యోగాతో మానసిక ప్రశాంతత. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
యోగాతో మానసిక ప్రశాంతత. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Streetbuzz news. నల్గొండ జిల్లా :
ప్రతి ఒక్కరూ యోగా ఆచరించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెల్లడించారు.బుదవారం నాడు నకిరేకల్ మినీ స్టేడియంలో కందాల పాపి రెడ్డి విద్యసంస్థల చైర్మన్& యోగ మాస్టర్ ఆధ్వర్యంలో. ఏ వి యమ్ ఈ - టెక్నో స్కూల్ విద్యార్థులచే (సహస్ర రిథమిక్ యోగ) యోగ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై యోగ ఆసనాలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.నిత్యం యోగా చేయడం వల్ల యవ్వనంగా ఉంటారని అనేక శారీరక రుగ్మతల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు.
ప్రస్తుత సమాజంలో 30ఏండ్ల వయస్సు నుంచే ఎంతో మంది ఆరోగ్య సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని యోగా వల్ల మానసిక, దీర్ఘకాలిక వ్యాధులు సైతం దూరమవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని కోరారు. యోగా వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం కలుగుతుందన్నారు.
యోగాతో మానవ శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలంతా ప్రతి రోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, పిల్లలకు కూడా యోగాను నేర్పించాలని సూచించారు. యోగ ద్వారా విద్యార్థులు చురుకుగా ఉంటారని చదువులో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు.
చిన్నపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు రోజూ ఒక గంట లేదా అరగంట వ్యాయామం తో పాటు యోగా చేస్తే శరీరానికి చాలా మంచిదని, చిన్న చిన్న జబ్బులు కూడా యోగాతో ఇట్టే తగ్గిపోతాయన్నారు. మనిషి శరీరం సహాకరిస్తే మనం ఎన్నోరకాల కార్యక్రమాలు చేయగలమని అందుకు యోగా సాధనంగా తప్పకుండా ఆచరించాలని కోరారు.
భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణంతో పాటు మంచి ఆరోగ్యాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలు, పట్టణాలలో పల్లె, పట్టణ ప్రకృతి వనాలతో పాటు క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు.ఈ కార్యక్రమంలో. మున్సిపల్ చైర్మన్ రాచకొండనకిరేకల్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
Mar 15 2023, 19:37