భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించాలి. (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్న కుమార్)

భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించాలి. (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్న కుమార్)

నేటి యువతకు భగత్ సింగ్ జీవితం స్ఫూర్తిదాయకంమని ఆయన ఆశయాలు కొనసాగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జగ్గయ్యపేట మండల కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ ,రాజ్ గురు ,సుకుదేవ్ ల 92వ వర్ధంతి కార్యక్రమం జగ్గయ్యపేట పట్టణంలో ఉన్నా నారాయణ స్కూల్ నుండి బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భగత్ సింగ్ చిత్రపటముకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్న కుమార్ పూలమాలవేసి నివాళులు అర్పించారు....

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా, దేశస్వాతంత్య్రం కోసం నూనూగు మీసాల వయస్సులోనే ప్రాణత్యాగం చేసిన వీరకిశోరాలన్నారు. జలియన్ వాలా బాగ్ దురంతంతో ప్రభావితమైన ఆయన జీవితం దేశ స్వాతంత్య్రం కోసం పార్లమెంట్ పొగ బాంబులతో దాడి చేసి బ్రిటీష్ వారిని గడగడ లాడించిన పోరాట యోధుడు భగత్ సింగ్ అని అన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు, కాషాయకరణ, యుద్ధోన్మాదంకి వ్యతిరేకంగా పోరాడాలని, కార్పొరేట్ అనుకూల జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేసేంత వరకు,విద్యా ఉపాధి అవకాశాల కోసం భగత్ సింగ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పోరాడాలని యువతని కోరారు..   

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఏం.సోమేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు జి.గోపినాయక్, ఐద్వా డివిజన్ కార్యదర్శి సోమోజు నాగమణి ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష , కార్యదర్శులు రాజు ఎస్.ప్రణయ్ తేజ సిఐటియు మండల కార్యదర్శి గౌస్, డివైఎఫ్ఐ కార్యదర్శి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణానికి వరం బార్క్‌ నీటి శుద్ధి పరిజ్ఞానం.

గ్రామీణానికి వరం బార్క్‌ నీటి శుద్ధి పరిజ్ఞానం.

రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, మార్చి 23: బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్క్‌) అభివృద్ధి చేసిన నీటి శుద్ధి పరిజ్ఞానం సాయంతో అతి తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాలకు శుద్ధిచేసిన, సురక్షితమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పీఎంవో శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధిచేసిన తాగునీరు అందించే లక్ష్యంతో ఆకృతి ప్రోగ్రాం పేరిట కేంద్ర ప్రభుత్వం అనేక మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఆల్ట్రా ఫిల్టరేషన్ మెంబ్రేన్ ఆధారిత నీటిశుద్ధి సాంకేతికతను బదలాయించినట్లు తెలిపారు.

బార్క్‌ అభివృద్ధి చేసిన నీటిశుద్ధి సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్ర ప్రభుత్వం ఏఏ రాష్ట్రాల్లో విస్తరించింది? ఏ టెక్నాలజీ ఎంత ధరలో అందుబాటులో ఉన్నాయి? చౌకగా తాగు నీటిని శుద్ధి చేసే ఈ టెక్నాలజీని వాణిజ్యపరం చేసే ఆలోచన ఉందా అంటూ శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ వినూత్న నీటి శుద్ధి పరిజ్ఞానం గురించి వివరించారు. బార్క్ రూపొందించి నీటిశుద్ధి సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, గుజరాత్, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో విస్తరించినట్లు తెలిపారు. అలాగే వాణిజ్యపరంగా దీనిని విస్తరించేందుకు 14 పైగా ప్రైవేటు సంస్థలకు వివిధ రకాల టెక్నాలజీలను బదలాయించినట్లు తెలిపారు.

