వివాహ శుభాకార్యనికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన. జెడ్పిటిసి బలరాం

వివాహ శుభాకార్యనికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన. జెడ్పిటిసి బలరాం

కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన 8వార్డు మెంబర్ చెరుకు జ్యోతిరామన్న కూతురు సిందు అనిల్ కుమార్, వివాహాశుబాకార్యనికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన.కట్టంగూర్ జెడ్పిటిసి తరాల బలరామ్, ఈకార్యక్రమంలో. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ,పి ఏ సి ఎస్ చైర్మన్ నూక సైదులు, కురుమర్తి ఎంపిటిసి బిరెళ్ళి రాజ్యలక్ష్మీ ప్రసాద్, వార్డు మెంబర్ రెడ్డి పల్లి మనోహర్,తదితరులు పాల్గొన్నారు..

మన హక్కులే మనకు భరోసా. వస్తువులు కొనుగోలు చేసి మోసపోతున్నారా. ది.జాతీయ వినియోగదారుల హక్కుల కమీషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ యంగలి గోపి గౌడ్

మన హక్కులే మనకు భరోసా.

వస్తువులు కొనుగోలు చేసి మోసపోతున్నారా.

ది.జాతీయ వినియోగదారుల హక్కుల కమీషన్

తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ యంగలి గోపి గౌడ్

వస్తువులు కొన్నప్పుడు, సేవలని ఉపయోగించుకునే సందర్భాల్లో మోసపోయి చాలా మంది వినియోగదారులు మోసపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో న్యాయాన్ని అందించేందుకు వినియోగదారుల ఫోరాలు ఉంటాయని వినియోగదారులు గుర్తించాలి. గుండు సూది నుంచి విమాన ప్రయాణం వరకు, దీనిని కొనుగోలు చేసిన ఎంత ఖర్చు చేసినా వాళ్లు వినియోగదారులే (కన్స్యూమర్ ).

కొనుగోలు చేసిన ప్రతీ వస్తువు నాణ్యత లేకపోయినా, నాణ్యత ప్రమాణాలకు తగ్గట్లుగా లేకపోయినా నష్టాల బారిన పడేది ఆ వినియోగదారుడే.

ఉదా : ఒక వ్యక్తి గడువు తీరిన వస్తువులను కొనుగోలు చేసినచో మోసపోయానని బాధపడాల్సిక అవసరం లేదు. ప్రస్తుతం తినే ఆహారం నుంచి వేసుకునే దుస్తులు, తొడుక్కునే చెప్పులు అన్నీ కల్తీ, తాగే నీళ్ళు, నకిలీలతో వినియోగదారుడు మోసపోతూన్నారు..

జరిగిన నష్టాన్ని చూస్తూ ఉండకుండా మన హక్కులను మనం కాపాడుకోకావల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.

వినియోగ‌దారుల రక్షణ కోసం ప్రత్యేకంగా వినియోగ‌దారుల చ‌ట్టం (థ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ) ఉంది. వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం, సంబంధించి సమాచారం ఇందులో ఉంటుంది. అంతేకాదు న‌ష్టప‌రిహారం పొందే హ‌క్కునూ ఈ చ‌ట్టమే క‌ల్పిస్తోంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల నుంచి పొందే సేవ‌ల‌న్నీ వినియోగదారుల చట్టం పరిధిలోకి వ‌స్తాయి.

ఒప్పందం ప్రకారం సేవ చేయకపోయినా, వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, చట్ట ప్రకారం విధులు నిర్వర్తించ‌క‌పోయినా వినియోగదారుడు ఈ చ‌ట్టం ప్రకారం కోర్టులను (ఫోరం) ఆశ్రయించవచ్చు. ఉచితంగా పొందే సర్వీసులు ఈ చట్టం పరిధిలోకి రావు. వినియోగదారుడికి రక్షణగా వినియోగ‌దారుల సంఘాలు, తూనికల కొలతల శాఖ, ఆహార కలుషిత నియంత్రణ తదితర విభాగాలు ఏర్పాటయ్యాయి.

