోజకవర్గ.జడ్పీటీసీలు, ఎంపీపీలు ఎంపిటిసిలు,సర్పంచులు, ఉపసర్పంచ్,వార్డ్ నెంబర్లు, మాజీ ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 14 2023, 18:51

నల్గొండ జిల్లా:కట్టంగూర్ మండలం::డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులర్పించిన.నాయకులు.
  • డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులర్పించిన. నాయకులు

.

Streetbuzz news :నల్గొండ జిల్లా

కట్టంగూర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించిన. నాయకులు ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు ప్రపంచ దేశాలు సైతం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు.అని అన్నారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గద్దపాటి దానయ్య మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి జయంతి నిర్వహించుకోవడం. ఎంతో సంతోషం గత కొన్ని సంవత్సరాల నుండి ఐక్యరాజ్యసమితి డాక్టర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా నేడు తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ జన్మదిన సందర్భంగా 125 అడుగుల ఎత్తు విగ్రహ ఆవిష్కరణ హుసేన్ సాగర్ దగ్గరలో నిర్వహించడం యావత్ ప్రపంచం గర్జించదగ్గ విధంగా జయంతినీ నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంటరానితనం అసమానతలు సైతం లెక్క చేయకుండా ముందుకు సాగిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు అన్నారు. అనంతరం. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మేడి వెర్నిక రత్న పుట్టినరోజు కార్యక్రమాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సన్నిధిలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో.కట్టంగూర్ మాజీ జెడ్పిటిసి సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,మాజీ రెపరండం సర్పంచ్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత గద్దపాటి దానయ్య, విద్యార్థి జిల్లా నాయకులు కొమ్మనబోయిన సైదులు యాదవ్,ప్రముఖ అడ్వకేట్ మేడి విజయకుమార్,జిల్లా యువజన నాయకులు ముక్కాముల శేఖర్ యాదవ్,బొజ్జ శ్రీను,ఊట్కూరి రాజశేఖర్,శ్రీనివాస్,పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 14 2023, 18:46

నల్గొండ జిల్లా:కట్టంగూర్ మండలం::డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులర్పించిన.నాయకులు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులర్పించిన. నాయకులు

.

Streetbuzz news :నల్గొండ జిల్లా

కట్టంగూర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించిన. నాయకులు ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు ప్రపంచ దేశాలు సైతం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు.అని అన్నారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గద్దపాటి దానయ్య మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి జయంతి నిర్వహించుకోవడం. ఎంతో సంతోషం గత కొన్ని సంవత్సరాల నుండి ఐక్యరాజ్యసమితి డాక్టర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా నేడు తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ జన్మదిన సందర్భంగా 125 అడుగుల ఎత్తు విగ్రహ ఆవిష్కరణ హుసేన్ సాగర్ దగ్గరలో నిర్వహించడం యావత్ ప్రపంచం గర్జించదగ్గ విధంగా జయంతినీ నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంటరానితనం అసమానతలు సైతం లెక్క చేయకుండా ముందుకు సాగిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు అన్నారు. అనంతరం. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మేడి వెర్నిక రత్న పుట్టినరోజు కార్యక్రమాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సన్నిధిలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో.కట్టంగూర్ మాజీ జెడ్పిటిసి సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,మాజీ రెపరండం సర్పంచ్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత గద్దపాటి దానయ్య, విద్యార్థి జిల్లా నాయకులు కొమ్మనబోయిన సైదులు యాదవ్,ప్రముఖ అడ్వకేట్ మేడి విజయకుమార్,జిల్లా యువజన నాయకులు ముక్కాముల శేఖర్ యాదవ్,బొజ్జ శ్రీను,ఊట్కూరి రాజశేఖర్,శ్రీనివాస్,పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 14 2023, 17:43

నల్గొండ :నకిరేకల్ :డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి ఘనంగా నిర్వహించిన.కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య.

బాబా సాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి ఘనంగా నిర్వహించిన.కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణ కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి.ఆ మహనీయుని స్మరించుకుని. ఈ సందర్భంగా. మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య. మాట్లాడుతూ...అంటరానితనంపై అంబేద్కర్ పూరించిన సమరశంఖం నేటికీ అగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉంది. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా,సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి సేవలు సవరించుకుందాం భవిష్యత్తు తరాలకు వారు చేసిన కృషిని తెలియచేద్దాం ఆయన ఆశయాలను కొనసాగిద్దాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు రాజు,

యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు గుండా జలంధర్ రెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంబాయ్ శ్రీను,యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు..