రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కి లేదు. బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడి
రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కి లేదు. బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడి
రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత చిరుమర్తి లింగయ్య కు లేదని నకిరేకల్ నియోజకవర్గంలో దళితులకు ఏమి చేయలేదని దళితులపై దాడి జరిగిన స్పందించలేదని బిఎస్పి జిల్లా ఇంచార్జి ఆదిమల్ల గోవర్ధన్, నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు.నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వారు మీడియతో మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఉద్యోగం తెచ్చుకొని ఈ రోజు ఆలా బాబా సాహెబ్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ల ద్వారా కష్ట పడి చదువుకున్న ఉద్యోగస్తులు అందరిని కష్టాన్ని మీరు విస్మరిస్తున్నట్టుగా కనిపిస్తుందని అన్నారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కష్టపడి చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను వినియోగించుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడడం జరిగిందన్నారు.అది మాత్రమే కాకుండా వెనకున్నటువంటి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చారన్నారు.నిజంగా స్వలాభం కోసం వేల కోట్లు సంపాదించి ఉంటే నీ లెక్కనే వేరే పార్టీలోకి చేరి పదవి తెచ్చుకొని తన ఆస్తులు కాపాడుకునే పనిలో ఉండేవాళ్ళు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మాన్యవర్ కాన్షీరామ్ స్ఫూర్తితో బహుజనులకు ఆత్మగౌరవంతో బ్రతికే అవకాశం కేవలం బహుజన సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం అని విశ్వసించి బిఎస్పి పార్టీలోకి చేరారు అన్నారు. నువ్వు రిజర్వేషన్లను వినియోగించుకొని నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయి అభివృద్ధి కోసమే పార్టీ మారాను అని చెప్పిన నువ్వు ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తీసుకొచ్చావ్, ఇక్కడున్నటువంటి దళితుల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఏ పథకాలు తీసుకొచ్చావో చెప్పాలి.
ప్రవీణ్ కుమార్ సార్ మీద చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలని ఖండిస్తూ గురుకులాల సెక్రటరీగా చేసిన కృషికి, శ్రమకు ప్రపంచంలోనే నం.1 అయిన హర్వర్డ్ యూనివర్సిటీ గురుకులాలని కేస్ స్టడీగా తీసుకోవడం జరిగిందన్నారు.అత్యున్నత శిఖరమైనటువంటి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించినటువంటి ఒక సాధారణ తండా నుంచి పుట్టిన బిడ్డ మనవత్ పూర్ణ ను అడిగితే తెలుస్తుంది. సార్ ఇచ్చిన ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదని.. యువతని పక్కదోవ పట్టిస్తున్నారని చేస్తున్నటువంటి ఆరోపణలని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. యువతని చైతన్యవంతులు చేస్తూ బహుజన రాజ్యాధికార యాత్ర ద్వారా వేలాది కిలోమీటర్లు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ ఓటు చైతన్యాన్ని తీసుకువస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర ఆధిపత్య వర్గాల పార్టీల లెక్క బహుజనులు కేవలం అనుచరులుగా మాత్రమే కాదు మనం లీడర్లుగా తయారు చేసే విధంగా ముందుకు వెళ్తుంది. నిజంగా యువతని పెడదారి పట్టిస్తున్నది యువత శక్తి మొత్తం నిర్వీర్యం చేస్తున్నది నువ్వు, నీ వెనుక ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ. యువతని ముందుకి, బిర్యానిలకి, డబ్బుకి బానిసలు చేస్తూ నకిరేకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను భయపెట్టి బెదిరించి దళిత బందు అనే ప్రలోభాలకు గురిచేసి పార్టీ మారేటట్టు చేస్తున్నది నువ్వు కాదా,
3500 కోట్ల ఇసుక దందా నకిరేకల్ చుట్టూ జరుగుతుందన్నది వాస్తవం కాదా? నిజంగా ఎన్ని వెహికల్స్ కి పర్మిషన్ ఉన్నది? ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి? అనేదానికి బహిరంగ చర్చకు రావడానికి నువ్వు సిద్ధమా? ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య ఈ విషయమై గొడవ జరిగిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
పరువు నష్టం దావా వేస్తా అని మమ్మల్ని బెదిరించడం కాదు నీకు దమ్ముంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద దళితులను మోసం చేశాడని కేసు పెట్టు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని దళితుల భూములు లాక్కున్నది మీ ప్రభుత్వం కాదా?
కరోడ్ గిరి షాపుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసింది నువ్వు కదా?
నీ అల్లుడు ఉద్యోగాల పేరిట పోస్టింగుల పేరిట లక్షల రూపాయలు బెదిరించి వసూలు చేసింది నిజం కాదా?
రైతుల భూములు లాక్కున్న చరిత్ర నీకు లేదా?
రియల్ ఎస్టేట్ పేరిట ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకి అమ్ముకున్నది నిజం కాదా?
నేషనల్ హైవే నాలుగు లేన్ల దారికి సంబందించిన నీ అవినీతి అక్రమాలెన్ని? నీ చరిత్ర అంతా దోచుకోవడం దాచుకోవడమే.
నువ్వు కేసు పెడ్తే భయపడడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిల్లి కాదు, పులి. తన మీద, తన కుటుంబం మీద చేసినటువంటి ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోకపోతే బహుజన సమాజ్ పార్టీ ద్వారా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ పోకల ఎలిజబెత్, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా మర్రి శోభ,చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, కేతేపల్లి మండల అధ్యక్షులు విజయ్,మహిళా కన్వీనర్ చందుపట్ల శృతి,చిట్యాల మండల ప్రధాన కార్యదర్శి మేడి రాజు, కోశాధికారి మునుగోటి సత్తయ్య,రామన్నపేట మండల ఉపాధ్యక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా,నాయకులు మేడి కృష్ణ, చరణ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.
Mar 02 2023, 18:08