వినియోగదారుల హక్కులు:

► వస్తువులను లేదా సేవలను వినియోగదారులు తమకు అందుబాటు ధరలో ఉండి., నచ్చితేనే ఎంచుకునే హక్కు ఉంటుంది. బలవంతంగా వినియోగదారుడికి అంటగట్టే ప్రయత్నం నేరమే అవుతుంది.

► భద్రత హక్కు: ఈ హక్కు ప్రకారం సంస్థలు నాణ్యమైన వస్తువులు, సేవలను వినియోగదారుడికి అందించాలి. వినియోగదారుడు కొనే వస్తువులు, పొందే సేవలు దీర్ఘకాలం మన్నికలా ఉండాలి. అవి వినియోగదారులు ఆస్తులకు నష్టం కలిగించకూడదు. అయితే నాణ్యతను గుర్తించి వస్తువులను, సేవలను కొనుక్కోవాల్సిన బాధ్యత మాత్రం వినియోగదారుడి పైనే ఉంటుంది

► సమాచారం పొందే హక్కు : కొనే వస్తువు, పొందే సేవల నాణ్యతా ప్రమాణాలు, ధరల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు విధించడానికి వీల్లేదు.

► అభిప్రాయం వినిపించొచ్చు: వినియోగదారుల వేదికలపై వినియోగదారుడు అభిప్రాయాలు చెప్పేందుకు హక్కు ఉంది. అంతేకాదు ప్రత్యేకంగా వినియోగదారుల సంఘాలను ఏర్పరుచుకునేందుకు కూడా హక్కు ఉంది. అయితే ఆ సంఘాలకు రాజకీయాలు, వ్యాపారాలతో ఎలాంటి సంబంధం ఉండకూడదు

► న్యాయపోరాటం: వినియోగదారుడు మోసపోయినా లేదా నష్టపోయినా న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు ఉంటుంది. ఇది అన్నింటికన్నా అతిముఖ్యమైన హక్కు.

బిల్లు ఉంటే ఫోరం సంప్రదిద్దాం సరైన న్యాయం పొందుతాం

ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని యాడ్‌లలో తరచూ చూస్తుంటాం. కొన్ని వస్తువుల విషయంలో గ్యారెంటీ, వారెంటీ కార్డులను షాపు యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి. చిన్న చిన్న వస్తువులను మినహాయిస్తే సాధ్యమైనంత వరకు బిల్లులను అడిగి తీసుకోవడం మంచిది. సమస్య తలెత్తినప్పుడు వినియోగదారుల ఫోరంలో సమర్పించడానికి ఇవి ఉపయోగపడతాయి, వినియోగ‌దారుల చ‌ట్టం కింద నష్టపోయిన వ్యక్తికి న్యాయం చేసేందుకు మూడంచెల వ్యవస్థలో ఫోరాలు ఏర్పాటయ్యాయి. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల ఫోరాలు ఉన్నాయి.

- యంగలి గోపి గౌడ్

ది.జాతీయ వినియోగదారుల హక్కుల కమీషన్

తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్

బహుజన బాంధవుడు కాన్షీరామ్‌.కాన్షీరామ్ ఆశయాలు సాధి ద్దాం.బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి

బహుజన బాంధవుడు కాన్షీరామ్‌

కాన్షీరామ్ ఆశయాలు సాధి ద్దాం

బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి*

బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం గారి జయంతి వేడుకలు నకిరేకల్ పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్పీ, నియోజకవర్గ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించి, కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసికేక్ కట్ చేసి, నివాళులర్పించారు.అనంతరం నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ రాజకీయాల్లో చరిత్ర మార్చి బహుజన రాజ్యాధికారాన్ని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో నిలబెట్టిన ఘనుడు మాన్యవీర్‌ కాన్షిరాం అని అన్నారు. అంబేడ్కర్‌ రాసిన ‘కుల నిర్మూలన’ పుస్తకం స్ఫూర్తితో పీడిత వర్గాల జీవితాల్ని రాజ్యాధికారం దిశగా తన నాయకత్వంలో ముందుకు నడిపారు. గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, ఛత్రపతి సాహూ మహారాజ్, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, నారాయణ గురు, పెరియార్‌ లాంటి వారిని గురువులుగా భావించారు. వారి ప్రభావంతోనే 1971లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. తదనంతరం 1978లో బ్యాక్‌వార్డ్‌ అండ్‌ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (బామ్‌ సెఫ్‌)ను స్థాపించి అణగారిన వర్గాలలో ఎదిగినవారు తమ వర్గాల అభ్యున్నతికి తోడ్పడే విధంగా కృషి చేశారన్నారు.'రాజ్యాధికారమే మాస్టర్‌ కీ’ అన్న అంబేడ్కర్‌ మాటలను ఆదర్శంగా తీసుకొని 1984లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ స్థాపించారు. బహుజన సమాజాన్ని రాజ్యాధికారం వైపు నడిపించడానికి అంబేడ్కర్‌ చెప్పిన విధంగా ‘బోధించు, సమీకరించు, పోరాడు’ సిద్ధాంతానికి అనుగుణంగా 1983 మార్చి 15న ఢిల్లీ నుండి బయలుదేరి ఏడు రాష్ట్రాల మీదుగా 100 సైకిళ్ళతో 40 రోజులలో 4,200 కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలను బహుజన ఉద్యమం వైపు మరల్చిన గొప్ప వ్యక్తి కాన్షీరాం. ఆయన అలుపెరగని పోరాటంతో ఉత్తరప్రదేశ్‌లో బహుజనులు కొన్ని సార్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే కాక... దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ గణనీయమైన రాజకీయ శక్తిగా ఎదిగారన్నారు. 85శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రలోభాలకు లోనవకుండా వారి ఓటు వారే వేసుకుని సరైన నాయకుడ్ని ఎన్నుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, నియోజకవర్గ కోశాధికారి దేశాపాక రాజ్ కుమార్, చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత, కట్టంగూర్ మండల అధ్యక్షులు మేడి శ్రీనివాస్, కేతాపల్లి మండల అధ్యక్షులు విజయ్, మహిళా కన్వీనర్ చందుపట్ల శృతి, వివిధ మండల బి ఎస్ పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

యోగాతో మానసిక ప్రశాంతత. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

యోగాతో మానసిక ప్రశాంతత. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య                           

Streetbuzz news. నల్గొండ జిల్లా :

 ప్రతి ఒక్కరూ యోగా ఆచరించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెల్లడించారు.బుదవారం నాడు   నకిరేకల్ మినీ స్టేడియంలో కందాల పాపి రెడ్డి విద్యసంస్థల చైర్మన్& యోగ మాస్టర్ ఆధ్వర్యంలో. ఏ వి యమ్ ఈ - టెక్నో స్కూల్ విద్యార్థులచే (సహస్ర రిథమిక్ యోగ) యోగ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై యోగ ఆసనాలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.నిత్యం యోగా చేయడం వల్ల యవ్వనంగా ఉంటారని అనేక శారీరక రుగ్మతల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. 

ప్రస్తుత సమాజంలో 30ఏండ్ల వయస్సు నుంచే ఎంతో మంది ఆరోగ్య సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని యోగా వల్ల మానసిక, దీర్ఘకాలిక వ్యాధులు సైతం దూరమవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని కోరారు. యోగా వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం కలుగుతుందన్నారు.

యోగాతో మానవ శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలంతా ప్రతి రోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, పిల్లలకు కూడా యోగాను నేర్పించాలని సూచించారు. యోగ ద్వారా విద్యార్థులు చురుకుగా ఉంటారని చదువులో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు.

