నల్గొండ జిల్లా :అవినీతిపై యుద్ధానికి యూత్ కాంగ్రెస్ సిద్ధం .కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సాకారం.

అవినీతిపై యుద్ధానికి యూత్ కాంగ్రెస్ సిద్ధం

కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సాకారం

బూత్ జోడో యూత్ జోడో తెలంగాణ ఇన్చార్జి శ్రీనివాస్

నకిరేకల్ లో యూత్ కాంగ్రెస్ సమన్వయ సమావేశం

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దోచుకుంటున్న అవినీతిపరులపై యుద్ధం చేయడానికి యూత్ కాంగ్రెస్ సిద్ధం అవుతోందని బూత్ జోడో యూత్ జోడో తెలంగాణ ఇన్చార్జి శ్రీనివాస్ అన్నారు. నకిరేకల్ నియోజకవర్గం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు గుండా జలందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన బూత్ జోడో యూత్ జోడో కార్యక్రమానికి తెలంగాణ ఇన్చార్జి శ్రీనివాస్ హాజరై యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక శిక్షణ అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీళ్లు, నియామకాల కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ, విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడుతుంటే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, ఇప్పటికీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి బూత్ కు సంబంధించిన ఓటర్లను సమన్వయపరుచుకోవడమే బూత్ జోడో యూత్ జోడో ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొనసాగిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల కళలు సాకారం కావాలన్నా, బాబాసాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.

ధరణి దరిద్రాన్ని పారదోలుతాం: రాజారమేష్ యాదవ్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు ఇబ్బందులు పెట్టే ధరిణి దరిద్రాన్ని పారదోలుతామని యూత్ కాంగ్రెస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాజారమేష్ యాదవ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తున్న యువకులంతా ధరిణి పోర్టల్ ద్వారా ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారో రైతులకు వివరించాలని కోరారు. నకిరేకల్ నియెజవర్గంలో ఎవరూ పోటీచేసినా కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని అన్నారు. బూత్ జోడో యూత్ జోడోతో ముందుకు పోతామని, క్రియాశీలకంగా పనిచేసే వారికి కాంగ్రెస్ లో ప్రథమ స్థానం ఉంటుందని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నకిరేకల్ చౌరస్తా వరకూ వందల సంఖ్య యూత్ కాంగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జఠంగి వెంకటనర్సయ్య, బడుగుల చంద్రశేఖర్ యాదవ్, బొంబాయి శ్రీను, మాచర్ల శ్రీను, ఒంటే పాక తిరుమలేశ్, వేణు, పావురాల సైదులు, పజ్జూరి లింగస్వామి, బొజ్జ చంటి, తదితరులు పాల్గొన్నారు.

పీఆర్వో

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

ఏపీ:దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫ్యామిలీ డాక్టర్ పథకం. పేదవాడి ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫ్యామిలీ డాక్టర్ పథకం

పేదవాడి ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత

జగన్నాధపురం గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ప్రారంభిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

తాడేపల్లిగూడెం ప్రభన్యూస్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే ఫ్యామిలీ డాక్టర్ అనే పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు గురువారం తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. స్వర్గీయ దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పధకం ఇప్పుడు దేశానికీ శిరోధార్యంగా మారిందన్నారు. కరోన సమయంలో దేశం మొత్తం అల్లాడిపోయినా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి పౌరుడి ఆరోగ్యం సమాచారం సేకరించిన సచివాలయం వ్యవస్థ ద్వారా మరింత మొరుగైన ఆరోగ్యాన్ని అందించాలనే ఆశయంతో ఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.పేదవాడి ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధమపాధాన్యత అన్నారు. ఆరోగ్యానికి కాపాడుకొనేందుకు వేలాది, లక్షలాది. రూపాయలను వెచ్చించే దుస్థితి నుండి పేదవాడిని రక్షించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోపడుతుందన్నారు. దీనితో ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు పథకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. నాడు వైఎస్.రాజశేఖరరెడ్డి నేడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రజా ఆరోగ్యం కోసం ఆలోచన చేశారన్నారు. కార్యక్రమంలో ద్వారకాతిరుమల ట్రస్ట్ బోర్డ్ మెంబర్ ముప్పిడి సంపత్ కుమార్ జడ్పిటిసి సభ్యులు ముత్యాల ఆంజనేయులు తాడేపల్లిగూడెం ఎంపీపీ శేషు లత పెంటపాడు ఎంపీపీ దాసర హేమావతి ఇతర ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఏపీ :జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 (ఎన్.ఎప్.ఎస్. ఏ) కింద లబ్ధిదారుల కవరేజీ గురించి పార్లమెంటులో ప్రశ్నించిన అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ.

జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 (ఎన్.ఎప్.ఎస్. ఏ) కింద లబ్ధిదారుల కవరేజీ గురించి పార్లమెంటులో ప్రశ్నించిన అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ.

అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు లోక్ సభలో జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 (NFSA) కింద లబ్ధిదారుల కవరేజీలో ప్రజాపంపిణీ వ్యవస్థలోని అసమానతలను పరిష్కరించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ప్రశ్నించారు. అదే విధంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పేదరిక స్థాయిలను నిర్ధారించడానికి కేంద్రం చేపట్టిన అధ్యయనాల గురించి సమాచారంతో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో లోని కవరేజీకి సంబంధించి ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా అని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరారు

ఇందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వర్యులు సాధ్వి నిరంజన్ జ్యోతి సమాధానమిస్తూ, జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 గ్రామీణ జనాభాలో 75% వరకు మరియు పట్టణ జనాభాలో 50% వరకు కవరేజీని అందిస్తోందని చెప్పారు.

ఈ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం, ప్రతి రాష్ట్రానికి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో పబ్లిక్ డిస్ట్రిల్ సిస్టమ్ కింద ఉన్న శాతం కవరేజీని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని, మరియు రాష్ట్రంలో కవర్ చేయాల్సిన మొత్తం వ్యక్తుల సంఖ్య సంబంధిత గణాంకాలు, ప్రచురించబడిన జనాభా లెక్కల ఆధారంగా లెక్కించబడుతాయని సాధ్వి నిరంజన్ జ్యోతి పేర్కొన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలోని 81.35 కోట్ల జనాభాలో, 80.11 కోట్ల మంది లబ్ధిదారులను ఈ చట్టం పరిధిలో గుర్తించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మరో 1.24 కోట్ల అదనపు లబ్ధిదారులను గుర్తించే అవకాశం ఉందిని కేంద్ర మంత్రి తెలిపారు.

లబ్ధిదారుల కవరేజీని 2011 -12 లో అప్పటి అధ్యయనాల ఆధారంగా ప్రణాళికా సంఘం (నేటి నీతి ఆయోగ్) నిర్ణయించిందని, ప్రస్తుతం,ఈ చట్టం కింద కవరేజీలో సవరణ ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని, ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే కవరేజీ కొనసాగనుందని కేంద్ర మంత్రి తెలియజేశారు.

అమరావతి::ఏపీ లో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీ లకు రంగం సిద్దం.

అమరావతి

ఏపీ లో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీ లకు రంగం సిద్దం?

ఇవ్వాలో, రేపు అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం

ఎన్నికల దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, ఎస్పీల బదిలీ ప్రక్రియ

కొందరు కలెక్టర్ల, ఎస్పీలు భారీగా ఫిర్యాదులు చేసిన ప్రజా ప్రతినిధులు...

గత నెలలోనే బదిలీ జరగాల్సిన సీఎం ఆమోదం కాకపోవడంతో నిలిచిన బదిలీలు.

నల్గొండ జిల్లా :భారతీయ జనతా పార్టీ నకిరేకల్ పట్టణ అధ్యక్షులు పల్స శ్రీను గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 43వ,ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించరు

భారతీయ జనతా పార్టీ నకిరేకల్ పట్టణ అధ్యక్షులు పల్స శ్రీను గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 43వ,ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించరు.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

భారతీయ జనతా పార్టీ నకిరేకల్ పట్టణ అధ్యక్షులు పల్స శ్రీను గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 43వ,ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించరు. ఈ కార్యక్రమంలో. ముఖ్య అతిథులుగా రాష్ట్ర దళిత మోర్చా కార్యదర్శి పోతేపాక సాంబయ్య పాల్గొని. పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేసి.అనంతరం వారు మీడియాతో. మాట్లాడుతూ. బిజెపి పార్టీ మహా నాయకుల ఆత్మ బలిదానాలతో వెలసిన పార్టీ ఇద్దరు వ్యక్తులతో మొదలుకొని నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వాలు నమోదైన పార్టీగా వెలిసింది బిజెపి కార్యకర్త సిద్ధాంతంతో ఒక్కొక్క సైనికుడై పోరాడుతున్నారని తెలిపారు అదే విధంగా ఈరోజు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ రాక్షస పాలన అవినీతి పాలన దొర పాలన ప్రతిపక్షాల గొంతు నొక్కిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ని అరెస్టు చేసినందుకు బిఆర్ఎస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రజలు కూడా బిఆర్ఎస్ పార్టీని కూకటి వేళ్ళతో పీకి పడేస్తారని దిశగా తెలిపారు

