madagoni surendar

Mar 25 2023, 16:12

సింహాచలం :ప్రసాద్. పథకం పనులు వేగవంతం చేయించండి.రెండో విడత నిధులకు. ప్రతిపాదనలు పంపాలని వినతి

ప్రసాద్ పథకం పనులు వేగవంతం చేయించండి.

రెండో విడత నిధులకు. ప్రతిపాదనలు పంపాలని వినతి

ఎంవీపీ కాలనీ, మార్చ్ 25

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తుందని,అందులో భాగంగానే తొలి విడతగా సింహాచలం దేవస్థానానికి మంజూరు చేసిన 54 కోట్ల పనులను వేగవంతం చేసే విధంగా తమ వంతు సహకారం అందించాలని విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ను సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు జాతీయ జర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీను బాబు కోరారు. శనివారం ఉదయం ఎంపీ ని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని శ్రీను బాబు .l ఘనంగా సత్కరించి సింహాద్రినాధుడు జ్ఞాపిక బహుకరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ సింహాచలం దేవస్థానానికి తొలి విడతగా 54 కోట్లు నిధులు మంజూరు చేశారని, అయితే అభివృద్ధిపనులు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు అని ఎంపి కి వివరించారు..పర్యాటక శాఖ ద్వారా ఈ పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు.ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన సహకారం అందించే విధముగా కృషి చేయాలని అధికారులను శీను బాబు ఎంపీ ని కోరారు.. అలాగే రెండో విడత నిధులు మంజూరు కు కూడా కృషి చేయాలని శ్రీనుబాబు వివరించారు. ఇందుకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సానుకూలంగా స్పందించి తన వంతు సహకారం అందిస్తానన్నారని శ్రీను బాబు చెప్పారు.

madagoni surendar

Mar 25 2023, 16:04

ఘంటాడి కృష్ణ 'రిస్క్'.. బ్లాక్ బస్టర్ అవ్వడం మాత్రం పక్కా: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి.

ఘంటాడి కృష్ణ 'రిస్క్'.. బ్లాక్ బస్టర్ అవ్వడం మాత్రం పక్కా: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి  

తెలుగులో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ దర్శకుడిగా మారి కొత్త వారితో తీస్తున్న పాన్ ఇండియా సినిమా 'రిస్క్'. ఈ సినిమా సాంగ్ లాంఛ్ కు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణ కృష్ణమోహన్, ప్రముఖ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు, ప్రముఖ ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ యలమంచిలి రవిశంకర్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, హీరో ఆదిత్య హాజరయ్యారు.

madagoni surendar

Mar 25 2023, 14:34

టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీక్ కేసు : టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్న సిట్‌..

టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీక్ కేసు : టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్న సిట్‌..

హైదరాబాద్‌ : టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో మరొకరిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ ఉపాధి హామీ విభాగంలో పని చేసే ఉద్యోగి ప్రశాంత్‌ను సిట్‌ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.పేపర్ కొనుగోలు చేసి అతడు పరీక్ష రాసినట్లు గుర్తించారు..

రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతో ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజశేఖర్ రెడ్డికి బావ అయిన ప్రశాంత్‌.. గ్రూప్ వన్ పరీక్ష రాసి 100కు పైగా మార్కులు తెచ్చుకున్నట్లు సిట్‌ ఆధారాలు సేకరించింది..

madagoni surendar

Mar 24 2023, 22:48

విజయవాడ: రాహుల్ గాంధీ పై కక్ష సాధింపు చర్యలుకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం. ఎపీలో వివిధ ప్రాంతాలలో ఆందోళనలు,

విజయవాడ

రాహుల్ గాంధీ పై కక్ష సాధింపు చర్యలుకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

