బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.
బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
Streetbuzz news. నల్గొండ జిల్లా :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణ కేంద్రంలో పద్మశాలి భవనంలో కేక్ కట్ చేసి, ఆశ వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి, మునిసిపల్ కార్మికులకి శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిదులుగా నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి,డాక్టర్ స్నేహలత విచ్చేసి అనంతరం వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి, మునిసిపల్ కార్మికులకి కనీస వేతనం ఇవ్వాలన్నారు.పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. మహిళా దినోత్సవం రోజున మాత్రమే మహిళలను గౌరవించడం కాకుండా ప్రతి రోజు మహిళల పట్ల విధేయత చూపాలని కోరారు.ఒక్కరోజు మాత్రమే మహిళా దినోత్సవం కాదని ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవమేనని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రస్తుత కాలంలో ప్రతీ రంగంలోకి మహిళలు అడుగిడుతురన్నారు. ప్రతీ ఒక్కరూ అన్నిరంగాల్లో రాణించాలన్నారు.ఒకరిపై ఆధారపడకుండా మహిళలు తమ సమస్యలు తామే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.తమ కూతుళ్ళకు కొడుకులతో సమానంగా ఉన్నత విద్యను అందిస్తే పురుషులతో సమానంగా ఎదగగలరని చెప్పారు. మహిళలు అన్నిరంగాల్లో సాధికారత సాధించినప్పుడే అటు గ్రామ ప్రగతితో పాటు దేశ ప్రగతి సాధ్యమన్నారు.మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను, ప్రపంచంలో మహిళలు సాధించిన విజయాలను వివరించారు. మహిళలు సమాజంలో సగ భాగమని, ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో ముఖ్యంగా రాజకీయాల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ప్రోత్సహిస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ ఇంచార్జి గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, కేతాపల్లి మహిళా కన్వీనర్ చందుపట్ల శృతి,ఆశ వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు సింగం రేణుకు, ఆశ వర్కర్ల మండల అధ్యక్షురాలు ఎస్కే సుల్తాన్, నకిరేకల్ మండల అధ్యక్షులు చెట్టిపల్లి శంకర్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్,ఆశ వర్కర్లు,తదితరులు పాల్గొన్నారు.
Mar 15 2023, 16:46