ఈ కార్యక్రమంలో జిల్లా డాకయ్య,తాడికొండ రామ్మూర్తి,మైల శ్రీనివాస్, అప్పం అంజయ్య,నారగోని వెంకటేశ్వర్లు,పెండం చంద్రమోహన్,చినేని జానీ,జాల వెంకన్న, నడికుడి నవీన్,బ్రహ్మయ్య, సోమయ్య, రాపోలు శరత్,తదితర మిత్రులు పాల్గొన్నారు

గద్వాల పట్టణంలోని డీకే అరుణ బంగ్లా లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలోబిజెపి జిల్లా ప్రదాన కార్యదర్శి డాక్టర్ డికె స్నిగ్ద రెడ్డి

ఈరోజు గద్వాల పట్టణంలోని డీకే బంగ్లా లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలోబిజెపి జిల్లా ప్రదాన కార్యదర్శి డాక్టర్ డికె స్నిగ్ద రెడ్డి మాట్లాడుతూ..

పరంపర అనే పేరుతో ఆహుతి సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

దేశ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించే విధంగా ఈ నెల 9వ తేదీనా 6:30 గంటలకు గద్వాల తేరు మైదానంలో

ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మన దేశ కళలు, సాంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నది.

ఇందులో భాగంగా మన గద్వాల్ లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతతోపాటు, యువతకు వాటి పట్ల ఆసక్తి కనబరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అని అన్నారు

ఈ కార్యక్రమం నృత్యగ్రామ్ డాన్స్ ఎన్సెంబుల్ చిత్ర సేన డాన్స్ కంపెనీ వారు శ్రీలంక కళాకారుల చేత నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమం తమ ప్రాంతంలో నిర్వహిస్తే ఎంతో బాగుంటుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి వెంటనే స్పందించి ఈ కార్యక్రమ నిర్వహణపై అనుమతి ఇవ్వడం జరిగింది..

ఇటువంటి కార్యక్రమంలో గద్వాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడంతోపాటు రాబోయే తరాలకు సంస్కృతి, సంప్రదాయాల విలువలను అందించాలని అన్నారు...

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు,జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి,జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు క్రిష్ణ వేణి , కిసాన్ మోర్చా అధ్యక్షుడు పాల్వాయి రాముడు తదితరులు ఉన్నారు.

ఏపీ:కాలుష్య నివారణకు తగు చర్యలు చేపడతాం.షా బుఖారి బాబా దర్గా మసీదు ప్రాంగణాన్ని సందర్శించిన. ‌ ఎన్ టి టి పి ఎస్ ఎన్విరాన్మెంట్ ఈ ఈ బాబురావు.

కాలుష్య నివారణకు తగు చర్యలు చేపడతాం

షా బుఖారి బాబా దర్గా మసీదు ప్రాంగణాన్ని సందర్శించిన ‌ ఎన్ టి టి పి ఎస్ ఎన్విరాన్మెంట్ ఈ ఈ బాబురావు*

కొండపల్లి మున్సిపాలిటీ,

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హజ్రత్ సయ్యద్ షాబుఖారి దర్గా మసీదు పరిసర ప్రాంతమంతా ఎన్టీపీఎస్ కాలుష్యం వలన దర్గాకు మసీదుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదు మేరకు నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్విరాన్మెంట్, బాబురావు ఇతర అధికారులు షా బుఖారి బాబా దర్గా మరియు మసీదు ప్రాంగణం ఈరోజు పరిశీలించారు.

పొల్యూషన్ కారణంగా త్వరగా కు భక్తులు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలుష్యంతో దర్గా ప్రాంగణమంతా నల్లగా అయిపోతుందని, మసీదులో కనీసం నమాజ్ చేసుకునేందుకు కూడా భక్తులు ఇబ్బంది పడుతున్నారని, సిబ్బందికి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ఈ ఈ కు విన్నవించుకున్నారు.

అదేవిధంగా వెంటనే ‌చెట్లు నాటించాలని, దర్గా మసీదు లో పనిచేసే సిబ్బందికి, ముతవల్లీలకు, ఇమామ్ లకు హెల్త్ కార్డ్ ఇవ్వాలని,షెడ్డు ఏర్పాటు చేయాలని చెట్లకు నీళ్లు వేయటానికి, పరిశుభ్రత చేయుటకు వర్కర్స్ ని కేటాయించాలని భక్తులు కోరారు.

స్పందించిన ‌ఈ ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని త్వరలోనే కాలుష్య నివారణ చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా, దర్గా ముతవల్లి షాజహాన్ బాబు, కాజా తదితరులు పాల్గొన్నారు.