ఆయా ప్రాంతాల్లో నీటి నాణ్యత ఆధారంగా ఏ విధమైన నీటిశుద్ధి టెక్నాలజీని వినియోగించాలో నిర్ణయించిన మీదట దానిని విస్తరిస్తారని మంత్రి తెలిపారు. నీటిలో సూక్ష్మక్రిములతో నిండిన కాలుష్యం, మలినాలను తొలగించేందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ఆల్ట్రా ఫిల్టరేషన్ మెంబ్రేన్ టెక్నాలజీని, నీటిలో ఆర్సెనిక్/ ఐరన్ వంటి కాలుష్యాన్ని తొలగించేందుకు ఫిజికో కెమికల్ ప్రాసెస్ అసిస్టెడ్ ఆల్ట్రా ఫిల్టరేషన్ మెంబ్రేన్ టెక్నాలజీని, ఉప్పుతోపాటు అనేక రకాల కాలుష్యాలు తొలగించేందుకు బ్రాకిష్‌ వాటర్ రివర్స్ ఆస్మోసిస్ ఆధారిత మెంబ్రేన్ టెక్నాలజీ, టీడీఎస్ 5000 నుంచి 35000 పీపీఎం వరకు తొలగించేందుకు సీ వాటర్ రివర్స్ ఆస్మోసిస్ ఆధారిత మెంబ్రేన్ టెక్నాలజీని బార్క్‌ రూపొందించినట్లు తెలిపారు.

బార్క్ రూపొందించిన మెంబ్రేన్ ఆధారిత నీటిశుద్ది సాంకేతిక పూర్తిగా స్వదేశీయమైనది, తక్కువ ఖర్చుతో కూడుకున్నదని మంత్రి తెలిపారు. ఈ టెక్నాలజీల ఆధారంగా రూపొందించిన డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫైర్స్ మార్కెట్లో లభ్యమయ్యే వాణిజ్యపరమైన రకాలతో పోల్చిచూస్తే 30%-40% వరకు తక్కువ ధరలో అందిస్తున్నట్లు చెప్పారు. ఇంట్లో కుళాయికి అమర్చే డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫైర్ 5 వేల రూపాయలు, గంటకు 10 లీటర్ల నీటిని శుద్ధిచేసే సామర్ధ్యం గల బీడబ్ల్యుఆర్ఓ-పీఓయూ వాటర్ ప్యూరిఫైర్ 10 వేలు, కమ్యూనిటీ సైజ్ యూఎఫ్ ఆధారిత ఆర్సెనిక్/ ఐరన్ రిమూవల్ యూనిట్ 10 లక్షలు, బీడబ్ల్యుఆర్ఓ మెంబ్రేన్ ఆధారిత కమ్యూనిటీ సైజ్ ఆర్ ఓ యూనిట్ 12 నుంచి 15 లక్షలు, గంటకు 10 వేల లీటర్ల నీటని శుద్ధి చేసే సామర్ధ్యం కలిగిన ఎస్‌డబ్ల్యుఆర్‌ఓ మెంబ్రేన్ ఆధారిత కమ్యూనిటీ సైజ్ ఆర్వో యూనిట్ 70 నుంచి 85 లక్షల మధ్యలో లభిస్తుందని మంత్రి తెలిపారు.

----------------------------------------------------------

హైదరాబాద్ : అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు

హైదరాబాద్ : అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు

హైదరాబాద్‌: వ్యక్తిగత డేటా సేకరించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.8కోట్ల మందికి సంబంధించిన డేటా చోరీ చేశారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు..

పలు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ల నుంచి డేటాను చోరీ చేసి ఈ ముఠా సైబర్‌ నేరగాళ్లకు అమ్ముతున్నట్లు వెల్లడించారు. పాన్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగులు, పలు బ్యాంకింగ్‌ క్రెడిట్ కార్డులు, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న సంస్థల నుంచి డేటా చోరీ అయిందని చెప్పారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

''బీమా, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల సమాచారం తస్కరించినట్లు గుర్తించాం. ఫేస్‌బుక్‌ యూజర్ల ఐడీ, పాస్‌వర్డ్‌లు, ఐటీ ఉద్యోగుల డేటాను సైతం చోరీ చేశారు. డిఫెన్స్‌, ఆర్మీ ఉద్యోగుల డేటా అంగట్లో అమ్మకానికి పెట్టారు. మహిళల వ్యక్తిగత డేటానూ సైబర్‌ నేరగాళ్లకు అమ్ముతున్నారు. ఇది దేశ భద్రతకు పెను ముప్పు. సైబరాబాద్‌ పరిధిలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ఈ వ్యవహారంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డ్‌ జారీ చేసే ఓ ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించాం. దీనికి సంబంధించి జస్ట్‌ డయల్‌ సంస్థపై కూడా కేసులు నమోదు చేస్తాం. గతంలో ఇలాంటి కేసులు మా దృష్టికి వచ్చాయి. వీరి వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తాం'' అని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు..

