ఏపీ :ఈ నెల 7వ తేదీన ప్రారంభమవనున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం వివరాలు. *ప్రతీ ఇంటా.. ప్రతీ నోట జగన్ మాట..

ఈ నెల 7వ తేదీన ప్రారంభమవనున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం వివరాలు

ప్రతీ ఇంటా.. ప్రతీ నోట జగన్ మాట...!!

7 లక్షల మంది సైనికులతో ప్రతి ఇంటికీ 'జగనన్నే మా భవిష్యత్తు'

ప్రభుత్వంపై ప్రజా విశ్వసనీయతను ప్రజా మద్దతుగా భావించి నమోదు చేసేలా ‘పీపుల్స్‌ సర్వే’

రాష్ట్రంలోని పట్టణాలు మొదలు మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలకు జగనన్న సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి వివరించేందుకు తలపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే 'జగనన్నే మా భవిష్యత్తు'. 'మా నమ్మకం నువ్వే జగన్'

రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణల అనంతరం అందిస్తున్న సుపరిపాలనను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ 7 లక్షల మంది కార్యకర్తలతో సైన్యాన్ని నియమించింది. ప్రతి గ్రామ సచివాలయానికి ముగ్గురు చొప్పున కన్వీనర్లు.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహ సారథులు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసే వ్యవస్థను ఏర్పాటు ఏ రాజకీయ పార్టీ ఇదివరకు చేయని భారీ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7 వ తేదీన ప్రారంభించి ఏప్రిల్ 20 వ తేదీ వరకూ అంటే 14 రోజుల ­పాటు కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 1.6 కోట్ల ఇళ్ల వద్దకు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు వెళ్లి ప్రజలతో మాట్లాడనున్నారు. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్నసంక్షేమ, అభివృద్ధి ఫలాలను వివరించనున్నారు.

రాష్ర్టానికి మంచి చేయడం కోసం అనుక్షణం పనిచేస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాల స్థానంలో వాస్తవాలను, సీఎం జగన్‌ సంక్షేమ రథానికి అడుగడుగునా అడ్డుతగులుతున్న వైనాన్ని ప్రజలకు వివరించనున్నారు. ‘పీపుల్స్‌ సర్వే’లో భాగంగా ప్రతి ఇంట్లోనూ పౌరులను ఐదు ప్రశ్నలు అడిగి.. వారు చెప్పిన సమాధానాలను ‘ప్రజా మద్దతు పుస్తకం’లో నమోదుచేసి రశీదు ఇస్తారు. ఆ తర్వాత జగన్‌ సర్కారుకు మద్దతు తెలిపేందుకు అంగీకరించిన వారితో 82960 82960 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులను గృహసారథులు విజ్ణప్తి చేస్తారు. ఇలా మిస్డ్‌కాల్‌ ఇచ్చిన ఒక్క నిమిషంలోగా వారికి సీఎం జగన్‌ సందేశంతో కూడిన ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ వస్తుంది.

సీఎం జగన్‌ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల పట్ల రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాల ప్రజలు పూర్తి విశ్వసనీయత కనబరచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ నినదించి.. ప్రతిపక్షాలకు తగినరీతిలో గుణపాఠం చెబుతారని వైఎస్సార్‌ సీపీ బలంగా నమ్ముతోంది. ఈ కార్యక్రమాన్ని మండల ఇన్‌చార్జ్‌లు, జోనల్‌ కో–ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తారు.

ప్రజా సమస్యలు తీర్చే బాధ్యత కలిగిన కార్యకర్తలున్న పార్టీ వైఎస్సార్ సీపీ..

వైఎస్సార్ సీపీ తన సైనికులను ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే బాధ్యత గల సుశిక్షితులైన కార్యకర్తలున్న పార్టీగా వైఎస్సార్ సీపీ ఉన్నత శిఖరాలకు చేరువ అవుతోంది ఈ విషయాన్ని ‘జగనన్నే మా భవిష్యత్తు.. తద్వారా మా నమ్మకం నువ్వే జగన్‌’ కార్యక్రమం ద్వారా నిరూపించాలని వైఎస్సార్ సీపీ భావిస్తోంది.

ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ అజెండాను రూపొందించుకుని పనిచేయాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షులు సీఎం జగన్‌ ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ భవిష్యత్తులో గర్వంగా చెప్పుకునేందుకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తుంది. అందుకనే, ప్రజలతో మమేకమయ్యే ఈ భారీ కార్యక్రమం ఎలా ఉండాలి? మా పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే కన్వీనర్లు, గృహసారథులకు శిక్షణ కూడా ఇచ్చింది. 

 

ప్రజల నినాదంగా ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ ప్లకార్డు కార్యక్రమం

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా వాడవాడలా ప్లకార్డ్ ప్రదర్శనా క్యార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వ పథకాలతో సంతృప్తి చెందిన వారికి ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించి, వారితో స్వచ్ఛందంగా ప్లకార్డు ప్రదర్శించి ప్రజలు మద్ధతుతును సమీకరించి వాటి ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

నల్గొండ జిల్లా:కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా ముక్కాముల శేఖర్ యాదవ్.

కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా ముక్కాముల శేఖర్ యాదవ్               

Streetbuzz news. నల్గొండ జిల్లా :

కాంగ్రెస్ పార్టీ కట్టంగూర్ మండల అధ్యక్షునిగా కట్టంగూర్ మండల కేంద్రనికి చెందిన ముక్కాముల శేఖర్ యాదవ్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ముక్కాముల శేఖర్ మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ బలో ప్రాంతానికి ఎంతో కృషి చేస్తానని తెలిపారు. మండలంలో నియోజకవర్గంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తన వంతుగా కఠినంగా పనిచేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తన నియామకానికి కృషి చేసిన.రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,మాజీ సీఎల్పీ నేత కుందూరి జానారెడ్డి,పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య,నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ అధికార ప్రతినిధి సుంకరబోయిన నర్సింహ్మ యాదవ్,కి&సీనియర్ నాయకులకు ధన్యవాదాలు. తెలిపారు.ఈ కార్యక్రమంలో. పి. ఏ. సి.ఎస్ కట్టంగుర్ మాజీ చైర్మెన్ చేవుగొని సాయిలు , ఒ. బి. సి..మండల అధ్యక్షులు బొడ్డుపల్లి సైదులు. కొంపెల్లీ లక్ష్మయ్య, పిట్టం పల్లి మాజీ సర్పంచ్ గౌర నర్సింహా, మండల యువజన నాయకులు మేడి విజయకుమార్, నంద్యాల అనంత రెడ్డి.మండల యువ జన కాంగ్రెస్ అధ్యక్షులు కక్కిరేని సైదులు,అన్నారం గ్రామ శాఖ అధ్యక్షులు చిలుముల సైదులు,మునికుంట్ల గ్రామ అధ్యక్షులు కడారి మల్లేష్, వార్డు మెంబర్లు ఉట్కురి శ్రీను ,ఏనుగు సైదులు,బొజ్జ శ్రీను,యువజన నాయకులు నర్సింగ్ సంతోష్ గౌడ్,ఉట్కురి సాయి ,దాసరి సతీష్,బీసం మహేష్ పులకరం శ్రీను,మల్లె బోయిన ప్రకాష్,కైతపురం.సైదులు,మారం ప్రభాకర్ రెడ్డి,తేలు సైదులు, సాయి ప్రతప్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఏపీ :కన్న కూతురిని హత్య చేసిన కసాయి తల్లి

కన్న కూతురిని హత్య చేసిన కసాయి తల్లి

నెల్లూరు జిల్లా:

జిల్లాలో కన్న కూతురినే హత్య చేసిందో కసాయి తల్లి.

గుర్రాల మడుగు సంగంలో కిడ్నాపు గురై కాల్వలో శవమై తేలిన చిన్నారిని.. తానే హత్య చేసినట్లు చిన్నారి తల్లి అంగీకరించింది.

నిందితురాలిని బాలాజీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.

ఫిర్యాదుదారుపై అనుమానంతో విచారించగా.. తనకు ఇద్దరు ఆడపిల్లలే కావడం, భర్తతో విడిగా ఉండటం తదితర కారణాలతో నేరానికి పాల్పడ్డట్లు ఒప్పుకుందని పోలీసులు తెలిపారు.

నెల్లూరు జిల్లా: ట్రాఫిక్ అధికారులు మరియు సిబ్బందికి వాటర్ కూలర్స్ , హ్యాట్స్, సన్ గ్లాసెస్ అందించిన జిల్లా యస్.పి. విజయ రావు, ఐపీఎస్ .*

నెల్లూరు జిల్లా

ట్రాఫిక్ అధికారులు మరియు సిబ్బందికి వాటర్ కూలర్స్ , హ్యాట్స్, సన్ గ్లాసెస్ అందించిన జిల్లా యస్.పి. విజయ రావు, ఐపీఎస్ .

ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు ట్రాఫిక్ పోలీసులకు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద 150 వాటర్ కూలర్స్ , 150 హ్యాట్స్ మరియు 150 సన్ గ్లాసెస్ పంపిణీ.నిత్యం ఎండలో నిలబడి దుమ్ము, ధూళి లెక్కచేయకుండా జిల్లాలోని ట్రాఫిక్ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారు కనుక వారి సంక్షేమం నా భాధ్యత –యస్.పి.

ఎండ తీవ్రత కూడా విపరీతంగా పెరిగింది. మండుటెండలో తప్పనిసరిగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

స్వీయ రక్షణ చాలా అవసరం. ఎండకు నీరు బాగా తాగాలి, డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

వడ దెబ్బ వంటి ప్రమాదకర పరిస్థితులకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

అత్యవసర కార్యకలాపాలు సాఫీగా సాగుటకు ట్రాఫిక్ పోలీసుల పాత్ర అత్యంత కీలకమైనది.*

 నిరంతరం ప్రజల కంటికి కనబడే పోలీస్ విభాగమే ట్రాఫిక్.

 ప్రముఖుల రాకపోకలు, పరిక్షల సమయంలో, ఇటీవల జరిగిన శోభాయాత్రలో ట్రాఫిక్ సమన్వయం చాలా బాగుంది.

 ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ-చలన వేయడంలో, ఫైన్ కట్టించుటలో బాగా విధులు నిర్వహిస్తున్నారని అభినందనలు.

 విధినిర్వహణలో నిక్కచ్చిగా ఉండాలని తెలిపారు.

 మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుస్తా, చక్కగా పని చేయండి.

 మా సంక్షేమంకొరకు ఎంతో శ్రద్ద తీసుకుంటు అన్ని రకాల సదుపాయలు అందిస్తున్న యస్.పి. గారికి సంతోషంతో ధన్యవాదాలు తెలిపి ఆనందం వ్యక్తపరిచి విదులు సక్రమంగా

నిర్వహిస్తామని తెలిపిన ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది.

జిల్లా పోలీసు కార్యాలయం,

సుప్రీం కోర్ట్ : దర్యాప్తు సంస్థల 'దుర్వినియోగం'పై పిటిషన్‌.. ప్రతిపక్షాలకు సుప్రీం షాక్‌..!

సుప్రీం కోర్ట్ : దర్యాప్తు సంస్థల 'దుర్వినియోగం'పై పిటిషన్‌.. ప్రతిపక్షాలకు సుప్రీం షాక్‌..!

దిల్లీ: రాజకీయ కుట్రలో భాగంగా సీబీఐ (సీబీఐ), ఈడీ (ఈ డి ) వంటి సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని కొంతకాలంగా ఆరోపిస్తున్న విపక్షాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేతృత్వంలో 14 రాజకీయ పార్టీలు వేసిన పిటిషన్‌ను విచారిచేందుకు సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) నిరాకరించింది. ఈ కేసులో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా సాధారణ మార్గదర్శకాలను రూపొందించడం ప్రమాదకరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

2014లో మోదీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలను (Probe Agencies) దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతలనే లక్ష్యంగా చేసుకుని ఈడీ (ed), సీబీఐ (CBI) వంటి సంస్థలతో కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీలు ఆరోపించాయి. అయితే బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌.. దీని విచారణ అర్హతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ''కేసుల దర్యాప్తులు, విచారణల నుంచి విపక్ష నేతలకు రక్షణ కల్పించేందుకు ఈ పిటిషన్‌ వేశారా? వారికి ఏమైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా?'' అని ప్రతిపక్షాల (Opposition Parties) తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని సీజేఐ ప్రశ్నించారు.