చిన్నపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు రోజూ ఒక గంట లేదా అరగంట వ్యాయామం తో పాటు యోగా చేస్తే శరీరానికి చాలా మంచిదని, చిన్న చిన్న జబ్బులు కూడా యోగాతో ఇట్టే తగ్గిపోతాయన్నారు. మనిషి శరీరం సహాకరిస్తే మనం ఎన్నోరకాల కార్యక్రమాలు చేయగలమని అందుకు యోగా సాధనంగా తప్పకుండా ఆచరించాలని కోరారు.

భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణంతో పాటు మంచి ఆరోగ్యాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలు, పట్టణాలలో పల్లె, పట్టణ ప్రకృతి వనాలతో పాటు క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు.ఈ కార్యక్రమంలో. మున్సిపల్ చైర్మన్ రాచకొండనకిరేకల్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఎల్ ఓ సి అందజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా ఎల్ ఓ సి అందజేత  

 

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కట్ పల్లి మండలం మాధవ ఎడవెల్లి గ్రామానికి అలుగుబెల్లి రాధిక ఆనారోగ్యం కారణంగా అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద ఎల్ ఓ సి ద్వారా మంజూరైన 1,25,000/- రూపాయల ఎల్ ఓ సి పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో.  నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేసారు.

బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.

బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Streetbuzz news. నల్గొండ జిల్లా :

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణ కేంద్రంలో పద్మశాలి భవనంలో కేక్ కట్ చేసి, ఆశ వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి, మునిసిపల్ కార్మికులకి శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిదులుగా నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి,డాక్టర్ స్నేహలత విచ్చేసి అనంతరం వారు  మాట్లాడుతూ ఆశ వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి, మునిసిపల్ కార్మికులకి కనీస వేతనం ఇవ్వాలన్నారు.పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. మహిళా దినోత్సవం రోజున మాత్రమే మహిళలను గౌరవించడం కాకుండా ప్రతి రోజు మహిళల పట్ల విధేయత చూపాలని కోరారు.ఒక్కరోజు మాత్రమే మహిళా దినోత్సవం కాదని ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవమేనని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రస్తుత కాలంలో ప్రతీ రంగంలోకి మహిళలు అడుగిడుతురన్నారు. ప్రతీ ఒక్కరూ అన్నిరంగాల్లో రాణించాలన్నారు.ఒకరిపై ఆధారపడకుండా మహిళలు తమ సమస్యలు తామే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.తమ కూతుళ్ళకు కొడుకులతో సమానంగా ఉన్నత విద్యను అందిస్తే పురుషులతో సమానంగా ఎదగగలరని చెప్పారు. మహిళలు అన్నిరంగాల్లో సాధికారత సాధించినప్పుడే అటు గ్రామ ప్రగతితో పాటు దేశ ప్రగతి సాధ్యమన్నారు.మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను, ప్రపంచంలో మహిళలు సాధించిన విజయాలను వివరించారు. మహిళలు సమాజంలో సగ భాగమని, ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో ముఖ్యంగా రాజకీయాల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ప్రోత్సహిస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ ఇంచార్జి గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, కేతాపల్లి మహిళా కన్వీనర్ చందుపట్ల శృతి,ఆశ వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు సింగం రేణుకు, ఆశ వర్కర్ల మండల అధ్యక్షురాలు ఎస్కే సుల్తాన్, నకిరేకల్ మండల అధ్యక్షులు చెట్టిపల్లి శంకర్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్,ఆశ వర్కర్లు,తదితరులు పాల్గొన్నారు.

టోల్ ప్లాజా నిబంధనల మార్పు.హైవేపై ప్రయాణీకులకు శుభవార్త! నేటి నుంచి టోల్ ట్యాక్స్ నిబంధనలలో భారీ మార్పు!..