ఎపీలో వివిధ ప్రాంతాలలో ఆందోళనలు, నిరసనలు

సుంకర పద్మశ్రీ .. ఎపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ 

దేశంలో కుల మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతుంది

మోడీ, అమిత్ షాలు దొంగలకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారు

వీరి అవినీతిని రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు

పార్లమెంటు లో కూడా వారిని అక్రమాలను ప్రశ్నిస్తారనే భయం వారిలో ఉంది

అందుకే సూరత్ కోర్టీ తీర్పు ఆధారాంగా పార్లమెంట్ లో అనుర్హుడిగా ప్రకటించారు

రెండేళ్లు జైలు శిక్ష పడిందనే సాకుతో.. ఇప్పటికిప్పుడు నిర్ణయిస్తారా

వేల కోట్ల రూపాయలు దోచుకున్న వారిని మాత్రం మోడీ కాపాడతారా 

ఎన్నికలలో ధైర్యంగా ఎదుర్కోలేక గతంలో తప్పుడు కేసులు పెట్టారు

రాజ్యాంగ బద్దంగా ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తిని ఎలా అనర్హుడిగా ప్రకటిస్తారు

మోడీ, అమిత్ షాలు విధానాలపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు

కాంగ్రెస్ శ్రేణులంతా మా నాయకుడికి అండగా ఉంటాం

రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేకే.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలు చేపట్టారు.

..

కార్యాలయ కార్యదర్శి,

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ

madagoni surendar

Mar 24 2023, 22:40

న్యూఢిల్లీ. కాంగ్రెస్‌ అధిష్ఠానం కీలక భేటీ..

న్యూఢిల్లీ.

కాంగ్రెస్‌ అధిష్ఠానం కీలక భేటీ..

రాహుల్‌ గాంధీని (రాహుల్ గాంధీ ) ఎంపీగా అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో తదుపరి వ్యూహాన్ని రచించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి సోనియా గాంధీ, జనరల్‌ సెక్రటరీలు ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేష్‌, రాజీవ్‌ శుక్లా, తారీఖ్‌ అన్వర్‌లతోపాటు సీనియర్‌ నేతలు పి.చిదంబరం, ఆనంద్‌ శర్మ, అంబికా సోనీ, ముకుల్‌ వాస్నిక్‌, సల్మాన్‌ ఖుర్షిద్‌, పవన్‌ కుమార్‌ బన్సాల్‌, మరికొందరు సీనియర్‌ నేతలు హాజరయ్యారు. అయితే, ఈ భేటీకి రాహుల్‌ గాంధీ రాలేదని సమాచారం.

మరోవైపు మోదీ ఇంటిపేరును కించపరిచేలా 2019లో కర్ణాటకలో జరిగిన ఓ సమావేశంలో రాహుల్‌ (రాహుల్గాం ధీ ) చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసు దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సూరత్‌ కోర్టు ఈ కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్‌ తన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

madagoni surendar

Mar 24 2023, 19:34

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా ఎల్ ఓ సి అందజేత.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా ఎల్ ఓ సి అందజేత.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

కేతపల్లి మండలం గుడివాడ గ్రామానికి చెందిన పల్స వెంకన్న ఆనారోగ్యం కారణంగా అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద ఎల్ ఓ సి ద్వారా మంజూరైన. 2,50,000/- రూపాయల ఎల్ఓసి పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేసారు. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 24 2023, 18:53

దాతల సహకారం తో పౌష్టికాహార వితరణ

దాతల సహకారం తో పౌష్టికాహార వితరణ

దాతల సహకారంతో క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరు మాసాల పాటు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు డాక్టర్ నాగరాణి శుక్రవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం కార్యక్రమంలో ఆమె తెలిపారు .ఈ సందర్భంగా హాస్పిటల్స్ సూపర్డెంట్ డాక్టర్ హరీష్ మాట్లాడుతూ క్షయ వ్యాధి లక్షణాలను విశదీకరించారు .రెండు వారాలకు మించి దగ్గు, జ్వరము తగ్గకుంటే , బరువుని కోల్పోతున్నట్లయితే డాక్టర్స్ ని సంప్రదించాలని ఆయన సూచించారు . ప్రతి నెల ఐదుగురు క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న కర్లపాటి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సామాజికవేత్త కర్లపాటి వెంకట శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కర్లపాటి మాట్లాడుతూ తమ ట్రస్ట్ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలతో పాటు క్షయ వ్యాధిగ్రస్తులకు కూడా సహకారాన్ని అందించనున్నట్లు తెలిపారు. 