ఘనంగా నేషనల్ క్రిస్టియన్ బోర్డు సమావేశం.పెనుగంచిప్రోలు.

ఘనంగా నేషనల్ క్రిస్టియన్ బోర్డు సమావేశం.

పెనుగంచిప్రోలు

నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అద్యక్షులు డాక్టర్ జాన్ మాస్క్ పిలుపు మేరకు మండలంలోని శివపురం గ్రామంలో ఏ జి సి ఎం ప్రార్ధనా మందిరంలో పాస్టర్ ప్రభు కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా నేషనల్ క్రిస్టియన్ బోర్డు మండల ప్రతినిధుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా 

 ఏపి స్టేట్ అద్యక్షులు రెవ. డా. నవీన్ కుమార్ మాట్లాడుతూ దైవ సేవలో ఉన్న వారంతా నమ్మకంగా, ఐక్యత కలిగి జీవించాలని, దేశ రక్షణ కొరకు ప్రార్థించాలని పిలుపునిచ్చారు. జిల్లా అద్యక్షులు

రెవ. ఏ చింతయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మండలంలో కష్టపడి పనిచేయాలని అందరికి క్రీస్తు ప్రేమను పంచాలన్నారు. స్టేట్ ట్రెజరర్ వై. శేఖర్ బాబు మాట్లాడుతూ క్రైస్తవులు సమయపాలన కలిగి సమాజిక సేవ చేయలని తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు, పలువురు మండల నాయకులు, స్థానిక దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు

పోలవరం. ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం: కేంద్రం.

Polavaram: 'పోలవరం. ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం: కేంద్రం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతానికి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని తేల్చి చెప్పింది..

పార్లమెంటులో వైకాపా ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని స్పష్టం చేశారు. తొలిదశ సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికే పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు.

అయితే, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఖరారైందని వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం కల్పించినట్లు తెలిపారు. సహాయ, పునరావాసం మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉన్నా... అందులో కూడా జాప్యం జరిగిందని కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా వివరించారు..

ఏపీ :ఒక్క ఎమ్మెల్యే కోసం స్పెషల్ ప్లైట్ ఏర్పాటు చేసిన వైయస్సార్ సీపీ

ఒక్క ఎమ్మెల్యే కోసం స్పెషల్ ప్లైట్ ఏర్పాటు చేసిన వైయస్సార్ సీపీ.

ఎమ్మెల్సీ పోలింగ్.. ఓటు వేసిన 174 మంది ఎమ్మెల్యేలు

AP: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దాదాపు ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు గడువు ఉన్నా.. ఇప్పటికే 175 మంది ఎమ్మెల్యేల్లో 174 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుమారుడి వివాహం ఉండటంతో నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఇంకా ఓటు వేయలేదు. ఆయన కోసం వైసీపీ ప్రత్యేక ఛాపర్ ఏర్పాటు చేసింది. దాంట్లో బయల్దేరిన ఆయన కాసేపట్లో గన్నవరం విమానాశ్రయం చేరుకుని ఓటు వేసేందుకు పయనం కానున్నారు.....

విజయవాడ:ఇంద్రకీలాద్రి లో దోపిడి.. కేశఖండనశాలలో భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్న సిబ్బంది..

విజయవాడ:ఇంద్రకీలాద్రి లో దోపిడి..

కేశఖండనశాలలో భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్న సిబ్బంది..

దూర ప్రాంతాల నుంచి వచ్చు భక్తులను నిలువునా దోచుకుంటున్న దేవస్థానం సిబ్బంది..

కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించే భక్తుల నుండి అధిక దోపిడీ..

దుర్గగుడి కేశఖండన శాలలో భక్తుల నుండి అధిక దోపిడీ

భక్తుల సెంటిమెంటును ఆసరాగా చేసుకుంటున్నా దేవాలయ సిబ్బంది..

భక్తులు సమర్పించే తలనీలాలు టికెట్ ధర 25 రూపాయలు..

ఆలయ సిబ్బంది మాత్రం 500 రూపాయలు డబ్బులు ఇస్తేనే తలనీలాలు చేస్తాం లేకపోతే లేదు అని చెబుతున్నారని భక్తులు ఆరోపణ..

వాటాల నిమిత్తం

MLA 200

ట్రస్ట్ బోర్డు సభ్యులకు 200

కేశఖండ శాల లో విధులు నిర్వహించే వాళ్లకి 100

గర్భనిరోధానికి ఇక పిల్స్‌తో పనిలేదు.తెలుగు రాష్ట్రాల్లో కొత్త విధానం అమలుకు కేంద్రం రెడీ.

