విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సాయం.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని గబ్బాయి గ్రామానికి చెందిన ఎలాది రమేష్ కూతురు వెన్నెల ఉట్నూర్ ఏకలవ గురుకులంలో విద్యను భరిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఆదివారం ఆదివాసి నాయకులు కుటుంబాన్ని పరామర్శించి రూ: 7000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు సిడం సకారం, తలండి లక్ష్మణ్, మడావి వెంకట్రావు, ఏన్క శ్రీహరి ,నైతం సత్తయ్య ఆత్రం మాంతయ్య ,ఏలాది నారాయణ తదితరులున్నారు.
Mar 19 2023, 20:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0