టోల్ ప్లాజా నిబంధనల మార్పు

హైవేపై ప్రయాణీకులకు శుభవార్త! నేటి నుంచి టోల్ ట్యాక్స్ నిబంధనలలో భారీ మార్పు!..

టోల్ ప్లాజా నియమాలు: వాహనం మరియు టోల్ మధ్య సంబంధం ఆహారం మరియు కూరగాయల వంటిది రెండూ కలిసి ఉంటాయి. ఈరోజుల్లో లాంగ్ డ్రైవ్ కు వెళితే ఎక్కడో ఒకచోట టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. హైవేపై డ్రైవింగ్ చేసే వారికి ఈరోజు మనం పెద్ద వార్తను అందిస్తున్నాము.

మీరు కూడా హైవేపై ప్రయాణించి టోల్ టాక్స్ గురించి ఆందోళన చెందుతుంటే, ఇప్పుడు మీ ఆందోళనలు తగ్గుతాయి. కోట్లాది మంది వాహన యజమానులను ప్రభావితం చేసే టోల్ ట్యాక్స్‌కు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పెద్ద ప్రకటన చేశారు. 2024 సంవత్సరానికి ముందు భారతదేశంలో 26 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తామని, అదే సమయంలో టోల్ ట్యాక్స్‌కు కొత్త నిబంధనలు జారీ చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు..

టెక్నాలజీలో కూడా మార్పు వస్తుంది, గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించిన తర్వాత, రోడ్ల పరంగా భారతదేశం అమెరికాతో సమానంగా ఉంటుంది. దీనితో పాటు, టోల్ టాక్స్ వసూలు చేయడానికి నియమాలు మరియు సాంకేతికతలో పెద్ద మార్పు ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు..

 టోల్ టాక్స్ రికవరీ కోసం ప్రభుత్వం 2 పద్ధతులను చేయవచ్చు..

రాబోయే రోజుల్లో టోల్ రికవరీ కోసం ప్రభుత్వం 2 ఎంపికలను ఇవ్వాలని యోచిస్తోంది. ఇందులో కార్లలో ‘GPS’ వ్యవస్థలను అమర్చడం మొదటి ఎంపిక. కాగా, రెండో పద్ధతి తాజా నంబర్ ప్లేట్‌కు సంబంధించినది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది..

 ప్రస్తుతం శిక్ష విధించే నిబంధన లేదు..

టోల్ ట్యాక్స్ చెల్లించనందుకు ఎలాంటి శిక్ష విధించే నిబంధన లేదు. రాబోయే రోజుల్లో టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంపై కూడా దృష్టి సారించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు..

 డబ్బు నేరుగా ఖాతా నుంచి తీసివేయబడుతుంది..

ఇప్పటి వరకు టోల్ చెల్లించనందుకు శిక్ష విధించే నిబంధన లేదని, అయితే టోల్‌కు సంబంధించి బిల్లు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పుడు టోల్ ట్యాక్స్ మీ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా తీసివేయబడుతుంది. దీని కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు. ఇకపై టోల్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ మొత్తం నేరుగా మీ ఖాతా నుంచి తీసివేయబడుతుందని నితిన్‌ గడ్కరీ చెప్పారు. దీంతోపాటు కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ‘2019లో కంపెనీ అమర్చిన నంబర్‌ ప్లేట్లతో కార్లు వస్తాయని నిబంధన పెట్టాం. అందుకే గత నాలుగేళ్లలో వచ్చిన వాహనాలకు వేర్వేరు నంబర్ ప్లేట్లు ఉన్నాయి..

ఆయుష్మాన్ భారత్ కార్డుతో మాత్రమే ఉచిత వైద్యం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆర్హు లే. మార్చి 31వరకు కొనసాగానున్న నమోదు ప్రక్రియ.

