మన హక్కులే మనకు భరోసా. వస్తువులు కొనుగోలు చేసి మోసపోతున్నారా. ది.జాతీయ వినియోగదారుల హక్కుల కమీషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ యంగలి గోపి గౌడ్
మన హక్కులే మనకు భరోసా.
వస్తువులు కొనుగోలు చేసి మోసపోతున్నారా.
ది.జాతీయ వినియోగదారుల హక్కుల కమీషన్
తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ యంగలి గోపి గౌడ్
వస్తువులు కొన్నప్పుడు, సేవలని ఉపయోగించుకునే సందర్భాల్లో మోసపోయి చాలా మంది వినియోగదారులు మోసపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో న్యాయాన్ని అందించేందుకు వినియోగదారుల ఫోరాలు ఉంటాయని వినియోగదారులు గుర్తించాలి. గుండు సూది నుంచి విమాన ప్రయాణం వరకు, దీనిని కొనుగోలు చేసిన ఎంత ఖర్చు చేసినా వాళ్లు వినియోగదారులే (కన్స్యూమర్ ).
కొనుగోలు చేసిన ప్రతీ వస్తువు నాణ్యత లేకపోయినా, నాణ్యత ప్రమాణాలకు తగ్గట్లుగా లేకపోయినా నష్టాల బారిన పడేది ఆ వినియోగదారుడే.
ఉదా : ఒక వ్యక్తి గడువు తీరిన వస్తువులను కొనుగోలు చేసినచో మోసపోయానని బాధపడాల్సిక అవసరం లేదు. ప్రస్తుతం తినే ఆహారం నుంచి వేసుకునే దుస్తులు, తొడుక్కునే చెప్పులు అన్నీ కల్తీ, తాగే నీళ్ళు, నకిలీలతో వినియోగదారుడు మోసపోతూన్నారు..
జరిగిన నష్టాన్ని చూస్తూ ఉండకుండా మన హక్కులను మనం కాపాడుకోకావల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.
వినియోగదారుల రక్షణ కోసం ప్రత్యేకంగా వినియోగదారుల చట్టం (థ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ) ఉంది. వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం, సంబంధించి సమాచారం ఇందులో ఉంటుంది. అంతేకాదు నష్టపరిహారం పొందే హక్కునూ ఈ చట్టమే కల్పిస్తోంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల నుంచి పొందే సేవలన్నీ వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తాయి.
ఒప్పందం ప్రకారం సేవ చేయకపోయినా, వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, చట్ట ప్రకారం విధులు నిర్వర్తించకపోయినా వినియోగదారుడు ఈ చట్టం ప్రకారం కోర్టులను (ఫోరం) ఆశ్రయించవచ్చు. ఉచితంగా పొందే సర్వీసులు ఈ చట్టం పరిధిలోకి రావు. వినియోగదారుడికి రక్షణగా వినియోగదారుల సంఘాలు, తూనికల కొలతల శాఖ, ఆహార కలుషిత నియంత్రణ తదితర విభాగాలు ఏర్పాటయ్యాయి.
వినియోగదారుల హక్కులు:
► వస్తువులను లేదా సేవలను వినియోగదారులు తమకు అందుబాటు ధరలో ఉండి., నచ్చితేనే ఎంచుకునే హక్కు ఉంటుంది. బలవంతంగా వినియోగదారుడికి అంటగట్టే ప్రయత్నం నేరమే అవుతుంది.
► భద్రత హక్కు: ఈ హక్కు ప్రకారం సంస్థలు నాణ్యమైన వస్తువులు, సేవలను వినియోగదారుడికి అందించాలి. వినియోగదారుడు కొనే వస్తువులు, పొందే సేవలు దీర్ఘకాలం మన్నికలా ఉండాలి. అవి వినియోగదారులు ఆస్తులకు నష్టం కలిగించకూడదు. అయితే నాణ్యతను గుర్తించి వస్తువులను, సేవలను కొనుక్కోవాల్సిన బాధ్యత మాత్రం వినియోగదారుడి పైనే ఉంటుంది
► సమాచారం పొందే హక్కు : కొనే వస్తువు, పొందే సేవల నాణ్యతా ప్రమాణాలు, ధరల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు విధించడానికి వీల్లేదు.
► అభిప్రాయం వినిపించొచ్చు: వినియోగదారుల వేదికలపై వినియోగదారుడు అభిప్రాయాలు చెప్పేందుకు హక్కు ఉంది. అంతేకాదు ప్రత్యేకంగా వినియోగదారుల సంఘాలను ఏర్పరుచుకునేందుకు కూడా హక్కు ఉంది. అయితే ఆ సంఘాలకు రాజకీయాలు, వ్యాపారాలతో ఎలాంటి సంబంధం ఉండకూడదు
► న్యాయపోరాటం: వినియోగదారుడు మోసపోయినా లేదా నష్టపోయినా న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు ఉంటుంది. ఇది అన్నింటికన్నా అతిముఖ్యమైన హక్కు.
బిల్లు ఉంటే ఫోరం సంప్రదిద్దాం సరైన న్యాయం పొందుతాం
ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని యాడ్‌లలో తరచూ చూస్తుంటాం. కొన్ని వస్తువుల విషయంలో గ్యారెంటీ, వారెంటీ కార్డులను షాపు యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి. చిన్న చిన్న వస్తువులను మినహాయిస్తే సాధ్యమైనంత వరకు బిల్లులను అడిగి తీసుకోవడం మంచిది. సమస్య తలెత్తినప్పుడు వినియోగదారుల ఫోరంలో సమర్పించడానికి ఇవి ఉపయోగపడతాయి, వినియోగదారుల చట్టం కింద నష్టపోయిన వ్యక్తికి న్యాయం చేసేందుకు మూడంచెల వ్యవస్థలో ఫోరాలు ఏర్పాటయ్యాయి. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల ఫోరాలు ఉన్నాయి.
- యంగలి గోపి గౌడ్
ది.జాతీయ వినియోగదారుల హక్కుల కమీషన్
తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్
Mar 23 2023, 10:51