నందిగామ నియోజకవర్గ సచివాలయ కన్వీనర్లు - వాలంటీర్లు -గృహసారథులకు విజ్ఞప్తి ..*

నందిగామ నియోజకవర్గ సచివాలయ కన్వీనర్లు - వాలంటీర్లు -గృహసారథులకు విజ్ఞప్తి ..

"మా నమ్మకం నువ్వే జగన్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ..డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .శాసనమండలి సభ్యులు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఆదేశానుసారం "మా నమ్మకం నువ్వే జగన్ - మా భవిష్యత్తు నువ్వే జగనన్న" కార్యక్రమంలో భాగంగా నందిగామ నియోజకవర్గంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు మండలాల సచివాలయ కన్వీనర్లు- వాలంటీర్లు - గృహసారథులు కలిసికట్టుగా ఈనెల 7 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు పార్టీ కార్యాలయం అందజేసిన జగనన్న కిట్లు( ప్రచార సామాగ్రి) తో తమ క్లస్టర్లలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబంతో 10 నిమిషాల సమయం కేటాయించి మన ప్రభుత్వ పథకాలను- పనితీరును వివరిస్తూ, వారి ఇళ్లకు జగనన్న స్టిక్కర్లు అంటిస్తూ- వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకుంటూ - జగనన్న పాలన పై వారి అభిప్రాయాలను సేకరిస్తూ - గత పాలనకు.. మన పాలనకు .. వ్యత్యాసాన్ని వారికి వివరిస్తూ.. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేస్తూ .. ఎప్పటికప్పుడు డేటాను పార్టీ కార్యాలయానికి అందజేయాలని మనవి చేస్తున్నాను .. పార్టీ ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తూ ..

డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

శాసనమండలి సభ్యులు

ఏపీ :ఈ నెల 7వ తేదీన ప్రారంభమవనున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం వివరాలు. *ప్రతీ ఇంటా.. ప్రతీ నోట జగన్ మాట..

ఈ నెల 7వ తేదీన ప్రారంభమవనున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం వివరాలు

ప్రతీ ఇంటా.. ప్రతీ నోట జగన్ మాట...!!

7 లక్షల మంది సైనికులతో ప్రతి ఇంటికీ 'జగనన్నే మా భవిష్యత్తు'

ప్రభుత్వంపై ప్రజా విశ్వసనీయతను ప్రజా మద్దతుగా భావించి నమోదు చేసేలా ‘పీపుల్స్‌ సర్వే’

రాష్ట్రంలోని పట్టణాలు మొదలు మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలకు జగనన్న సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి వివరించేందుకు తలపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే 'జగనన్నే మా భవిష్యత్తు'. 'మా నమ్మకం నువ్వే జగన్'

రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణల అనంతరం అందిస్తున్న సుపరిపాలనను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ 7 లక్షల మంది కార్యకర్తలతో సైన్యాన్ని నియమించింది. ప్రతి గ్రామ సచివాలయానికి ముగ్గురు చొప్పున కన్వీనర్లు.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహ సారథులు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసే వ్యవస్థను ఏర్పాటు ఏ రాజకీయ పార్టీ ఇదివరకు చేయని భారీ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7 వ తేదీన ప్రారంభించి ఏప్రిల్ 20 వ తేదీ వరకూ అంటే 14 రోజుల ­పాటు కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 1.6 కోట్ల ఇళ్ల వద్దకు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు వెళ్లి ప్రజలతో మాట్లాడనున్నారు. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్నసంక్షేమ, అభివృద్ధి ఫలాలను వివరించనున్నారు.

రాష్ర్టానికి మంచి చేయడం కోసం అనుక్షణం పనిచేస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాల స్థానంలో వాస్తవాలను, సీఎం జగన్‌ సంక్షేమ రథానికి అడుగడుగునా అడ్డుతగులుతున్న వైనాన్ని ప్రజలకు వివరించనున్నారు. ‘పీపుల్స్‌ సర్వే’లో భాగంగా ప్రతి ఇంట్లోనూ పౌరులను ఐదు ప్రశ్నలు అడిగి.. వారు చెప్పిన సమాధానాలను ‘ప్రజా మద్దతు పుస్తకం’లో నమోదుచేసి రశీదు ఇస్తారు. ఆ తర్వాత జగన్‌ సర్కారుకు మద్దతు తెలిపేందుకు అంగీకరించిన వారితో 82960 82960 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులను గృహసారథులు విజ్ణప్తి చేస్తారు. ఇలా మిస్డ్‌కాల్‌ ఇచ్చిన ఒక్క నిమిషంలోగా వారికి సీఎం జగన్‌ సందేశంతో కూడిన ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ వస్తుంది.