ఆయుష్మాన్ భారత్ కార్డుతో మాత్రమే ఉచిత వైద్యం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆర్హు లే. మార్చి 31వరకు కొనసాగానున్న నమోదు ప్రక్రియ.బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు.పసుల సైదులు

Streetbuzz news :నల్గొండ జిల్లా

ఆరోగ్య శ్రీ తరహాలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. దారిద్రపు రేఖకు దిగువున్న కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందించే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది దేశ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లిన ఆయుష్మాన్ భారత్ కార్డు పనిచేస్తుంది ఇందుకోసo లబ్దిదారుల జాబితాన్ని రూపొందించి కేవైసి చేయాలనీ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు ఈయొక్క నమోదు పక్రియ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పసుల. సైదులు ఒక ప్రకటన లో కట్టంగూర్ ప్రజలను ప్రతి 5 లక్షల బీమా వర్తిస్తుంది అని భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ పేద ప్రజలకోసం ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెచ్చినందుకు ధన్యవాదములు తెలిపారు.

కట్టంగూర్ మెయిన్ సెంటర్లో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. కేంద్రం పెంచిన వంటగ్యాస్ ధరలపై నిరసన కార్యక్రమం.

కట్టంగూర్ మెయిన్ సెంటర్లో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. కేంద్రం పెంచిన వంటగ్యాస్ ధరలపై నిరసన కార్యక్రమం.

కట్టంగూర్ మండల కేంద్రంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలను మరోసారి భారీగా పెంచి సామాన్యుడిపై మరింత భారాన్ని మోపిన కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరిని నిలదిస్తూ కట్టంగూరు మెయిన్ సెంటర్లో బిఆర్ఎస్ కట్టంగూర్ మండల పార్టీ తరఫున సిలిండర్లతో వంటవారుకు నిర్వహించి మోడీ దిష్టిబొమ్మ దానం చేసి ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో.జడ్పీటీసీ తరాల బలరాం, మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు,నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పోగుల నరసింహ,వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి,పిఏసీఎస్. చైర్మన్ సైదులు యాదవ్,ఎంపిటిసిల పోరం అధ్యక్షులు పాలడుగు హరికృష్ణ బాబు,సర్పంచుల ఫోరం అధ్యక్షులు గుర్రం సైదులు,ఎంపిటిసిలు,వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు,వ్యవసాయ కమిటీ డైరెక్టర్లు,పిఎసిఎస్ డైరెక్టర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు,మండల మహిళా నాయకులు,వార్డ్ మెంబర్స్,మండల నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం.టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్,పేదలకు సేవ చేయడమే తమ లక్ష్యం.టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య.

కార్యకర్తలకు అండగా ఉంటాం. 

టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్,

పేదలకు సేవ చేయడమే తమ లక్ష్యం.

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య హామీ

కేతేపల్లి: పేదలకు, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య హామీ ఇచ్చారు. కేతేపల్లి మండలం గుడివాడ గ్రామానికి చెందిన చిత్తలూరి బక్కా లక్ష్మమ్మ గురువారం అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ తో కలిసి గుడివాడ గ్రామంలో లక్ష్మమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.లక్ష్మమ్మ మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబీకులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.‌ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు సహాయం చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.వారి వెంట.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ అధికార ప్రతినిధి సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,గుడివాడ ఎంపీటీసీ గాజుల ప్రభాకర్,మాజీ సర్పంచులు చిత్తలూరు వెంకటయ్య, ఎస్కే లతీఫ్,‌గ్రామ శాఖ అధ్యక్షుడు రాచకొండ లింగయ్య, చిత్తలూరు రవి,టేకుల సుధాకర్,వెంకన్న, ఖమ్మం పాటీ సతీష్,ఆలకుంట్ల సత్యనారాయణ,ఎస్కే దస్తగిరి, కదిరే శ్రవణ్,గుండగాని వెంకన్న,కాంగ్రెస్ పార్టీ గుడివాడ గ్రామ నాయకులు, తదితరులు ఉన్నారు.