మోదీపాలన కూట్రపూరితం కక్ష సాధింపుల ప్రభుత్వాలకు స్వస్తి పలుకుదాం.రాహుల్ గాంధీపై అక్రమంగా కేసులు పెడితే ఊరుకోబోం.కొండేటి
మోదీపాలన కూట్రపూరితం కక్ష సాధింపుల ప్రభుత్వాలకు స్వస్తి పలుకుదాం.రాహుల్ గాంధీపై అక్రమంగా కేసులు పెడితే ఊరుకోబోం.టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య ఫైర్.
Streerbuzz news :నల్గొండ జిల్లా :
నకిరేకల్: కేంద్ర రాష్ట్రాల్లో కక్ష సాధింపుల పాలన కొనసాగుతోందని, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి మల్లయ్య ఫైర్ అయ్యారు. సూరత్ కోర్టు రాహుల్ గాంధీపై ఇచ్చిన తీర్పుపై హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో గురువారం నిరసన వ్యక్తం చేశారు. దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీపై కావాలనే బీజేపీ ప్రభుత్వం తీర్పులు ఇప్పిస్తోందని, తమకు న్యాయవ్యవస్థపై నమ్మకముందని అన్నారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతోందని, అరాచకపాలన సాగుతోందని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుకు త్వరలోనే చెక్ పెట్టే రోజు వస్తుందని అన్నారు. రాహుల్ గాంధీకి దేశమంతా అండగా ఉంటుందని, ఇప్పటికే ప్రజల్లో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల్లో అపహాస్యం అవుతుననాయని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతి నేతపై ప్రజలు కోపంతో ఉన్నారని, వారిమ కుట్రపూరితమైన పాలనకు స్వస్తి పలికే రోజు త్వరలోనే ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎంలు కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకనైనా మోదీ పాలనలో బంధీ అయిన ప్రజాస్వామ్యాన్ని కాపడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొండేటి మల్లయ్య పిలుపునిచ్చారు.
Mar 23 2023, 19:07