కాగా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య నిపుణులు డాక్టర్ పవన్ ,డాక్టర్ రాజ్ కుమార్ ,డాక్టర్ శాలిని, పి పి ఈ యూనిట్ డాక్టర్ నాగరాణి ,

టీబి సూపర్వైజర్ నాగరాజు పెద్ద ఎత్తున ఆశలు ఏఎన్ఎం పాల్గొన్నారు

madagoni surendar

Mar 24 2023, 18:48

డిసక్వాలిఫైడ్ ఎంపీస్ - ఎమ్మెల్యేస్ | జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!

డిసక్వాలిఫైడ్ ఎంపీస్ - ఎమ్మెల్యేస్ | జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!

దిల్లీ: మోదీ ఇంటి పేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి (రాహుల్ గాంధీ ) జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్‌ సభ్యత్వం (ఎంపీ )పై అనర్హత వేటు పడింది..

అయితే, అప్పీలుకు వెళ్లేందుకు రాహుల్‌కు 30రోజులు గడువు ఉండటంపై కోర్టు నిర్ణయానికి అనుగుణంగా మళ్లీ ఆయన అర్హత పొందే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్‌ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో దోషిగా తేలి, రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడిన చట్టసభ సభ్యులు (ఎంపీ /MLAs) తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఇలా గతంలో తమ లోక్‌సభ, శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన నేతలను ఓ సారి పరిశీలిస్తే..

మొహమ్మద్‌ ఫైజల్‌:ఓ హత్యాయత్నం కేసులో లక్షద్వీప్‌ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌(మహమ్మద్ ఫైజల్ )ను అక్కడి సెషన్స్‌ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఈ ఏడాది జనవరిలో తన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని (ఎంపీ ) కోల్పోయారు. అయితే, అనంతరం కేరళ హైకోర్టు స్టే విధించడంతో మళ్లీ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని న్యాయశాఖ సిఫార్సు చేసింది.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (లాలు ప్రసాద్ యాదవ్ ) కూడా తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. కుంభకోణానికి సంబంధించి 2013లో వచ్చిన తీర్పుతో పార్లమెంటుకు దూరమయ్యారు. అనంతరం జైలుకు వెళ్లిన ఆయన.. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.

ఆజాం ఖాన్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌ మాజీ సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాంఖాన్‌ను (అజాం ఖాన్ ).. 2019లో చేసిన ద్వేషపూరిత ప్రసంగం కేసులో న్యాయస్థానం దోషిగా తేల్చింది. రాంపుర్‌ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం యూపీ అసెంబ్లీ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. అంతకుముందు ఎంపీగా ఉన్న ఆయన ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు..

జయలలిత: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత (జయలలిత ) కూడా జైలు శిక్ష కారణంగా అనర్హతకు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా కూడా పడింది. దీంతో అనర్హతకు గురైన ఆమె.. సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అనంతరం 2015లో కర్ణాటక హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ నిర్దోషిగా ప్రకటించించడంతో.. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. చివరకు ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది..

madagoni surendar

Mar 24 2023, 18:46

డిసక్వాలిఫైడ్ ఎంపీస్ - ఎమ్మెల్యేస్ | జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!

డిసక్వాలిఫైడ్ ఎంపీస్ - ఎమ్మెల్యేస్ | జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!

దిల్లీ: మోదీ ఇంటి పేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి (రాహుల్ గాంధీ ) జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్‌ సభ్యత్వం (ఎంపీ )పై అనర్హత వేటు పడింది..

