రూ:1.56 కోట్లతో నిర్మించనున్న (పి హెచ్ సి) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన.రాజ్యసభ సభ్యులు& నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి
రూ:1.56 కోట్లతో నిర్మించనున్న (పి హెచ్ సి) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన.రాజ్యసభ సభ్యులు& నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి
Streetbuzz news :నల్గొండ జిల్లా :
కట్టంగూర్ మండల కేంద్రంలో రూ.1.56 కోట్లతో నిర్మించనున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ (పి హెచ్ సి) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మరియు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య .ఈ సందర్భంగా. ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో వైద్య సేవలు గ్రామీణ ప్రజలకు మరింత మెరుగ్గా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న 3వ రాష్ట్రంగా మన తెలంగాణను నీతి ఆయోగే గుర్తించడం మనందరికీ గర్వకారణమన్నారు.
సీఎం కెసిఆర్ కృషి వల్ల 2014 లో 92గా ఉన్న మాతృ మరణాల రేటు 2022 నాటికి గణనీయంగా తగ్గి 43 కి చేరిందని
ఈ రోజు దేశంలో అతి తక్కువ మాతృ మరణాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదన్పారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్ సీట్లు, 7 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లతో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నదని గుర్తు చేశారు.
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేవలం 1400 ఆక్సిజన్ బెడ్లు ఉంటే వాటి సంఖ్యను ఇరవై రెట్లు పెంచి 27,966 బెడ్లకు పెంచిన ఘనత కేసీఆర్ దారికే దక్కుతుందన్నారు.
2018లో ప్రారంభమైన కంటి వెలుగు పథకం ద్వారా 1 కోటి 54 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి, 40 లక్షలకు పైగా కళ్ళద్దాలను పంపిణీ చేసి కేసిఆర్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాకో మెడికల్ కాలేజి ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ దని గుర్తు చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో కేవలం మూడే డయాలసిస్ సెంటర్లు ఉంటే నేడు 104 డయాలసిస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని,డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పించన్లు అందిస్తుండటంతో పాటు వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం కుడా తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని సంతోషం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి సహకారాలతో నకిరేకల్ లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ. 32.00 కోట్లు మంజూరు చేసుకొని పనులు కూడా ప్రారంభించామని ,మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో
కట్టంగూర్ పి హెచ్ సి భవన నిర్మాణానికి రూ. 1.56 కోట్లు, నియోజకవర్గ పరిధిలోని 12 హెల్త్ సబ్ సెంటర్లకుగాను రూ.2.40 కోట్లు మంజూరు చేసుకున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో. జెడ్పిటిసి తరాల బలరాం,బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరు ఏడుకొండలు, నకిరేకల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ్మ గౌడ్,డి ఎం హెచ్ ఓ,డాక్టర్,నర్సులు,ఆశ వర్కర్లు,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,వార్డ్ నెంబర్లు,తదితరులు పాల్గొన్నారు.
Feb 28 2023, 10:17