ఎలికట్టే గ్రామంలో ఘనంగా బీజేపీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం
•బూత్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి సందీప్ ఆధ్వర్యంలో
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి సందీప్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 43వ, ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్య అతిధిగా నల్లగొండ జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారు పాల్గొని పార్టీ జెండాకు కొబ్బరికాయలు కొట్టి జెండా ఆవిష్కరించి అరటి పళ్ళు పంచడం జరిగింది.
అనంతరం పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ బిజెపి పార్టీ మహా నాయకుల ఆత్మబలిదానాలతో వెలసిన పార్టీ ఇద్దరు వ్యక్తులతో మొదలుకొని నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వాలు నమోదైన పార్టీగా వెలిసింది బిజెపి కార్యకర్తలు సిద్ధాంతంతో ఒక్కొక్క సైనికుడై పోరాడుతున్నారని తెలిపారు.
అదే విధంగా ఈరోజు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ రాక్షస పాలన అవినీతి పాలన దొర పాలన అంతమొందించాలంటే ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కంకణబద్ధులై పని చేయాలన్నారు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులను మీడియాను ఇబ్బందులకు గురి చేస్తూ వారి గొంతు నొక్కేస్తూ వాస్తవాలు బయటికి రాకుండా బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారిని అరెస్టు చేసినందుకు బిఆర్ఎస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తెలంగాణ ప్రజల కూడా బిఆర్ఎస్ పార్టీని రానున్న ఎన్నికల్లో కూకటి వేళ్ళతో పీకి పడేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గొలనుకొండ మదన్ మోహన్, దుబ్బాక నవీన్ రెడ్డి, చెరుకుపల్లి నాగరాజు, సోమనబోయిన విగ్నేష్, గుణగంటి రాఘవేంద్ర, ఉయ్యాల సుమంత్, కొండ రమేష్ లింగస్వామి రాజు పవన్ తదితరలు పాల్గొన్నారు.
Apr 06 2023, 13:54