కుక్కల దాడిలో మృతి చెందిన బాలుని కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి
•విబిఏ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ డిమాండ్•
Street Buzz news తెలంగాణ రాష్ట్రం:
(కరీంనగర్ జిల్లా) :- హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేటలో లో ప్రదీప్ (4) బాలుడు కుక్కల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే ,ఈ బాలుడి మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విబిఏ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ మృతి చెందిన బాలుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక గ్రామములో మండల కేంద్రాలలో పట్టణాలలో మనుషుల పైన పశువులపైన అడవి జంతువులపైన కుక్కలు చిన్న పెద్ద తేడా లేకుండ మీద కొరికి కరిచి గాయపరుస్తున్నాయి సంపుతున్నాయి కాని గ్రామాలలో సర్పంచులు మండల జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని కుక్కలను పెంచుతున్న యజమానులు వాటిని ఇంటిలో కట్టి ఉంచుకోవడం లేదు, కావున ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం తెచ్చి కుక్కను ఎవరు సాధిన ఆ కుక్కతో ఎవరికి ప్రమాదం జరిగిన వారినే బాద్యులుగా చేయాలి. వారి నుండి నష్టపరిహారం కోటి రూపాయలు వారి కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. గ్రామాలలో ఉన్న వీది కుక్కలను వదించాలి, కక్కులు ఎవరిని కరిచిన ఆ గ్రామ సర్పంచ్ ను అధికారిని పట్టణం లో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లు,వార్డు సభ్యులను, ఎం ఎల్ ఏ, ఎం పి, లను కింది నుంచి పై వరకు అధికారులను బాద్యులు గా చేయాలని, ప్రభుత్వం పూర్తీ బాధ్యత వహించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ఆధ్యక్షులు మరియు వంచిత్ బహుజన్ ఆఘాడి విబిఏ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఒకవేళ కుక్కలు ఎవరిని కరిచిన స్థానిక సర్పంచ్ అధికారులు ప్రజాప్రతినిధులు పెంచిన యజమానులను బాద్యులుగా చేస్తూ నష్టపరిహారం తో పాటు వారిపై కేసులు బుక్ చేసి కఠినంగా శిక్షించాలని గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
Feb 23 2023, 07:59