ఏపీ :ఘనంగా మాజీ ఎంపీ పాటూరు రాజగోపాల్ నాయుడు మరియు యువ హీరో గల్లా అశోక్ జన్మదిన వేడుకలు :

ఘనంగా మాజీ ఎంపీ పాటూరు రాజగోపాల్ నాయుడు మరియు యువ హీరో గల్లా అశోక్ జన్మదిన వేడుకలు :

తవణంపల్లి,ఏప్రిల్ 05,2023:* స్యతంత్ర సమరయోధులు, మాజీ ఎంపీ కి. శ్. శ్రీ. పాటూరు రాజగోపాల్ నాయుడు 103వ జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా, తవనంపల్లి మండల, దిగువమాగం గ్రామం నందు గల రాజన్న మెమోరియల్ పార్క్ నందు. రాజగోపాల్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి,ఇందులో భాగంగా ఆయన గారాలపట్టి మాజీ మంత్రివర్యులు శ్రీమతి గల్లా అరుణ కుమారి మరియు అమర రాజా వ్యవస్థాపక అధ్యక్షుడు గల్లా రామచంద్ర నాయుడు కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి , ప్రత్యేక పూజలు చేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం గల్లా అరుకుమారి ముద్దుల మనమడు యువ హీరో గల్లా అశోక్ కి కూడా జన్మదినం సందర్భంగా గల్లా అరుణ మరియు గల్లా రామచంద్ర నాయుడు గార్లు,గల్లా అశోక్ అభిమానులు మరియు సమీప గ్రామ ప్రజలు బారి కేక్ నీ కట్ చేసి గల్లా అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపి అశోక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ నాన్న మరియు అశోక్ జన్మదినం ఒకే రోజు రావటం చాలా సంతోషం గా ఉన్నది ఇద్దరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మరియు అశోక్ సినీరంగంలో అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు.

గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ రాజగోపాల్ నాయుడు ఎంతో మందికి మార్గదర్శి గా నిలిచారని కొనియాడారు మరియు అశోక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వాదాలు అందించారు.

ఈ కార్యక్రమం లో గ్రామస్థులు చే కోలాటాలు మరియు ఇతర సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి , ఈ కార్యక్రమం లో అమర రాజా వ్యవస్థాపక చైర్మన్ శ్రీ. గల్లా రామచంద్ర నాయుడు, మాజీ మంత్రి వర్యులు గల్లా అరుణ కుమారి గారు, పార్టీలకతీతంగా మండల రాజకీయ నాయకులు,దిగువమాగం సర్పంచ్ గోపి,మాజీ సర్పంచ్ కుమార్ నాయుడు , వైస్ సర్పంచ్ శ్రీధర్ నాయుడు మరియు గల్లా అశోక్ అభిమానులు సురేష్ ఎల్లంపల్లి తదితరులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

తెలంగాణ. సచివాలయ ప్రారంభానికి విస్తృత ఏర్పాట్లు

తెలంగాణ. సచివాలయ ప్రారంభానికి విస్తృత ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

30న శాస్ర్తోక్తంగా పూజా కార్యక్రమాలు

గృహలక్ష్మి విధివిధానాలు రూపొందించండి

అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ విగ్రహావిషరణ సమీక్ష అనంతరం సచివాలయ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన ముఖ్యాంశాలు

ఏప్రిల్‌ 30న 'డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ తెలంగా ణ సచివాలయం' ప్రారంభ కార్యక్రమం ఉం టుంది. ఉదయం శాస్ర్తోక్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పాల్గొం టారు. అనంతరం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం కొనసాగుతుంది. సంబంధిత షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తారు.

సచివాలయం ప్రారంభం కాగానే ముందుగా ముఖ్యమంత్రి తన చాంబర్‌లో ఆసీనులు అవుతారు. వెంటవచ్చిన మంత్రులు, కార్యదర్శులు, సీఎంవో సిబ్బంది, సచివాలయ సిబ్బంది తమతమ చాంబర్లలోకి వెళ్లి తమ సీట్లల్లో ఆసీనులు అవుతారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్‌వోడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్తు చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతుబంధుసమితి అధ్యక్షులు, మున్సిపల్‌ మేయర్లు తదితరులు పాల్గొంటారు. అందరూ కలిపి దాదాపు 2,500 మంది హాజరవుతారు. వీరికి భోజనాలు ఏర్పాటు చేస్తారు.

సచివాలయం రక్షణకు సంబంధించి డీజీపీ విధివిధానాలు రూపొందించి పకడ్బందీ చర్యలు చేపడుతారు.

సచివాలయం నాలుగు దికుల్లో ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటిల్లో నార్త్‌వెస్ట్‌ (వాయువ్య) ద్వారాన్ని అవసరం వచ్చినపుడు మాత్రమే తెరుస్తారు.