అయితే, అప్పీలుకు వెళ్లేందుకు రాహుల్‌కు 30రోజులు గడువు ఉండటంపై కోర్టు నిర్ణయానికి అనుగుణంగా మళ్లీ ఆయన అర్హత పొందే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్‌ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో దోషిగా తేలి, రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడిన చట్టసభ సభ్యులు (ఎంపీ /MLAs) తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఇలా గతంలో తమ లోక్‌సభ, శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన నేతలను ఓ సారి పరిశీలిస్తే..

మొహమ్మద్‌ ఫైజల్‌:ఓ హత్యాయత్నం కేసులో లక్షద్వీప్‌ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌(మహమ్మద్ ఫైజల్ )ను అక్కడి సెషన్స్‌ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఈ ఏడాది జనవరిలో తన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని (ఎంపీ ) కోల్పోయారు. అయితే, అనంతరం కేరళ హైకోర్టు స్టే విధించడంతో మళ్లీ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని న్యాయశాఖ సిఫార్సు చేసింది.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (లాలు ప్రసాద్ యాదవ్ ) కూడా తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. కుంభకోణానికి సంబంధించి 2013లో వచ్చిన తీర్పుతో పార్లమెంటుకు దూరమయ్యారు. అనంతరం జైలుకు వెళ్లిన ఆయన.. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.

ఆజాం ఖాన్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌ మాజీ సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాంఖాన్‌ను (అజాం ఖాన్ ).. 2019లో చేసిన ద్వేషపూరిత ప్రసంగం కేసులో న్యాయస్థానం దోషిగా తేల్చింది. రాంపుర్‌ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం యూపీ అసెంబ్లీ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. అంతకుముందు ఎంపీగా ఉన్న ఆయన ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు..

జయలలిత: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత (జయలలిత ) కూడా జైలు శిక్ష కారణంగా అనర్హతకు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా కూడా పడింది. దీంతో అనర్హతకు గురైన ఆమె.. సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అనంతరం 2015లో కర్ణాటక హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ నిర్దోషిగా ప్రకటించించడంతో.. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. చివరకు ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది..

madagoni surendar

Mar 24 2023, 18:36

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15 వ శాసన సభ బడ్జెట్ సమావేశ విశేషాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15 వ శాసన సభ బడ్జెట్ సమావేశ విశేషాలు

వెలగపూడి : తొమ్మిదో రోజైన శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర       2023-24 బడ్జెట్ సమావేశం శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన ఉదయం 9 గంటలకు క్వశ్చన్ అవర్ తో ప్రారంభం అయింది. సభ్యులు డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, మంతెన రామరాజు తదితరులు రాష్ట్రంలో “ఆయుష్మాన్ భారత్ యోజన” పథకం అమలుపై అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజిని సమాదానం చెపుతున్న సమయంలో ప్రధాన ప్రతి పక్ష పార్టీకి చెందిన శాసన సభ్యలు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. జీవో నెంబర్ వన్ రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తూ క్వశ్చన్ అవర్ ను ముందుకు సాగనివ్వకుండా గలాటా చేస్తూ వెల్లోకి దూసుకు వస్తూ తమ ఆందోళనలను ఉదృతం చేశారు. అదే సమయంలో స్పీకర్ మేని సీతారాం వారిని వారిస్తూ వెల్లో గీసిన ఎర్ర గీతను దాటి వస్తే మాత్రం ఆటోమేటిక్ సస్పెన్షన్ ను అమలు చేస్తానని హెచ్చరించారు.

స్పీకర్ హెచ్చరికతో వారంతా వెల్లో గీసిన ఎర్ర గీత వద్ద ఆగిపోయి ఆ గీత దాటకుండానే నినాదాలు చేస్తూ నిలిచిపోయారు. లక్ష్మణ రేఖ తరహాలో ఆ ఎర్ర గీతకు ఎంతో ప్రాధాన్యత నిస్తూ టిడిపి సభ్యులు ఇలా ప్రవర్తించడంపై సభ్యులు యావన్మంది అవాక్కయ్యారు.

సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యలు ఎర్ర గీత వద్ద నిలబడి తమ ఆందోళనను కొనసాగిస్తున్నప్పటికీ స్పీకర్ క్వశ్చన్ అవర్ ను కొనసాగించారు. గౌరవ సభ్యులు జక్కంపూడి రాజా, మల్లాది విష్ణు, మహమ్మద్ మస్తఫా షేక్, కైలె అనిల్ కుమార్, వసంత వెంకట కృష్ణప్రసాద్, సింహాద్రి రమేష్ బాబు తదితరులు జగన్న కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పనపై అడిగిన ప్రశ్నకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రతిపక్ష పార్టీ సభ్యుల ఆందోళన మద్యే సమాదానం చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ పథకం అమల్లో లబ్దిదారులకు ఒనగూరే ప్రయెజనాలను, క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న పలు సమస్యలను గౌరవ సభ్యులు జక్కంపూడి రాజా తదుపరి మల్లాది విష్ణు సభ దృష్టికి తెస్తున్న సమయంలో ప్రతి పక్ష పార్టీ సభ్యుల ఎర్రగీతను దాని పోడియంపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. స్పీకర్ వారిని ఎన్ని సార్లు వారిస్తున్నప్పటికీ ఎర్ర గీతను దాటి పోయి పోడియం పైకి వెళ్లడంతో స్పీకర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వారందరినీ నేటి సమావేశం నుండి సస్పెండ్ చేస్తున్న ప్రకటించారు. 

వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మకాయల చినరాజప్ప, కింజరపు అచ్చెన్నాయుడు, మంతెన రామరాజు, గద్దే రామమాహన్, ఏలూరి సాంబశివరావు, డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, బెందాళం అశోక్ తదితరులను నేటి బడ్జెట్ సమావేశం నుండి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడం మార్షల్స్ వచ్చి వారందరినీ బయటకు పంపించేందుకు ప్రయత్నించడంతో వారంతా ప్రభుత్వానికి వ్యతిరేఖకంగా పలు నినాదాలు చేస్తూ సభ బయటకు వెళ్లిపోయారు. అనంతరం ప్రశ్నోత్తర సమయాన్ని స్పీకర్ కొనసాగించారు. 

గౌరవ సభ్యులు అబ్దుల్ హఫీజ్ ఖాన్, విశ్వనరాయి కళావతి, జొన్నలగడ్డ పద్మావతి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, అరణి శ్రీనివాసులు తదితరులు ఇళ్ల పట్టాలపై పంపిణీ అంశానికి సంబందించి అడిగిన ప్రశ్నకు  రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమాదానం చెపుతూ 2019 నుండి ఇప్పటి వరకూ మొత్తం 30,65,315 ఇళ్ల పట్టాలను రాష్ట్రంలోని నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు మొత్తం 25,427.13 ఎకరాల విస్తీర్ణంగల పట్టాభూమిని సేకరించడమైందని, నేటికి రూ.11,343.71 కోట్లను వెచ్చించడం జరిగిందని తెలిపారు. 

మత్స్యకారులకు ఆర్థిక సాయం అనే అంశంపై పలువురు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్రం పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు సమాదానం చెపుతూ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం క్రింద వేట నిషేద సమయంలో రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని, మరణించిన మత్స్యకార కుటుంబాలకు ఎక్సెగ్రేషియాగా రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుచున్నదన్నారు. గత నాలుగేళ్ల కాలంలో మత్స్యకారు సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలు వినూత్న పథకాలను అమలు చేయడం జరుగుచున్నదని, ఆయా పథకాల క్రింద ఇప్పటి వరకూ రూ.811.377 కోట్ల మే ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 

•అదే విధంగా గౌరవ సభ్యులు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, నంబూరు శంకరరావు, టి.జె.ఆర్.సుధాకర్ బాబు ధూప దీప నైవేద్య పథకం అమలుపై అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమాదానం చెపుతూ ఈ పథకం క్రింద రూ.1.00 లక్ష కంటే తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలకు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుచున్నదన్నారు. ఈ పథకం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 4,603 దేవాలయాలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ పథకం క్రింద గత నాలుగేళ్లలో రూ.56.96 కోట్లను తమ ప్రభుత్వం ఖర్చు చేయగా గత ప్రభుత్వ హయాంలో  కేవలం రూ.40.45 కోట్లను మాత్రమే వెచ్చించడం జరిగిందని తెలిపారు. 

•అజెండాలో ఉన్న మిగిలిన ప్రశ్నలను అడిగిన ప్రతి పక్షపార్టీ సభ్యులు సభలో లేనందున వాటన్నింటికీ సమాదానాలు చెప్పినట్లు స్పీకర్ ప్రకటించారు.

•అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ శాసన సభచే ఆమోదించబడి శాసన మండలి ఆమోదానికై పంపబడిన పలు బ్లిలు తే.20.03.2023 దీన నిర్వహించిన శాసన మండలి సమావేశంలో శాసన సభచే పంపబడిన బిల్లులు అన్నింటినీ ఎటు మార్పులు లేకుండా ఆమోదంచి వాటిని తిరికి శాసన సభకు నేను పంపించడం జరిగిందని తెలిపారు. 

•అదే విధంగా ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం నుండి చివరి రోజైన నేటి వరకూ సభలో నిర్వహించిన క్వశ్చన్ అవర్ లలో చర్చకు రాని 29 స్టార్డ క్వశ్చన్లు, రెండు అన్ స్టార్డు క్వశ్చన్లను మరియు నోటీసులను కూడా ఈ సభ ప్రొసీడింగ్స్ లో భాగంగా గుర్తించడంమైందని ప్రకటిస్తూ వాటి సమాదానాలను సంబందిత శాఖల మంత్రులు ప్రశ్నలు అడిగిన సభ్యులకు నేరుగా వ్రాతపూర్వంగా సత్వరమే అందజెయాలని ఆదేశించారు. అనంతరం జీరో అవర్ ను స్పీకర్ ప్రారంభించారు. 

•ఈ జీరో అవర్ లో భాగంగా పలువురు శాసన సభ్యులు వారి నియోజక వర్గాల్లోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకు వస్తూ వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సంబందిత మంత్రులను కోరారు.  

                                                                                         •నందికొట్కూరు శాసనసభ్యులు ఆర్డర్ తొగూరు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా తమ ప్రాంతంలోని అరటి, మిరప, మిరప తోటలు దారుణంగా దెబ్బ తిన్నాయని ఆర్థికంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. 

•కందుకూరి శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 500 మంది హోంగార్డుల సమస్యను పరిష్కరించాలని, రాష్ట్ర విభజనకు ముందు ఉభయ రాష్ట్రాల్లో ఈ హోంగార్డులు నియమితులయ్యారని, రాష్ట్రం విడిపోయినా, వారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారని, వారి ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ కు పంపించడానికి తెలంగాణ ప్రభుత్వం సైతం అంగీకరించిందన్నారు. అయితే సంబందిత పైలు ఆర్థిక శాఖ లో పెండింగ్ లో ఉందని దాన్ని వెంటనే ఆమోదించి వీరిని మన రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.

•కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రాంతమైన కొల్లేరులో మత్స్య పరిశ్రమ 1975 నుంచి గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు. కొల్లేటి వాసులు చేపల చెరువుల ద్వారా మత్స్య పరిశ్రమను రాష్ట్రమంతా విస్తరింప చేశారన్నారు. తమ ప్రాంతంలో మత్స్య శాఖ అధికారులు నిర్లక్ష్యం వలన ఈనాటికి ఇక్కడ చేప పిల్లల హ్యాచరీ లేదన్నారు. కైకలూరు ప్రాంతంలో వైయస్సార్ ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేయాలన్నారు. ఆక్వా జోన్ పరిధిలో లేదని విద్యుత్ శాఖ చేపల చెరువుల రైతుల నుంచి పెద్ద మొత్తంలో విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు.

•ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాట్లాడుతూ తాళ్ళరేవు మండలంలో లక్షకు పైగా జనాభా ఉందని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు రెండు ఉన్నాయని, తమ ప్రాంతంలో కిడ్నీ పేషెంట్లు అధికమని వారికోసం డయాలసిస్ సెంటర్ ఒకటి ప్రారంభించాలని అభ్యర్థించారు.

•గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ గంగవరం పోర్టు కారణంగా స్థానిక మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని, భారీ వాహనాల రద్దీ కారణంగా ఎగిసిపడుతున్న దుమ్ము ధూళితో పలువురికి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలుతున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

•విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ నగరానికి ఉత్తరాంధ్ర నుంచి పలువురు తూర్పు కాపులు, కొండ దొరలు తదితర కులస్తులు నియోజకవర్గంలో వివిధ వృత్తుల కేసు జీవనం కొనసాగిస్తున్నారని, వీరికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2017 నుంచి ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రాలు అధికారులు ఇవ్వడం లేదన్నారు. ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు.

•పెనమలూరు శాసన సభ్యులు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ తాను లేవనెత్తుతున్న సమస్య రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందన్నారు. వీధి కుక్కలు సంఖ్య విపరీతంగా పెరిగిపోయి చిన్నారులను పెద్దలను కడిచి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు. పొరుగు రాష్ట్రంలో పసిపిల్లలను హతమార్చిన ఘటన కూడా నమోదు కావడం గమనార్హం అన్నారు. పశుసంవర్ధక శాఖ వీటికి పునరుత్పత్తి నిరోధక ఇంజక్షన్ ఇవ్వడం లేదా చట్టంలో ఏదైనా మార్పు తీసుకొచ్చి వీధి కుక్కలను సమూలంగా నిర్మూలించే విధంగా చట్టం రూపొందించాలన్నారు.

• పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షం కారణంగా తమ ప్రాంతంలో మామిడి జీడి మామిడి తదితర పంటలకు విపరీతమైన నష్టం కలిగిందన్నారు. అలాగే ఏనుగులు గుంపు పొలాలపై విరుచుకుపడి సోలార్ పంపుసెట్లు ధ్వంసం చేస్తున్నాయన్నారు.  నష్టాలకు గురైన బాదిత రైతులకు తగు సహాయం చేయాలని ఆమె కోరారు. 

•కమలాపురం శాసనసభ్యులు పొచిమ‌రెడ్డి రవీంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ గత వారంలో అరగంటసేపు కురిసిన వడగళ్ల వాన తన ప్రాంత రైతులను ఆర్థికంగా తీవ్రంగా నష్టానికి గురి చేసిందని తెలిపారు. వరి, నువ్వులు, హార్టికల్చర్ కు సంబంధించిన వివిధ పంటలు దారుణంగా దెబ్బతిన్నా యన్నారు. నిమ్మ పిందె దశలో ఉన్నందున పంట పూర్తిగా నాశనం అయిందన్నారు. రైతుకు పంట నష్టం వచ్చేందుకు ఏమాత్రం అనుకూలించని ఉద్యానవన శాఖ నిబంధనలను ప్రభుత్వం మార్చాలన్నారు.

•పెదకూరపాడు నియోజక వర్గం శాసన సభ్యులు నంబూరి శంకర్ రావు మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యేసరికి మిర్చి, పత్తి విత్తనాలు రైతులకు అందడం లేదని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అచ్చంపేట ప్రాంతంలో గంగాభవాని అనే రకం విత్తనాలు రైతులను తీవ్రంగా నష్టపర్చిందన్నారు. పంటల బీమా తమ ప్రాంత రైతులకు కల్పించాలని ఆయన కోరారు. అలాగే బుడగజంగాలకు కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వారు అనేక ప్రభుత్వ పథకాలను కోల్పోతున్నారన్నారంటూ వారిని ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 

•నరసరావుపేట నియోజక వర్గం శాసన సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పంటకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి క్వింటాల్ 25 వేల రూపాయల ధర పడుతుందని రైతు సంబరపడిపోతున్న సమయంలో మిర్చి కల్లాలులో ఉండగానే తడిచిపోయిందని తెలిపారు. తూర్పు రాయలసీమకు ఒక యూనివర్సిటీ కావాలనే ప్రతిపాదన ఏనాటి నుంచో ఉన్నదని అందుకై 87 ఎకరాలు స్థలం కూడా సిద్ధంగా ఉందని, ప్రభుత్వం చొరవ చూపి ఈ విశ్వవిద్యాలయ నిర్మాణానికి కృషి చేయాలన్నారు.