సీఎం జగన్‌ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల పట్ల రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాల ప్రజలు పూర్తి విశ్వసనీయత కనబరచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ నినదించి.. ప్రతిపక్షాలకు తగినరీతిలో గుణపాఠం చెబుతారని వైఎస్సార్‌ సీపీ బలంగా నమ్ముతోంది. ఈ కార్యక్రమాన్ని మండల ఇన్‌చార్జ్‌లు, జోనల్‌ కో–ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తారు.

ప్రజా సమస్యలు తీర్చే బాధ్యత కలిగిన కార్యకర్తలున్న పార్టీ వైఎస్సార్ సీపీ..

వైఎస్సార్ సీపీ తన సైనికులను ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే బాధ్యత గల సుశిక్షితులైన కార్యకర్తలున్న పార్టీగా వైఎస్సార్ సీపీ ఉన్నత శిఖరాలకు చేరువ అవుతోంది ఈ విషయాన్ని ‘జగనన్నే మా భవిష్యత్తు.. తద్వారా మా నమ్మకం నువ్వే జగన్‌’ కార్యక్రమం ద్వారా నిరూపించాలని వైఎస్సార్ సీపీ భావిస్తోంది.

ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ అజెండాను రూపొందించుకుని పనిచేయాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షులు సీఎం జగన్‌ ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ భవిష్యత్తులో గర్వంగా చెప్పుకునేందుకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తుంది. అందుకనే, ప్రజలతో మమేకమయ్యే ఈ భారీ కార్యక్రమం ఎలా ఉండాలి? మా పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే కన్వీనర్లు, గృహసారథులకు శిక్షణ కూడా ఇచ్చింది. 

 

ప్రజల నినాదంగా ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ ప్లకార్డు కార్యక్రమం

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా వాడవాడలా ప్లకార్డ్ ప్రదర్శనా క్యార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వ పథకాలతో సంతృప్తి చెందిన వారికి ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించి, వారితో స్వచ్ఛందంగా ప్లకార్డు ప్రదర్శించి ప్రజలు మద్ధతుతును సమీకరించి వాటి ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

నల్గొండ జిల్లా:కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా ముక్కాముల శేఖర్ యాదవ్.

కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా ముక్కాముల శేఖర్ యాదవ్               

Streetbuzz news. నల్గొండ జిల్లా :

కాంగ్రెస్ పార్టీ కట్టంగూర్ మండల అధ్యక్షునిగా కట్టంగూర్ మండల కేంద్రనికి చెందిన ముక్కాముల శేఖర్ యాదవ్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ముక్కాముల శేఖర్ మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ బలో ప్రాంతానికి ఎంతో కృషి చేస్తానని తెలిపారు. మండలంలో నియోజకవర్గంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తన వంతుగా కఠినంగా పనిచేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తన నియామకానికి కృషి చేసిన.రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,మాజీ సీఎల్పీ నేత కుందూరి జానారెడ్డి,పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య,నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ అధికార ప్రతినిధి సుంకరబోయిన నర్సింహ్మ యాదవ్,కి&సీనియర్ నాయకులకు ధన్యవాదాలు. తెలిపారు.ఈ కార్యక్రమంలో. పి. ఏ. సి.ఎస్ కట్టంగుర్ మాజీ చైర్మెన్ చేవుగొని సాయిలు , ఒ. బి. సి..మండల అధ్యక్షులు బొడ్డుపల్లి సైదులు. కొంపెల్లీ లక్ష్మయ్య, పిట్టం పల్లి మాజీ సర్పంచ్ గౌర నర్సింహా, మండల యువజన నాయకులు మేడి విజయకుమార్, నంద్యాల అనంత రెడ్డి.మండల యువ జన కాంగ్రెస్ అధ్యక్షులు కక్కిరేని సైదులు,అన్నారం గ్రామ శాఖ అధ్యక్షులు చిలుముల సైదులు,మునికుంట్ల గ్రామ అధ్యక్షులు కడారి మల్లేష్, వార్డు మెంబర్లు ఉట్కురి శ్రీను ,ఏనుగు సైదులు,బొజ్జ శ్రీను,యువజన నాయకులు నర్సింగ్ సంతోష్ గౌడ్,ఉట్కురి సాయి ,దాసరి సతీష్,బీసం మహేష్ పులకరం శ్రీను,మల్లె బోయిన ప్రకాష్,కైతపురం.సైదులు,మారం ప్రభాకర్ రెడ్డి,తేలు సైదులు, సాయి ప్రతప్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.