గర్భనిరోధానికి ఇక పిల్స్‌తో పనిలేదు

తెలుగు రాష్ట్రాల్లో కొత్త విధానం అమలుకు కేంద్రం రెడీ!

మూడు నాలుగు సెంటీమీటర్ల పొడవుతో సూదిలా సాధనం

మోచేతి చర్మం కింద పైపొరలో అమరిక

గర్భాన్ని నిరోధించే హార్మోన్ విడుదల

అన్ని రాష్ట్రాల్లోనూ ఉచితంగా పంపిణీ చేయనున్న కేంద్రం

బిడ్డల మధ్య ఎడం కోరుకునే వారికి ఉపయుక్తం

సంతానం కావాలనుకున్నప్పుడు ఈజీగా తొలగించొచ్చు

న్యూ ఢిల్లీ : గర్భ నిరోధానికి ఇప్పటి వరకు ఉన్న పిల్స్, ఇంజెక్షన్లు, కాపర్-టి, కండోమ్‌ల వంటి సాధనాల స్థానంలో కొత్త పద్ధతి వస్తోంది. దీనిని తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కొత్త సాధనం 3-4 సెంటీమీటర్ల పొడవు, 2-4 మిల్లీమీటర్ల పొడవుతో సూదిలా ఉంటుంది. దీనిని మోచేతి చర్మం కింద పైపొరలో అమరుస్తారు. దీంట్లో నుంచి గర్భాన్ని నిరోధించే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నిజానికీ సాధనం హార్మోన్‌తోనే తయారవుతుంది. సంతానం మధ్య దూరం ఉండాలని కోరుకునే వారు ఈ సాధనాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల భార్యాభర్తల సఖ్యతకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధానాన్ని ‘సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్’గా పిలుస్తున్

ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. మొదటి వోటు వేసిన సీఎం జగన్

ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.

మొదటి వోటు వేసిన సీఎం జగన్

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్ ముగిసిన గంట తర్వాత అంటే..సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలుకానుంది. అందర్నీ ఏకకాలంలో తరలించే ప్రయత్నాల్లో ఉంది టీడీపీ. చంద్రబాబుతో కలిసే ఓటింగ్‌కి వెళ్లబోతున్న 19 మంది ఎమ్మెల్యేలు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు. ఈ పోలింగ్ మొత్తం విప్ వర్సెస్ ఆత్మప్రబోధానుసారం కాన్సెప్ట్‌లో జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోటీచేస్తున్న ఒక్క సీటును గెలిచితీరతామంటున్నాయి టీడీపీ వర్గాలు. లేదు లేదు ఏడుకు ఏడు సీట్లు తమవేనన్న ధీమాలో ఉంది వైసీపీ. ఎవరి ధీమా వాళ్లకు ఉన్నా.. ఎవరి టెన్షన్ కూడా వాళ్లకుంది. ఎందుకంటే.. ఈ పోటీల్లో గెలుపోటములను రెబల్స్ టెన్షన్ ప్రభావితం చెయ్యబోతోంది.

అమరావతి :కేజీబీవీలలో ప్రవేశం కోసం దరఖాస్తుల స్వీకరణ

'కేజీబీవీలలో ప్రవేశం కోసం దరఖాస్తుల స్వీకరణ'

అమరావతి: కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో 6, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8, 9 తరగతుల్లో మిగి లిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తు న్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఆన్లైన్లో దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. 

ఈనెల 27 నుంచి ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నామన్నారు.

 అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ ( బడి మానేసిన వారు) పేద, ఎస్.సి, ఎస్.టి, బీసీ, మై నారిటీ, బి.పి.ఎల్ బాలికలు మాత్రమే దర ఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 

ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తామని చెప్పారు. 

దరఖాస్తును‘హెచ్ టీటీపీఎస్://ఏపీకేజీబీవీ. ఏపీసీఎఫ్ఎస్ఎస్. ఐఎన్' సైట్ ద్వారా పొందవచ్చునన్నారు. 

ఎంపికైన విద్యార్థుల కు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుందని తెలిపారు. సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చని, సందేహాలు ఉంటే 9494383617, 9441270099, 9441214607, 9490782111 నంబర్లలో సంప్రదించాలని కోరారు.