• ఈ సందర్బంగా కందుకూరి శాసన సభ్యులు మహీదర రెడ్డి మాట్లాడుతూ జీరో అవర్ జీరోగా ఉండిపోతుందనే భావన చాలా మంది శాసన సభ్యులలో ఉందని, ఇటు వంటి భావనకు స్వస్తి పలికే విధంగా జీరో అవర్ ను నిర్వహించాలన్నారు. పలువురు శాసన సభ్యులు వారి నియోజక వర్గాల్లోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకు రావడం జరుగుచున్నదని, అయితే సంబందిత మంత్రులు సభలో ఉండకపోవడం దురదృష్టకరమని, ఇతర మంత్రులు సభ్యలు చెప్పిన సమస్యలను నోట్ చేసుకోవడం జరిగిందని, వాటిని సంబందిత మంత్రి దృష్టికి తీసుకువెళతామని ఏదో మొక్కుబడిన సమాదానాలు ఇవ్వడం జరుగుచున్నదన్నారు. గతంలో తాను ఇదే సభలో దేవాదాయ శాఖకు సంబందించి తమ నియోజకవ వర్గంలోని సమస్యను సంబందిత మంత్రి దృష్టికి తీసుకురాగా, దానికి సంబందించి ఇంతవరకు తమకు ఎటు వంటి సమాదానం అందలేదని, సదరు మంత్రి కూడా మారిపోవడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రస్తుత జీరో అవర్ లో సభ్యులు సభ దృష్టికి తెచ్చిన పలు సమస్యల విషయం మరో మార్పుకు దారితీయకుండా వాటిపై తగు చర్యలు తీసుకోవడమే కాకుండా సమాదానాలు సకాలంలో అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సభాధిపతి తమ్మినేని సీతారామ్ ను కోరారు.

• అదే విధంగా పలువరు శాసన సభ్యులు ఈ జీరో అవర్ లో మాట్లాడుతూ వారి నియోజక వర్గాల సమస్యలను సభ దృష్టికి తీసుకవచ్చి వాటి తక్షణ పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

•తదుపరి స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ జీరో అవర్ ముగిస్తున్నట్లు ప్రకటించారు.

•అదే విధంగా ఏలూరు సాంబశివరావు, ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

•అజెండాలోని అన్ని పేపర్లు సభ ముందు ఉండమైనట్టు స్పీకర్ ప్రకటించారు.

•అనంతరం పలు శాఖలకు చెందిన పలు బిల్లుల సవరణలకు సభ ఆమోదం తెలపాలంటూ సంబందిత మంత్రులు ఆయా బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.

•రాష్ట్ర మహిళ, శిశు, విభిన్న ప్రతిపభావంతులు మరియు సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ 2023 ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ (సవరణ) బిల్లును, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆంధ్రప్రదేశ్ దేశీయ జలమార్గముల ప్రాధికార సంస్థ బిల్లును మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి తరపున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త (సవరణ) బిల్లును సభ పరిశీలనార్థం మరియు ఆమోదించడం కోసం సభలో ప్రవేశ పెట్టారు.

•ఈ సవరణ బిల్లులు అన్నింటిపై పలువురు సభ్యులు ప్రసంగించిన తదుపరి ఈ బిల్లులపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించడంతో సభ్యలు అందరూ ఆయా బిల్లుల ఆమోదానికి అంగీకారం తెలపడంతో సవరణ బిల్లులు అన్నింటినీ సభ ఆమోదించినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.