నార్త్‌ఈస్ట్‌ (ఈశాన్య) ద్వారం గుండా సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారుల రాకపోకలు కొనసాగుతాయి. సౌత్‌ఈస్ట్‌ (ఆగ్నేయం) ద్వారం విజిటర్స్‌ కోసం వినియోగిస్తారు. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.

తూర్పుగేట్‌ (మెయిన్‌గేట్‌) ముఖ్యమంత్రి, సీఎస్‌, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ, విదేశీ అతిథుల కోసం మాత్రమే వినియోగిస్తారు.

దివ్యాంగులు, వృద్ధుల కోసం ఎలక్ట్రిక్‌ బగ్గీలను ఏర్పాటుచేస్తారు. ప్రైవేట్‌ వాహనాలను సచివాలయంలోకి అనుమతించరు.

సత్వరమే గృహలక్ష్మి విధి విధానాలు

ఖాళీ స్థలాలు ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన గృహలక్ష్మి పథకం అమలుకు సత్వరమే విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమం త్వరలో ప్రారంభించాలని సూచించారు. సత్వరమే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. దళితబంధు పథకాన్ని కొనసాగించాలని చెప్పారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1022 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.ఏప్రిల్ 1 నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 30 ఏప్రిల్ 2023. ఈ పోస్టులను రిటైర్డ్ ఉద్యోగుల కొరకు కేటాయించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం.. అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను sbi.co.in సందర్శించాలి. మొత్తం 1022 ఉద్యోగాల్లో.. ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్, ఛానల్ మేనేజర్ సూపర్‌వైజర్, సపోర్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ మూడు కేటగిరీలకు కనీస వయోపరిమితి 60 ఏళ్లుగా, గరిష్ట వయో పరిమితి 63 ఏళ్లుగా నిర్ణయించారు.

స్టేట్ బ్యాంక్ లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ బ్యాంకు నుండి రిటైర్డ్ ఉద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, ఆపై వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. దీనిలో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు.

డిల్లీ: మోదీ, అమిత్, నడ్డా భేటీ.. సంజయ్ అరెస్టుపై చర్చ.

డిల్లీ: మోదీ, అమిత్, నడ్డా భేటీ.. సంజయ్ అరెస్టుపై చర్చ

ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానితో మీటింగ్ అనంతరం అమిత్ షా, నడ్డా విడిగా సమావేశం అయ్యారు. సంజయ్ అరెస్టు నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏపీ :వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కుటుంబానికి ఉపాధి కల్పించిన ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను.

_*వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కుటుంబానికి ఉపాధి కల్పించిన ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను.

_వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ పురోభివృద్ధికి కృషిచేసిన కుటుంబానికి ప్రభుత్వవిప్,సామినేని ఉదయభాను అండగా నిలిచారు._

_జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన ఇడుపులపాటి సంతోష్ కుమార్ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా పనిచేస్తూ ఉండేవాడు.అనుకోని విధంగా ప్రమాదవశాత్తు ఇటీవల కాలంలో మరణించాడు.దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన మనోవేదనకు గురవడంతో స్పందించిన ప్రభత్వవిప్,శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు వారి స్వగృహానికి వెళ్లి వారిని పరామర్శించారు,వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని అప్పటికే నర్సింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన సంతోష్ కుమార్ భార్య ప్రసన్న కుమారికి ఈరోజు విజయవాడలోని ప్రభుత్వ హాస్పటల్ నందు నర్సింగ్ జాబ్ ఇప్పించడం జరిగింది._

_ఈ సందర్భంగా వారి భార్య ప్రసన్న కుమారి మాట్లాడుతూ తన భర్త సోషల్ మీడియాలో పనిచేయడంతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మా కుటుంబానికి అండగా నిలిచిందని,భర్త చనిపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నా విషయాన్ని ఉదయభాను దృష్టికి తీసుకోవడంతో నర్సింగ్ పూర్తి చేసుకున్న నాకు వారి సహకారంతో ఈరోజు విజయవాడలో ప్రభుత్వ హాస్పటల్ నందు GNM(General Nursing and Midwifery) పోస్ట్ ఇప్పించడం జరిగిందని తెలిపారు. నా కుటుంబానికి ఇంతటి ఆర్థిక భరోసాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను కి కృతజ్ఞతలు తెలిపారు._

_ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు._