మాక్డ్రిల్తో అప్రమత్తమైన భారత్.. కొత్తగా 5,676 కేసులు, 15 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో గత మూడు రోజులుగా 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం..
24 గంటల వ్యవధిలో 5,676 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ లో ముగ్గురు చొప్పున, కేరళలో ఇద్దరు, గుజరాత్, హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,000కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 37,093 యాక్టివ్ కేసులు ఉండగా, కేరళలో 13,745, మహారాష్ట్రలో 4,667, ఢిల్లీ- 2,338, తమిళనాడు- 2,099, గుజరాత్- 1,932, హరియాణా - 1,928, కర్ణాటక - 1,673, ఉత్తర్ ప్రదేశ్లో 1,282 కేసులు ఉన్నాయి. ఇక మిగిలిన ఇతర రాష్ట్రాల్లో వెయ్యికి లోపే కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది..
Apr 11 2023, 14:05