రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
.
.
Streetbuzz న్యూస్. నల్గొండ జిల్లా :
రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు బుధవారం కట్టంగూర్ మండల కేంద్రంలో మరియు అయిపాముల,మునుకుంట్ల గ్రామంలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలన్ని ప్రారంభించిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియెగం చేసుకోవాలన్నారు.అనంతరం ఈదులూరు గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనంతరం. గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి..గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 80 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో.కట్టంగూర్ ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య ,జడ్పీటీసీ తరాల బలరాం, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ గౌడ్, పీ.ఏ.సి.ఎస్.చైర్మన్ నూక సైదులు,మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు,ఎంపిడిఓ సునీత,సర్పంచులు,ఎంపిటిసిలు, వార్డ్ నెంబర్లు అధికారులు,నాయకులు. తదితరులు పాల్గొన్నారు.
Apr 12 2023, 14:47